బాబు హామీల్‌..అన్నీ ఉడాల్‌..! | - | Sakshi
Sakshi News home page

బాబు హామీల్‌..అన్నీ ఉడాల్‌..!

Published Thu, Mar 28 2024 2:00 AM | Last Updated on Thu, Mar 28 2024 11:28 AM

- - Sakshi

అరిగిన హామీల క్యాసెట్టు..

వేశాడే మళ్లీ పెసరట్టు..

జనం అంతా అదిరేట్టు..!

పలమనేరు: అని కుప్పం, పలమనేరు ప్రెజలు మళ్లీ తల్‌కాయలు పట్టుకున్నారు. చెంద్రబాబు ఎప్పుడు జూసినా చెప్పిందే చెప్పీ..చెప్పీ బేజారెత్తిస్తాండప్పా..ఏందోబ్బా.. ఈ పార్టీ ఇయర్సు ఇండస్టిరీ అని నిస్టూరమాడినారు. అధికార పచ్చం పారిటీ వోల్ల ప్రెచారానికి నిద్ర పట్టక కుప్పానికి, పలమనేరుకు వచ్చిన చెంద్రబాబు ‘ప్రెజాగలం’లో కొత్తగా ఏమైనా చెప్తాడనుంటే ఏం చెప్పలేదప్పా..మళ్లీ పాత గలమే ఇప్పినాడు. కుప్పంలో అరచేతిలో సింగపూరు సొక్కాయి చూపిచ్చినాడు..ఇమానాలు ఎగిరిపిచ్చినాడు..బెంగలూరుకు నాలుగ్గీతల రోడ్డేసినాడు..అంద్రీ–నీవా నీల్లు పారిచ్చినాడు..అని ఎకసెక్కాలాణ్నారు.

పోనీ పలమ్‌నేర్‌లో అయినా కొత్తగా ఏమైనా చెప్తాడా అన్కుంటే ఈడ కూడా అరిగిపోయిన పాత హామీల క్యాసెట్టేసినడబ్బా! ప్యాకట్రీలు కట్టించి, ఉజ్జోగాలిప్పిస్తాడంట..ఈడుంటే వోల్లు బెంగలూరుకు పనుల కోసం పోయేది కాదు..బెంగలూరోల్లే ఈడికి ఉజ్జోగాలు, పనులకు వచ్చేలా చేస్తాడంట! ఓయమ్మా..ఇది నమ్మే మాటేనా..చెప్పుయా!? బాబు చెప్పేవన్నీ ఉడాల్‌ మాట్లేయా! అని జెనాలు ఎండ చుర్రుమనేకాడికి తల మీద గుడ్డేసుకుని ‘ప్రెజాగలం’ నుంచి ఎలబారి ఇల్లకు పోయినారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement