
యూపీఐ లావాదేవాల మీద ప్రభుత్వం జీఎస్టీ విధించనుందని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కేద్రం క్లారిటీ ఇచ్చింది. రూ. 2వేలు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే 18 శాతం జీఎస్టీ విధిస్తారని ప్రచారమవుతున్న వార్తా అబద్దమని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు చేస్తే జీఎస్టీ విధిస్తారని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
యూపీఐ అందుబాటులోకి వచ్చిన తరువాత.. చాలామంది జేబులో డబ్బులు పెట్టుచుకోవడమే మరచిపోయారు. ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఆన్‌లైన్‌లో పే చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లావాదేవీలమీద జీఎస్టీ విధిస్తారని వస్తున్న వార్తలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.