Microsoft
-
'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్ ఎదుటే నిరసన (వీడియో)
శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.An employee disrupted Microsoft’s 50th anniversary event to protest its use of AI.“Shame on you,” said Microsoft worker Ibtihal Aboussad, speaking directly to Microsoft AI CEO Mustafa Suleyman. “You are a war profiteer. Stop using AI for genocide. Stop using AI for genocide in… pic.twitter.com/cfub3OJuRv— PALESTINE ONLINE 🇵🇸 (@OnlinePalEng) April 4, 2025 -
దురదృష్టవశాత్తు.. ‘50 వసంతాల మైక్రోసాఫ్ట్’పై బిల్‌గేట్స్ వీడియో
వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఆరంభ రోజుల్లో.. యవ్వనంలో ఉండగా దిగిన ఫొటోలను సరదాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తు.. నేను మళ్ళీ ఎప్పటికీ కూల్‌గా ఉండను. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఇది నేనే’’ అంటూ క్యాప్షన్ ఉంచారాయన. 1975 ఏప్రిల్ 4వ తేదీన న్యూ మెక్సికో అల్బుకెర్కీలో మైక్రోసాఫ్ట్‌ను చిన్ననాటి స్నేహితులైన బిల్ గేట్స్, పాల్ అలెన్‌లు స్థాపించారు. 1979లో కంపెనీ విస్తరణలో భాగంగా వాషింగ్టన్కు మార్చారు. ఆ తర్వాత గేట్స్, అలెన్‌తో పాటు స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్ల కంపెనీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) మైక్రోసాఫ్ట్‌కు 2000 సంవత్సరం దాకా గేట్స్ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద రీతిలో.. మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి 2020 నుంచి ఆయన వైదొలిగారు. 1955 సియాటెల్‌లో జన్మించిన విలియమ్ హెన్సీ గేట్స్.. బాలమేధావిగా 13 ఏళ్ల వయసుకే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాసే స్థాయికి చేరాడు. అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించేందుకు హార్వార్డ్ నుంచి విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారాయన. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ ఎంఎస్-డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించి.. ఆపై దానిని విండోస్‌గా పేరు మార్చారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా.. మైక్రోసాఫ్ట్ తన వెబ్సైట్లో కొత్త పేజీలను లాంచ్ చేసింది. గత ఐదు దశాబ్దాలుగా సాగిన ప్రయాణాన్ని అందులో పదిలపరిచింది. కంపెనీ ఎదుగుదల, మైలు రాళ్లు, ఆవిష్కరణలను అందులో ఉంచింది. అలాగే.. రాబోయే 50 ఏళ్ల విజన్‌ను అందులో పొందుపరిచింది. -
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలను వేగంగా మార్చివేసింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీ వచ్చినప్పటి నుంచి దీని విస్తృతి మరింతగా పెరిగింది. చాలా మంది తమ రోజువారీ జీవితంలో, వృత్తుల్లో జెమినీ, కోపైలట్, డీప్‌సీక్ వంటి చాట్బాట్లను వినియోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు ఎలా ఉన్నా సరే.. మానవ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగేసుకుంటుందన్న ఆందోళనలు మాత్రం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ సరికొత్త సాంకేతిక విప్లవం నడుమ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కనీసం కొన్ని రోజులైనా కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ నుండి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్న వృత్తులపై తన భావాలను పంచుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేట్స్ ప్రత్యేకమైన మానవ నైపుణ్యాలు అవసరమయ్యే మూడు కీలక రంగాలను హైలైట్ చేశారు. అవి కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ.కోడర్లు.. వీళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఏఐ కోడ్ జనరేట్ చేయడం, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను ఆటోమేట్ చేయడంలో పురోగతి సాధించినప్పటికీ, సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఖచ్చితత్వం, లాజిక్, సమస్య పరిష్కార నైపుణ్యాలు దీనికి లేవు. డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరచడానికి కూడా హ్యూమన్ ప్రోగ్రామర్లు అనివార్యమని గేట్స్ అభిప్రాయపడ్డారు.ఎనర్జీ ఎక్స్పర్ట్స్శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ప్రపంచ ఇంధన రంగం అత్యంత సంక్లిష్టమైనది. కృత్రిమ మేధస్సు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిమాండ్‌ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఇది ఇంధన పరిశ్రమను నిర్వచించే సంక్లిష్టమైన నియంత్రణ భూభాగాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర పరిష్కారాలను అమలు చేయడంలో, విద్యుత్ అంతరాయాలు లేదా వనరుల కొరత వంటి సంక్షోభాలకు ప్రతిస్పందించడంలో మానవ నైపుణ్యం కీలకమని గేట్స్ నొక్కి చెప్పారు.జీవశాస్త్రవేత్తలుజీవశాస్త్రంలో.. ముఖ్యంగా వైద్య పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలో మానవ అంతర్దృష్టి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన అవసరం. కృత్రిమ మేధ పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో, నమూనాలను గుర్తించడంలో రాణిస్తున్నప్పటికీ, ఇది అద్భుతమైన పరికల్పనలను రూపొందించే లేదా పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం ఏఐ సహాయపడుతుందని గేట్స్ పేర్కొన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పు.. ఉద్యోగులకు లేఖలు
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ హెచ్ఆర్ విభాగంలో కీలక మార్పులు చేసింది. కాథ్లీన్ హొగన్ స్థానంలో అమీ కోల్ మన్ను కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సత్య నాదెళ్ల నేరుగా ఉద్యోగులకు ఈ-మెయిల్ లేఖలు పంపించారు.దశాబ్దానికి పైగా మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా సేవలందించిన హొగన్ "ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. నేరుగా సీఈవో సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేసే ఈ హోదాను కొత్తగా సృష్టించారు. చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా మైక్రోసాఫ్ట్ పై కాథ్లీన్ చూపిన ప్రభావాన్ని అతిశయోక్తిగా చెప్పలేమని సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో పేర్కొన్నారు."గత పదేళ్లకు పైగా ఆమె మన సాంస్కృతిక పరివర్తనకు నాయకత్వం వహించారు. వృద్ధి మనస్తత్వాన్ని స్వీకరించి చురుకుదనంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవటానికి ఇది మనకు దోహదపడింది" అంటూ సత్య నాదెళ్ల ప్రశంసించారు.ఇక మైక్రోసాఫ్ట్ లో 25 ఏళ్లకు పైగా పనిచేసిన కోల్ మన్ ఇటీవల మానవ వనరులు, కార్పొరేట్ ఫంక్షన్లకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సత్య నాదెళ్ల ఆమెను "నమ్మకమైన సలహాదారు" అని అభివర్ణించారు.ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలలో ఒకటిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే పనితీరు నిర్వహణ ప్రక్రియను సమీక్ష చేపట్టిన మైక్రోసాఫ్ట్ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
ఆన్లైన్ గేమర్ల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత అసిస్టెంట్ ‘కోపైలట్ ఫర్ గేమింగ్’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఇది ఆన్లైన్లో ప్లేయర్లకు సమయాన్ని ఆదా చేయడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతర స్నేహితులు, గేమింగ్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఏఐ టూల్‌కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.నైపుణ్యాలు పెంచేందుకు..కోపైలట్ ఫర్ గేమింగ్ అనేది గేమింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, రియల్-టైమ్‌లో గేమర్లకు మద్దతుగా నిలిచేందుకు, వారి గేమింగ్ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏఐ ఆధారిత టూల్. ఈ ఏఐ అసిస్టెంట్ ప్లేయర్లకు మరింత వేగంగా గేమ్స్ సెట్ చేయడానికి, వారి ప్రాధాన్యతల ఆధారంగా కొత్త టైటిల్స్‌ను సిఫారసు చేయడానికి, అవసరమైనప్పుడు గేమ్‌లో సహాయాన్ని అందించడానికి తోడ్పడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కోపైలట్ ఫర్ గేమింగ్ ప్రారంభంలో ఎక్స్ బాక్స్ ఇన్ సైడర్ ప్రోగ్రామ్ ద్వారా మొబైల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర ప్లాట్‌పామ్‌లకు త్వరలో దీన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.With Copilot for Gaming, you can jump back into games faster, get real-time coaching, and stay connected... all on your own terms. Excited for what the team has in store! pic.twitter.com/18Ll2D25i1— Satya Nadella (@satyanadella) March 13, 2025ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?ఈ ఏఐ అసిస్టెంట్‌ను సామర్థ్యం, అడాప్టబిలిటీ, పర్సనలైజేషన్ అనే మూడు ప్రధాన సూత్రాలకు అనుగుణంగా నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. ప్లేయర్ల అభిరుచులకు తగినట్లుగా గేమ్‌లను సెర్చ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి, వాటిని అప్డేట్ చేయడానికి సమయాన్ని ఆదా చేయడం, ప్లేయర్లు ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడం దీని ఉద్దేశం. గేమింగ్ కోసం కోపైలట్ ప్లేయర్ నియంత్రణలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. -
మైక్రొసాఫ్ట్ కీలక నిర్ణయం: త్వరలో ఆ యాప్ షట్‌డౌన్!
ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్కైప్' (Skype)ను శాశ్వతంగా మూసివేయాలని, టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' యోచిస్తోంది. మే నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని.. కంపెనీ వెల్లడించింది.2003లో ప్రారంభమైన స్కైప్‌ను.. మైక్రోసాఫ్ట్ 2011లో 8.5 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ. 74వేలకోట్లు) కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇందులో అనేక అప్డేట్స్ తీసుకొచ్చింది. విండోస్ లైవ్ మెసెంజర్ తొలగింపు తరువాత.. 2015లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. ఇది మొత్తం తొమ్మిది నెలలు కొనసాగింది. అయితే ఇప్పుడు 22 ఏళ్ల స్కైప్ ప్రయాణానికి మంగళం పాడనుంది.మైక్రోసాఫ్ట్.. స్కైప్‌ను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా పాటుపడింది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీకి చెందిన 'ఐమెసేజ్'తో పోటీ పడటానికి సిద్ధమైంది. అయినా ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రారంభించింది. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా స్కైప్ అభివృద్ధి చెందలేదు. దీంతో చేసేదేమీ లేక.. కంపెనీ పూర్తిగా స్కైప్‌ను నిలిపివేయడానికి ఫిక్స్ అయింది. సంస్థ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా యూజర్లకు వెల్లడించనుంది. -
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్ డౌన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్ షట్ డౌన్‌పై మైక్రోసాప్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్ చరిత్రస్కైప్ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్,వాట్సాప్,జూమ్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్-19 సమయంలో స్కైప్ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్, గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్ఫారమ్ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్ స్కైప్‌ను షట్‌డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ తన ఫోకస్ అంతా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్టీమ్స్లో జోడించింది. ఇటీవల కోపైలెట్ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
మా తప్పు వల్లే గూగుల్ సక్సెస్!
మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల తన అతిపెద్ద వృత్తిపరమైన పశ్చాత్తాపం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. గూగుల్ (Google) విజయవంతంగా క్యాష్ చేసుకున్న వెబ్ సెర్చ్ మార్కెట్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వెబ్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, సెర్చ్ అత్యంత విలువైన వ్యాపార నమూనాగా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు.చేజారిన అవకాశం..వెబ్ మార్కెట్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, కేవలం వెబ్ సెర్చ్ అంత పెద్ద బిజినెస్ మోడల్‌గా అంచనా వేయలేకపోయిందని సత్య నాదెళ్ల (Satya Nadella) అంగీకరించారు. ఈ పొరపాటు గూగుల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సెర్చ్ చుట్టూ భారీ వ్యాపారాన్ని నిర్మించడానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. "వెబ్ లో అతిపెద్ద వ్యాపార నమూనాగా మారిన దానిని మేము మిస్ అయ్యాము. ఎందుకంటే వెబ్ అంతటా విస్తృతమవుతుందని మేమంతా భావించాము" అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.గూగుల్ దూరదృష్టిసెర్చ్ ప్రాముఖ్యతను మైక్రోసాఫ్ట్ తక్కువగా అంచనా వేసినప్పటికీ, దాని సామర్థ్యాన్ని గూగుల్ గుర్తించింది. దూరదృష్టిని ప్రదర్శించింది. వ్యూహాన్ని లోపరహితంగా అమలు చేసింది. సెర్చ్ ద్వారా వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో విలువను చూసి గూగుల్ దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసిందో సత్య నాదెళ్ల వివరించారు. "వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో సెర్చ్ అతిపెద్ద విజేత అవుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మేము స్పష్టంగా దానిని చూడలేదు, గూగుల్ దాన్ని చూసింది.. చాలా బాగా అమలు చేసింది" అని అంగీకరించారు.నేర్చుకున్న పాఠాలుసాంకేతిక మార్పులను అర్థం చేసుకుంటే సరిపోదని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. విలువ సృష్టి ఎక్కడ జరుగుతుందో కంపెనీలు గుర్తించాలి. సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే వ్యాపార నమూనాలలో మార్పులకు అనుగుణంగా మారడం చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ బిజినెస్ మోడల్ మార్పులు టెక్ ట్రెండ్ మార్పుల కంటే కూడా కఠినంగా ఉంటాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, సత్య నాదెళ్ల సీఈవోగా (CEO) బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ పై బలమైన దృష్టితో మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు నాయకత్వం వహించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు, టెక్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహించేలా కంపెనీని నడిపిస్తున్నారు.సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, విస్కాన్సిన్-మిల్వాకీ వర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు. -
'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్‌పై నెటిజన్లు ఫైర్!సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్‌తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్‌ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
ఏఐ పాఠాలు.. ఉద్యోగులకు శిక్షణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఐ ఫౌండేషన్ అకాడమీ ‘అడ్వాంటేజ్ తెలంగాణ’కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిపాలన, ప్రజాసేవలోనూ ఏఐ సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ కు 3 కొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన భవనాన్ని సీఎం గురువారం ప్రారంభించారు. భవిష్యత్తు ఏఐ సాంకేతికతదే.. ‘మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ నడుమ సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ ఆవిష్కరణలపై హైదరాబాద్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రభావాన్ని చూపింది. సంస్థ కార్యకలాపాల విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభి స్తాయి. వారి సాధికారతకు కూడా ఇది దోహదపడుతుంది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీదే. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘అడ్వాంటేజ్ తెలంగాణ’కార్యక్రమం ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తెలంగాణలో స్టార్టప్ వాతావరణాన్ని బలోపేతం చేస్తాయి. ఏఐ టూల్స్‌తో, ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ సిటీలో ‘ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేస్తోంది. ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను ఈ సెంటర్ అభివృద్ధి చేస్తుంది. ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్‌కు ఉన్న నిబద్ధత తెలంగాణ పురోగామి విధానాలకు తోడ్పాటును అందిస్తుంది’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అతిపెద్ద డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ‘మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రం, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితరాలతోపాటు మూసీ పునరుజ్జీవ పథకం ద్వారా హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌తో అనుబంధం కలిగిన మైక్రోసాఫ్ట్ రూ.15 వేల కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది..’అని శ్రీధర్‌బాబు తెలిపారు. అధునాతన ప్రమాణాలతో కొత్త క్యాంపస్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఈ సంస్థకు హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు భవనాలు ఉన్నాయి. కొత్త క్యాంపస్‌లో 2,500 మంది ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు ఉన్నాయి. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు 20 వేల మంది ఉద్యోగులు ఉండగా, సగం మంది హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారు. కాగా నూతన భవన ప్రారంభం పురస్కరంచుకుని సంస్థ గురువారం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ అందించేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ‘అడ్వాంటేజ్ తెలంగాణ’పేరిట 500 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఏఐ పాఠాలతో శిక్షణ ఇస్తుంది. ‘ఏఐ ఇండస్ట్రీ ప్రో’పేరిట 20 వేల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యంలో తర్ఫీదు ఇస్తుంది. ‘ఏఐ గవర్నర్ ఇనిషియేటివ్’పేరిట సుమారు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టవిటీ వంటి కీలక రంగాల్లో శిక్షణ ఇస్తుంది. ఎక్స్‌లెన్స్ సెంటర్‌పై ఎంవోయూ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో పాటు ఏఐ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు రెట్టింపు చేయడంతో పాటు, రాబోయే రోజుల్లో అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద డేటా హబ్ గా అవతరించనుంది. ఇలావుండగా ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్ రాజీవ్‌కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్ కోడ్’!
మహాకవి పోతన రచించిన ఒక పద్యం ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు’ అని మొదలవుతుంది. శత కోటీశ్వరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్ గేట్స్‌ను ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం. రాగల దశా బ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి, అందుకోసం యాభైయ్యేళ్ల నాడే ఒక సంస్థను స్థాపించిన దార్శనికుడు. మరికొందరికి ఆయన దాతృత్వశీలి. తన స్వచ్ఛంద సంస్థ మెలిందా–గేట్స్ ఫౌండేషన్ ద్వారా వెనకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యకలాపాల వెనక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్ గేట్స్ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. అందులో ఆయన్ను కీర్తించినవీ ఉన్నాయి, తూర్పారబట్టినవీ ఉన్నాయి. కానీ ఇంతకూ బిల్ గేట్స్ ఎవరు? తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయచరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ పుస్తకం వెలువరించారు. మొత్తం మూడు భాగాలుగా వచ్చే స్వీయచరిత్రలో ఇది తొలి భాగం. ఇందులో బాల్యం నుంచి తొలి పాతికేళ్ల ప్రస్థానం ఉంది. బిల్ గేట్స్ వరకూ పుస్తకం వచ్చిన సందర్భం అనేక విధాల ముఖ్యమైనది. ఆయనకు ఈ సంవత్సరంతో 70 ఏళ్లు వస్తాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతుంది. దివంగతుడైన ఆయన తండ్రికి ఇది శతజయంతి సంవత్సరం. ఏడాదిన్నర క్రితం తన గురించి తాను రాసుకోవాలనిపించిందని,ఇందులో తన ఎదుగుదలకు కారకులైన తల్లితండ్రుల గురించీ, కుటుంబం గురించీ, ఇద్దరు బాల్యస్నేహితుల గురించీ చెప్పాలనిపించిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన సమకాలీకులతో పోలిస్తే ఆయనెప్పుడూ కొన్ని దశాబ్దాల ముందు ఆలోచించేవారని బిల్ గేట్స్ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఈ పుస్తకం కోసం ఆయన కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగు దలకైనా, పతనానికైనా కుటుంబ ప్రభావం, పెంపకం ఎలా దోహద పడతాయో ఈ పుస్తకంలో వివరించారు. తండ్రికి కోపం తెప్పించిన సందర్భంస్వీయచరిత్ర రాయదల్చుకున్నవారికి నిజాయితీ ముఖ్యం. తన తప్పొప్పులన్నిటినీ నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఆత్మకథకు పూను కోవాలి. తాను మానవాతీతుడినన్న అహం ఉండకూడదు. తన ఎదు గుదల ఎలా సాధ్యమైందో, జీవితం ఏయే మలుపులు తిరిగిందో, తన ప్రతి అడుగులోనూ ఎవరెవరు అండదండలు అందించారో, ఎవరిపట్ల తాను నిర్దయగా వ్యవహరించాడో, ఆ తప్పును ఏ దశలో గుర్తించాడో, ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పగలగాలి. ఈ చట్రంలో ఇమిడే స్వీయచరిత్రలు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ. బిల్‌గేట్స్ తన గురించి తాను ఏం చెప్పుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. తొలి భాగం ‘సోర్స్ కోడ్’ ఆ విషయంలో అందరి మన్ననలూ పొందే అవకాశం ఉంది. ఇది బాల్యం గురించే కనుక, ఆ దశలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టే అవకాశం లేదని అనుకుంటారు. కానీ బాల్య జీవితంలోని కొన్ని అంశాలను నిస్సంశయంగా చెప్పటం ద్వారా బిల్ ఫుల్మార్క్లు కొట్టేశారు. అది అమెరికా కనుక 1970ల నాటికే అందరికీ కంప్యూటర్ గురించి తెలిసిపోయింది. పర్సనల్ కంప్యూటర్ల వాడకమూ మొదలైంది. కాకపోతే ఇప్పటిలా నిత్యావసర వస్తువు కాదు. బాగా ధనవంతులకు మాత్రమే సాధ్యపడే విలాసవంతమైన ఉపకరణం. అలాగని బిల్ గేట్స్ తల్లిదండ్రులు నిరుపేదలు కాదు. వారి కుటుంబం ఇతరు లతో పోలిస్తే సుఖంగానే జీవనం సాగించేది. తండ్రి గేట్స్ సీనియర్ సమాజం పట్లా, కుటుంబం పట్లా ఎంతో నిబద్ధతతో ఉండేవాడని బిల్ గుర్తు చేసుకున్నారు. ఆచితూచి వ్యవహరించేవాడని, పిల్లల పట్ల దయతో, శ్రద్ధాసక్తులతో ఉండేవాడని రాశారు. ఆయన ఒకే ఒకసారి ఉగ్రుడయ్యాడట. అది కూడా తన లోపమేనని ఆయనంటారు.డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్ ముఖంపై చిమ్మారట. ‘థాంక్స్ ఫర్ ద షవర్’ అంటూ అక్కడి నుంచి బిల్ నిష్క్రమించారు. ‘ఎప్పుడూ ఎంతో శాంతంగా, ప్రేమగా ఉండే తండ్రిని నా ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశాను’ అని బిల్ రాశారు. ‘చిన్నప్పుడంతా ‘జటిలమైన కొడుకు’గానే ఉండేవాడిని’ అంటారు. ‘ఇప్పుడైతే ఆ ప్రవర్తన చూసి కచ్చితంగా ఆటిజంతో బాధపడేవాడిగా పరిగణించివుండేవారు’ అని చెబుతారు. చిన్ననాడే మద్యపానం, గంజాయి, ఎల్ఎస్డీ వంటివి అలవా టైన సంగతి, వాటికి దూరమైన సంగతి కూడా బిల్ దాచుకోలేదు. కొన్ని విషయాల్లో తమ పిల్లాడు ఎందుకంత ఆలోచిస్తాడో, ప్రవర్తి స్తాడో తెలుసుకోవటానికి అవసరమైన పుస్తకాలు, ఇతరేతర సమా చారం తల్లితండ్రులకు ఉండేది కాదంటాడు. ‘పెద్దవాళ్లను కలవటం, వారితో చర్చించటం, వారి సలహాలు, సూచనలు పాటించడం అనే సంస్కృతిని అమ్మానాన్న, అమ్మమ్మ అలవాటు చేశారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్లినా పెద్దవాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించటం, సంతృప్తికరమైన జవాబు వచ్చేవరకూ ఆ ప్రశ్నల పరంపరను కొనసాగించటం అలవాటైంది. అది జీవితంలో ఎదగటానికి తోడ్పడింది’ అని బిల్ గేట్స్ అభిప్రాయపడతారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ తనలో పోటీతత్వాన్ని ఎంతగానో పెంచారంటారు. తన జీవితంలో చోటుచేసుకున్న ఈ అంశాలను చెప్పటం అవి అందరికీ ఉపయోగపడతాయన్న ఉద్దేశమేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పుట్టుకే అయాచితంగా అదనపు హక్కు (ప్రివిలేజ్)ను ఇచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవటం ప్రశసించ దగ్గది. అప్పటికే జాతిపరమైన విభేదాలతో నిలువునా చీలివున్న సియాటెల్ సమాజంలో తాను శ్వేతజాతిలో పుట్టడం, అందులోనూ మగవాడిని కావటం ఎంతో కలిసొచ్చిందని బిల్ స్వీయాభిప్రాయం. పుట్టుకతోనే ప్రతిభావంతులమని స్వోత్కర్షకు పోయేవారికి ఇదొక కనువిప్పు. మేము లేకుండా కంప్యూటర్ విప్లవమా?హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేనాటికి బిల్ గేట్స్‌కూ, ఆయన బాల్యస్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్కూ, 17 యేళ్లవయసులోనే మృత్యు వాత పడిన మరో స్నేహితుడు కెంట్ ఇవాన్స్కూ పర్సనల్ కంప్యూ టర్‌పై అవగాహన ఉంది. ఎయిత్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు పాఠశాల కొచ్చిన కంప్యూటర్‌తో ఎక్కువ సమయం గడిపేందుకు కంప్యూ టర్లో బగ్స్ సృష్టించామని, అది కనిపెట్టి తననూ, ఇవాన్స్నూ వెళ్లగొట్టారని బిల్ గేట్స్ చెప్పారు. తర్వాత కాలంలో కంప్యూటర్లలో బగ్స్ గుర్తించి తొలగించే పనికి కుదిరి కొంత డబ్బు సంపాదించిన ఉదంతాలూ ఉన్నాయి. కంప్యూటర్ను నిర్వహించే సీసీసీ కంపెనీ మూతపడటంతో దాని నిర్వహణ భారాన్ని స్కూల్లో తనకు అప్పగిస్తే, మిత్రుడు అలెన్ సాయంతో దాన్ని పూర్తిచేశారు. తన తొలి వ్యాపార భాగస్వామిగా ఇవాన్స్ తనతో జతకట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, అతని మరణం ఒక్కటే తన బాల్యంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనని ఆయన వివరి స్తారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్ విప్లవం వెల్లువెత్తు తుందేమోనన్న ఆత్రుత గేట్స్‌కూ, అలెన్కూ ఉండేదంటే... తాము అందులో పాలుపంచుకుని ప్రముఖంగా ఎదగాలనుకున్నారంటే వారి తపన ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ఇద్దరు మిత్రులూ ఎంఎస్–డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ వంటి సాఫ్ట్వేర్ రూపకల్పనలు చేయ గలిగారు.ఇవాళ్టిరోజున మైక్రోసాఫ్ట్‌లో బిల్ గేట్స్ వాటాల విలువ 10,780 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఆయన 13వ అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. 2021లో ఆయనతో విడిపోయిన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ వాటాలు 3,040 కోట్ల డాలర్ల పైమాటే. అన్నట్టు, దీని అనంతరం రాబోయే పుస్తకాల్లో చాలా వివాదాస్పద విషయాలుంటాయి. ‘సోర్స్ కోడ్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే ఆయన దేన్నీ దాచదల్చలేదని స్పష్టమవుతుంది. మిత్రుడు అలెన్‌ను దూరం చేసుకోవటం తప్పేనని అంగీకరించారు. మైక్రోసాఫ్ట్‌లో కొందరు మహిళా ఉద్యోగినులతో తన వివాహేతర సంబంధాలు, లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణ లొచ్చిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకున్న అనుబంధం, 27 ఏళ్ల వివాహబంధం అనంతరం భార్యతో విడాకులు, స్టీవ్ జాబ్స్‌తో పరిచయం, గొడవలు వంటి వ్యవహారాలపై బిల్ గేట్స్ అరమరికలు లేకుండా మాట్లాడారు. ఇంకా పర్యావరణం, ఏఐ వరకూ అభివృద్ధిపరిచిన సాంకేతికత, కరోనా మహమ్మారి, డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌ల తీరుతెన్నులు వగైరాలు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావన కొచ్చాయి. కనుక రాబోయే రెండు భాగాల్లో వీటికి సంబంధించి మరిన్ని వివరాలందిస్తారని తెలుస్తూనే ఉంది. తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
ఆమె నా అదృష్టం.. పెదవి విప్పిన బిల్ గేట్స్
అపర కోటీశ్వరుడు, తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల వార్తల్లో నిలిచారు. మెలిందా ఫ్రెంచ్ నుండి విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, బిల్ గేట్స్ ఇటీవల ది టైమ్స్ ఆఫ్ లండన్‌తో మాట్లాడుతూ తన నిర్ణయం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. అయితే గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. దాతృత్వవేత్త పౌలా హర్డ్‌తో (Paula Hurd) ఆయన బంధంలో కొనసాగుతున్నారు. ఆమెతో ఉన్న సంబంధం గురించి మొదటిసారిగా బిల్ గేట్స్ పెదవి విప్పారు.తాజాగా ‘టుడే షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పౌలాతో ఉన్న సంబంధాన్ని బిల్‌గేట్స్ బయటపెట్టారు. "పౌలా వంటి సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. ఒలింపిక్స్‌కు వెళ్తున్నాం. ఇంకా మరెన్నో" అంటూ పేర్కొన్నారు. బిల్ గేట్స్ పౌలా హర్డ్ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ జంట తరచుగా అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించారు.ఎవరీ పౌలా హర్డ్?పౌలా హర్డ్ (62)ను పౌలా కలుపా అని కూడా పిలుస్తారు. ఇది ఈమె తొలి పేరు. పౌలా గతంలో ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ను వివాహం చేసుకోగా 2019లో ఆయన అకాల మరణం చెందారు. పౌలా, మార్క్ వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ పరోపకారి. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రసిద్ధి చెందారు. కాగా బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ వివాహం 27 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు.బిల్ గేట్స్ ఆత్మకథ బిల్ గేట్స్(70) స్వీయ చరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ (Source Code: My Beginnings) తాజాగా అమెరికా మార్కెట్లోకి విడుదలైంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతోంది. అదేవిధంగా, తన తండ్రి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భాన తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల గురించీ చెప్పాలనిపించినట్లు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.తన సమకాలికులతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్లి ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అటువంటిది, ఆత్మ కథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారు. తన స్వీయ రేఖా చిత్రం తాలూకూ స్కెచ్ ఎంతో శ్రద్ధగా గీసి, దానికి అవసరమైన రంగులద్ది ఎంతో ప్రతిభావంతంగా రూపొందించిన పెయింటింగ్‌లా ఉంది ఈ స్వీయచరిత్ర. తన తండ్రి గేట్స్ సీనియర్ కుటుంబం, సమాజం అంటే ఎంతో నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిల్లలంటే ఎంతో దయతో ప్రేమతో వ్యవహరించేవారని చెప్పారు. ఆయనకు ఒకే ఒకసారి బాగా కోపం వచ్చిందట. అది కూడా తన లోపమేనంటారు బిల్ గేట్స్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్‌పై ముఖంపై చిమ్మారట. వెంటనే ‘థాంక్స్ ఫర్ ది షవర్స్’అంటూ బిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి తన ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశానని బిల్ రాశారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద వాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించడం, సంతృప్తి కరమైన జవాబు వచ్చే వరకు ప్రశ్నల పరంపరను కొనసాగించడం అలవాటైందని, జీవితంలో ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పుకున్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్‌లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు (AI) సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఏఐకి పునాదుల్లాంటి ఫౌండేషన్ మోడల్స్‌ను సొంతంగా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఒక్క కొత్త మ్యాథ్స్ సూత్రం, అల్గోరిథంలాంటిది కనుగొన్నా ఏఐ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.కృత్రిమ మేథను ఉపయోగించి, పరిశ్రమల పనితీరును మెరుగుపర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతనమైన ఏఐ సిస్టమ్స్ మీద కసరత్తు చేయాలంటే పెట్టుబడుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంటోందని ఆయన చెప్పారు. కానీ పరిశోధనలతో వ్యయాల భారాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇండియా ఏఐ టూర్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల వివరించారు.ప్రస్తుతం ఓపెన్ఏఐ, గూగుల్‌లాంటి టెక్ దిగ్గజాలు తయారు చేసిన ఏఐ ఇంజిన్లనే (ఫౌండేషన్ మోడల్స్) దేశీయంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్యక్రమం సందర్భంగా రైల్‌టెల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా గ్రూప్ మొదలైన సంస్థలతో మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.ఈ ఒప్పందాల కింద క్లౌడ్, ఏఐ ఆవిష్కరణల ద్వారా ఆయా సంస్థల సిబ్బంది, కస్టమర్లు ప్రయోజనం పొందేందుకు కావాల్సిన తోడ్పాటును మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. అటు దేశీయంగా ఏఐ, కొత్త టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు, సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియా ఏఐతో కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణఇండియాఏఐతో భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్‌స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
అగ్రగామిగా హైదరాబాద్.. సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ నేపథ్యంలో వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. సీఎం సోమవారం.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ వంటి అంశాలను వివరించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచడంపై రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో టాప్ ఫిఫ్టీకి: సత్య నాదెళ్ల తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని సత్య నాదెళ్ల ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచే అంశంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహద పడతాయని, హైదరాబాద్‌ను ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి నగరాల జాబితాలో చేర్చుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఇక్కడ పది వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టామని గుర్తుచేశారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయండి: శ్రీధర్‌బాబు సీఎం భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్య నాదెళ్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఇటీవల కొత్తగా మరో 4వేల ఉద్యోగాల కల్పనకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చందనవెల్లిలో రెండు, మేకగూడ, షాద్‌నగర్‌లో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తంగా 600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల ఏర్పాటును స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించే ఏఐ సిటీలో ‘ఏఐ సాంకేతికత’కు సంబంధించి ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ), ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఏఐ, జెన్ ఏఐ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: ఈ అంశాలపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్ సీఈఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఇదే మొదటిసారి. స్కిల్ యూనివర్సిటీ (Skill University), ఏఐ క్లౌడింగ్ (AI Clouding) కంప్యూటింగ్ వంటి వాటి మీద చర్చలు జరపనున్నారు.రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి.. సత్య నాదెళ్లను కోరనున్నారు. తెలంగాణలో మొత్తం 6 డేటా సెంటర్లను కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ద్వారా 4,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఒప్పందాలు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.స్కిల్ యూనివర్సిటీరంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుమారు 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఇందులో మెషీన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐ అండ్ రోబోటిక్స్, ఐవోటీ, ఇండస్ట్రియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటాసైన్స్ అండ్ అనలిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ మొదలైన కోర్సులు ఉండనున్నట్లు సమాచారం. -
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
మైక్రోసాఫ్ట్‌కు, గూగుల్‌కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్‌లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్‌కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్‌ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ అండ్ ఇన్‌క్లూషన్ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేశారు.దెబ్బతింటోన్న వైవిధ్యంఅమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్ అమెరికన్ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులుప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. -
మైక్రోసాఫ్ట్‌తో ఇన్ఫోసిస్ పార్టనర్షిప్ విస్తరణ
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్లో మైక్రోసాఫ్ట్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్లకు వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, స్కేలబిలిటీని సాధించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐతో ఐపీ సొల్యూషన్ల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ సమ్మిళితం చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్‌డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్‌ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్‌ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్‌గేట్స్‌కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్‌కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్‌వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మన్తో ముచ్చటించారు. ఈ సందర్భంలో కంపెనీలో నెలకొన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఉత్పాదకలో సమస్యలున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు.కరోనా సమయంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అంకితమయ్యారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత రిమోట్ వర్క్ అమల్లోకి వచ్చింది. ఇది ఉత్పాదకలో సమస్యలకు కారణమవుతోంది. కంపెనీలోని మేనేజర్లు 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో 85 శాతం ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు.ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులు పనిచేయలేదు అంటుంటే.. ఉద్యోగులు చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి డేటా మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. దీనిని పరిష్కరించడానికి ఒకటే మార్గం. అదేమిటంటే.. మేనేజర్లు ముందున్న లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ప్లాన్స్ వేసుకోవాలి, అవి సాధ్యం కాకపోతే కొత్తవాటిని అమలు చేయాలనీ సత్య నాదెళ్ల అన్నారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్ఎలాంటి సమయంలో అయినా.. ప్రపంచానికి నాయకులు చాలా అవసరమని నేను విశ్వసిస్తున్నానని సత్య నాదెళ్ల అన్నారు. నాయకులు తమ ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని వెల్లడించారు. -
ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..
మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.ప్రతి ఇంట్లోని డెస్క్‌పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. 1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు. -
రూ.520 కోట్లతో స్థలం కొనుగోలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్ఎల్పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
ఎక్కువ.. తక్కువ.. నిర్ణయాత్మకంగా..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల(57)నేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి’ అనే నియామాన్ని సత్య ఎక్కువగా నమ్ముతారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్‌లో ఆగస్టు 19, 1967లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు రూ.251 లక్షల కోట్లు (3 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు(రూ.8.3 లక్షలు) పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు(రూ.95 లక్షలు) అయ్యేది.బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే సత్యకు పెద్ద సవాలే. ఆయన సీఈఓ అవ్వడానికంటే 22 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. దాంతో చాలామంది సత్య సుధీర్ఘ ప్రస్థానంలో సాధించలేనిది సీఈఓగా బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నాదెళ్ల చేసే ప్రతి పనిని గత సీఈఓల పనితీరుతో పోల్చేవారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దాంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!పేరు: సత్య నారాయణ నాదెళ్లతండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్తల్లి: ప్రభావతిభార్య: అనుపమ నాదెళ్లపిల్లలు: 3కుమారుడు: జైన్ నాదెళ్లకుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్లజన్మస్థలం: హైదరాబాద్వయసు: 57 (2024)జాతీయత: భారతీయుడుపౌరసత్వం: యూఎస్ఏచదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీవృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
హై రిస్క్‌లో విండోస్ యూజర్లు..
మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గుర్తించిన రెండు భద్రతా లోపాల గురించి యూజర్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని టార్గెట్ సిస్టమ్‌పై దాడి చేసే వ్యక్తి 'ఎలివేటెడ్ ప్రివిలేజెస్' పొందేందుకు ఆస్కారం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది.ఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జారీ చేసిన ఒక సూచనలో సమస్య గురించి కొన్ని వివరాలను పంచుకుంది. “వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ (VBS), విండోస్ బ్యాకప్‌కు మద్దతు ఇచ్చే విండోస్ ఆధారిత సిస్టమ్‌లలో ఈ లోపాలు ఉన్నాయి. దాడి చేసే వ్యక్తి గతంలో తొలగించిన సమస్యలను తిరిగి ప్రవేశపెట్టడానికి లేదా వీబీఎస్ రక్షణలను చేధించడానికి ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు" అని పేర్కొంది.తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లో సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. కాబట్టి విండోస్ యూజర్లు మైక్రోసాఫ్ట్ అందించిన అప్డేట్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచించింది.ప్రభావిత విండోస్ వెర్షన్లు ఇవే..Windows Server 2016 (Server Core installation)Windows Server 2016Windows 10 Version 1607 for x64-based SystemsWindows 10 Version 1607 for 32-bit SystemsWindows 10 for x64-based SystemsWindows 10 for 32-bit SystemsWindows 11 Version 24H2 for x64-based SystemsWindows 11 Version 24H2 for ARM64-based SystemsWindows Server 2022, 23H2 Edition (Server Core installation)Windows 11 Version 23H2 for x64-based SystemsWindows 11 Version 23H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for 32-bit SystemsWindows 10 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for x64-based SystemsWindows 10 Version 21H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for 32-bit SystemsWindows 11 version 21H2 for ARM64-based SystemsWindows 11 version 21H2 for x64-based SystemsWindows Server 2022 (Server Core installation)Windows Server 2022Windows Server 2019 (Server Core installation)Windows Server 2019Windows 10 Version 1809 for ARM64-based SystemsWindows 10 Version 1809 for x64-based SystemsWindows 10 Version 1809 for 32-bit Systems -
ఉద్యోగులకు నంబర్1 మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, అమెజాన్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నట్టు ‘ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2024’ నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మంచి పేరు, కెరీర్లో చక్కని పురోగతి అవకాశాలు ఈ మూడూ ఉద్యోగులు ప్రధానంగా చూసే అంశాలు. వీటి పరంగా మైక్రోసాఫ్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. టాటా పవర్, టాటా మోటార్స్, శామ్సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మెర్సెడెస్ బెంజ్ వరుసగా టాప్–10లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,73,000 మంది ప్రతినిధులు, 6,084 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా ర్యాండ్‌స్టాడ్ తెలుసుకుంది. భారత్ నుంచి 3,507 మంది అభిప్రాయాలు స్వీకరించింది. -
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య మొదట యూరోప్‌లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.We're currently investigating access issues and degraded performance with multiple Microsoft 365 services and features. More information can be found under MO842351 in the admin center.— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024We are investigating an issue impacting the Azure portal. More details will be provided as they become available.— Azure Support (@AzureSupport) July 30, 2024 -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్‌స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్‌ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్‌స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్‌తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్‌ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్‌కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్‌లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
ఆటో డ్రైవర్‌గా మారిన మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుకంటే..?
ప్రముఖ కంపెనీలో టెక్కీలుగా పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా కెమెరా కంటికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదేంటీ టెక్కీ ఇలా డ్రైవర్‌గా పనిచేయడం ఏంటని అందరూ కంగుతిన్నారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వేంకటేశ్ గుప్తా అనే వ్యక్తి కోరమంగళలోని మైకోసాఫ్ట్లో పనిచేస్తున్న వేంకటేశ్ గుప్తా అనే టెక్నీని కలిసినట్లు తెలిపాడు. వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న ఆ టెక్కీతో మాటలు కలిపినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో అతడి వివరాలు ఆరా తీయగా..ఆ టెక్కీ తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు. విచిత్ర ఏంటంటే ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీని కూడా ధరించాడు.. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అతడి ఒంటరితనం పట్ల సానూభూతి చూపగా, ఇంకొందరూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారాంతాల్లో ఇలా ఆటో డ్రైవర్లగా పనిచేయడం కొత్త విషయం ఏమీ కాదు. కొంతమంది టెక్కీలు కూడా ఇలా గిగ్ వర్కర్లుగా పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో కూడా బెంగుళూరులోని హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)లో జావా డెవలపర్‌గా పనిచేస్తునన్న ఉద్యోగి రాపిడో బైక్ టాక్సీని నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతను తన మునుపటి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే అతను తన తోటి టెక్కీలను కనుగొనడానికి ఇలా బైక్ రైడర్‌గా మారినట్లు చెప్పడం గమనార్హం. Met a 35 year old staff software engineer at Microsoft in Kormangala driving Namma Yatri to combat loneliness on weekends pic.twitter.com/yesKDM9v2j— Venkatesh Gupta (@venkyHQ) July 21, 2024 (చదవండి: నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!) -
చైనాపై పడని మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇందులో భారత్ సహా అమెరికా, యూరప్ దేశాలు ఉన్నాయి. అనేక దేశాలపై పడిన ఈ మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండటం గమనించదగ్గ విషయం.ప్రపంచవ్యాప్తంగా విమానాలు, ఐటీ వ్యవస్థలు, వ్యాపారాలపై ప్రభావం చూపిన మైక్రోసాఫ్ట్ అంతరాయం చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు కూడా సజావుగా జరిగాయి. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.ప్రపంచంలోని చాలా దేశాలు మైక్రోసాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం విదేశీ టెక్నాలజీల మీద ఆధారపడటాన్ని తగ్గించి, సొంత దేశ టెక్నాలజీలనే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగానే చైనాలో మైక్రోసాఫ్ట్ వినియోగం లేదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి చైనాలో రోజూ జరగవలసిన కార్యకలాపాలు నిర్విరామంగా జరిగాయి. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
విండోస్‌లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్‌స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్‌లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్‌లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్‌అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్‌లను బ్యాకప్ చేశాం. విండోస్‌లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్‌సైట్‌ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్‌లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యథావిధిగా విమాన సర్వీసులు
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్లైన్ చెక్ఇన్ సాఫీగా సాగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఆన్లైన్ చెక్ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
Microsoft: బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్!
వాషింగ్టన్/వెల్లింగ్టన్/న్యూఢిల్లీ/ఫ్రాంక్ఫర్ట్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సరీ్వసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్లను యాక్సెస్ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్/చెక్ ఇన్ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా, అలీజియంట్ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. రైల్వే, టెలివిజన్ సేవలకూ అంతరాయం బ్రిటన్‌లో రైల్వే, టెలివిజన్ స్టేషన్లూ కంప్యూటర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయని బ్రిటన్ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. బ్యాంకింగ్ సేవలకూ దెబ్బ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్‌ల వద్దే కాదు, గ్యాస్‌స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్‌బీ, కివిబ్యాంక్ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్ తెలిపింది. పేమెంట్ వ్యవస్థలు, వెబ్సైట్లు, యాప్స్ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. భారత్‌లో పరిస్థితి ఏంటి? భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు ఆన్లైన్ చెక్ ఇన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పలు విమానాల సరీ్వస్‌లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్లు రద్దయ్యాయి. ఆఫ్‌లైన్‌లో మ్యాన్యువల్‌గా లగేజ్ ‘చెక్ ఇన్’, బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్‌కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ఎక్సే్ఛంజ్లు, బ్రోకరేజ్ సంస్థలు, బ్యాంక్‌ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. పేలిన జోకులు కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్’ కాదు. మాక్రో‘హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ల అన్ని సర్వీస్‌లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పోస్ట్‌చేశారు.ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్?:కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్ కనిపించాక కంప్యూటర్ రీస్టార్ట్ అవడంగానీ షట్‌డౌన్ అవడంగానీ జరుగుతోంది. విండోస్ అప్డేట్ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ఉల్లంఘనలు, హ్యాకింగ్‌ను రియల్‌టైమ్‌లో అడ్డుకునేందుకు క్రౌడ్‌స్ట్రయిక్ సంస్థ తమ సైబర్‌సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్‌కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్‌గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్‌స్ట్రయిక్ ఒక చిట్కా చెప్పింది. విండోస్10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో వివరింది. సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో లేదా విండోస్ రికవరీ ఎన్విరోన్మెంట్లో ఓపెన్ చేయాలి. తర్వాత C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్‌ను డిలీట్ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్‌ను బూట్ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపెట్టింది. భారత్‌లోని విమానయాన, బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై అది స్వల్ప ప్రభావం చూపినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే, ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్‌లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ వినియోగిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. -
'బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్' అంటే ఏమిటి? పరిష్కార మార్గమిదే!
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ యూజర్స్ ఈరోజు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యను ఎదుర్కొన్నారు. ఇంతకీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటిబ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్‌ను.. బ్లూ స్క్రీన్ ఎర్రర్లు, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్లు లేదా స్టాప్ కోడ్ ఎర్రర్లు అని కూడా పిలుస్తారు. సిస్టం అనుకోకుండా షట్ డౌన్ అయినప్పుడు లేదా రీస్టార్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. అంటే కంప్యూటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటడానికి విండోస్ షట్ డౌన్ అవుతాయి. ఈ సమస్య హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ కారణాల వల్ల కూడా జరిగే అవకాశం ఉంది.విండోస్ బ్లూ స్క్రీన్ సమస్యను ఎలా పరిష్కరించాలివిండోస్ బ్లూ స్క్రీన్ సమస్యను పరిష్కరించుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఖచ్చితమైన మార్గ దర్శకాలను వెల్లడించలేదు. కానీ విండోస్‌లో గెట్ హెల్ప్ యాప్ ఓపెన్ చేయాలి. అక్కడ ట్రబుల్షూట్ బీఎస్ఓడీ ఎర్రర్ అని టైప్ చేయాలి. ఆ తరువాత మీకు కనిపించే సూచలనను అనుసరించాల్సి ఉంటుంది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన టెక్ దిగ్గజం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ కంపెనీలకు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సమస్య స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క సారిగా కంపెనీ 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది.టెక్ దిగ్గజం షేర్ విలువ ఒకేసారి 0.71 శాతం తగ్గింది. దీంతో కంపెనీ దాదాపు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు సమయంలో 443.52 డాలర్ల వద్ద ఉండేది. అయితే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఇది 440.37 డాలర్లకు పడిపోయినట్లు ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాక్‌లిటిక్స్ వెల్లడించింది.స్టాక్‌లిటిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపైన గణనీయమైన ప్రభావం చూపాయి. భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది. -
మైక్రోసాఫ్ట్ సమస్య పరిష్కారం.. క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్య పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించినట్లు క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్ చేశారు.సమస్యను గుర్తించామని, పరిష్కారం కూడా అమలు చేశామని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ 'జార్జ్ కర్ట్జ్' వెల్లడించారు. ఈ ప్రభావం మ్యాక్, లినక్స్ హోస్ట్‌ల మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇది సైబర్‌టాక్ అటాక్ కాదు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ కస్టమర్లను చేరువలో ఉంటామని ఆయన అన్నారు.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.CrowdStrike is actively working with customers impacted by a defect found in a single content update for Windows hosts. Mac and Linux hosts are not impacted. This is not a security incident or cyberattack. The issue has been identified, isolated and a fix has been deployed. We…— George Kurtz (@George_Kurtz) July 19, 2024 -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఈ రంగాలపైనే ప్రభావం!
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగించాయి. టికెట్ బుకింగ్స్ నుంచి చెక్ ఇన్ వరకు అన్నింటికీ అవాంతరాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.భారతదేశంలో మాత్రమే కాకుండా.. అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. క్రౌడ్‌స్ట్రైక్ సమస్యను తామే పరిష్కరిస్తామంటూ వెల్లడించింది. ఈ తరుణంలో అమెరికా ఎమర్జెన్సీ కాలర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.బ్రిటన్‌లో విమాన సర్వీసులు మాత్రమే కాకుండా.. రైల్వే, హాస్పిటల్ సర్వీసుల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడి స్కైన్యూస్ ప్రసారాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేసింది. -
మైక్రోసాఫ్ట్ డౌన్ : మస్క్ సైటైర్, సోషల్‌మీడియా మీమ్స్, ఫన్సీ ట్వీట్స్ వైరల్
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అర్థాంతరంగా విండోస్ స్క్రీన్లపై "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ సందడి చేశాయి. పనిలో పనిగా టెస్లా అధినే, ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం.మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై స్పందించిన సంస్థ 365 యాప్‌లు, సేవలను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినట్టు వివరణ ఇచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. మస్క్ రియాక్షన్ మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ ఒక మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అంటూ సెటైర్ వేస్తూ పాత ట్వీట్‌ను రీట్వీట్ చేవారు. అంతేకాదు ఎలన్ మస్క్ జోస్యం నిజ మైందంటున్నార నెటిజన్లు.IT departments: #Microsoft #Windows #bluescreen pic.twitter.com/cwO7x4QqF4— NEELKAMAL MEENA NEWAI (@NEELKAMALBhonda) July 19, 2024 Happy Weekend, thank you #Microsoft #Bluescreen pic.twitter.com/P8NywbSv6S— Parmatma Yadav (@yparmatma561) July 19, 2024 కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ముందే వచ్చిందని కొందరు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ మరికొందరి మీమ్స్ , ఫన్నీ జోక్‌లతో ఇంటర్నెట్ సందడిగా మారింది.… https://t.co/X9a2ghyo4P— Elon Musk (@elonmusk) July 19, 2024 -
ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
సాక్షి, ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య భారత్ సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ఇబ్బందులకు దృష్టిపెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇక, మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మెహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విశాఖ, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/విశాఖ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్య కాస్తా ఎయిర్‌లైన్స్ సర్వర్లపై ప్రభావం చూపించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.కాగా, విశాఖలో ఎయిర్ లైన్స్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ఆపరేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, ఎయిర్‌పోర్టు సిబ్బంది మాన్యువల్‌గా బోర్డింగ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు రద్దీ పెరిగింది. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.ఇదిలా ఉండగా.. ఇటు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్‌లో టెక్నికల్ సమస్య కారణంగా దాదాపు 35 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో అధికారులు మాన్యువల్‌గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక, వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గన్నవరంలో ఇదీ పరిస్థితి..మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో గన్నవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గన్నవరం నుండి ప్రతీరోజూ 23 విమాన సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంతో 13 సర్వీసులు మాత్రమే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయి. మరో ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులో ఇదే పరిస్థితి ఉంది. గన్నవరంలో టికెట్ కౌంటర్లో ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడం నిలిపివేయడం జరిగింది. మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్ ఇచ్చి ప్రయాణికులను పంపిస్తున్నామని తెలిపారు. -
మైక్రోసాఫ్ట్‌లో సమస్య: టచ్‌లో ఉన్నామంటూ మంత్రి ట్వీట్
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగిస్తోంది. వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. ఇలా మెసేజ్ వచ్చిన తరువాత రీస్టార్ట్ అవుతున్నాయని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపైన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం టచ్‌లో ఉందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యను గుర్తించారని, దాన్ని పరిష్కరిస్తున్నారని.. ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వంటి వాటిని ప్రభావితం చేయదని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలను అందించే పాన్-ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ఒక సాంకేతిక సలహాను జారీ చేసింది. ఇందులో క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్లకు సంబంధించిన విండోస్ హోస్ట్‌లు.. ఇటీవలి అప్డేట్ల కారణంగా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని, క్రాష్ అవుతున్నాయని పేర్కొన్నారు.MEITY is in touch with Microsoft and its associates regarding the global outage. The reason for this outage has been identified and updates have been released to resolve the issue. CERT is issuing a technical advisory.NIC network is not affected.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2024 -
మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్
-
మైక్రోసాఫ్ట్ సర్వీసులో సమస్య.. ట్రేడింగ్ బ్రోకరేజ్‌లో అంతరాయం
మైక్రోసాఫ్ట్ సర్వీస్‌లో ఏర్పడిన సమస్య వల్ల ఆన్లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ‘ఎక్స్’లో పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ఈమేరకు ప్రభావితం చెందినట్లు ఎక్స్‌లోని పోస్ట్‌ల ద్వారా తెలిసింది.మైక్రోసాప్ట్ క్లౌడ్ సర్వీస్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, విమానాశ్రయ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఆన్లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సేవల్లోనూ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థల ప్లాట్ఫామ్ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఎక్స్ వేదికగా నివేదించాయి. మైక్రోసాఫ్ట్‌లోని సమస్య కారణంగా తమ సిస్టమ్‌లు ప్రభావితమయ్యాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. వీలైనంత త్వరగా ఆ సిస్టమ్‌లను పునరుద్ధరించడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పాయి.‘బ్రేకరేజ్ సొల్యూషన్ ప్రొవైడర్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమవడంతో వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఏంజెల్ వన్ తెలిపింది.పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లు కనిపించకపోవడంతో తమ పొజిషన్లను విక్రయించలేకపోయామని వినియోగదారులు ఎక్స్‌లో తెలిపారు. ఆ పొజిషన్ల వల్ల తమకు కలిగిన నష్టాలకు బ్రోకర్లు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.You may be facing an intermittent issue due to a global outage faced by one of the solution providers. We are trying to get this resolved at the earliest.— Angel One (@AngelOne) July 19, 2024 -
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతోంది. దీంతో సమాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ముంబయి, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థలు ప్రకటించాయి. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనూ సర్వర్లు డౌన్ అయినట్లు తెలిసింది. హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడంతో మ్యానువల్ చెకింగ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ సాంకేతిక సమస్య కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ‘మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు, విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తోంది. దయచేసి ప్రయాణికులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో అందరం సహనం పాటించాలి’ అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.డెన్వర్‌లోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్, ఫ్రాంటియర్ గ్రూప్ హోల్డింగ్స్ ఇంక్ యూనిట్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా విమానాలను నిలిపివేశారు. విమానయాన సంస్థ బుకింగ్, చెక్-ఇన్ సిస్టమ్‌లతో పాటు బోర్డింగ్ పాస్ యాక్సెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపింది.ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లుఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ‘మాకు ఈ సమస్య గురించి తెలుసు. దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇంటర్నల్‌గా సమస్యకు గల కారణాన్ని గుర్తించాం’ అని వివరణ ఇచ్చింది.VIDEO | Passengers stranded at Goa airport following a technical glitch with the check-in system. Further details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/XAYjtLRlpJ— Press Trust of India (@PTI_News) July 19, 2024pic.twitter.com/SI8mcURA1H— IndiGo (@IndiGo6E) July 19, 2024@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD— Sameen (@MarketWizarddd) July 19, 2024 -
ఆఫీసులో ఐఫోన్ మాత్రమే వాడండి!.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' మొబైల్ వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్లను అందించడం ప్రారంభించినట్లు సమాచారం. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని సంస్థ స్పష్టం చేసింది.చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేదు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్‌ఫామ్ కలిగి ఉన్నాయి. కాబట్టి అలాంటి మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఐఫోన్లలో సెక్యూరీటీ సిస్టం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వదిలిపెట్టి.. ఐఫోన్ ఉపయోగించాలని కోరింది.ఐఫోన్ లేని, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ఉద్యోగులకు కంపెనీ కొత్త డివైజ్‌లను అందజేస్తుంది. ఉద్యోగులకు కొత్త ఐఫోన్ 15 ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడొద్దని, కేవలం ఐఫోన్స్ మాత్రమే వాడండి అని చెప్పడంతో కొందరిలో అనుమానాలు పుడుతున్నాయి. -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన భయం
ఇప్పుడిప్పుడే టెక్ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక.. కంపెనీలోని ఉద్యోగులలో ఒక్కసారిగా భయం మొదలైంది.వైర్డ్ గీక్ నివేదిక ప్రకారం.. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగించనున్నారు, ఎప్పుడు తొలగించనున్నారు అనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. వ్యాపారాన్ని నిర్వహించడంలో శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి. సంస్థ భవిష్యత్తు కోసం ఈ తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.మైక్రోసాఫ్ట్ 2023లో కూడా లేఆప్స్ కింద ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. గత నెలలో కంపెనీ అజూర్లోని పాత్రలతో సహా దాదాపు 1000 స్థానాలపై ప్రభావం చూపిన రౌండ్ తొలగింపులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా కంపెనీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు సంస్థ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో భయాన్ని కలిగిస్తోంది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్‌కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్‌తోపాటు యూఎస్‌లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. -
ఇదో డిఫరెంట్ ఇంటెలిజెన్స్.. 'ఏఐ'పై సత్యనాదెళ్ళ
టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టింస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఆ పదమే నచ్చదని అన్నారు. దీనికి ఓ కొత్త పేరు కూడా ప్రతిపాదించారు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే, దాన్ని మనుషులతో పోల్చడం సరికాదని అన్నారు.1950లలో పుట్టుకొచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే పదం పట్ల సత్య నాదెళ్ల అయిష్టతను వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి 'కృత్రిమ మేధస్సు' అని నేను అనుకుంటున్నాను, మనం దానిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని పిలువవచ్చు. ఎందుకంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది, కాబట్టి ఏఐ అవసరం లేదని సత్య నాదెళ్ల అన్నారు.టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సుకు సరికాదు. ఎందుకంటే మనిషికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలామంది మనిషి సృష్టించినదాన్ని మనిషి కంటే గొప్పదని అనుకుంటున్నారు. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. ఇలాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో లెక్కకు మించి రావొచ్చు. ఆ ఘనత మొత్తం మనిషికే చెందుతుంది. ఎందుకంటే వాటిని రూపొంచేది మనిషే కాబట్టి.ఏఐ ఇలా పనికొస్తుందిఏఐ మానవ పరిభాషలో కావలసిన విషయాలను వెల్లడిస్తుందని అంగీకరించారు. సాఫ్ట్వేర్ పనితీరును వివరించడానికి "లెర్నింగ్" వంటి సాపేక్ష పదాలను ఉపయోగించి సాఫ్ట్వేర్ వెనుక ఉన్న అల్గారిథమ్‌లను అర్థం చేసుకోవడానికి ప్రజలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. -
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్లైన్ హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్‌టెక్‌లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
సత్య నాదెళ్ల సక్సెస్ అయింది ఇలాగేనా..?
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్మెంట్, కెరీర్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం. -
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. భారీగా తొలగింపులు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గత ఏడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లేఆఫ్‌లు ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది.ఈ తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ మిక్స్డ్ రియాలిటీ విభాగం, అజ్యూర్ క్లౌడ్ యూనిట్‌తో సహా వివిధ విభాగాలలో సుమారు 1,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అత్యంత ప్రభావితవుతున్న విభాగాల్లో హోలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేసిన మిక్స్డ్ రియాలిటీ విభాగం ఉంది. ఓ వైపు ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ, హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది.'మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించాం. రక్షణ శాఖకు సంబంధించిన ఐవీఏఎస్ కార్యక్రమానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మన సైనికులకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాం. అదనంగా, విస్తృత మిక్స్ డ్ రియాలిటీ హార్డ్ వేర్ ఎకోసిస్టమ్ ను చేరుకోవడానికి మేము W365 లో పెట్టుబడిని కొనసాగిస్తాం. ఇప్పటికే ఉన్న హోలోలెన్స్ 2 కస్టమర్లు, భాగస్వాములకు మద్దతు ఇస్తూనే హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగిస్తాం' అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి క్రెయిగ్ సిన్కోటా 'ది వెర్జ్'కు ఈమెయిల్ ప్రకటనలో తెలిపారు.మిక్స్ డ్ రియాలిటీ విభాగంతో పాటు అజూర్ క్లౌడ్ యూనిట్ ను కూడా గణనీయమైన తొలగింపులు తాకుతున్నాయి. అజూర్ ఫర్ ఆపరేటర్స్, మిషన్ ఇంజనీరింగ్ టీమ్‌లలో వందలాది ఉద్యోగాలను తొలగించినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి 2021లో స్థాపించిన స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్గనైజేషన్‌లో ఈ టీమ్‌లు భాగంగా ఉన్నాయి. -
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్‌గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్‌ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్‌డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్షాట్లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్‌ను విమర్శించారు.బ్లాక్ మిర్రర్ సిరీస్బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్‌లలో 27 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్‌లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.This is a Black Mirror episode. Definitely turning this “feature” off. https://t.co/bx1KLqLf67— Elon Musk (@elonmusk) May 20, 2024 -
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్‌లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్‌లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్‌ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్‌కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్‌జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి. -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్ చేస్తే..!
సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్‌లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.ఉత్తర ప్రదేశ్‌లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్‌ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో పెళ్లిళ్ల సీజన్లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు. “ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్. -
హైదరాబాద్‌లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో భారీ విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. 48 ఎకరాల భూమిని రూ. 267 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రాప్‌స్టాక్‌కు లభించిన పత్రాల ద్వారా తెలిసింది.ఏప్రిల్ 18న సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లను బట్టీ తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఉన్న భూమిని ఎకరం సుమారు రూ. 5.56 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అధికారిక సమాచారం రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, 2022లో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను స్థాపించడానికి హైదరాబాద్‌లో సుమారు రూ. 275 కోట్లకు మూడు ల్యాండ్ పార్సెల్‌లను కొనుగోలు చేసింది. -
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్‌ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్‌ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్‌ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్‌ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్‌కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్‌లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
రూ.14వేలకోట్లతో డేటా సెంటర్లు ప్రారంభం.. ఎక్కడంటే..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్‌ఫ్లడ్‌తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలుగ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్ చెప్పారు. -
టైమ్స్ జాబితాలో 'సత్య నాదెళ్ల'కు చోటు
ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు కృషిచేస్తోంది. సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఈ సమయంలో ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీపై ఆధారపడటాన్ని తగ్గించారు. ఇదీ చదవండి: గూగుల్‌లో రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: ముగ్గురు కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
మైక్రోసాఫ్ట్‌తో టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: బిజినెస్, డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్‌బెంచ్‌ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్‌బెంచ్ సిస్టమ్ ఉపయోగపడగలదని, సంక్లిష్టమైన డేటా వర్క్‌ఫ్లోను సరళతరమైన ఇంటర్ఫేస్తో సులభంగా రూపొందించవచ్చని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొంది. -
'స్టార్గేట్' ఏఐ సూపర్ కంప్యూటర్: టెక్నాలజీలో మరో అడుగు..
ఓపెన్ఏఐ.. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి సరికొత్త 'ఏఐ సూపర్ కంప్యూటర్'ను రూపొందించడానికి సన్నద్ధమైంది. 'డేటా సెంటర్ ప్రాజెక్ట్' పేరుతో దీని కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 'స్టార్గేట్' పేరుతో రానున్న ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు 2028 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రెడిషినల్ డేటా సెంటర్ల కంటే కూడా అడ్వాన్డ్ కార్యకలాపాలను నిర్వహించడానికి టెక్ దిగ్గజం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఉన్న కొన్ని అతిపెద్ద డేటా సెంటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్‌కి మైక్రోసాఫ్ట్ నిధులు సమకూరుస్తుంది. ఓపెన్ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు కంపెనీలు సూపర్ కంప్యూటర్లను ఐదు దశల్లో విస్తరించాయి. ఇందులో స్టార్గేట్ ఐదవ దశలో రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ 2026 నాటికి నాల్గవ దశ సూపర్ కంప్యూటర్ తీసుకురానున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్‌లో కస్టమ్ డిజైన్ కంప్యూటింగ్ చిప్‌లను కూడా ప్రకటించింది. ఆ తరువాత చిప్‌లతో పని చేసేలా కొత్త ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ సామర్థ్యానికి సంబంధించిన సరిహద్దును కొనసాగించడానికి అవసరమైన తదుపరి తరం మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ రానుంది. మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళిక కోసం అయ్యే ఖర్చు సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది సర్వర్లు, భవనాలు, ఇతర పరికరాల కోసం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చేసిన ఖర్చు కంటే కూడా మూడు రేట్ల ఎక్కువని తెలుస్తోంది. స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి -
భవిష్యత్తు అంతా ఏఐ మయం.. పీఎంతో బిల్‌గేట్స్ ఆసక్తికర చర్చ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారత..వంటి క్లిష్టమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతలో మార్పులు, సుస్థిరత, సామాజిక సాధికారత వంటి అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా ఏఐ ఆవిష్కరణలో దేశం అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో ఘణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరువురు మాట్లాడుకున్నారు. ఇండియాఏఐ మిషన్‌ను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌ను కేటాయించడంపట్ల మోదీ దూరదృష్టిని గేట్స్ ప్రశంసించారు. ఈ మిషన్‌లో భాగంగా కొత్త ఆవిష్కరణలతోపాటు, సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పీఎం మోదీ చెప్పారు. డ్రోన్ పైలటింగ్ నైపుణ్యాలతో మహిళలను సన్నద్ధం చేయడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు, గ్రామీణాభివృద్ధిని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అందులో భాగంగానే ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అందులో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. 2021లో జరిగిన కాప్26 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించిన ‘పంచామృతం’ ప్రతిజ్ఞకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వాతావరణ పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రతీకగా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన జాకెట్‌ను మోదీ ధరించినట్లు చెప్పారు. చర్చలోని ముఖ్యాంశాలు.. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు విస్తృతమైన చర్చలు చేశామని, అందులోని లక్ష్యాలను చేరే దిశగా చాలా మార్పలు తీసుకురాబోతున్నట్లు మోదీ చెప్పారు. ప్రపంచ ప్రతిష్టాత్మక జీ20 సమావేశాన్ని భారతదేశం నిర్వహించడం అద్భుతంగా ఉందని గేట్స్ చెప్పారు. డిజిటల్ ఆవిష్కరణలతో ఇక్కడి అభివృద్ధిని ఇతర దేశాలకు చేరవేయడంలో కృషిచేస్తామని గేట్స్ అన్నారు. 2023 జీ20 సమ్మిట్ సమయంలో ఏఐ ఎలా ఉపయోగపడిందో చర్చించారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ఏఐ సాయంతో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువదించబడిందో మోదీ గుర్తు చేసుకున్నారు. నమో యాప్‌లో ఏఐని ఉపయోగిస్తున్నట్లు పీఎం గేట్స్‌తో చెప్పారు. చారిత్రాత్మకంగా మొదటి, రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ వలసరాజ్యంగా ఉందని పీఎం అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా డిజిటలీకరణ ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పారు. అందులో ప్రపంచంలోనే భారత్ ప్రధానపాత్ర పోషిస్తోందన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమ్మను ‘ఆయ్’ అంటారు. బిడ్డ పుట్టగానే శిశువు ముందుగా నేర్చుకునే పదం 'ఆయ్' అని మోదీ అన్నారు. ఆయ్ అనే పదానికి AIకు దగ్గరిపోలిక ఉందని, భవిష్యత్తులో ఆయ్‌తోపాటు ఏఐ చాలాముఖ్యమని మోదీ సరదాగా చెప్పుకొచ్చారు. దేశంలో 2 లక్షల ఆరోగ్య మందిర్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు పీఎం చెప్పారు. వాటిని ఆధునిక సాంకేతికత సహాయంతో స్థానికంగా ఉన్న ఉత్తమ ఆసుపత్రులతో అనుసంధానించాలని గేట్స్‌ను మోదీ కోరారు. నమో డ్రోన్ దీదీ పథకం గురించి మాట్లాడారు. ప్రపంచంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండాలని కోరుకున్నట్లు పీఎం చెప్పారు. అందులో భాగంగానే భారత్‌లో చదువురాని మహిళలకు సైతం సాంకేతికతను పరిచయం చేశామన్నారు. చాలా మంది మహిళలకు సైకిల్ తొక్కడం తెలియదన్నారు. కానీ వారు పైలట్లుగా మారి డ్రోన్లను నడుపుతున్నారని వివరించారు. An insightful interaction with @BillGates. Do watch! https://t.co/wEhi5Ki24t — Narendra Modi (@narendramodi) March 29, 2024 -
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా పవన్ దావులూరి నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన పవన్ దావులూరిని నియమించింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. దావులూరి, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ డీప్‌మైండ్ డిపార్ట్మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్ హెడ్‌గా నియమించగా.. తాజాగా పవన్‌కు కీలక బాధ్యతలను మైక్రోసాఫ్ట్ అప్పగించింది. అయితే, విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్‌కే కట్టబెట్టింది. ఇక పవన్ నియామకమంతో అమెరికా దిగ్గం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్‌కు సైతం చోటు దక్కింది. ప్రస్తుతం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ స్వయంగా సత్య నాదెళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. కాగ్నిజెంట్‌కి రవి కుమార్ , ఐబీఎంకు అరవింద్ కృష్ణ, పాలో ఆల్టో నెట్వర్క్స్కు నికేశ్ అరోరా, యూట్యూబ్ నీల్ మోహన్ అడోబ్కి శాంతను నారాయణ్‌లు సీఈఓలుగా రాణిస్తున్నారు. -
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, బిలియనీర్ భార్య, కానీ బిడ్డలు మాత్రం.. ఎవరీమె?
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, హైదరాబాద్‌లోనే చదువుకుంది. టెక్ దిగ్గజం భార్య. భర్తకు 450 కోట్ల జీతం. ఆమె స్వయంగా ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్. అయినప్పటికీ, ఉద్యోగంలో రాణించేందుకు అన్ని అర్హతులున్నా పిల్లలు, భర్త కోసం ఇంటికే పరిమితమైంది. వారి బాధ్యతలే ప్రధానంగా భావించింది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం రండి! అమె మరెవ్వరో కాదు ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ప్రియదర్శిని నాదెళ్ల. అనుగా పాపులర్ అయిన ఈమె.. ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తె. అనుపమ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సత్య నాదెళ్ల తండ్రి, అనుపమ తండ్రి కేఆర్ వేణుగోపాల్ ఇద్దరూ బ్యాచ్‌మేట్స్. వీరిద్దరి స్నేహం వియ్యానికి దారి తీసింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరిన ఏడాదిలోనే (1992)అనుపమ నాదెళ్లను వివాహం చేసుకున్నారు. పెళ్లి నాటికే సత్యనాదెళ్ల అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. అయినా అనుపమ వీసా దరఖాస్తును యుఎస్ తిరస్కరించింది. దీంతో పర్యాటక వీసాతో కొంతకాలం కలసి ఉండాల్చి వచ్చింది. అయితే అనుపమను అమెరికా తీసుకెళ్లేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలను సులభంగా పూర్తి చేసుకుందుకుగాను గ్రీన్ కార్డును వదులుకొని, తిరిగి హెచ్-1బీ వీసా తీసుకున్నారు. చివరికి ఇద్దరూ అక్కడ శాశ్వత నివాసితులయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. బిడ్డల కోసం అత్యసవరస్థితిలో సిజేరియన్ ద్వారా తొలి చూరు కాన్పులో మగబిడ్డ జైన్‌కు జన్మనిచ్చింది. కానీ ఈ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. గర్భాశయ శ్వాసలోపం కారణంగా శిశువుగా ఎదగలేదు, తీవరమైన సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ క్వాడ్రిప్లెజియాతో జైన్ బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. తరువాత ఇద్దరు కుమార్తెలు తారా,దివ్య పుట్టారు. వీరిలో కూడా ఒకరి లెర్నింగ్ సమస్యలు తలెత్తాయి. దీంతో బిడ్డల కోసం ఆర్కిటెక్ట్‌గా తన కెరీర్ నుండి తప్పుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అనుపమ నాదెళ్ల సానుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2022లో 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం వారి జీవితాల్లో పెద్ద విషాదం. అప్పటినుంచి ఆమె సీటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భాగస్వామ్యంతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించారు. అంతేకాదు భర్త సత్యకు దీర్ఘకాల భాగస్వామిగా, నాదెళ్ల కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డారు. సమస్యలతో ఉన్న బిడ్డల్ని సాదుకుంటూ, వారిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మైక్రోసాఫ్ట్ బిలియనీర్ సీఈవో భార్యగా ప్రపంచంలోనే అత్యత్తుమ కంపెనీ సీఈవో భార్యగా భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ జనవరి 11న 2.87 ట్రిలియన్లడాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2024 ఫిబ్రవరి నాటికి సత్య నాదెళ్ల నికర విలువ 974 మిలియన్ డాలర్లు. కాగా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు అనుపమ పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేసిన సంగతి తెలిసిందే. -
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్‌గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్‌కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్‌లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్‌పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్‌తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్‌కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్‌పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
విజయం YSRCP దే అంటున్న మైక్రోసాఫ్ట్ సర్వే
-
ఇకపై ఆండ్రాయిడ్ యాప్స్‌ను వాడలేరు!
ఆండ్రాయిడ్ యాప్స్‌ను మొబైళ్లతోపాటు పర్సనల్ కంప్యూటర్లలో కూడా చాలామంది వినియోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్. విండోస్ 11 పీసీ వినియోగదారులు ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించలేరని మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2025 మార్చి 5 నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించడం కుదరదు. ఈ మేరకు తన సపోర్ట్ డాక్యుమెంట్లో తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్‌పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు, గేమ్స్ ఎంతమాత్రం పనిచేయవు. అంతేకాదు 2024 మార్చి 5 తర్వాత కొత్త యాప్స్‌ను డౌన్లోడ్ చేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇప్పటికే డౌన్లోడ్ చేసి యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే కటాఫ్ డేట్ వరకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’ గతంలో మొబైల్ యాప్స్‌ను విండోస్ 11 పీసీల్లో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్‌స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీల్లో వినియోగించేలా ఏర్పాటు చేశాయి. దీంతో అమెజాన్ యాప్ స్టోర్‌ను డౌన్లోడ్ చేసుకుని, అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను, గేమ్స్‌ను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
ప్రధానితో చర్చించిన అంశాలను పంచుకున్న బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 25 ఏళ్ల తర్వాత ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం సమావేశమయ్యారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల అభివృద్ధి వంటి అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం గురించి మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీని ఆయన విదేశాల్లో చాలాసార్తు కలిశారని తెలిపారు. మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ అవసరాల గురించి మాట్లాడామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించామని బిల్ గేట్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో చెప్పారు. గేట్స్ పోస్టుకు మోదీ స్పందించారు. నిజంగా అదో అద్భుత సమావేశమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గతిని మార్చే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. It is always inspiring to meet with @narendramodi and there was a lot to discuss. We talked about AI for public good; DPI; women-led development; innovation in agriculture, health, and climate adaptation; and how we can take lessons from India to the world. @PMOIndia pic.twitter.com/Y3REO67gxP — Bill Gates (@BillGates) February 29, 2024 ఇదీ చదవండి: ఇకపై యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ ఇటీవల సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్‌ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్‌గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్‌వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్‌గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్‌ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్‌కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్‌పూర్‌లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్‌వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్‌వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్
సాక్షి,హైదరాబాద్: సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఐడీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్, గేమింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం కానుందని చెప్పారు. ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి బిల్‌గేట్స్ చేసిన ప్రసంగం గొప్పదన్నారు. ఏఐ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారని చెప్పారు. ఇదీ చదవండి.. ఎనిమిది వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ -
‘మాకు ఓ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే చూడరా’.. వీడియో వైరల్!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఆయా టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. వాళ్లకి ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాలు వంటి వాటిని నిలిపివేస్తున్నాయి (గూగుల్ ఆపని ఎప్పుడో చేసింది). ఈ తరుణంలో ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులతో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాతావరణం ఎలా ఉంటుంది? తమకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే విషయాల్ని వెల్లడించారు. ఆ వీడియోలో ఆహ్లదకరమైన క్యాంపస్, ఫ్రీ స్నాక్స్, ఎన్ఏపీ రూమ్, పని చేసేందుకు అనువైన వాతావరణం ఉన్నాయంటూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు చెప్పారు. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్‌లో సిబ్బంది కోసం సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన క్యాంపస్‌లో హైటెక్ భద్రతా వ్యవస్థలతో మూడు భవనాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by twosisterslivingtheirlife (@twosisterslivingtheirlife) ఆఫీస్‌లోని ప్రతి ఫ్లోర్లో కాఫీ, టీ, పండ్లు, డ్రింక్స్‌తో పాటు ఇతర వంటలను ఆరగించేందుకు భారీ కిచెన్ రూములు, రెస్ట్ తీసుకునేందుకు గదులు సైతం ఉన్నాయంటూ ఉద్యోగులు వర్క్ ప్లేస్ గురించి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. రీల్‌కు మైక్రోసాఫ్ట్ స్పందించింది. ఉద్యోగులు వీడియో సంపూర్ణంగా ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ని షేర్ చేసింది. అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్లు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయగా ఉంది. మాకు కూడా మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్ ఉన్నాయా? మేం చేరుతాం అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సిబ్బంది మాత్రం మేం క్యాంపస్ వాతావరణాన్ని కోల్పోతున్నామని నిట్టూర్చుతున్నారు. -
సత్య నాదెళ్ల జీతం ఆస్తులు ఎంతో తెలుసా..?
-
భారతీయులకు మైక్రోసాఫ్ట్ బంపరాఫర్
-
Sarvam AI: భారతీయ ‘గొంతు’కు మైక్రోసాఫ్ట్ మద్దతు!
భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. వాయిస్ ఆధారిత జనరేటివ్ AIని అభివృద్ధి చేయడం, అజూర్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా సర్వం ఏఐకి (Sarvam AI)కి మద్దతు ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. భారత్‌లో ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులను మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భారంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో చేతులు కలుపుతున్నట్లు వెల్లడించింది. సర్వం ఏఐ భారతీయ భాషలు, నేపథ్యంపై ఉత్పాదక ఏఐ మోడల్స్‌ను రూపొందించడంలో పని చేస్తోంది. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, ఖోస్లా వెంచర్స్ నుంచి గత ఏడాది డిసెంబర్లో సుమారు రూ.340 కోట్ల మేర నిధులు సేకరించింది. ఈ స్టార్టప్‌ను స్థాపించిన ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్‌లు గతంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధనా బృందం ఏఐ4భారత్‌తో కలిసి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్నారు. ప్రతిఒక్కరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఏఐ-మొదటి దేశంగా భారత్ పరివర్తన చెందడానికి సాధికారత కల్పిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా & దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అన్నారు. సర్వం ఏఐతో సహకారం ద్వారా స్వదేశీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి, వారి భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా వాయిస్-ఆధారిత ఏఐ సొల్యూషన్ల శక్తి నుంచి ప్రయోజనం పొందగల భవిష్యత్తును తాము ప్రోత్సహిస్తున్నామని చందోక్ చెప్పారు. భారతీయ భాషలలో ఉత్పాదక ఏఐ అప్లికేషన్ల కోసం వాయిస్ అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌లలో ఒకటి. విద్య, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో దీన్ని వర్తింపజేయొచ్చు. సర్వం ఏఐ ఇండిక్ వాయిస్ ఎల్ఎల్ఎంను అజూర్‌లో అందుబాటులోకి తేవడం ద్వారా భారత్-కేంద్రీకృతంగా మరిన్ని ఆవిష్కరణలు రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ పునాదులు వేస్తోంది. -
Generative AI: ఏఐలో అమెరికాను ఢీకొట్టేది భారతీయులే..!
ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో భారతీయుల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని పలు టెక్నాలజీ దిగ్గజాలకు అధితులుగా భారతీయులే ఉండి నడిపిస్తున్నారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో ఇండియన్ డెవలపర్ కమ్యూనిటీ కీలక పాత్రను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఈ టెక్నాలజీతోనే ముడిపడింది. జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లు ఇప్పటికే అనేకం వస్తున్నాయి. వీటిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక ఏఐ ప్రాజెక్ట్‌ల్లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత డెవలపర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. 2027 నాటికల్లా.. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సాఫ్ట్వేర్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ అయిన గిట్‌హబ్ (GitHub)లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. 1.32 కోట్ల మంది డెవలపర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. 2027 నాటికి గిట్‌హబ్‌లో భారత్ అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారు. గిట్‌హబ్‌లో అత్యధిక సంఖ్యలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కార్యకలాపాలు, పనితీరును తరువాతి తరం ఏఐ పూర్తిగా మార్చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత డెవలపర్ కమ్యూనిటీ మన టెక్నాలజీ, టూల్స్‌తో భారత్‌తోపాటు ప్రపంచ భవిష్యత్తు కోసం కృషి చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం
ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా 'కోడ్ వితౌట్ బ్యారియర్' అనే కార్యక్రమాన్ని భారత్‌కు విస్తరింపజేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ 'సత్య నాదెళ్ల' ఇటీవలే ప్రకటించారు. కోడ్ వితౌట్ బ్యారియర్స్ అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ AI టూర్లో 1100 మంది డెవలపర్లు & టెక్నాలజీ లీడర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా AI ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో భారతీయ డెవలపర్లు చూపుతున్న ప్రభావం గురించి మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల మాట్లాడారు. కోడ్ వితౌట్ బ్యారియర్ కార్యక్రమం 75,000 మంది మహిళా డెవలపర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ 2021లోనే తొమ్మిది ఆసియా పసిఫిక్ దేశాల్లో విస్తరించింది. దీని ద్వారా క్లౌడ్, ఏఐ రంగాల్లో లింగ భేదాలను తొలగించాలనేది కూడా ఇందులో ఒక ప్రధాన అంశం. ఇదీ చదవండి: భవిష్యత్ అంతా అందులోనే!.. ఉద్యోగాలు పెరుగుతాయ్.. 20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. -
ఇంట్లో కూర్చొని ‘మైక్రోసాఫ్ట్ కోసం పనిచేస్తుంది.. డబ్బులు సంపాదిస్తుంది!’
సంక్షోభంలో అవకాశాల్ని వెతుక్కోవడం అనే మాట తరచూ వింటుంటాం. ఇప్పుడు ‘బేబీ రాజారాం బోకాలే’ లాంటి మహిళలు అదే కోవకు చెందుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మానువుల ఉద్యోగాల్ని భర్తీ చేస్తుందంటూ నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ కార్మిక రంగంలో అనిశ్చితి నెలకొంది. పైగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం ఉద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలోని ఖరాడి సబర్బ్‌కు చెందిన 53 ఏళ్ల బేబీ రాజారాం బోకాలే మాత్రం కొత్త అవకాశాల్ని సృష్టించుకుంటుంది. నిన్న మొన్నటి వరకు సాధారణ మహిళగా చిరు మసాలా దినుసుల వ్యాపారం చేస్తుండేది. కానీ మైక్రోసాఫ్ట్ అభివృద్ది చేస్తున్న ఏఐ టూల్స్‌కు మరాఠీ నేర్పుతుంది. ఇందుకు గాను ఆమె గంటకు సుమారు రూ. 400 సంపాదిస్తుంది. ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్నీ వందలు సంపాదిస్తున్నట్లు తెలిపింది. ఇందంతా ఆమె ఇంట్లో కూర్చొనే పనిచేస్తున్నట్లు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సైతం తమ ఏఐ టూల్స్ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. Great to be in India this week meeting with changemakers like the team at Karya, who are doing the critical work of building high-quality datasets for AI—and expanding economic opportunity at the same time. https://t.co/jJUDjnBUEo — Satya Nadella (@satyanadella) February 7, 2024 ఇంతకి ఆమె ఏం పని చేస్తుందో తెలుసా? ఇంట్లో కూర్చొని తన స్మార్ట్‌ఫోన్‌లో మైక్రోసాఫ్ట్ యాప్‌ను ఓపెన్ చేసి మహరాష్ట్ర మాతృభాష మరాఠాలో కదలని చదువుతుందని’ అని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా బోకాలే మాట్లాడుతూ.. ‘నా వాయిస్ రికార్డ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడు ఎవరైనా నా వాయిస్‌తో మరాఠీ నేర్చుకోవచ్చు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ తయారు చేస్తున్న ఏఐ టూల్స్‌ను మరాఠాలో తన వాయిస్‌తో అందుబాటులోకి తెస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్‌కి ఏఐ టూల్స్‌కి మరాఠా భాషలో బోకాలే బ్యాంకులు ఎలా పని చేస్తాయి? ఎలా పొదుపు చేయాలి? మోసాలను ఎలా నివారించాలి? ఇలా అనేక అంశాలను చదువుతుంది. ఆమె వాయిస్‌తోనే మైక్రోసాఫ్ట్ సృజనాత్మకతను జోడించి వినియోగ దారులకు అందిస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. బోకాలేపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ మహిళలు మైక్రోసాఫ్ట్ అభివృద్ది చేస్తున్న ఏఐ టూల్స్‌కి సాయం చేస్తున్నారని ట్వీట్ చేశారు. -
నాదెళ్ల పదేళ్ల ప్రయాణం..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆయన బాధ్యతలు ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకున్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఐటీ పరిశ్రమ ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయానికి బదులుగా సంస్కరణలను నమ్ముతుంది. అందులో భాగంగా పరిశోధనలను అందిపుచ్చుకుంటుదని సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సత్య మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికే 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా కంపెనీలోనే ఉన్నారు కదా..కొత్తగా ఏమి ఆవిష్కరిస్తారని చాలామంది అనుమానించారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే పెద్ద సవాలే. సత్య నాదెళ్ల చేసే ప్రతి పనిని, ప్రతి కదలికను ఆ ఇద్దరితో పోలుస్తారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బి.డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అంతర్గతంగా ఉత్తమ ఫలితాలు సాధించడం కంటే, ప్రజలు-పరిశ్రమలో బ్రాండ్ బిల్డింగ్ వైపు మైక్రోసాఫ్ట్ ఎక్కువగా మొగ్గుచూపేది. ఆ వైఖరిని ఆయన పూర్తిగా మార్చారు. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: 3 కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
లింక్డిన్లో ఉద్యోగం ఊడింది .. అదృష్టం వరించింది!
ఐర్లాండ్‌కు చెందిన ‘మరియానా కొబయాషి’కి లింక్డిన్లో పని చేయడం ఓ కల. పలు దిగ్గజ కంపెనీల్లో ఎన్నో తిరస్కరణల తర్వాత చివరికి 2022లో ఉద్యోగం సాధించింది. అదే కొబయాషి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలలో ఒకటిగా నిలిచింది. లింక్డిన్లో కోరుకున్న జాబ్.. సంతృప్తినిచ్చేలా జీతం. ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది. కానీ గతేడాది ఆర్ధిక మాంద్యం భయాలు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాయి. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి అంతర్జాతీయ కంపెనీల వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ తొలగింపుల్లో 2023 మేలో కోబయాషిని తొలగిస్తూ లింక్డిన్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం ఊడింది బ్రతుకు జీవుడా అంటూ ఇతర కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి చెడులో మంచి ఉందనే నానుడిని నిజం చేస్తూ..సరిగ్గా ఆరు నెలల తర్వాత గూగుల్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. దాదాపు రెట్టింపు జీతంతో, ఉన్నత స్థాయిలో జాబ్ ఆఫర్ చేయడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ గురైన సందర్భంలో ఆమె మానసిక సంఘర్షణ ఎలా ఉందో చెబుతూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకుంది. లింక్డిన్లో లేఆప్స్ సమయంలో తనకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకుంటూ..‘ నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లేఆఫ్స్ నన్ను షాక్‌కి గురి చేశాయి. లింక్డిన్లో ఉద్యోగం సాధించడం ఓ కలగా భావించనందునే .. అందులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఊహాలోకంలో విహరించాను. అదెంత తప్పో ఆ తర్వాతే తెలిసింది. లేఆఫ్స్‌కు గురయ్యాను. నాకున్న వ్యాల్యుని ఉద్యోగంతో ముడిపెట్టకూడదని, లేదంటే ఎప్పుడూ సంస్థల్ని నమ్ముకుని ఉండొద్దనే అనుభవం నాకు నేర్పించింది. తొలగింపుల నుంచి బయటపడేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాను. చివరికి గూగుల్ డబ్లిన్ కార్యాలయంలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని పొందినట్లు తెలిపింది. ఇప్పుడు నన్ను నేను చూసుకుని గర్వపడుతున్నాను. లింక్డిన్లో ఉద్వాసనకు గురైన తర్వాత నా కెరీర్లో రెండు అత్యున్న స్థానాలకు చేరుకున్నాను. ఒకటి జీతం డబుల్ అయ్యింది. రెండోది నాకు సరిపోయే గూగుల్‌లో ఉద్యోగం పొందడం. అదే లింక్డిన్లో ఉంటే ఆ రెండు అసాధ్యం’ అని వెల్లడించింది. ఈ సందర్భంగా లేఆఫ్స్ గురైన వారికి కోబయాషి పలు సూచనలు చేశారు. ఉద్యోగం పోగొట్టుకున్న వారికి నేనిచ్చే సలహా ఒకటే ప్రతి సంక్షోభంలోనూ ఓ అవకాశాన్ని వెతుక్కోడింది. అదే మిమ్మల్ని అత్యున్న స్థాయిలో ఉంచేలా చేస్తోంది అని ముగించింది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ గత ఏడాది రెండు సార్లు ఉద్యోగుల్ని తొలగించింది. రెండవ సారి ఇంజనీరింగ్, టాలెంట్ అండ్ ఫైనాన్స్ విభాగాలలో దాదాపూ 700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది. వారిలో మరియానా కొబయాషి ఒకరు -
త్వరలో భారత పర్యటన..మోదీతో భేటీ కానున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7, 8 రెండు రోజుల పర్యటనలో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు, ఈ టెక్నాలజీ వినియోగంతో వచ్చే అవకాశాల గురించి మాట్లాడనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు ఈ రెండు రోజుల పర్యటనలో సత్యనాదెళ్ల ఏఐ గురించి ఏం మాట్లాడుతారా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వెలుగులోకి వచ్చిన మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చాందక్ ఇంటర్నల్ మెయిల్స్ ఆధారంగా ‘మైక్రోసాఫ్ట్ భారత్‌లో ఆయా టెక్నాలజీల వినియోగం, అవకాశాల్ని మరింత విస్తరించనుందని’ తెలుస్తోంది. సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ 2023లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెక్ దిగ్గజ కంపెనీలైన యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోస్టాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఆ భేటీలో భారత్ టెక్నాలజీ వినియోగం, అవకాశాల గురించి సీఈఓలతో మోదీ మాట్లాడారు. ఆ చర్చలకు కొనసాగింపుగా.. భారత్‌లో పర్యటించనున్న సత్యనాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అవుతారంటూ మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన స్టేట్మెంట్లో తెలిపింది. వీరిరువురి భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశ సామర్థ్యాల గురించి చర్చకు వస్తాయని పేర్కొంది. టెక్నాలజీలో భారత్ భళా ‘భారతీయుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడే టెక్నాలజీలలో కృత్రిమ మేధస్సు ఒకటి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన డెవలపర్, స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థలకు నిలయం. మైక్రోసాఫ్ట్ భారతీయ సాంకేతికత వృద్ధికి కట్టుబడి ఉంది. ఇది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ప్రభావితం చేస్తుంది’ మైక్రోసాఫ్ట్ ప్రకటనలో హైలెట్ చేసింది. ఏడాది క్రితం భారత్‌లో పర్యటన ఏడాది క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల భారత్‌లో నాలుగు రోజుల అధికారిక పర్యటన చేశారు. తన పర్యటనలో కస్టమర్లు, స్టార్టప్‌లు, డెవలపర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులను కలిశారు. భవిష్ అగర్వాల్ సైతం పలు నివేదికల ప్రకారం.. భారత్ పర్యటకు రానున్న సత్యనాదెళ్లతో ముంబై, బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్స్ ఫౌండర్లు ఆయనతో భేటీ కానున్నారు. వారిలో సర్వం ఏఐ సంస్థ అధినేతలు, ఏఐ స్టార్టప్ కృత్తిమ్ ఫౌండర్ భవిష్ అగర్వాల్‌లు ఉన్నట్లు సమాచారం. -
Microsoft layoffs: 1,900 మందిని ఇంటికి పంపిస్తున్న మైక్రోసాఫ్ట్!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ గత ఏడాది 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ను బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్లు ఈమెయిల్లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. -
భారీగా పెరిగిన షేర్స్.. కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మైక్రోసాఫ్ట్!
గ్లోబల్ ఐటీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మార్కెట్ విలువ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్‌ను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కంపెనీ ఈ పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఎక్సేంజ్‌లో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 1.3 శాతం పెరిగి 403.78 డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్ విలువ పెరగడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. గతంలో 3 ట్రిలియన్ మార్కెట్ విలువను సాధించిన మొదటి కంపెనీగా యాపిల్ చేరింది. ఇప్పుడు అలాంటి రికార్డును తాజాగా మైక్రోసాఫ్ట్ కైవసం చేసుకుంది. ఇక యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా? మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం.. కంపెనీ ముందుకు దూసుకెళ్లడానికి, వృద్ధి సాధించడానికి కారణమవుతోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధిని సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ, యాపిల్ కంపెనీని అధిగమిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం బిల్‌గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. తాజాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బిల్‌గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్‌లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్‌లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్‌గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు. అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. -
వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్
యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మరో సారి రికార్డ్ క్రియేట్ చేసింది. 2024 ప్రారంభం నుంచి మార్కెట్లో యాపిల్ డిమాండ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ యాపిల్ని బీట్ చేసి ఆ స్థానం కైవసం చేసుకుంది. వాషింగ్టన్కు చెందిన మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5% పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏఐ మైక్రోసాఫ్ట్ వృద్ధికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2021 తర్వాత మొదటి సారి యాపిల్ వాల్యుమేషన్ మైక్రోసాఫ్ట్ కంటే తక్కువకు పడిపోయింది. కరోనా మహమ్మారి సమయంలో సప్లై చైన్ కొంత నిరాశపరచిన సమయంలో కూడా యాపిల్ని మైక్రోసాఫ్ట్ అధిగమించింది. ప్రస్తుతం, వాల్ స్ట్రీట్ మైక్రోసాఫ్ట్ మరింత సానుకూలంగా ఉంది. ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న కారణంగా యాపిల్ బలహీనపడింది. ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. చైనాలో యాపిల్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది, రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ వృద్ధి గతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐతో టై ఆప్ కావడమని తెలుస్తోంది. -
ఏఐలో ఉచిత శిక్షణ కావాలా?...
చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్బాట్లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ఏఐకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న టెకీల చదువు, పూర్వ పని అనుభవంతో సంబంధం లేకుండా కంపెనీలు అవకాశాలు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఏఐలో పని చేయాలనుకునే వారికి శిక్షణతోపాటు గుర్తింపు ఇస్తున్నాయి. దాంతో భవిష్యత్తులో వారు ఏదైనా ఇంటర్వ్యూకు హాజరైతే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏఐ ఒడిస్సీ ప్రోగ్రామ్‌తో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ప్రోగ్రామ్ నెల రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటిదశలో అజూర్ ఏఐ సర్వీస్‌లకు సంబంధించిన మెలకువలు నేర్పుతారు. కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు ఎలా సాధించాలో, నేర్చుకున్న మెలకువలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. రెండోదశలో నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా అమలు చేయాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్ ల్యాబ్ టాస్క్‌లతో ఆన్లైన్ అసెస్మెంట్ను పూర్తి చేయాలి. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని ఏఐ రియల్‌టైమ్ సమస్యలపై పనిచేసేందుకు వీలుంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి 8న బెంగళూరులో జరగబోయే మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఈ టూర్లో జనరేటివ్ ఏఐకు సంబంధించి అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఏఐ ఒడిస్సీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. aka.ms/AIOdyssey లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను అందులో నమోదు చేసి సబ్మిట్ చేయాలి. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత లెర్నింగ్ మాడ్యూల్స్‌కు యాక్సెస్ పొందుతారు. అందులో లాగిన్ అవ్వాలి. ప్రోగ్రామ్ మొదటి దశలో అజూర్ ఏఐ సర్వీస్‌లను ఎలా ఉపయోగించాలో ఉంటుంది. రెండో దశలో ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా ఏఐ నైపుణ్యాలను పరీక్షించుకోవాలి. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ..
గజినీ మహమ్మద్ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, అయితే ఓ మహిళ ఉద్యోగం కోసం ఏకంగా 30 కంటే ఎక్కువ సార్లు ఒకే కంపెనీకి అప్లై చేసి ఉద్యోగం సాధించింది, జాబ్‌లో చేరిన కేవలం ఏడాదికే రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చింది. దీనికి బంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతానికి చెందిన 'హిమాంతిక మిత్రా' (Haimantika Mitra) బెంగళూరులో నివశిస్తూ.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేయాలని దాదాపు 30 కంటే ఎక్కువ సార్లు అప్లై చేసుకుని, పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా చివరకు అనుకున్నట్లుగానే ఉద్యోగంలో చేరింది. 30 సార్లు ఉద్యోగానికి అప్లై చేసి జాబ్ తెచ్చుకున్న హిమాంతిక కేవలం ఒక సంవత్సరం మాత్రమే అక్కడ పనిచేసి రాజీనామా చేసి కంపెనీకి మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అవాక్కయ్యేలా చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ 2020లో దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి సపోర్ట్ ఇంజినీర్లను ఎంపిక చేఉకోనున్నట్లు తెలుసుకుని మిత్రా జాబ్‌కి అప్లై చేసింది. అప్పుడు మొత్తం 11,000 జాబ్ కోసం అప్లై చేసుకోగా.. చివరి రౌండ్లో మిత్రా సెలక్ట్ కాలేకపోయింది. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ కంపెనీ ఆమె పనితీరుని చూసి మైక్రోసాఫ్ట్ రిక్రూటర్లు ఇంటర్వ్యూ చేయడానికి అంగీకరించారు, ఇందులో భాగంగానే 2021 ఏప్రిల్ నుంచి ఇంటర్న్‌షిప్ అనుకున్నట్లుగానే చివరకు ఇంటర్వ్యూలో నెగ్గి జాబ్ కొట్టేసింది. ఇంత కష్టపడి ఉద్యోగంలో చేరిన సంవత్సరం తరువాత మైక్రోసాఫ్ట్ కంటే మంచి కంపెనీలో.. మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశ్యంతో జాబ్ వదిలిసినట్లు తెలిపింది. భవిష్యత్తులో మళ్ళీ మైక్రోసాఫ్ట్‌లో అడుగు పెడతానని కూడా మిత్రా వెల్లడించింది. I applied to Microsoft 30+ times, and when I got hired, I was one among the 25 from the pool of 11000 applicants (It was off-campus hiring through a hackathon). I believe in - Send that DM. Apply to that job. Take the road not taken. Worst case? I fail. Soak it all in. Be sad.… https://t.co/3YQemnJ2Yj — Haimantika Mitra (@HaimantikaM) January 4, 2024 -
‘నా సీఈఓ పదవికే ఎసరు పెడతారా?’.. ఓపెన్ ఏఐలో మరో కీలక పరిణామం!
చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కారణమైన బోర్డ్ సభ్యులపై చర్యలు తీసుకున్నారు. బోర్డ్‌లో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా,మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ పార్టనర్ షిప్ అండ్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించే ‘డీ టెంపుల్టన్’ను శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ బోర్డులో నాన్-ఓటింగ్ అబ్జర్వర్ బాధ్యతలు అప్పగించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ వ్యాపార ప్రపచంలో చర్చాంశనీయంగా మారింది. సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ను బోర్డ్ సభ్యులు పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 700 మంది ఉద్యోగులు రాజీనామా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆల్ట్‌మన్‌తో మైక్రోసాఫ్ట్ భేరసారాలు అదే సమయంలో ఓపెన్ ఏఐ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇవ్వడం, ఆల్ట్ మన్తో పాటు ఇతర ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంపద్రింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. అయితే , ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్ తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఓపెన్ ఏఐలోనూ సమస్య సద్దుమణిగింది. ఓపెన్ ఏఐ బోర్డ్‌లో మార్పులు ఓపెన్ఏఐలో సీఈఓగా తిరిగి వచ్చిన తర్వాత, ఓపెన్ఏఐ బోర్డు మైక్రోసాఫ్ట్ నాన్-ఓటింగ్, అబ్జర్వర్ పొజిషన్‌ను తీసుకుంటుందని ఆల్ట్‌మన్ చెప్పారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డీ టెంపుల్టన్ ఓపెన్ఏఐలో అబ్జర్వర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. అబ్జర్వర్‌గా టెంపుల్టన్ ఓపెన్ ఏఐలో అబ్జర్వర్‌గా బాధ్యతలు చేపట్టనున్న టెంపుల్టన్.. ఆ సంస్థ బోర్డ్ మీటింగ్‌తో పాటు, ఇతర అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కలగనుంది. కానీ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఏదైనా తీసుకునే నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉండదు. దీంతో పాటు ఓటింగ్ నిర్వహించి డైరెక్టర్లను ఎంపిక చేసుకునే విధానంతో ఎలాంటి సంబంధం ఉండదు. 25ఏళ్ల అనుభవం టెంపుల్టన్ మైక్రోసాఫ్ట్‌లో 25 ఏళ్లగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇప్పటికే ఓపెన్ ఏఐ బోర్డు సమావేశాలకు హాజరవుతన్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఓపెన్ఏఐ బోర్డ్ సభ్యులు వీరే సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆల్ట్మన్లో బోర్డ్‌లో మార్పులు చేస్తున్నారు. తనని తొలగించిన డైరెక్టర్ల బోర్డును పాక్షికంగా పునర్నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు పాత బోర్డ్ సభ్యులు సైతం అంగీకరించారు. ఇప్పుడు వారి స్థానంలో సేల్స్‌ఫోర్స్ కో సీఈఓ బ్రెట్ టేలర్, మాజీ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, క్వారా సీఈఓ, ప్రస్తుత డైరెక్టర్ ఆడమ్ డి ఏంజెల్‌లు ఓపెన్ఏఐతో చేతులు కలిపారు. బోర్డ్‌లో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. -
పనిచేయకుండా రూ.830 కోట్ల సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
'కష్టే ఫలి' అన్నారు పెద్దలు.. కష్టపడకుండానే ఫలితం వచ్చేస్తే..! ఈ మాటలు వినటానికి వింపుగా ఉంటాయి, కానీ కొందరి జీవితంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ 'స్టీవ్ బాల్మెర్' (Steve Ballmer). ఇంతకీ ఈయన కష్టపడకుండా ఎలా సంపాదించాడు, దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్‌లో అతిపెద్ద వాటాదారు అయిన బాల్మెర్ కంపెనీలో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది దాదాపు 333.2 మిలియన్ షేర్లకు సమానమని సీఎన్ఎన్ నివేదించింది. ఈ వాటా విలువ ఇప్పుడు ఏకంగా 130 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఈ ఏడాది మాత్రమే ఆయన సంపద 44 బిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర ఏకంగా 56 శాతం పెరగడంతో బార్మర్ సంపాదన కూడా పెరిగింది. మొత్తానికి స్టీవ్ బాల్మెర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి వార్షిక డివిడెండ్ చెల్లింపులలో 1 బిలియన్లను అందుకోబోతున్నారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ. 830 కోట్లకంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? 1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బాల్మెర్ అతి తక్కువ కాలంలోనే గణనీయమైన వాటాను సంపాదించాడు. అంతే కాకుండా 2000లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికై 2014లో పదవీవిరమణ చేశాడు. వాటా యాజమాన్యం కారణంగా, స్టీవ్ బాల్మెర్ ప్రపంచ ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో చేరటానికి అవకాశం ఉందని తెలుస్తోంది. -
టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు!
మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్-10నేనా? అయితే వెంటనే జాగ్రత్త పడండి. వేలు పోసి కొనుక్కున్న ఆ కంప్యూటర్/ల్యాప్‌టాప్ నిరుపయోగంగా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటారా.. విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సపోర్ట్‌ను నిలిపివేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారతాయని 'కెనాలిస్ రీసెర్చ్' తాజా నివేదికలో వెల్లడించింది. మరిన్ని వివరాలు... మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 10కు సపోర్ట్ చేయడం నిలిపేస్తే.. చాలా మంది అలాంటి కంప్యూటర్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపరు. దీంతో ఇవన్నీ పనికిరాని వస్తువులుగా మిగిలిపోవాల్సి వస్తుంది, తద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యర్దాల బరువు సుమారు 3.20 లక్షల కార్ల బరువుకు సమానంగా ఉండొచ్చని, దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ స్క్రాప్ భవిష్యత్తులో ఏ స్థాయిలో పెరుగుతాయనేది ఇప్పుడే అర్థమైపోతోంది. విండోస్ 10కు సపోర్టు నిలిచిపోయినప్పటికీ కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంది, కానీ సేఫ్టీ అప్డేట్స్ లేని కారణంగా ఎక్కువమంది కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో.. ఇవన్నీ నిరుపయోగమే అవుతాయి. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! నిజానికి మైక్రోసాఫ్ట్ గతంలోనే ఓ సందర్భంలో.. 2025 నాటికి విండోస్ 10కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ 2028 వరకు వార్షిక ఫీజుతో అందించనున్నట్లు సమాచారం, ఈ వార్షిక ఫీజు చెల్లించడానికి బదులు అప్డేటెడ్ కంప్యూటర్లను కొనుగోలు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్క్రాప్‌కు వెళ్లే పాత కంప్యూటర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని కెనాలిస్ రిపోర్ట్ వెల్లడించింది. -
Generative AI Battle: చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ
భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ఏఐ యాజమాన్యంలోని చాట్‌జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చినా ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది... మొగ్గు జెమినీకే కనిపిస్తున్నా... అవడానికి చాట్‌జీపీటీ, జెమినీ రెండూ జెనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాట్రన్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జెనరేట్ చేస్తాయి. చాట్‌జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం). ఇది టెక్స్ట్ జెనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత వెబ్ సంభాషణల యాప్‌గా కూడా పని చేస్తుంది. గూగుల్‌కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో లాఎండీఏ లాంగ్వేజ్ మోడ్‌పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని పీఏఎల్‌ఎం2 మోడ్‌గా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్‌జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎందుకంటే ఇది మలి్టపుల్ ఇన్పుట్, ఔట్పుట్ మోడ్లతో నేరుగా పని చేయగలదు. అంతేగాక టెక్స్ట్, ఆడియో, వీడియోలను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి సామర్థ్యంతో కూడిన జీపీటీ–4 విజన్ మోడల్‌ను ప్రకటించినా అది జెమినీ మాదిరిగా పూర్తిస్థాయి మలీ్టమోడల్ కాదు. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్స్ట్ పైనే ఆధారపడుతుంది. ఉదాహరణకు ఆడియో ఇన్‌పుట్స్‌ను స్పీచ్ ఔట్పుట్గా మార్చేందుకు విష్పర్ అనే స్పీచ్ టు టెక్స్ట్ ఇన్పుట్ లెరి్నంగ్ మోడల్ సాయం తీసుకుంటుంది. ఇమేజీలను అందించాలన్నా అంతే. అది జెనరేట్ చేసే టెక్స్ట్ ప్రాంప్్టలను డాల్–ఈ2 అనే మరో డీప్ లెరి్నంగ్ మోడల్ ఇమేజీలుగా మారుస్తుంది. కానీ గూగుల్ మాత్రం జెమినీని ఇలా కాకుండా పూర్తిస్థాయి మల్టీ మోడల్ ఏఐగా తీర్చిదిద్దుతోంది. ఇతర లెరి్నంగ్ మోడళ్ల సాయంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆడియో, ఇమేజీలు, వీడియో, టెక్స్ట్ వంటి ఇన్పుట్ టైప్లను అది తనంత తానే కావాల్సిన ఔట్పుట్లుగా మార్చేస్తుంది. జీపీటీ–4తో పోలిస్తే జెమినీ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియకపోయినా దాన్ని చాలా హెచ్చు సామర్థ్యంతో రూపొందిస్తున్నట్టు గూగుల్ ప్రకటించుకుంది. దానికిప్పటికే జెమినీ 1.0 అల్ట్రా అని కూడా పేరు పెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో ఇది జీపీటీ–4 కంటే మిన్నగా తేలిందని చెబుతోంది కూడా. ఇందుకు రుజువుగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. కాకపోతే అందులో చూపించిన టాస్‌్కలను రియల్‌టైమ్‌లో చేయడంలో జెమినీ ఏ మేరకు కృతకృత్యమవుతుందో చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధి యూజర్లకే... ఈ సందేహాల మాట ఎలా ఉన్నా జెమినీ వంటి భారీ మలీ్టమోడల్ మోడళ్లు జెనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా టెక్స్ట్ ఆధారితమైన జీపీటీ–4 ఇప్పటికే ఏకంగా 500 బిలియన్ పదాలపై శిక్షణ పొందింది! అంటే, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పదాలన్నీ దానికిప్పటికే చిరపరిచితమని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైనింగ్ డేటాతో పాటు మోడల్ తాలూకు సంక్లిష్టత ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితీరు అంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి అన్ని రకాల డేటాను నేరుగా వాడగల జెమినీ వంటి ఏఐ మోడళ్లు మున్ముందు మరింత సామర్థ్యం సంతరించుకోవడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అప్‌గ్రేడెడ్ జీపీటీ–5 వెర్షన్‌పై ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ నిరంతర పోటీ అంతిమంగా యూజర్లకే మరింత లబ్ధి చేకూరుస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Generative AI: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...
చాట్‌జీపీటీ.. ఆన్లైన్ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ. అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. బింగ్ ఏఐ గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్సైట్లోకి వెళ్లి బింగ్ చాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్‌ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్‌లేటర్ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది. మెర్లిన్ ఇదో క్రోమ్ చాట్‌జీపీటీ ఎక్స్టెన్షన్. ఏ వెబ్సైట్ మీదైనా యాక్సెస్ చేయొచ్చు. మెర్లిన్‌ను ఇన్స్టాల్ చేసుకొని, ఖాతాను ఓపెన్ చేస్తే చాలు. కంట్రోల్/ కమాండ్ ప్రాంప్ట్ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్‌నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్ రాసి పెడుతుంది. దీనిలోని చాట్‌జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్‌బార్‌లో సమాధానాలిస్తుంది. పోయ్ ఇది కోరాకు చెందిన ఏఐ యాప్. ఆంత్రోపోనిక్ సంస్థ రూపొందించిన క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోయ్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్ లేదా ప్రాంప్ట్‌తో తేలికగా వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: సీఈఓ -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్‌తో ఆల్ట్‌మన్‌ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
Microsoft: త్వరలో మైక్రోసాఫ్ట్ ఐడీసీ సంచలన ప్రాజెక్ట్‌లు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్ కేక్ కట్‌చేసి మాట్లాడారు. ‘భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్ ఫార్మాట్లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్బంది అనే కోపైలట్ టూల్ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: తెలంగాణను దాటేసిన ఏపీ..! మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్బందీ, అజూర్ స్పెషలైజ్డ్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా?
ఎలాన్‌మస్క్‌కు చెందిన సోషల్‌మీడియా దిగ్గజ కంపెనీ ‘ఎక్స్’ త్వరలో ఈ ఏడాది చివరినాటికి భారీగా నష్టపోనుందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. ఎక్స్ ద్వారా చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను ప్రచారం చేస్తాయి. అయితే అందులో ప్రధాన బ్రాండ్ కంపెనీలు వాటి ప్రచారాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేయనున్నట్లు తెలిసింది. దాంతో ఆ కంపెనీల ద్వారా ఎక్స్‌కు వచ్చే ఆదాయం రూ.625 కోట్లు తగ్గనుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత వారం ఎలాన్‌మస్క్ ఎక్స్ వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఉన్న ఒక పోస్ట్‌ను సమర్థించాడు. దాంతో వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో సహా కొన్ని కంపెనీలు ఎక్స్‌లో తమ ప్రకటనలు కొంతకాలం నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో యాపిల్, ఒరాకిల్‌తో సహా ప్రధాన కంపెనీలకు చెందిన ప్రకటనలు అడాల్ఫ్ హిట్లర్, నాజీ పార్టీని ప్రచారం చేసే కొన్ని పోస్ట్‌ల పక్కన కనిపించాయి. దాంతో ఆ కంపెనీలు ఎక్స్ మీడియా, వాచ్డాగ్ గ్రూప్ మీడియాపై దావా వేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈవారం ఎయిర్ బీఎన్బీ, అమెజాన్, కోకకోలా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన దాదాపు 200 యాడ్ సంస్థలు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రకటనలు లిస్ట్ చేశాయి. కానీ వాటిలో కొన్నింటిని త్వరలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! అక్టోబర్ 2022లో మస్క్ ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా కంపెనీలకు చెందిన ప్రకటనదారులు యాడ్లను తగ్గించినట్లు సమాచారం. సైట్లో ద్వేషపూరిత ప్రసంగాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. మస్క్ ఎక్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి యూఎస్ ప్రకటనల ఆదాయం ప్రతి నెలా దాదాపు 55 శాతం తగ్గుతుందని రాయిటర్స్ గతంలో తెలిపింది. -
మైక్రోసాఫ్ట్ జీడీసీ లీడర్‌గా అపర్ణ గుప్తా
Microsoft GDC Leader: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తన కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్ని అధికారికంగా ప్రకటించింది. ఈమె ఎవరు? ప్రస్తుతం ఆమె చేపట్టే బాధ్యతలు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా 'అపర్ణ గుప్తా' (Aparna Gupta) బాధ్యతలు స్వీకరించింది. ఈమె కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ సామర్ధ్యాలను పర్యవేక్షిస్తుంది. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ విభాగంగా జీడీసీని హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఆ తరువాత ఇది బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాలకు విస్తరించింది. అపర్ణ గుప్తా లీడర్షిప్ లక్షణాలు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ మీద కూడా మంచి పట్టుని కలిగి ఉంది, ఆమె సారథ్యంలో కంపెనీ పురోగతి చెందుతుందన్న విశ్వాసం తమకుందని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ మౌరీన్ కాస్టెల్లో అన్నారు. ఆరు సంవత్సరాల క్రితం, అపర్ణ కమర్షియల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ (CSE)గా చేరి.. ఇప్పుడు గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా ఎంపికైంది. ప్రారంభం నుంచి మంచి ప్రతిభను కనపరిచిన అపర్ణ ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది, రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్..
Microsoft Outlook Lite: ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఔట్లుక్ లైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇమెయిల్ అండ్ ఎస్ఎమ్ఎస్ యాప్ పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ (Microsoft Outlook Lite) అనేది భారతదేశంలోని వినియోగదారుల కోసం కంపెనీ రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాప్. ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి అనుకూలంగా ఇది స్థానిక భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది 3G, 4G, 5G లాంటి ఏ నెట్‌వర్క్‌లో అయినా చాలా వేగంగా పనిచేస్తుంది. ప్రాంతీయ భాషల్లో.. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ భారతదేశంలో విభిన్న భాషా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది. ఇందులో వాయిస్ టైపింగ్, ట్రాన్స్లేషన్ వంటివి మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఇమెయిల్ చదవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ద్వారా వినియోగదారుడు తమ మాతృభాష లేదా ప్రాధాన్య భాషలో ఇమెయిల్‌లను కంపోజ్ చేసుకోవచ్చు, తద్వారా సులభంగా చదువుకోవచ్చు. అంతే కాకుండా ఒక భాషలో ఈ కంటెంట్ టైప్ చేసి దాన్ని తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. హిందీలో ఇమెయిల్ టైప్ చేసి, దాన్ని ఆటోమాటిక్‌గా ఇంగ్లీష్‌లో లేదా ఇతర భాషల్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఔట్లుక్ లైట్ సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ వంటి ఐదు భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని భాషలు, మాండలికాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఎస్ఎమ్ఎస్.. ఇక ఎస్ఎమ్ఎస్ మెసేజింగ్ విషయానికి వస్తే, ఔట్లుక్ లైట్ కేవలం ఇమెయిల్స్‌కి మాత్రమే కాకుండా.. ఎస్ఎమ్ఎస్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేషన్, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి కోసం సంస్థ 'స్మార్ట్ ఇన్‌బాక్స్' అందిస్తుంది. ఇది సమాచారాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సంబంధిత సందేశాలను ఒకే చోట చూడటానికి అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన అపాయింట్మెంట్లు, ట్రావెల్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్ వంటి వాటిని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఔట్లుక్ లైట్ భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది, కంపెనీ త్వరలోనే ఈ ఫెసిలిటీని కూడా అందించే అవకాశం ఉంది. ఆ తరువాత వినియోగదారుడు తనకు నచ్చిన భాషల్లో మెసేజస్ చదువుకోవచ్చు. నచ్చిన భాషలో అనువాదం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఫీచర్స్ పరిచయం చేసిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ & మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, ఇండియా గ్రూప్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ 'రాజీవ్ కుమార్' మాట్లాడుతూ.. భారతదేశం టెక్నాలజీలో దూసుకెళ్తున్న తరుణంలో డిజిటల్ అనుభవాలను పెంపొందించడంలో ఔట్లుక్ లైట్ ఫీచర్స్ ఉపయోగపడతాయని, వినియోగదారుల మధ్య బలమైన కమ్యూనికేషన్ పెంపొందించడం సహాయపడతాయని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ప్రతి వ్యక్తి లేదా వినియోగదారుడు తన ప్రాధాన్య భాషతో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, రోజువారీ పరస్పర చర్యలను సులభతరం చేయడంలో ఇది సహకరిస్తుందని చెబుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో కంపెనీ కృషి చేస్తుందని వివరించారు. -
ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్ స్పందన
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను, అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కృషిని ప్రశంసించిన నాదెళ్ల కప్ గెలుచుకున్న ఆసీస్‌ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్కాస్ట్లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కారా స్విషర్ పోడ్కాస్ట్లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అని కారా సరదాగా ప్రశ్నించాడు. దీనికి నాదెళ్ల మాట్లాడుతూ ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు. అయితే ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే చాట్‌జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్మాన్ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుండి నడిపిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరో కీలక పరిణామం, ‘ఓపెన్ఏఐ’లోకే శామ్ ఆల్ట్‌మన్?
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఓపెన్ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్ఏఐలో ఆల్ట్‌మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్‌లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆల్ట్‌మన్ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అయితే, ఓపెన్ఏఐలోని పెట్టుబడి దారులు శామ్ ఆల్ట్‌మన్‌ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో చేరడం కంటే, తిరిగి ఓపెన్ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ! -
మైక్రోసాఫ్ట్‌లోకి సామ్ ఆల్ట్‌మ్యాన్
వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్ ఆల్ట్‌మ్యాన్ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్ ఆల్ట్‌మ్యాన్ తాజాగా మైక్రోసాఫ్ట్‌లో చేరి పోయారు. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. ఆల్ట్‌మ్యాన్‌ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ సైతం ఓపెన్ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మ్యాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్‌చేశారు. -
ఓపెన్ఏఐ వద్దంటే.. మైక్రోసాఫ్ట్ రమ్మంది!
సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. కంపెనీ 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించిన వెంటనే సంస్థ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్‌మన్' తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఒకే రోజులు జరిగిన ఈ సంఘటనలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో వారిద్దరూ (శామ్ ఆల్ట్‌మన్ & గ్రెగ్ బ్రాక్‌మన్) ఎమ్మెట్ షియర్ అండ్ ఓఏఐ (Emmett Shear and OAI) కొత్త బృందానికి నాయకత్వం వహించనున్నట్లు సీఈఓ 'సత్య నాదెళ్ళ' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్ ఓపెన్ఏఐతో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని.. శామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్‌లో చేరబోతున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. వారి విజయాలకు అవసరమైన వనరులను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సత్య నాదెళ్ల వెల్లడించారు. We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett… — Satya Nadella (@satyanadella) November 20, 2023 -
అప్పుడు షాక్‌కి గురయ్యా..! ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) 2014లో సీఈఓ అవుతానని తెలిసినప్పుడు ఎలా అనిపించిందో ఇటీవల బెర్లిన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు అందుకున్న సత్య నాదెళ్ల తన కెరీర్ గురించి, నాయకత్వం గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైక్రోసాఫ్ట్‌లో స్టీవ్ బాల్మెర్ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురైనట్లు, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ బోర్డు సీఈఓ పదవికి ఎంపికైన నలుగురు టాప్ అభ్యర్థుల్లో నాదెళ్ల కూడా ఉన్నట్లు తెలిపాడు. బోర్డు సభ్యులలో ఒకరు నన్ను మీరు CEO అవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన విషయం స్పష్టంగా గుర్తుందని.. నేను ఎప్పుడూ సీఈఓ కావాలనుకునే విషయం గురించి ఆలోచించలేదని, అయితే నా మీద నమ్మకంతో సీఈఓ బాధ్యతలు అప్పగించారని వివరించారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇంజినీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని బిల్ గేట్స్ ప్రకటించాడు. ఆ తరువాత సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. 1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి నాయకత్వం వహించిన ముగ్గురు వ్యక్తులలో తెలుగు తేజం సత్య నాదెళ్ల ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. అంతకు ముందు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించారు. -
గూగుల్ - యాపిల్ మధ్య భారీ డీల్.. సత్యనాదెళ్ల పోరాటం ఫలించేనా?
ఆన్లైన్ సెర్చింగ్ విభాగంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యాంటీ ట్రస్ట్ కేసుల్ని ఎదుర్కొంటుంది. ఇతర సంస్థల్ని ఎదగనీయకుండా గూగుల్ గుత్తాదిపత్యం వహిస్తుందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతుంది. ఓ వైపు ఆ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుండగా.. ఐఫోన్లలో డీపాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండేలా గూగుల్ మరో టెక్ దిగ్గజం యాపిల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? యాపిల్ వెబ్‌బ్రౌజర్ సఫారీలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ ఉంచేందుకు గాను గూగుల్ యాజమాన్యం 10 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్ల మధ్య చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఆ డీల్ విలువ 18 బిలియన్ డాలర్లు అంటూ ఓ నివేదికను విడుదల చేసింది. 2021లో గూగుల్ ఈ మొత్తాన్ని యాపిల్‌కు చెల్లించిందని స్పష్టం చేసింది. స్పాట్‌లైట్‌తో పాటు సఫారీలో సైతం రెండు దిగ్గజ టెక్ కంపెనీల మధ్య ఒప్పందం పూర్తయితే.. యాపిల్ సంస్థ తయారు చేసే ఐమాక్లలో స్పాట్లైట్ అనే ఫీచర్ ఉంది. ఆ ఫీచర్లో గూగుల్ సెర్చింజన్ ఆప్షన్ కనిపించడంతో పాటు, మనం ఏదైనా సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో.. అలాంటి ఫలితాలే యాపిల్ బ్రౌజర్ సఫారీ యూజర్లకు కనిపిస్తాయి. యాపిల్ భయపడుతోంది ఐఫోన్ల కోసం తన సొంత వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా స్పాట్లైట్ వినియోగాన్ని తగ్గించే మార్గాల్ని గూగుల్ అన్వేషిస్తుంది. యాపిల్ సఫారీ బ్రౌజర్‌కి బదులు ఐఫోన్ యూజర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను వినియోగించేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుంది. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల న్యూయార్క్ టైమ్స్(nyc)తో మరో విధంగా స్పందించారు. గూగుల్ తన సెర్చ్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై యాపిల్ ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. యాపిల్ యూజర్లు గూగుల్ క్రోమ్‌ని వినియోగించేలా గూగుల్ జీమెయిల్‌తో పాటు ఇతర సేవల్ని ఉపయోగించడంపై యాపిల్ భయపడుతుందని అర్ధం వచ్చేలా నాదెళ్ల వ్యాఖ్యలు చేశారు. మేం 15 బిలియన్ డాలర్లు చెల్లిస్తాం మేము (మైక్రోసాఫ్ట్) సైతం యాపిల్ డివైజ్‌లలో డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు సత్యనాదెళ్ల తెలిపారు. కానీ భారీ మొత్తంలో చెల్లించేందుకు తాము సంసిద్ధంగా లేమని న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాపిల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా మారేందుకు మైక్రోసాఫ్ట్ 15 బిలియన్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉందని న్యూ యార్క్ టైమ్స్ నివేదిక హైలెట్ చేసింది. గూగుల్ పై సత్యనాదెళ్ల న్యాయపోరాటం ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? గూగుల్ - యాపిల్ మధ్య జరిగిన ఈ ఒప్పందం గతంలో యాపిల్- మైక్రోసాఫ్ట్‌ల మధ్య జరిగింది. కానీ గూగుల్ తన గుత్తాధిపత్యంతో మైక్రోసాఫ్ట్‌ను వద్దనుకుని తనతో పనిచేసేలా పావులు కదిపింది. చివరికి అనుకున్నది సాధించింది. మైక్రోసాఫ్ట్‌ను వద్దనుకున్న యాపిల్ .. గూగుల్‌తో జతకట్టింది. ఇప్పుడు ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల యూఎస్‌లోని ఓ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్ మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని సత్య నాదెళ్ల ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ,గూగుల్‌పై సత్యనాదెళ్ల చేస్తున్న న్యాయ పోరాటం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి. చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్‌కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
Microsoft-Amazon Deal: రెండు టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి.. భారీ ఒప్పందం!
రెండు బలమైన టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి పరస్పరం సహకరించుకునేందకు సిద్ధమయ్యాయి. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ (Microsoft) దాని క్లౌడ్ ఆధారిత 365 ఉత్పాదకత సూట్ కోసం అమెజాన్ (Amazon.com)ని ముఖ్యమైన క్లయింట్‌గా స్వాగతించడానికి సిద్ధమైంది. 1 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లకు పైగా ) కంటే ఎక్కువ విలువైన ఈ ఒప్పందం ఇద్దరు టెక్ దిగ్గజాలకు ఒక మైలురాయిని సూచిస్తోంది. సాధారణంగా బలమైన పోటీదారులుగా ఉండే ఈ రెండు కంపెనీలు ఇలా సహకరించుకోవడం టెక్నాలజీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది. ఐదేళ్లకు మించి ఉండే ఈ ఒప్పందం కోసం అమెజాన్.. మైక్రోసాఫ్ట్‌కు భారీ మొత్తాన్ని కట్టబెట్టనుందని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ 365 కోసం అమెజాన్ పది లక్షలకు పైగా లైసెన్స్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ షేర్ ధర 1 శాతం మేర పెరిగింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. మరో వైపు అమెజాన్ కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నివేదిక ప్రకారం, నవంబర్ ప్రారంభంలో ఈ కొత్త సిస్టమ్‌లను ఏకీకృతం చేయడం ప్రారంభించాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (Microsoft Office) ఉత్పత్తుల స్థానిక, ఆన్-సైట్ వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. అమెజాన్ కొత్త సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నవంబర్‌లో ప్రారంభించలనుకుంటుండగా ఏఐ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసిన మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365) సూట్‌ను కూడా ఇదే నెలలో ప్రారంభించనుండటం గమనార్హం. -
మైక్రోసాఫ్ట్ ఫాంట్ వల్ల పాక్ ప్రధాని పదవి ఊడింది!
అది జులై 13, 2018 లాహోర్ ఎయిర్ పోర్ట్. పాకిస్తాన్లో శక్తివంతమైన నేత, ఆ దేశానికి అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్(72), ఆయన కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ తీవ్ర ఉద్రికత్త, ఉత్కంఠతల మధ్య అధికారులు అరెస్ట్ చేశారు. పనామా పత్రాల స్కామ్‌లో ఎవెన్ ఫీల్డ్ హౌజ్ అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ సుప్రీం కోర్టు వీళ్లిద్దరిని దోషులుగా ప్రకటించింది. అయితే, నవాజ్ షరీఫ్, కుమార్తె నవాజ్ మరియం షరీఫ్‌లు కేవలం మైక్రోసాఫ్ట్ ఫాంట్ వల్ల పట్టుబడ్డారనే విషయం మీకు తెలుసా? ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తన కుటుంబం కోసం ప్రభుత్వ నిధులు కాజేశారంటూ ఏప్రిల్3, 2016న జర్మన్ వార్తాపత్రిక Süddeutsche Zeitung ( SZ ) 11.5 మిలియన్ల రహస్య పత్రాలు లీక్ అయినట్లు ప్రకటించింది. పనామా పేపర్స్ అని పిలవబడే ఈ డాక్యుమెంట్లలో క్లయింట్లు ఆయా ప్రభుత్వాలకు పన్ను చెల్లించకుండా బిలియన్ డాలర్లు ఎలా దాచుకున్నారో వెల్లడించింది. వెలుగులోకి వచ్చిన పనామా డాక్యుమెంట్లలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దగ్గర ఉన్న ఆస్తులు కన్నా చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది. అంతేకాదు, ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసేలా షరీఫ్ తన కుమార్తె కోసం లండన్‌లో ఓ విలావంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై 2017లో పాక్ సుప్రీం కోర్టు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటూ షరీఫ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. అనేక వాయిదాల తర్వాత నవాజ్ షరీఫ్ కూతురు మరియం కొన్ని డాక్యుమెంట్లను సాక్షాలుగా చూపించింది. ఈ డాక్యుమెంట్స్‌లో ఉన్న డేట్ ఫిబ్రవరి 2006, వాడిన ఫాంట్ మైక్రోసాఫ్ట్ కాలిబ్రి. అయితే కాలిబ్రి అనే ఫాంట్ ను మైక్రోసాఫ్ట్ 2007లో అందరికి అందుబాటులో వచ్చింది. కానీ ఆ విషయం తెలియక షరీఫ్ - మరియంలు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించారు. ఇదే అంశంపై 15 సంవత్సరాల క్రితం కాలిబ్రిని డిజైన్ చేసిన డచ్ టైప్‌ఫేస్ డిజైనర్ లుకాస్ డి గ్రూట్, షరీఫ్ కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. తాను డిజైన్ చేసిన ఈ కాలిబ్రి ఫాంట్ 2007లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. కానీ 2006లో ఎలా వినియోగించారనే అనుమానం లేవనెత్తారు. దీని బట్టి మరియం ఇచ్చింది దొంగ సాక్ష్యాలని కోర్టుకు తెలిసింది. ఒక ఫారెన్సిక్ హ్యాండ్ రైటింగ్ కంపెనీ తప్పును పట్టేసింది. నవాజ్‌కు వ్యతిరేకంగా ఇదొక పెద్ద సాక్ష్యంగా మారింది. రెండు కేసుల్లో న్యాయస్థానాలు ఆయనకు 2018లో శిక్ష విధించాయి. లండన్‌లో అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న కేసులో పదేళ్లు; సౌదీ అరేబియాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 2019, నవంబరులో షరీఫ్ లండన్ వెళ్లి, ఇప్పటివరకూ తిరిగి రాలేదు! అయితే, తన సోదరుడు షెహ్బాజ్ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో..షరీఫ్ ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ క్రమంలోనే భారత్ చంద్రుణ్ని చేరుకుంటే.. పాక్ ప్రపంచాన్ని అడుక్కుంటోందని విచారించారు. అంతేకాదు, తన ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతోపాటు ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ఉన్నారని ఆరోపించారు. -
గూగుల్‌తో పోటీ: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. సీవీపీగా అపర్ణ చెన్నప్రగడ
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్ మహిళ అపర్ణ చెన్నప్రగడ (Aparna Chennapragada) నియమితులయ్యారు. టెక్ పరిశ్రమలో విశేష అనుభవమున్న ఆమెకు కీలకమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన అపర్ణకు ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గూగుల్‌లో సుమారు 12 ఏళ్లు పనిచేశారు. స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్‌హుడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ డిజైనర్లో జెనరేటివ్ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహించనున్నారు. (TCS Headcount Drops: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..) లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అపర్ణ చెన్నప్రగడ ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో టీటెక్ చేశారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని, మిట్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని పొందారు. ప్రముఖ ఈబే (eBay) సంస్థలో కన్స్యూమర్ షాపింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ఏఆర్, విజువల్ సెర్చ్ ప్రోడక్ట్‌లకు లీడ్‌గా, బోర్డు మెంబర్‌గా కూడా అపర్ణ పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా యూఎస్ చెందిన బిజినెస్ పబ్లికేషన్ ‘ఇన్ఫర్మేషన్’ నివేదించింది. అపర్ణ నియామకానికి ముందు మరో భారతీయ-అమెరికన్ రోహిణి శ్రీవత్స సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియాలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. పునీత్ చందోక్ ఆగస్టులో భారతదేశం, దక్షిణాసియాకు మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. -
కోర్టు హాలులో గూగుల్‌పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ ఆధారాలతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వాషింస్టన్ డీసీ కోర్టుకు హాజరయ్యారు. అమెరికా న్యాయశాఖకు, ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో సత్యనాదెళ్ల అత్యంత కీలకమైన ఆధారాల్ని ఇవ్వడంతో పాటు, కోర్టుకు సాక్ష్యం కూడా చెప్పారు. ఇటీవల కాలంలో గూగుల్ గత కొన్నేళ్లుగా యాంటీట్రస్ట్ ట్రయల్స్ విచారణ ఎదుర్కొంటుంది. ఇతర సంస్థలు ఎదగనీయకుండా గూగుల్ నియంత్రిస్తుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా న్యాయ శాఖ గూగుల్‌పై చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గూగుల్‌ను తీరును తప్పుబడుతూ వ్యక్తులు, లేదంటే సంస్థలు చేసిన ఫిర్యాదుల నుంచి ఆధారాలు సేకరిస్తుంది. కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ సైతం ఉంది. ఈ క్రమంలో వాషింస్టన్ డీసీ కోర్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల నుంచి పలు సాక్ష్యాలు ఆధారాల్ని సేకరించింది. పక్కా ఆధారాలున్నాయ్ అంతేకాదు, గూగుల్ తన ప్రత్యర్ధి సంస్థల భవిష్యత్‌ను అగాధంలోకి నెట్టేలా వ్యవహరిస్తుందని, తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా సత్యనాదెళ్ల ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా సెర్చ్ ఇంజిన్ ఇండస్ట్రీలో గూగుల్‌కు సామర్ధ్యంపై కోర్టు పలు ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానం ఇచ్చారు. గూగుల్ - యాపిల్ మధ్య జరిగిన మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందం కారణంగా మైక్రోసాఫ్ట్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్లైన ఎడ్జ్, బింగ్‌లు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందంటూ మండిపడ్డారు. కోర్టులో నిస్పృహను వ్యక్తం చేస్తూ.. గూగుల్‌పై ఎనిమిది నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓపెన్ ఏఐతో తన భాగస్వామ్యంతో గూగుల్‌కు చెక్ పెట్టే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయంటూ ఎంతో ఉత్సాహంతో చెప్పారు. వాషింగ్టన్ డీసీ కోర్టు విచారణలో ఓపెన్‌ఏఐను నిలువరించేందుకు గూగుల్ పెత్తనం చెలాయిస్తుందంటూ తన నిస్పృహను కోర్టులో వ్యక్తం చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓపెన్ ఏఐ డీల్, చాట్‌జీపీటీ, బింగ్ శక్తి సామర్ధ్యాలతో సెర్చ్ ఇంజిన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని భావించారు. కానీ, గూగుల్ వల్ల సెర్చ్ ఇంజిన్ డొమైన్లలో ఓ సంస్థగానే కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం జోక్యం అవసరం గూగుల్ తీరుపై రెగ్యులేటరీ జోక్యం చేసుకోవడం ద్వారా.. ఏఐలో మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటున్న పరిమితుల నుంచి బయటపడడంతో పాటు కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు పెట్టే అనేక స్టార్టప్ లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సకాలంలో గూగుల్ నుంచి ఎదురవ్వుతున్న ఇబ్బందుల నుంచి ముందే తెలుసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్‌ను దెబ్బతీసే శక్తి సామర్ధ్యాలు ఏఐకి ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఇది గూగుల్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి👉 సాక్ష్యం చెప్పేందుకే.. కోర్టు మెట్లెక్కిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల -
సాక్ష్యం చెప్పేందుకే.. కోర్టు మెట్లెక్కిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కోర్టు మెట్లెక్కనున్నారు. ఆన్లైన్ సెర్చ్, వ్యాపార ప్రకటనలలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా న్యాయ శాఖ విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా నిజానిజాలు వెల్లడించేందుకు సత్య నాదెళ్ల (సెప్టెంబర్ 2న)కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు గూగుల్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ యాప్‌ను తమ టాప్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుంది. ఆ ఒప్పందం మేరకు, యాపిల్, టెలికం దిగ్గజం ఎటీ అండ్ టీ (AT&T) సంస్థలకు ఏడాదికి 10 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. గూగుల్ విడుదల చేసే యాప్ టాప్‌లో ఉండడం వల్ల యూజర్ల వినియోగం పెరిగి..వాటి ద్వారా ఆదాయం గడించిందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు అయితే, గూగుల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల నుంచి సాక్ష్యాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ ఎడ్జ్, బింగ్ బ్రౌజర్ల విస్తరణ, గూగుల్ ఆధిపత్యం వల్ల ఎదురవుతున్న అడ్డంకులు గురించి అడగనుంది. రద్దయిన మైక్రోసాఫ్ట్ - యాపిల్ ఒప్పందం బింగ్ సెర్చ్ యాప్‌లో యాపిల్ యాప్స్ డిస్ప్లే అయ్యేలా మైక్రోసాఫ్ట్- యాపిల్ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఆ డీల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ జాన్తన్ టింటర్ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా యూజర్లు డీఫాల్ట్‌గా మరో సెర్చ్ ఇంజిన్‌ను (బింగ్) వినియోగించేందుకు వీలు లేకుండా గూగుల్ చేసిందన్న విషయాన్ని వెల్లడించారు. పరిమితులు విధించింది ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు లైసెన్స్ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యుయో స్మార్ట్‌ఫోన్ గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించాల్సి ఉందని, కానీ తన సొంత యాప్స్‌లలో బింగ్‌ను ఉపయోగించకుండా పరిమితులు విధించిందని టింటర్ కోర్టుకు తెలిపారు. చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే? -
పవర్ పాయింట్ సహ- సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ ఇకలేరు
Dennis Austin పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ సహ-సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ (76) ఇక లేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 1న కన్ను మూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని తన ఇంటిలో తుదిశ్వాస విడిచారని మైఖేల్ ఆస్టిన్ తెలిపారు. దీంతో ఆయన మృతిపై పలువురు టెక్ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. ఆధునిక సమాజంలో సమాచారం కమ్యూనికేషన్ కోసం ‘పవర్ పాయింట్’ కీలకమైన సాఫ్ట్వేర్ డెవలపర్‌గా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు డెన్నిస్ ఆస్టిన్. ఫోర్‌థాట్ అనే చిన్న సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా 1987లో దీన్ని విడుదల చేశారు. పవర్‌పాయింట్ ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్లకు డిజిటల్ వారసుడిగా , స్లయిడ్లను రూపొందించే శ్రమతో కూడిన ప్రక్రియను సులువుగా మార్చేశారాయన. ఫోర్థాట్ను రూపొంచిన ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ గాస్కిన్స్తో కలిసి డెన్నిస్ ఆస్టిన్ ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్ బిజినెస్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినషున్ గ్రేవాల్, 2016లో కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను ప్రదర్శించారు. పవర్‌పాయింట్ ఇప్పుడు రోజుకు 30 మిలియన్లకు పైగా ప్రెజెంటేషన్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంతోని కంపెనీ తెలిపింది. 1947, మే 28న పిట్స్‌బర్గ్‌లో జన్మించిన డెన్నిస్ ఆస్టిన్ MIT అండ్ UC శాంటా బార్బరా లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. తరువాత సాఫ్ట్వేర్ కంపెనీ ఫోర్‌థాట్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేరి పవర్‌పాయింట్‌ను కో-డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్ కొన్ని నెలల తర్వాత ఈ కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్టిన్ 1985 - 1996 వరకు అతను పదవీ విరమణ చేసేనాటికి PowerPoint ప్రాధమిక డెవలపర్‌గా పనిచేశారు. కాగా ప్రెజెంటేషన్ల కు సంబంధించి కీలక సాఫ్ట్‌వేర్‌గా పాపులర్ అయిన పవర్ పాయింట్‌కి 36-సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, PowerPoint ప్రజెంటేషన్‌కు వ్యతిరేకులు కూడా ఉన్నారు. జెఫ్ బెజోస్ , స్టీవ్ జాబ్స్ దీన్ని వ్యతిరేకించారు. ఏమి మాట్లాడుతున్నారో తెలిసినవాళ్లకి పవర్ పాయింట్ అవసరం లేంటూ జాబ్స్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. -
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుడ్‌బై!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్‌లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (OS) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్‌లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్‌లో రెజ్యూమ్, లెటర్స్‌ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్‌లో లేని ఇటాలిక్,అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్‌మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసలు బాటు కల్పించింది. వర్డ్ ప్యాడ్ కనుమరుగు అయితే, ఈ తరుణంలో 30 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్డ్ ప్యాడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్‌ను ఉపయోగించుకోవాలని కోరింది. రిచ్ టెక్స్ డాక్యుమెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, డీవోసీ అండ్. ఆర్టీఎఫ్,ప్లెయిన్ టెక్ట్స్ డాక్యుమెంట్ కోసం విండోస్ నోట్‌ప్యాడ్‌లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నోట్‌ప్యాడ్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆటోసేవ్, ఆటో రీస్టోర్ ట్యాబ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో ఎవరికైనా అవసరం అనిపిస్తే వర్డ్ ప్యాడ్ బదులు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో పనికొస్తుందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చాట్‌జీపీటీకి అనువుగా కోర్టానా మైక్రోసాఫ్ట్ చివరిగా విండోస్7 విడుదల సందర్భంగా కొన్ని మేజర్ అప్డేట్ చేసింది. 1990లలో మైక్రోసాఫ్డ్ వర్డ్, వర్డ్ స్టార్లలో యూజర్లు సులభంగా సెర్చ్ చేసేలా బటన్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేలా రిబ్బోన్ యూఐని విడుదల చేసింది. తాజాగా, ఆ యూఐ రిబ్బోన్ (Ribbon UI) స్థానంలో యూఐని తెచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ( Cortana ) యాప్‌ను మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌కు అనుకూలంగా చాట్‌జీపీటీని అందిచంనుంది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 11కు లేటెస్ట్ వెర్షన్ విండోస్12 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. చదవండి👉 నోరు పారేసుకున్న యాంకర్..కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్‌గేట్స్ అద్భుతమైన వీడియో
Happy Birthday Warren Buffett ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుడి, అపరకుబేరుడు బెర్క్‌షైర్ హాత్వే , ఛైర్మన్,సీఈవో వారెన్ బఫ్ఫెట్ పుట్టిన రోజు ఆగస్టు 30. ఈ సందర్బంగా మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన స్నేహితుడికి శుభాకాంక్షలందించారు.దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను షేర్ చూస్తూ వినూత్నంగా విషెస్ తెలిపారు. దీంతో ఇది నె టిజనులను బాగా ఆకట్టుకుంటోంది 1920లో నెబ్రాస్కాలోని ఒమాహాలో ఆగస్టు 30న జన్మించారు వారెన్ బఫ్ఫెట్. 93ఏళ్ల ఇన్వెస్టింగ్ లెజెండ్ వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలో అత్యంత విజయ వంతమైన పెట్టుబడిదారులలో ఒకరిగా పేరు గడించారు. ఇన్వెస్టింగ్ తీరు మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, పెట్టుబడులపై లాభాలు ఎలా సాధించాలి లాంటి సలహాలు ఇన్వెస్టర్లకు పెద్ద సక్సెస్మంత్రాలా పని చేస్తాయి. వ్యాపారవేత్త, తండ్రి హోవార్డ్ గ్రాహం బఫ్ఫెట్ ప్రేరణతో 60కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బెర్క్‌షైర్ హాత్వే సీఈవోగా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. మీ మీద మీ పెట్టుబడే పెద్ద సక్సెస్ అంటారు ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పాపులర్ అయిన వారెన్ బఫ్ఫెట్. Happy 93rd birthday to my friend Warren! pic.twitter.com/WxeVO1vOut — Bill Gates (@BillGates) August 30, 2023 -
విండోస్ బర్త్‌డే.. బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇదే!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్‌లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి. Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW — Bill Gates (@BillGates) August 24, 2023 -
డిజిలైజేషన్లో భారత పురోగతి అద్భుతం: మైక్రోసాఫ్ట్ బ్రాడ్ స్మిత్
2023 సెప్టెంబరులో జరగనున్న జీ20 సదస్సుకు సన్నాహకంగా ప్రపంచ వ్యాపార దిగ్గజాలు న్యూఢిల్లో శుక్రవారం సమావేశమైనారు. ఈ సందర్బంగా మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలకు కల్పనకు, వృద్ధికి దారి తీస్తుందన్నారు. ఏఐ సంభావ్య ప్రమాదాలు, చాట్ జీపీటీ వంటి ఉత్పాదక సాధనాల భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు ఇవి ఖచ్చితంగా ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయి, అయితే ఏఐ మానవ నియంత్రణలో ఉండాలన్నారు. దీనికి సంబంధించిన తనిఖీలు, బ్యాలెన్సింగ్ సిస్టం అవసరమన్నారు. విప్లవాత్మక ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణలా ఫ్యూచర్ నాలెడ్జ్‌కు ఇవి చాలా ముఖ్యం అని చెప్పారు. ఏఐ ఉద్యోగాలకు మూలం ఏఐ అంటే మ్యాజిక్ కాదు ఏఐ అనేది ప్రజలు తెలివిగా ఆలోచించడానికి, సమాధానాల్ని మరింత త్వరగా కనుగొనడంలో సహాయపడే ఒక సాధనం .. ఏఐ మనల్నిమరింత విజయ వంతం చేయగలదు. అలా అని మనం ఆలోచించడం మానుకోకూడదు. ఇది మరింత వృద్ధికి ఉద్యోగాల సృష్టికి మూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని మైక్రోసాఫ్ట్ బాస్ వెల్లడించారు. అంతేకాదు గత ఏడాది లాంచ్ అయిన ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీపై మరింత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది వ్యాధులను నిర్ధారించడంలో వైద్యులను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. వ్యాధులను నయం చేయడానికి కొత్త మందుల్ని కనుగొనడంలో సహాయపడుతుంది, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులకు ట్యూటర్‌గా ఉపయోగ పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా దాదాపు 600 సంవత్సరాల క్రితం ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణలా గట్టి ప్రభావం చూపుతుందనీ, ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని స్మిత్ అన్నారు. ఏఐ అంటేమ్యాజిక్ కాదు. నాలెడ్జ్‌కి ఇండిపెండెంట్ సోర్స్. అది గణితం. ఏఐ వల్ల ఎప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించా లనేదే తమ లక్ష్యమని, అయితే టెక్నాలజీ మన కంట్రోల్లో ఉండాలనే గుర్తుంచుకోవాలని తెలిపారు. డిజిలైజేషన్లో అద్భుతం అలాగే డిజిటలైజేషన్లో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ దశాబ్దం ఆరంభం నుండి అభివృద్ధి చెందిందని, డిజిటల్ చెల్లింపుల్లో ఇంత త్వరగా అభివృద్ది సాధించిన మరో దేశాన్ని తాను చూడలేదని చెప్పారు. -
మనిషి కనుసన్నల్లోనే ‘ఏఐ’, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్దికి మూలం కావొచ్చు. అభిప్రాయాలకు విరుద్ధంగా లక్షలాది మంది ఉద్యోగాలు ప్రభావితాయేమో. కానీ భవిష్యత్ బాగుండాలంటే నాలెడ్జ్ అనేది చాలా అవసరం’ అంటూ ప్రపంచ దేశాల జాబ్ మార్కెట్లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, చాట్‌జీపీటీ టూల్స్‌పై మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు కొనసాగుతున్న బీ20 సమ్మిట్‌కు బ్రాడ్ స్మిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృత్తిమ మేధతో పొంచి ఉన్న ప్రమాదాలు, చాట్‌జీపీటీ వంటి ప్రొడక్టీవ్ టూల్స్‌పై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదంత మనుషుల నియంత్రణలోనే ఉంటుంది.అలా నిర్ధారించేలా వ్యవస్థలు చాలా అవసరమని అన్నారు. అంతేకాదు, ఏఐ అనేది ప్రజలు తెలివిగా ఆలోచించడంలో, వారికి కావాల్సిన అనేక ప్రశ్నలకు సమాధానాలను కొనుగొనేందుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. ట్రాన్స్లేషన్, వర్క్ ప్రొడక్టివిటీ వంటి అంశాల్లో పని తీరు బాగుంటుంది. అలా అని ఆలోచించడం మానేయాకూడదు. ఇది మరింత వృద్ధికి, కొత్త ఉద్యోగాలను తయారు చేసేలా ప్రముఖ పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్ కోసమే తప్ప చాట్‌జీపీటీ వంటి ప్రొడక్టీవ్ టూల్స్ మానవ జీవన విధాన్ని మరింత సులభతరం చేసేందుకు ఓపెన్ ఏఐతో అభివృద్ది చేయించాం. రానున్న రోజుల్లో చాట్‌జీపీటీతో వైద్యులు వ్యాధులను నిర్ధారించడంలో, ఆ వ్యాధుల్ని నయం చేసేలా కొత్త ఔషదాల్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అన్నింటికంటే విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులు ఒక ట్యూటర్‌లా కలిసి పనిచేస్తుంది. ఏఐ లాంటి టెక్నాలజీ లేని సమయంలో అంటే సుమారు 600 ఏళ్ల క్రితం మనకున్న జ్ఞానంతో ప్రింటింగ్ ప్రెస్ లాంటి గొప్ప ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చామని గుర్తు చేశారు. మనిషి తెలివి తేటలకంటే ఏఐ టెక్నాలజీ గొప్పవేం కావని అన్నారు. మ్యాజిక్ ఏం చేయదు ‘ఏఐ మ్యాజిక్ ఏం చేయదు. మ్యాథ్స్ మాత్రమేనని అన్నారు. ఏఐపై మన ముందున్న లక్ష్యం వాటితో ప్రమాదం లేకుండా చూసుకోవడమేనని తెలిపారు. అవి మనుషుల నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఏఐ నుంచి ప్రమాదాల బారిన పడకుండా భద్రత, వ్యవస్థలను అభివృద్ది చేయాలి. బాధ్యతాయుతమైన పద్దతిలో ఏఐ టూల్స్‌ను తయారు చేయాలి. ప్రతి దేశంలో కొత్త చట్టాలు, నిబంధనల్ని తప్పని సరిగా అమలు చేయాలని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ సూచించారు. చదవండి👉 అమెజాన్‌లో జాబ్.. జీతం రూ.7 కోట్లు! -
ఏఐపై చర్చల్లో భారత్‌కు సాధికారత
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు సంబంధించిన అంశాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు .. ప్రస్తుతం జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కి ’సముచిత స్థాయి’ ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ బ్రాడ్ స్మిత్ వ్యాఖ్యానించారు. బీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన స్మిత్.. ఈ మేరకు ఒక బ్లాగ్ రాశారు. ఏఐ నియంత్రణ విషయంలో భారత్ సారథ్యం వహించగలదని, ఉదాహరణగా నిలవగలదని పలు దేశాలు ఎదురుచూస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏఐని అంతర్జాతీయంగా బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా వ్యవహరించడం ద్వారా గరిష్టంగా ప్రయోజనాలు పొందవచ్చని స్మిత్ తెలిపారు. భారత్ దృష్టి కోణం నుంచి పాలసీపరంగా తీసుకోతగిన కొన్ని చర్యలను ఆయన సూచించారు. కొత్త టెక్నాలజీల రాక వల్ల సమాజంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐని సమర్ధంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పనులను వేగవంతంగా, సులువుగా, మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడటంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు కొత్త పరిష్కారాలను కనుగొనేందుకు కూడా ఏఐ సహాయపడగలదని స్మిత్ చెప్పారు. -
కుసుమా నువ్వు గ్రేట్
బనశంకరి: ప్రజల్లో డిజిటల్ ఆర్థిక సాధికారత కోసం బెంగుళూరుకు చెందిన ఒక పోస్టుమాస్టర్ చేస్తున్న కృషికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ముగ్ధుల య్యారు. పోస్ట్‌మాస్టర్ కె.కుసుమ కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించారు. ఇటీవల బెంగళూరులో ఎందరో సామాజిక కార్యకర్తలను కలిశారు. పోస్ట్మాస్టర్అయిన కుసుమనూ కలిశారు. భారత్‌లో శరవేగంగా సాగుతున్న డిజిటల్ ఆర్థికాభివృద్ధిలో కుసుమ వంటివారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన బిల్‌గేట్స్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్‌కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్‌లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్‌కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్‌లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్‌కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రేమ పక్షులు..త్వరలోనే పెళ్లి
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇటలీలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు బిలియనీర్ బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పేజ్ సిక్స్ ( Page Six) నివేదించింది. ప్రస్తుతం, జెఫ్ బెజోస్‌కు చెందిన లక్షల కోట్ల షిప్ (సూపర్ యాచ్ )ఇటలీలో ఉంది. ఈ నౌకలో బెజోస్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్ ఇతర స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలే బిల్ గేట్స్ - పౌలా హర్డ్ డేటింగ్లో ఉన్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తూ వార్తల్లో నిలించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. ఇదే విషయంపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా మాట దాట వేస్తూ వచ్చారు. ఇప్పుడు పబ్లిక్‌గా తిరగడంతో త్వరలోనే ఈ ప్రేమ పక్షుల పెళ్లి తర్వలోనే జరగనుందంటూ పుకార్లు జోరందుకున్నాయి. 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్‌ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్‌లో అమెరికా ఎయిర్ బేస్‌కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్‌ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
AI chatbots: బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం శాన్డియా గోలో జరిగిన ASU+GSV సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్‌బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగు పరచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మానవ ట్యూటర్‌గా చేయలేనంతగా, మంచి ట్యూటర్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు మేథ్స్‌లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. చాట్‌బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్బాట్లు చదవడం,వ్రాయడంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత రచనలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్లపై పొగడ్తలు కురిపించారు. కంప్యూటర్‌కు వ్రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని తేలిపోయింది. డెవలపర్లకు కోడ్‌లో ప్రతిరూపం ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత AI చాట్‌బాట్‌కు డైనమిక్‌గా ఉండే మానవుల్లాగానే భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఉద్యోగుల్లో కలకలం!
Microsoft Layoffs: ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు గూగుల్, ట్విటర్ లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం చాలామంది జీవితాలను దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా మరోసారి 276 మంది ఉద్యోగులను తొలగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ప్రకారం.. బెల్లేవ్ & రెడ్మండ్ కార్యాలయాల్లోని మొత్తం 276 మందిని తొలగించినట్లు తెలిసింది. ఇందులో 66 మంది వర్చువల్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి, ఇందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు జరిగిందని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా కంపెనీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూడా లేఆప్స్ జరుగుతాయి. ఉద్యోగాల తొలగింపు ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా కంపెనీ చాలామంది ఉద్యోగులను తొలగించింది. (ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!) మైక్రోసాఫ్ట్ అనేది ఎన్నెన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్న పెద్ద టెక్ కంపెనీ. గత కొన్ని రోజుల నుంచి ఉద్యోగాల కోతలు భారీగా జరుగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఏఐ ప్రభావం కూడా ఐటీ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!
ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గణనీయమైన లాభాల్ని సాధించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్స్ సరికొత్తగా ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంది. కానీ ఉద్యోగులే జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈవో సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు ఇంటర్నల్ మెసేజ్ పంపించారు. అందులో ఈ ఏడాదిలో ఉద్యోగుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ సాధించిన ఫలితాలకు ఉద్యోగుల వినూత్నం, సృజనాత్మకత వల్లే సాధ్యమైందని కొనియాడారు. క్లయింట్లను, భాగస్వాములను సైతం అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని అధిగమించేలా అందరూ బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. థ్యాంక్యూ నోట్‌పై అసహనం సత్యనాదెళ్ల పంపిన ఈ ఇంటర్నల్ మెసేజ్‌ను 2లక్షల మందికి పైగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, సీఈవో తమకి అభినందనలు తెలపడంపై 130కి మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. మరికొంత మంది సీఈవో థ్యూంక్యూ నోట్‌పై అసహనం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు తెలపడం అంటే ఇలాగేనా ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపడం అంటే జీతాలు పెంచకుండా ఉండటం కాదని ఓ ఉద్యోగి అంటుంటే..సంస్థ గడించిన లాభాల గురించి మాట్లాడుతూ.. జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపై సదరు ఉద్యోగి విమర్శలు గుప్పించారు. కంపెనీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు రికార్డ్ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఉద్యోగులు మాత్రం వేతనాల కోతను ఎదుర్కొంటున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఇది సరికాదు, వేరే మార్గం లేదా? అని ప్రశ్నించారు. సంస్థను నమ్ముకుంటే మిగిలేది ఇదే.. పెరగకుండా స్తబ్దుగా ఉన్న వేతనాల గురించి ప్రస్తావిస్తూ మండిపోతున్న ధరలు.. పెరిగిపోతున్న ఖర్చులతో అల్లాడుతుంటే సంస్థ భారీ లాభాల్ని మూటగట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ తమకు పెరగాల్సి జీతాలు పెరగలేదని అన్నారు. ‘రికార్డు లాభాలు ఎక్కడ నుండి వస్తాయని ఆశ్చర్యపోతున్నాను? ఇక్కడ (ఆఫీస్‌లో) అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి కష్టపడి పనిచేసినందుకు నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు మరో ఉద్యోగి. జాబ్‌కు రిజైన్ చేస్తాం.. సత్యనాదెళ్ల పంపిన థ్యాంక్యూ మెసేజ్‌పై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం సందిగ్ధంలో పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఉద్యోగుల మధ్య జరిగిన ఇంటర్నల్ పోల్ సంభాషణల్లో ఎక్కువ మంది..తాము కోరుకున్న ఉద్యోగం దొరికితే..మైక్రోసాఫ్ట్‌ను వదిలివెళ్లేందుకు సిద్ధపడ్డట్లు నివేదికలు హైలెట్ చేశాయి. అయితే, ఉద్యోగుల అసంతృప్తి, రిజైన్ల అంశంపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి👉 ‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’ -
ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రముఖ గేమ్ క్యాండీ క్రష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చాలా మందిలాగే క్యాండీ క్యాష్ ఆడతానని వెల్లడించారు. ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంస్ ధోని విమానంలో ఆడుతున్న వీడియో నెట్టింట్ వైరల్ కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం, యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేమిటంటే క్యాండీ క్రష్ గేమ్ గురించి అభిప్రాయం ఏమిటని సత్య నాదెళ్లను న్యాయమూర్తి అడిగారు. దీనికి స్పందించిన నాదెళ్ల ధోనీలాగానే తాను కూడా ఈ గేమ్‌ను ఆస్వాదిస్తానని, దీంతో పాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని చెప్పారు. దీంతోపాటు కన్సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని నాదెళ్ల చెప్పుకొచ్చారు. దీంతో కోర్టు హాలులో నవ్వుల పువ్వులు పూసాయి. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) వరల్డ్ వైడ్‌గా క్యాండీ క్రష్ గేమ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గత కొన్నేళ్లుగా ఈ సాగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ధోనీ క్యాండీ క్రష్ దెబ్బకి కేవలం మూడే మూడు గంటల్లోనే మూడున్నర లక్షలమంది డౌన్ లోడ్స్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వైరల్ వీడియోలో, ఇండిగో ఎయిర్ హోస్టెస్ ధోనీకి విమానంలో చాక్లెట్లు, స్వీట్లను అందించడం, ధోనీ సీరియస్‌గా గేమ్‌లో మునిగి పోవడం చూడొచ్చు. దీంతో ధోనీ క్యాండీ క్రష్‌లో మునిగిపోయాడని నెటిజన్లు కమెంట్స్ చేశారు. అంతే క్షణాల్లో ఈ గేమ్ ట్విటర్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
ఉచితంగా ‘AI’ నేర్పిస్తాం.. మైక్రోసాఫ్ట్ బంపరాఫర్!
అందరి నోళ్ళలో నానుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఏఐ’ని సమర్ధవంతంగా వినియోగించేందుకు, ఉపాధి పొందేలా ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్స్‌లను నేర్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కోర్స్‌లను లింక్డిన్తో కలిసి అభివృద్ది చేసినట్లు వెల్లడించింది. జనరేటివ్ ఏఐ లెర్నింగ్ కంటెంట్ పేరుతో ఫ్రీగా నేర్పించే ఈ కోర్స్‌ను ఔత్సాహికులు నేర్చుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కోర్స్ నేర్చుకున్న అనంతరం కెరియర్ ఎసెన్షియల్ సర్టిఫికెట్ సైతం పొందవచ్చు. తద్వారా ఏఐని ప్రొఫెషనల్‌గా మారి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందవచ్చు. ఇటీవల భారత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ యువత ఏఐ నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తే సత్తా విషయంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికను విడుదల చేసింది. ఏఐ స్కిల్స్, విస్తరించే విషయంలో మొదటిస్థానంలో ఉంది. అయితే, ప్రస్తుతం టాలెంట్ ఉన్న 420,000 మంది నిపుణులను పరిగణలోకి తీసుకుంటే ఏఐ/ఎంఎల్ బిగ్ డేటా అనలిటిక్స్ టెక్ టాలెంట్ల డిమాండ్, సప్లయ్‌ల మధ్య అంతరాయం 51 శాతంగా ఉంది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏఐ సరికొత్త పని విధానాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉంది. నైపుణ్యం పరంగా వృద్ది సాధించేలా తాము అభివృద్ది చేసిన ఏఐ కోర్స్ ఉపయోగపడుతుంది. గత రెండేళ్లలో టైర్ 2, టైర్ 3 పట్టాణాల నుండి దాదాపు 70,000 మంది విద్యార్ధినులు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ పొందారని చెప్పారు. చదవండి👉 : ‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత! -
మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్‌కు పెట్టుబడుల వరద!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. పర్యటనలో భాగంగా మోదీ అగ్రరాజ్యం, భారత్‌లలో టాప్ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రానున్న ఏడేళ్ల కాలంలో భారత్‌లో 15 బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ఈకామర్స్ దిగ్గజం దేశీయ పెట్టుబడుల మొత్తం 26 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ఇక, గుజరాత్ కేంద్రంగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ కంపెనీ (గిఫ్ట్ సిటీ) లో గూగుల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించేలా సత్యనాదెళ్ల మోదీతో చర్చలు జరిపినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ పేరుతో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్లో దేశీయంగా ఇతర సంస్థలకు కావాల్సిన ఆర్ధిక సేవల్ని గూగుల్ అందించనుంది. ♦భారతీయులకు మెరుగైన జీవన ప్రమాణాల్ని అందించేలా, అందుకు పవర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు ఏ విధంగా తోడ్పడనున్నాయనే అంశంపై మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల చర్చించారు. ఈ ఏడాది మే’లో మైక్రోసాఫ్ట్ జూగల్ బందీ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. ఈ చాట్‌బాట్‌తో 50 కి ప్రభుత్వ పథకాలతో పాటు వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని 22 రకలా స్థానిక భాషల్లో అందిస్తుంది. ♦ఇక తాజాగా మోదీతో జరిగిన భేటీలో అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ భారత్‌లోని స్టార్టప్‌లతో పాటు కొత్త ఉద్యోగాల రూపకల్పన, ఎగుమతుల అనుమతి, డిజిటలైషేషన్, అంతర్జాతీయ స్థాయిలో చిన్న చిన్న వ్యాపారాలు వృద్ది జరిగేలా మద్దతు పలుకున్నట్లు తెలిపింది. అమెజాన్ 10 మిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేస్తామని, 2025 నాటికి భారత్‌లో 20 బిలియన్ల ఎగుమతులను ప్రారంభించేందుకు, 2 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇచ్చింది. ♦ప్రధాని పర్యటన సందర్భంగా, మైక్రోన్ టెక్నాలజీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో పాటు, గుజరాత్లో 2.75 బిలియన్ డాలర్ల వ్యయంతో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ సదుపాయాన్ని నిర్మిస్తామని చెప్పింది. ♦తన అమెరికా పర్యటన చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీ హై-టెక్ హ్యాండ్‌షేక్ పేరుతో నిర్వహించిన మెగా ఈవెంట్లో సెమీకండక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్, స్టార్ట్-అప్‌లతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. యాపిల్ టిమ్ కుక్, ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, ఎఫ్ఎంసీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో మార్క్ డగ్లస్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, గూగుల్ సుందర్ పిచాయ్ తదితరులు ఉన్నారు. ♦భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాటు పలువురు దిగ్గజ సంస్థల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ♦అంతరిక్ష రంగంలో, అంతరిక్ష పరిశోధన కోసం భారత్ ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి, నాసా, ఇస్రోలు మానవ అంతరిక్ష యాత్ర కోసం కలిసి పనిచేయనున్నాయి. చదవండి👉 భారత్‌లోకి టెస్లా రాకను కేంద్రం ఎందుకు వ్యతిరేకించింది? -
చూపు లేకున్నా రూ. 47 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబ్.. ఎవరీ యష్?
సాధించాలనే సంకల్పం నీకుంటే విజయం తప్పకుండా దాసోహం అంటుంది. ఈ మాటకు రూపం పోస్తే అతడే 'యష్ సోనాకియా' (Yash Sonakia). ప్రతిభకు ఏ శారీరక లోపం అడ్డు కాదు అని నిరూపించాడు. తన ఎనిమిదవ ఏటనే చూపో కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా మైక్రోసాఫ్ట్ కంపెనీలు జాబ్ కొట్టాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌కి చెందిన యష్ సోనాకియా పుట్టినప్పుడే అతనికి గ్లాకోమా ఉందని డాక్టర్లు నిర్దారించారు. అయితే అతనికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి చూపు కోల్పోయాడు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ కావాలని కళలు కన్న యష్ చూపు కోల్పోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా తన వైకల్యాన్ని అధిగమించి 2021లో శ్రీ గోవింద్రం సెక్సరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (SGSITS) నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత యష్ సోనాకియాకు ఒక మంచి బంపర్ ఆఫర్ లభించింది. అతనికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ 47 లక్షల వార్షిక వేతనం అందిస్తూ జాబ్ ఇచ్చింది. కళ్ళు లేని వ్యక్తి ఇంత గొప్ప ప్యాకేజీతో జాబ్ సంపాదించడం అనేది సాధారణ విషయం కాదు. యష్ తండ్రి యశ్పాల్ ఇండోర్‌లో క్యాంటీన్ నడుపుతున్నాడు. తన కొడుకు ఇంత మంచి జాబ్ తెచుకున్నందుకు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. -
వెయ్యి 'రెజ్యుమ్'లు పంపిస్తే.. ఒక్క ఉద్యోగం దొరకలే.. ఐటీ ఉద్యోగి ఆవేదన!
సాఫ్ట్వేర్! ఈ జాబ్‌కు ఉన్న క్రేజే వేరే. చదువు పూర్తయిందా. బూమింగ్‌లో ఉన్న కోర్స్ నేర్చుకున్నామా? జాబ్ కొట్టామా? అంతే. వారానికి ఐదురోజులే పని. వీకెండ్లో పార్టీలు, భారీ ప్యాకేజీలు, శాలరీ హైకులు, ప్రమోషన్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఆర్ధిక మాంద్యం భయాలతో ఆయా సంస్థలు తొలగించిన ఉద్యోగులు ప్రస్తుతం అనుభవిస్తున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది ప్రారంభంలో (జవవరి 18న) తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10,000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నుంచి తొలగిస్తున్న వారికి సమాచారం అందించి మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వారిలో అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన నికోలస్ నోల్టన్ ఒకరు. సంస్థ లేఆఫ్స్‌తో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తూనే మరో కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి సార్లు జాబ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. 'మైక్రోసాఫ్ట్‌లో నా ఉద్యోగం పోయింది. ఈ రోజే నా లాస్ట్ వర్కింగ్ డే. గత రెండు నెలలుగా కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పటికే 1000కి పైగా రెజ్యూమ్‌లు పంపించా. అందులో 250 కిపైగా అప్లికేషన్లు సెలక్ట్, 57 రిక్రూటర్స్ కాల్స్, 15 హెరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూలు, 3 ఫైనల్ రౌండ్స్ ఇవన్నీ చేసినా.. ఒక్క ఆఫర్ రాలేదు’ అని వాపోయాడు. విచిత్రం ఏంటంటే ఆయా సంస్థలు లేఆఫ్స్ ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం, ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చివరిగా.. ఆర్ధిక మాంద్యంలో సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నా సరే.. ఐటీ జాబ్ కొట్టాలనే సంకల్పంతో చాలా మంది యువత పోటీపడడం గమనార్హం. ఇదీ చదవండి : ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. కీలక తీర్పును వెలువరించిన అమెరికా ఫెడరల్ కోర్ట్!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు అమెరికా ఫెడరల్ కోర్ట్ భారీ షాకిచ్చింది. 69 బిలియన్ డాలర్లకు గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్ (Blizzard)ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో అమెరికా ఫెడరల్ కోర్ట్ బిలియన్ డాలర్ల భారీ కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని దీర్ఘకాలిక నిషేధం విధించాలనిఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) పెడరల్ కోర్ట్‌ను కోరింది. ఆ మరుసటి రోజు జరిగిన విచారణలో అమెరికా ఫెడరల్ జడ్జ్ ఎడ్వర్డ్ దవిలా గేమింగ్ సంస్థ క్రయ, విక్రయాలు లేకుండా ఆదేశాలు జారీ చేసినట్ల తీర్పులో తెలిపారు. ఇదే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు జూన్ 22, జూన్ 23న విచారణ జరపనుంది. ఇక బ్లిజార్డ్ కొనుగోలు దేశ (యూఎస్) యాంటీట్రస్ట్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదంటే విరుద్దంగా ఉన్నాయని నిర్ధారించనుంది. అప్పుటి వరకు కంపెనీ కొనుగోలుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కలిక కొనుగోళ్లకు వాయిదా వేస్తున్నట్లు రెగ్యులేటర్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా చైనా టెన్సెంట్, జపాన్ ప్లేస్టేషన్ తయారీదారు సోనీ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా అవతరించేలా మైక్రోసాఫ్ట్ గత ఏడాది ప్రారంభంలో బ్లిజార్డ్ కొనుగోలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొనుగోళ్లపై యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. కానీ ఈ విక్రయం క్లౌడ్ గేమింగ్‌లో పోటీని నిరోధిస్తుందని భావించిన బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) వ్యతిరేకించింది. కొనుగోలును నిలిపివేస్తూ ఈ తరుణంలో ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సిరీస్‌ను విడుదల చేసేలా యాక్టివిజన్ పేరెంట్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో జరిపిన లావాదేవీలు జరగకుండా ఆపాలని, ఈ లావాదేవీలు వీడియో గేమ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని అణిచివేస్తుందనే ఆందోళనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌లో దావా నమోదైంది. తాజాగా, ఫెడరల్ కోర్ట్ సైతం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం గేమింగ్ పరిశ్రమలో చర్చాంశనీయంగా మారింది. మైక్రోసాఫ్ట్ ఏం చెబుతోంది? ఎఫ్‌టీసీ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అంతేకాదు కాల్ ఆఫ్ డ్యూటీ తరహా వీడియో గేమ్ సిరీస్‌లను రాబోయే 10 ఏళ్లలో సోనీతో పాటు ఇతర ప్రత్యర్ధి సంస్థలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ డీల్ ద్వారా గేమర్స్, గేమింగ్ కంపెనీలకు లాభదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది. ఇదీ చదవండి : భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే? -
గ్రామీణ పేదలకు ఇంటర్నెట్: మైక్రోసాఫ్ట్, ఎయిర్‌జల్దీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ను ఇవి అందించనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది. -
టెక్ బుడగ పేలుతోందా?
ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు... అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ ఐటీ కంపెనీల తాజా పరిస్థితి సైతం ఇదే. వరుసగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ, ఆన్లైన్ సేవలతో లాభాలు పిండుకున్న టెక్ కంపెనీల అభివృద్ధి బుడగ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? బేజారెత్తిన టెక్ కంపెనీల పరిస్థితికి కారణం ఏమిటి? భవిష్యత్తులో వాటి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా? ‘‘రెండో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. ప్రతి కంపెనీ, ప్రతి పరిశ్రమ ఆన్లైన్ సేవల వైపు మొగ్గుతోంది. ఇది మా కంపెనీకి లాభాలను ఒనగూర్చుతోంది’’ – ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షల వేళ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల్ల వ్యాఖ్య ‘‘కోవిడ్ తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది’’ - కోవిడ్ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్య నాదెళ్ల చేసిన తాజా ప్రకటన ఉద్వాసనల పర్వం.. కోవిడ్ కాలంలో అనుకోకుండా వచ్చి పడిన అవకాశంతో అభివృద్ధి పుంతలు తొక్కిన టెక్ సంస్థలు శరవేగంగా విస్తరణపర్వం మొదలుపెట్టాయి. ప్రపంచం నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అమెజాన్ ఒక్కటే 2022 సెప్టెంబర్ నాటికి ఏడాది మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించాయి. గతేడాది చివరికి వచ్చే సరికి పరిస్థితులు మారడం మొదలైంది. లాభాల్లో కోత పడతుండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క 2022లోనే టెక్ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ అనే సంస్థ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను తొలగించాయి. కేవలం టెక్ స్టార్టప్ కంపెనీలకు మాత్రమే నిధులు సమాకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ఈ ఏడాది మార్చిలో కుప్పకూలడం ఐటీ కంపెనీలకు మరో శరాఘాతంగా పరిణమించింది. నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడటమో, ఉద్యోగాలను తొలగించడమో చేశాయి. గతేడాది నవంబర్‌లో 11,000 ఉద్యోగాల కోతపెట్టిన మెటా... మళ్లీ ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. అమెజాన్ 2022 నవంబర్‌లో 10,000 మంది, 2023 జనవరిలో 8 వేల మంది, మార్చిలో 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. యాక్సెంచర్ ఈ ఏడాదిలో ఇప్పటికే తన ఉద్యోగుల్లో 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని తొలగించింది. ట్విట్టర్‌ను కైవశం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని 80 శాతం మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్ మస్క్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగ్నిజెంట్ ఈ నెల 4న 3,500 మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్ గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అత్యల్ప ఆదాయం ఆర్జించింది. అమ్మకాలు 14 శాతం పడిపోయినట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. (వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?) ఎందుకీ పరిస్థితి టెక్ కంపెనీల తిరోగమ నానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణం. కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలు టెక్ ప్రపంచాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అధిక వడ్డీలకు దారితీశాయి. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి గండికొడుతున్నాయి. ఏఐ అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్ కంపెనీల ఉత్పాదనలను కృత్రిమ మేధ క్షణాల్లో అతిచౌకగా రూపొందిస్తుడటంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బపడుతోంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. టెక్ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుత ధరల స్థాయి గత 40 ఏళ్లలోనే అత్యధికం. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటం టెక్ కంపెనీలకు దెబ్బమీద దెబ్బగా పరిణమిస్తోంది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుండటం కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి. కరోనా వేళ మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్‌బర్గ్, సేల్స్‌ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ ఒప్పుకున్నారు. టెక్ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించింది. కోవిడ్ కాలంలో ఉద్యోగుల సంఖ్యను కేవలం 20 శాతమే పెంచుకుంది. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్ దిగ్గజం యాపిల్ ఒక్కటే. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పాతికేళ్ల నాటి డాట్‌కామ్ బుడగను గుర్తుచేస్తోందని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్‌కామ్ బుడగ? గత శతాబ్దం చివర్లో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. పేరు చివర డాట్‌కామ్ ఉన్న ప్రతి కంపెనీ విలువ వేలం వెర్రిగా పెరిగిపోయింది. 1995 నుంచి 2000 వరకు ఆన్లైన్ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగి శతాబ్దం చివరికి వచ్చే సరికి గాలిబుడగలా పేలిపోయాయి. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) ముందున్న కాలమంతా డాట్‌కామ్ కంపెనీలదే అని నిమ్మన వ్యక్తులు, సంస్థలు ఆయా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్‌స్కేప్ అనే సంస్థ 1995లో అంటే కేవలం ఏడాది తరువాత పబ్లిక్ ఫండింగ్‌కు వెళ్తే ఒక్క రోజులోనే దాని మార్కెట్ క్యాప్ 278 కోట్ల డాలర్లకు చేరుకుంది. జనరల్ మోటార్స్‌కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్లు పట్టింది. 2001 వచ్చే సరికి ఈ డాట్‌కామ్ కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అర్థమై అందరూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ‘నాస్డాక్’లో 1995 నుంచి 2000 వరకు క్రమేపీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 800 శాతం పెరిగితే 2002 వచ్చే సరికి పెరిగిన మొత్తంలో 790 శాతం పడిపోయి దాదాపు మొదటికి వచ్చింది. దాంతో డాట్‌కామ్ బుడగ పేలిపోయింది. (ఇలాంటి టెక్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్) - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ మధ్య చాట్ జీపీటీ చిచ్చు..