క్యాండీ క్రష్ ప్రశ్నకు జుకర్బర్గ్ మౌనం | To Most Voted Question on 'Candy Crush', Facebook's Mark Zuckerberg Has no Answers Yet | Sakshi
Sakshi News home page

క్యాండీ క్రష్ ప్రశ్నకు జుకర్బర్గ్ మౌనం

Published Wed, Oct 28 2015 1:07 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

క్యాండీ క్రష్ ప్రశ్నకు జుకర్బర్గ్ మౌనం - Sakshi

క్యాండీ క్రష్ ప్రశ్నకు జుకర్బర్గ్ మౌనం

ఫేస్బుక్ యూజర్లను నిత్యం చికాకుపరిచే క్యాండీ క్రష్ ఇన్విటేషన్స్పై అడిగిన ప్రశ్నకు మార్క్ జుకర్బర్గ్ మౌనం దాల్చారు. 'క్యాండీ క్రష్ ఆహ్వానాలను మేమెలా ఆపాలి?' అంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదే ప్రశ్నకు అందరూ ఓటేసినప్పటికీ.. ఆయన మాత్రం ఓ చిన్న చిరునవ్వుతో దానిని తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. 'ఇందుకే టౌన్హాల్ సమావేశాలు చాలా ఉపయోగకరం. ఇది చాలాకాలంగా టాప్ ఓటెడ్ క్వశ్చన్గా ఉంది. నేను మరో సమావేశం నిర్వహించేలోగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా మా డెవలపర్స్కు చెప్పాను. వారు అదే పనిలో ఉన్నారు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్ అయిన జుకర్బర్గ్కు ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. క్యాండీ క్రష్ గేమ్కు అలవాటుపడిన వారి నుంచే వచ్చే ఇన్విటేషన్లను భరించలేక.. చాలామంది వారిని తమ ఫేస్ బుక్ ఫ్రెండ్ లిస్టు నుంచి తొలగించేస్తున్నారు. అయినా ఈ సమస్యకు సంతృప్తికరమైన సమాధానాన్ని చెప్పకుండా జుకర్బర్గ్ దాటవేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement