YES BANK Stop Subscription Based SMS Balance Alerts From 01 December 2022 - Sakshi
Sakshi News home page

ఆ బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి ఈ సేవలు బంద్‌!

Published Tue, Nov 29 2022 6:16 PM | Last Updated on Tue, Nov 29 2022 8:00 PM

Yes Bank Stop Subscription Based Sms Balance Alerts From 01 December 2022 - Sakshi

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ YES Bank (యస్ బ్యాంక్) కీలక ప్రకటన చేసింది. ఇకపై సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఎస్‌ఎంఎస్‌ (SMS) బ్యాలెన్స్ అలర్ట్ సేవలను నిలిపివస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ నుంచి తప్పనిసరి అలర్ట్స్ (Mandatory Alerts)మాత్రం యథావిధిగా వస్తాయని తెలిపింది. కాగా బ్యాంక్‌ ఈ తప్పనిసరి అలర్ట్‌తో పాటు, సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఎస్‌ఎంఎస్‌ అలర్ట్ సదుపాయాన్ని గతంలో అందించేది. 

బ్యాంక్‌ తెలిపిన వివరాల ప్రకారం..  ‘డిసెంబరు 01, 2022 నుంచి SMS ద్వారా బ్యాలెన్స్ అలర్ట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాం. ఒకవేళ కస్టమర్లు ఎస్‌ఎంస్‌ అలర్ట్ ప్యాకేజీకి సబ్‌స్క్రైబ్ చేసుకుని, కస్టమర్లుకు కూడా ఈ సేవలను ఇకపై పని చేయవు.

అయితే  ఇదివరకు మాదిరిగానే తప్పనిసరి అలర్ట్స్‌ మాత్రం మాత్రం వస్తాయని’ స్పష్టం చేసింది. అయితే కస్టమర్లు తమ బ్యాలెన్స్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకోవచ్చని తెలుపుతూ..  అందుకోసం యస్‌ మొబైల్, యస్‌ ఆన్‌లైన్, యస్‌ రోబోట్ వంటి ఆన్‌లైన్ సౌకర్యాలను ఉపయోగించుకునే సదుపాయం ఉందని వెల్లడించింది.

చదవండి: బంపర్‌ ఆఫర్‌..ఆ క్రెడిట్‌ కార్డ్‌ ఉంటే 68 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement