Candy Crush
-
కాంగ్రెస్ కీలక సమావేశం.. క్యాండీ క్రష్ ఆడుతూ ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తలమునకలైంది. దీనికి సంబంధించి రాయపూర్‌లో అతి ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ క్యాండీక్రష్ ఆడడం రాజకీయంగా మాటల యుద్ధానికి దారి తీసింది. రాయపూర్‌లో మంగళవారం రాత్రి అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో సీఎం బఘేల్ తన ఫోన్లో క్యాండీక్రష్ ఆడుతూ కనిపించారు. ఈ ఫొటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతూ ఉంటే సీఎం హాయిగా క్యాండీక్రష్ ఆడుతూ రిలాక్సవుతున్నారు. బహుశా కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవదని ఆయనకూ తెలిసి ఉంటుంది’’ అని మాలవీయ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. వీటిని బఘేల్ తిప్పికొడుతూ గతంలో తాను ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ క్రీడలు గిల్లీ దందా, భవురా ఆడినప్పుడు కూడా బీజేపీ విమర్శలు చేసిందని గుర్తు చేశారు. ‘‘ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ క్రీడలు ఎంత ఇష్టంగా ఆడతానో క్యాండీక్రష్ అంతే ఇష్టంగా ఆడతాను. క్యాండీక్రష్‌లో చాలా లెవల్స్ పూర్తయ్యాయి. ఇంకా ఆటని కొనసాగిస్తూ లెవల్స్ అన్నీ దాటతాను. ఎవరు అధికారంలోకి వస్తారో రారో ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు’’ అని ఎదురుదాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రముఖ గేమ్ క్యాండీ క్రష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చాలా మందిలాగే క్యాండీ క్యాష్ ఆడతానని వెల్లడించారు. ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంస్ ధోని విమానంలో ఆడుతున్న వీడియో నెట్టింట్ వైరల్ కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం, యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేమిటంటే క్యాండీ క్రష్ గేమ్ గురించి అభిప్రాయం ఏమిటని సత్య నాదెళ్లను న్యాయమూర్తి అడిగారు. దీనికి స్పందించిన నాదెళ్ల ధోనీలాగానే తాను కూడా ఈ గేమ్‌ను ఆస్వాదిస్తానని, దీంతో పాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని చెప్పారు. దీంతోపాటు కన్సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని నాదెళ్ల చెప్పుకొచ్చారు. దీంతో కోర్టు హాలులో నవ్వుల పువ్వులు పూసాయి. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) వరల్డ్ వైడ్‌గా క్యాండీ క్రష్ గేమ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గత కొన్నేళ్లుగా ఈ సాగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ధోనీ క్యాండీ క్రష్ దెబ్బకి కేవలం మూడే మూడు గంటల్లోనే మూడున్నర లక్షలమంది డౌన్ లోడ్స్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వైరల్ వీడియోలో, ఇండిగో ఎయిర్ హోస్టెస్ ధోనీకి విమానంలో చాక్లెట్లు, స్వీట్లను అందించడం, ధోనీ సీరియస్‌గా గేమ్‌లో మునిగి పోవడం చూడొచ్చు. దీంతో ధోనీ క్యాండీ క్రష్‌లో మునిగిపోయాడని నెటిజన్లు కమెంట్స్ చేశారు. అంతే క్షణాల్లో ఈ గేమ్ ట్విటర్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి సంబంధించిన ఓ వీడియో గత కొద్దిగంటలుగా నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ధోని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్లో ప్రయాణిస్తూ తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కనిపించాడు. ఎయిర్ హోస్టెస్ ధోనికి చాక్లెట్లు ఆఫర్ చేస్తుండగా ఇది జరిగింది. అంతే ఈ వీడియో చూసిన మరుసటి క్షణమే ధోని అభిమానులు క్యాండీ క్రష్ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఏ రేంజ్లో సాగిందంటే.. 3 గంటల వ్యవధిలో ఈ గేమ్‌ను 36 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక్కసారిగా తమకు ఇంత గిరాకీ పెరగడం చూసి క్యాండీ క్రష్ యాజమాన్యం అవాక్కయ్యింది. ఉన్నట్లుండి డౌన్లోడ్స్ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణాలు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో క్యాండీ క్రష్ యాజమాన్యం ట్విటర్ వేదికగా తమ పాలిట దేవుడైన మహేంద్ర సింగ్ ధోనికి కృతజ్ఞతలు తెలిపింది. కేవలం 3 గంటల్లో 3.6 మిలిమన్ల డౌన్లోడ్స్.. థ్యాంక్స్ టు ఇండియన్ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని.. మీ వల్లే ప్రస్తుతం మేము భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నామంటూ తమ ట్వీట్లో రాసుకొచ్చింది. Just In - We Got 3.6 Million New Downloads in just 3 hours. Thanks to the Indian Cricket Legend @msdhoni . We are Trending In India Just Because Of You. #Candycrush #MSDhoni𓃵 ~ Team Candy Crush Saga pic.twitter.com/LkpY8smxzA — Candy Crush Saga Official (@teams_dream) June 25, 2023 అయితే కొద్దిమంది నెటిజన్లు ధోని ఫ్లయిట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆడింది క్యాండీ క్రష్ కాదని.. అది పెట్ రెస్క్యూ సాగా గేమ్ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ జనాల్లో ధోనికి ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుందని కొందరు అంటున్నారు. ధోనిని ఇంతలా ఫాలో అయ్యే అభిమానులు ఉన్నారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ధోనితో అట్లుంది మరి.. గంటల వ్యవధిలో క్యాండీ క్రష్ యజమానులను కుబేరులను చేశాడని అంటున్నారు. ఇంకొందరైతే ఈ సారి ఎన్నికల్లో ధోనిని నిలబెడితే ప్రధాన మంత్రి కూడా అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే ధోని.. ఐదోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే. ఈ లీగ్ అనంతరం ధోని మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని, ప్రస్తుతం క్రికెటేతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే మహేంద్రుడు సోషల్‌మీడియాలో మాత్రం అనునిత్యం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ధోని టీమిండియా మెంటార్‌గా వ్యవహరించనున్నాడని ప్రచారం జరుగుతుంది. -
కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి చాప కింద నీరులా అన్ని దేశాలకు విస్తరించింది. దాని భయంతో గడప దాటాలాంటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాలు సైతం గుంపులుగా వెళ్లకండి, సమూహాలుగా జత కట్టకండి అంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. మరి రోజంతా ఇంట్లో ఉండాలంటే అది అయ్యేపనేనా.. ఎన్నిరోజులని ఒంటరిగా స్వీయనిర్భందం చేసుకుంటాం. పోనీ అన్ని గంటలు ఒక్కరమే ఉండాలంటే మనకు తోడుగా ఓ వ్యాపకం ఉండాల్సిందే. దీనికి ఫోన్‌ను మించిన అవకాశం మరొకటి లేదు. కాబట్టి మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కింద చెప్పుకునే గేమ్స్ వేసుకోండి. పైగా వీటిని ఎలాంటి రుసుము లేకుండా ప్లేస్టోర్‌లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. మరింకెందుకాలస్యం.. వెంటనే ఫోన్ అందుకో.. గేమ్ ఆడుకో.. ► ఎయిట్ బాల్ పూల్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్‌లో ఇది కూడా ఒకటి. ఇది తప్పకుండా మీకు మజా ఇస్తుంది. ప్రత్యర్థుకు పోటీనిస్తూ ఎక్కువ స్కోర్ సాధించుకునే అవకాశం ఉంది. ► సబ్వే సర్ఫర్స్: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మెచ్చే గేమ్ ఇది. ఓ పిల్లవాడు తన ఎదురుగా ఉండే కాయిన్స్‌ను అందుకుంటూ వెళ్లాలి. క్రమక్రమంగా వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే రైళ్లను ఢీ కొట్టకుండా తప్పించుకు పరుగెత్తాలి. ఎన్నిసార్లు ఆడినా అస్సలు బోర్ కొట్టదు. ఆడిన ప్రతిసారీ ఇంతకుమించి హైస్కోర్ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది. (కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే) ► క్యాండీ క్రష్ సోడా సాగా: ఈ గేమ్ తెలియనివారు దాదాపుగా ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది పాత గేమే అయినప్పటికీ ఇప్పటికీ దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ టూర్లు గట్రా అంటూ తిరిగే వారికి ప్రయాణంలో దీన్ని మించిన తోడు ఉండదు. ► లూడో కింగ్: ఇది తప్పకుండా మీకందరికీ సుపరిచితమైన గేమ్. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి ప్రత్యక్షంగా ఆడుకునేవాళ్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చాక దీన్ని కాస్త ఆధునీకరించి ఆన్లైన్లో పరోక్షంగా ఆడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో కంప్యూటర్‌తో, ఇంటిసభ్యులతో ఆడుకునే సదుపాయం ఉండగా ఆన్లైన్లో ప్రపంచంలో ఎవరితోనైనా ఆడవచ్చు. ► ప్లేయర్స్ అన్నౌన్ బ్యాటిల్‌గ్రౌండ్స్(పబ్జీ): చివరగా చెప్పుకునే ఈ గేమ్ ఈపాటికే చాలామంది మొబైల్స్‌లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సాధారణ గేమ్స్ కన్నా ఇది కాస్త భిన్నం. అడ్వెంచర్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఈ గేమ్ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి పబ్జీ ఆడటానికి అలవాటుపడ్డారంటే.. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అది మీకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తారు. అంతలా అందులో తలమునకలవుతారు. ఈ గేమ్‌లో ఒకరినొకరు కాల్చిచంపుకునే విధ్వంసం కూడా ఉంటుంది. కానీ అది గేమ్వరకే పరిమితం. ఈ గ్రాఫిక్ గేమ్ ప్రస్తుత యూత్‌కు మోస్ట్ ఫేవరెట్ గేమ్‌గా నిలిచిపోయింది. (పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!) ఇలాంటి మరెన్నో గేమ్స్ ప్లేస్టోర్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచిని బట్టి వాటినీ ఓసారి ట్రై చేయండి. దీంతోపాటు టీవీలో కార్టూన్స్, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. కుదిరితే పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఈ విధంగా కరోనా భయాన్ని మీ దరి దాపుల్లోకి రాకుండా నిలువరించండి. కానీ, ఏదేమైనా వైద్యులు, ప్రభుత్వాల సూచనలు మాత్రం తూచ తప్పకుండా పాటించండి.. కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి. -
క్యాండీ క్రష్ ప్రశ్నకు జుకర్‌బర్గ్ మౌనం
-
క్యాండీ క్రష్ ప్రశ్నకు జుకర్‌బర్గ్ మౌనం
ఫేస్బుక్ యూజర్లను నిత్యం చికాకుపరిచే క్యాండీ క్రష్ ఇన్విటేషన్స్పై అడిగిన ప్రశ్నకు మార్క్ జుకర్‌బర్గ్ మౌనం దాల్చారు. 'క్యాండీ క్రష్ ఆహ్వానాలను మేమెలా ఆపాలి?' అంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదే ప్రశ్నకు అందరూ ఓటేసినప్పటికీ.. ఆయన మాత్రం ఓ చిన్న చిరునవ్వుతో దానిని తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. 'ఇందుకే టౌన్‌హాల్ సమావేశాలు చాలా ఉపయోగకరం. ఇది చాలాకాలంగా టాప్ ఓటెడ్ క్వశ్చన్‌గా ఉంది. నేను మరో సమావేశం నిర్వహించేలోగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా మా డెవలపర్స్‌కు చెప్పాను. వారు అదే పనిలో ఉన్నారు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్ అయిన జుకర్‌బర్గ్‌కు ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. క్యాండీ క్రష్ గేమ్‌కు అలవాటుపడిన వారి నుంచే వచ్చే ఇన్విటేషన్లను భరించలేక.. చాలామంది వారిని తమ ఫేస్ బుక్ ఫ్రెండ్ లిస్టు నుంచి తొలగించేస్తున్నారు. అయినా ఈ సమస్యకు సంతృప్తికరమైన సమాధానాన్ని చెప్పకుండా జుకర్‌బర్గ్ దాటవేయడం గమనార్హం. -
గేమ్‌తో కుస్తీ.. నిద్రకు స్వస్తి
క్యాండీక్రష్ సాగా మత్తులో యువత పిల్లలతో పాటు పెద్దలూ బానిసలే ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆట క్యాండీ క్రష్ సాగా. ఈ పేరుతోనూ ఓ ఆట ఉందా అనుకుంటున్నారా? ఉంది. అయితే శారీరక శ్రమ ఉండే ఆట కాదిది. ఏ ఒలింపిక్స్‌లోనూ ఆడరు దీనిని. గల్లీల్లోనూ పోటీలు ఉండవు. కేవలం సమయాన్ని వృథా చేసే గేమ్ ఇది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో గంటల తరబడి ఈ ఆట ఆడుతున్నారు. దీని మత్తులో యువతీ యువకులు మునిగి తేలుతున్నారు. కొందరైతే రాత్రింబవళ్లు ఈ ఆట ధ్యాసలోనే గడుపుతున్నారు. నిద్రకూ దూరమవుతున్నారు. కళాశాల విద్యార్థులు కొందరు తరగతులకు డుమ్మాకొట్టి మరీ గంటల కొద్దీ ఈ ఆట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దవాళ్లు కూడా ఈ ఆటకు బానిసలవుతున్నారు. మద్నూర్ : కొన్నాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. యువత ఫోన్ తీసుకు న్న మొదటి రోజే ఫేస్‌బుక్‌ను ఇన్స్టాల్ చేసు కుంటున్నారు. ఈ మధ్య కాలంలో క్యాండీక్రష్ సాగా అనే ఆట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫేస్బుక్ సిద్ధమైన వెంటనే క్యాండిక్రష్ సాగా ప్రత్యక్షమవుతోంది. దానిపై అవగహన లేకపోయినా స్నేహితుల ద్వారా మెస్సేజ్ ల ప్రవాహం మొదలవుతుంది. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలంలో ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేస్తే.. ఇక అంతే సంగతులు. తొలుత సరదాగా అనిపించే ఈ గేమ్.. ఆ తర్వాత వ్యసనంలా మారుతుంది. పనులను పక్కనబెట్టి.. పట్టణంలో ఓ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన పని మరచిపోయి క్యాండీక్రష్ సాగా గేమ్ ఆడుతున్నాడు. కిరాణ దుకాణంలో జీతం ఉంటున్న వ్యక్తి నుంచి యజమాని వరకు అందరూ ఈ గేమ్‌లో మునిగి తేలుతున్నారు. ఈ గేమ్ కోసం పనులను సైతం పక్కన పెట్టేస్తున్నారు. కొందరు విద్యార్థులు కళాశాలలకూ వెళ్లకుండా ఆటాడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఈ గేమ్‌కు బానిసలైనవారిలో విద్యార్థులే కాదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులూ ఉండడం గమనార్హం. ఈ గేమ్ ఆడేవారి గేమ్ లెవల్ తదితర వివరాలు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అందరికీ తెలుస్తూనే ఉంటాయి. దీంతో ఇదో అంటువ్యాధిలా మారి అందరినీ ఇబ్బంది పెడుతుంది. కాలాన్ని కరిగిస్తూ.. ఈ గేమ్ కారణంగా విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. విద్యార్థులపై ఈ గేమ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారిలో అత్యధిక మంది ఈ గేమ్‌లో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. మామూలుగా ఉన్న గేమ్‌లకు ఓ రీచ్ పాయింట్ ఉంటుంది. కానీ ఈ గేమ్ అన్లిమిటెడ్. 15 లెవల్ పూర్తి అయితే ఓ స్టేజ్ పూర్తి అవుతుంది. ఇలాంటి స్టేజీలు వెయ్యికి పైగా ఉన్నాయి. ఆ లెక్కన దీన్ని పూర్తి చేయాలంటే నెలల సమయం పడుతుంది. మధ్యలో లైఫ్‌లు లేనప్పుడు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టి మరీ లైఫ్‌లు పొందుతున్నారు. గేమ్ సంగతి ఎలా ఉన్నా నెట్ బ్యాలెన్స్ మాత్రం భారీగా కరిగిపోతోంది.