సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి | Three Students Died In Road Accident At Siddipet chinnaKodur | Sakshi
Sakshi News home page

సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి

Published Tue, Sep 12 2023 8:07 PM | Last Updated on Tue, Sep 12 2023 9:06 PM

Three Students Died In Road Accident At Siddipet chinnaKodur - Sakshi

సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్  శివారు.. రాజీవ్ రహదారిపై అగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్రగాయలయ్యాయి. క్వాలిస్‌లో మొత్తం11మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతి చెందిన విద్యార్థులను నితిన్ , గ్రీష్మ, నమ్రతగా గుర్తించారు.  విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మరణించారు. వీరంతా కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులంతా సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుకుంటున్నారు.

మంత్రి హరీష్‌ రావు సంతాపం
సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ  సానుభూతి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement