
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.
ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.
2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.
Interesting.
We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024