
ఆధునిక పద్ధతిలో సాగు చేయండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు ఆధునిక పద్ధతిలో పంట సాగు చేసి, లాభాలు ఆర్జించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిసాన్ డ్రోన్ గూపు కన్వీనర్లు, కో కన్వీనర్లు, అధికారులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ డ్రోగో టెక్నాలిజీస్ డ్రోన్ ధర రూ. 9.80 లక్షలుంటే రాయితీతో రూ.7.84 లక్షలతో అందిస్తారన్నారు. విహజ్ఞ టెక్నాలజీస్ వారి డ్రోన్ ధర రూ.9.81 లక్షలుంటే రాయితీతో రూ.7,84,800కే ఇస్తారన్నారు. రైతులకు దీనిపై పూర్థి స్థాయిలో అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతుల్లో వ్యవయసాయాన్ని వృద్ధి చేసుకునేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి హరీష్, ఎల్‌డీఎం హరీష్, డీసీసీబీ సీఈఓ శంకర్‌బాబు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

ఆధునిక పద్ధతిలో సాగు చేయండి