హైదరాబాద్‌లో దాడుల కలకలం.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు | ACB Searches at House of CCS ACP Umamaheswara Rao | Sakshi

హైదరాబాద్‌లో దాడుల కలకలం.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

Published Tue, May 21 2024 10:29 AM | Last Updated on Tue, May 21 2024 11:12 AM

ACB Searches CCS ACP Umamaheswara Rao's House

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

సాక్షి, హైదరాబాద్‌: సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అశోక్‌నగర్‌లో ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం రియల్‌ మర్డర్‌ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్‌ మార్డర్‌ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement