
అన్ని వర్గాలకూ ఆరాధ్యుడు అంబేడ్కర్
శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు
పెనుగొండ : దేశంలో అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆరాధ్యుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం ఆచంటలో సర్పంచ్ కోట సరోజని ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ప్రతిఒక్కరూ జయంతి వేడుకలు నిర్వహించే ఏకై క మహానేత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు నినాదంతో అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించి భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా చరిత్రలో నిలవాలన్నారు. వైఎస్సార్ సీపీ యువనేత చెరుకువాడ నరసింహరాజు(నరేష్) మాట్లాడుతూ అంంబేడ్కర్ అందరివాడన్నారు. యువకులంతా అంబేడ్కర్ చూపిన మార్గం చదువులో ముందుండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
ప్రమాదం జరిగే వరకూ పట్టించుకోరా?
నూజివీడు : నూజివీడులోని బోర్వంచ రోడ్డు మలుపు వద్ద మార్జిన్‌లో పెద్ద అగాధం ఏర్పడి ప్రమాదభరితంగా ఉంది. గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షానికి ఇక్కడ రోడ్డు మార్జిన్ కొట్టుకుపోగా.. ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు దీనిని పూడ్చేందుకు చర్యలు తీసుకోలేదు. ప్రమాదం జరిగే వరకూ పూడ్చరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోతిని పూడ్పించాలని కోరుతున్నారు.
ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): షెడ్యూల్ కులాల అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్టు ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి ప్రకటనలో తలెఇపారు. అభ్యర్థులు సోమవారం నుంచి వచ్చేనెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లాకు ఎస్సీ కా ర్యాచరణ ప్రణాళిక కింద 1,111 యూనిట్లకు రూ.4644.05 లక్షల పథక విలువతో లక్ష్యాలను కేటాయించారన్నారు. సబ్సిడీగా రూ.1,835.30 లక్షలు, బ్యాంకు రుణాలుగా రూ.2,576.55 లక్షలు, లబ్ధిదారుల వాటాగా రూ.232.20 లక్షల నిర్దేశించారని పేర్కొన్నారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో సోమ వారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కారణంగా పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు.

అన్ని వర్గాలకూ ఆరాధ్యుడు అంబేడ్కర్