Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan PM Shehbaz Sharif Reacts To Pahalgam Incident1
అంతా భారత్‌ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్‌ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీష్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్‌ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్‌ కాదు. భారత్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025

YS Jagan Shocking Comments On TDP Government In PAC Meeting2
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Indian Forces operation kagar karreguttalu Full Details3
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 38 మంది మావోయిస్టులు మృతి!

సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్‌ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.మరోవైపు.. కూంబింగ్‌లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్‌లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్‌ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.ఇక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ‍్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ‍్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

TDP Ganta Versus BJP Vishnu Kumar Raju Angry With Each Other4
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?

విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్‌ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Sehwag Slams CSK Names Underperforming Players who might Get Released5
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్‌కే బాగుపడుతుంది: సెహ్వాగ్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఘన చరిత్ర ఉన్న సీఎస్‌కే (CSK).. ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే గురిపెట్టిందని పేర్కొన్నాడు. తద్వారా ఆఖరి స్థానంలో ఉండటంలో ఉండే మజాను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతోందంటూ సెటైర్లు వేశాడు.కాగా ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు అత్యధిక సార్లు ఫైనల్‌ చేరిన జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. అయితే, ధోని (MS Dhoni) సారథ్య బాధ్యతల నుంచి నిష్క్రమించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత సీజన్‌లో కెప్టెన్‌గా వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్లే ఆఫ్స్‌ చేర్చలేకపోయాడు.ఇక ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయపడి రుతు జట్టుకు దూరం కాగా.. ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఈ ఎడిషన్‌లో సీఎస్‌కేకు తొమ్మిదింట ఇది ఏడో పరాజయం. దీంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.తొలిసారి అట్టడుగున.. ఆ కిక్కే వేరప్పా!ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ స్పందిస్తూ.. ‘‘చెన్నై పదో స్థానంతో ముగిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ వాళ్లు ఆ పని చేశారంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో వారు అనుభవించగలుగుతారు.ఎన్నో ఫైనల్స్‌ ఆడిన తర్వాత ఇలాంటి అనుభవం వారికి అవసరమే’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అదే విధంగా.. వచ్చే ఏడాది చెన్నై నలుగురు ప్లేయర్లను వదులుకుంటేనే బాగుంటుందంటూ ఇద్దరు దేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు.ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్‌కే బాగుపడుతుంది‘‘డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, రవిచంద్రన్‌ అశ్విన్‌, విజయ్‌ శంకర్‌.. వచ్చే ఏడాది సీఎస్‌కేలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నేను గనుక మేనేజ్‌మెంట్‌ స్థానంలో ఉంటే.. ఆ నలుగురి స్థానాలను కొత్త ముఖాలతో భర్తీ చేస్తాను.జట్టును నిర్మించడం అంటే ఒక్క సీజన్‌కే పరిమితం కాకూడదు. కనీసం పదేళ్ల పాటు ఆ జట్టు బలంగా ఉండాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్‌-2025: చెన్నై వర్సెస్‌ హైదరాబాద్‌👉వేదిక: చెపాక్‌ స్టేడియం, చెన్నై👉టాస్‌: హైదరాబాద్‌.. తొలుత బౌలింగ్‌👉చెన్నై స్కోరు: 154 (19.5)👉హైదరాబాద్‌ స్కోరు: 155/5 (18.4)👉ఫలితం: చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్‌.చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్‌ ఫైర్‌! A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025

US Court Given Relief To 1200 Students Over Deportation6
ట్రంప్‌ యూటర్న్‌.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్‌ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్‌ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్‌, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్‌ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Ranya Rao Charged Under COFEPOSA Act no chance to get bail for one year7
రన్యారావుకు మరిన్ని కష్టాలు .. ఆ చట్టంతో ఇక బెయిల్ కష్టమే!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడి కన్నడ నటి రన్యారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న రన్యారావుకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతంలో ఆమె బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) తిరస్కరించింది. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్‌ ఆమెకు బెయిల్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రన్యా రావుపై విదేశీ మారకద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం-1974((COFEPOSA)) కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB) ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారమైతే దాదాపు ఏడాది పాటు బెయిల్‌ వచ్చే అవకాశం లేదు. నిందితుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని తేలితే ఈ చట్టం ప్రయోగిస్తారని సమాచారం. ఈ కేసులో రన్యా రావు పదేపదే బెయిల్ కోసం ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఈ చర్య తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఆమెతో పాటు ఇతర నిందితులు తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్‌లపై కూడా ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు.కాగా.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యారావును మార్చి 3న అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసును డీఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి. డీజీపీ రామచంద్రరావు పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మూడో నిందితుడైన జైన్‌తో కలిసి నటి హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది.

Cars24 Implements Strategic Reset Amid Layoffs and Expansion8
ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్‌

పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్‌లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్‌ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్‌24 సంస్థలో ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీకి వాటాలుండడం గమనార్హం.కఠినంగా నియామకాలుకార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ‍ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్‌ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్‌పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్‌లైన్‌ సర్వీసులను ప్రారంభించింది.ఇదీ చదవండి: లేటరల్‌ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్‌ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లుకార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.

 Evidence Based Eating Almonds Daily Provides Health Benefits9
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!

మంచి ఆరోగ్యం కోసం తినాల్సిన వాటి గురించి సదా ఆరోగ్య నిపుణులు ద్వారా వింటుంటాం. అయితే అవి మన వల్ల కాదని, ఇష్టం లేదనో లేక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని రకాల నట్స్‌ మాత్రం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని మన డైట్‌లో భాగం చేసుకుంటే చాలామటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాదంపప్పు. బరువుతగ్గేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెండచడంతో దీనికి సాటి మరొకటి లేదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవో పరిశోధనాత్మకంగా వివరించి చెప్పారు. అవేంటంటే..!.గుండె ఆరోగ్యం: ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ, డయాస్టొలిక్ రక్తపోటును కొద్దిగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణ: రోజూ కనీసం 50 గ్రాముల బాదం తీసుకుంటే బరువు పెరగమని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి హెల్ప్‌ అవుతుందని అన్నారు. గట్‌హెల్త్‌: బాదం ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.బ్లడ్ షుగర్: బాదం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీస్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేగాక బాదంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నందున రోజవారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం తమ అధ్యయనాలు బాదం ప్రయోజనాలను బలంగా హైలెట్‌ చేశాయని అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ డైట్‌లో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక వాటి పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు నిపుణులు.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు)

Homes of suspected Pahalgam Terror attackers demolished in Jammu10
ఇండియన్‌ ఆర్మీ ఆన్‌ ఫైర్‌.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం

శ్రీనగర్‌: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్‌, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్‌ఈటీ ఆపరేటివ్స్‌పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.పుల్వామాలో ఎసాన్‌ ఉల్ హక్‌, షోపియాన్‌లోని చోటీపోరాలోని షాహిద్‌ అహ్మద్‌ , కుల్గాంలో జకీర్‌ గని ఇళ్లు బుల్డోజర్‌, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్‌లో చోటిపోరా గ్రామంలో ఎల్‌టీ కమాండర్‌ షాహిద్‌ అహ్మద్‌ కుట్టే నివాసానికి బుల్డోజర్‌ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్‌ అహ్మద్‌ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్‌ అహ్మద్‌(జకీర్‌ గని) నివాసాన్ని కూల్చేశారు. #BreakingNews : The house of LeT militant Shahid Ahmad, Kuty resident of #Chotipora #Shopian active since 2022 , was destroyed in a blast in Chotipora area of Shopian. pic.twitter.com/DT79ZJ7vxb— The Lal Chowk Journal (@LalChowkJournal) April 26, 2025పుల్వామా ముర్రాన్‌ ప్రాంతంలో ఎషన్‌ ఉల్‌ హక్‌ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్‌లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్‌.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్‌లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. ఎల్‌ఈటీ ఉగ్రవాది ఇషాన్‌ అహ్మద్‌ షేక్‌కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్‌ లోకల్‌ టెర్రరిస్టులు ఆసిఫ్‌ షేక్‌, అదిల్ మహమ్మద్‌ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్‌గా భారత బలగాలు భావిస్తున్నాయి.ఇక.. అసిఫ్‌ షేక్‌ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్‌ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్‌ సోదరితమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ​ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement