మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రముఖ గేమ్ క్యాండీ క్రష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చాలా మందిలాగే క్యాండీ క్యాష్ ఆడతానని వెల్లడించారు. ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంస్ ధోని విమానంలో ఆడుతున్న వీడియో నెట్టింట్ వైరల్ కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం, యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేమిటంటే క్యాండీ క్రష్ గేమ్ గురించి అభిప్రాయం ఏమిటని సత్య నాదెళ్లను న్యాయమూర్తి అడిగారు. దీనికి స్పందించిన నాదెళ్ల ధోనీలాగానే తాను కూడా ఈ గేమ్‌ను ఆస్వాదిస్తానని, దీంతో పాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని చెప్పారు. దీంతోపాటు కన్‌సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని నాదెళ్ల చెప్పుకొచ్చారు. దీంతో కోర్టు హాలులో నవ్వుల పువ్వులు పూసాయి. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన)
వరల్డ్ వైడ్‌గా క్యాండీ క్రష్ గేమ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గత కొన్నేళ్లుగా ఈ సాగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ధోనీ క్యాండీ క్రష్ దెబ్బకి కేవలం మూడే మూడు గంటల్లోనే మూడున్నర లక్షలమంది డౌన్ లోడ్స్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వైరల్ వీడియోలో, ఇండిగో ఎయిర్ హోస్టెస్ ధోనీకి విమానంలో చాక్లెట్లు, స్వీట్లను అందించడం, ధోనీ సీరియస్‌గా గేమ్‌లో మునిగి పోవడం చూడొచ్చు. దీంతో ధోనీ క్యాండీ క్రష్‌లో మునిగిపోయాడని నెటిజన్లు కమెంట్స్ చేశారు. అంతే క్షణాల్లో ఈ గేమ్ ట్విటర్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment