Eluru District Latest News
-
ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ఏలూరు టౌన్: పేదోడికి పెద్ద రోగమొస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యానికి తూట్లు పొడుస్తూ కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి చూపుతోంది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలందించే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు బకా యిలు చెల్లింపుపై మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. దీంతో మరోసారి నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యచికిత్సలు, సేవలు అందించలేమని చెప్పడంతో పేదల ఆరో గ్యం ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ పథకం స్థానంలో బీమా పథకాన్ని తీసుకువస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేద వర్గాల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో నిర్విరామంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. రూ.వెయ్యి ఖర్చు అయ్యే సేవలను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి భరోసా కల్పించారు. ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారు. ఇలా గత ఐదేళ్లలో పేదల ప్రాణాలకు సంజీవనిలా ఆరోగ్యశ్రీ పథకం నిలిచిందనటంలో సందేహం లేదు. పేదలు శస్త్ర చికిత్సలు చేయించుకుని ఇంటికి వెళితే ఉపాధి లేక సరైన పౌష్టికాహారం అందదనే ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. జిల్లాలో సేవలు ఇలా.. జిల్లాలో 2023–24లో 20,826 మందికి వైద్య సేవలు అందించారు. రూ.49 కోట్లు ఖర్చు చేశారు. 2024–25లో 7,129 మందికి వైద్య సేవలు అందించారు. రూ.14 కోట్లు వెచ్చించారు. 2023–24లో 15,623 మందికి ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.9 కోట్లు అందించారు. కూటమి పాలనలో ఈ పథకాన్ని నిలిపివేశారు. నేడు.. నాడు.. పేదల ఆరోగ్యం.. గాల్లో దీపం! నేటినుంచి నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలుపుదల బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి పెద్దపీట కూటమి సర్కారు పాలనలో పేదల ఆరోగ్యాన్ని గాల్లో దీపంలా మార్చివేశారు. పేదలకు అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ పథకం ఉందనే భరోసా లేకుండా చేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేరు మార్పు చేశారు. అలాగే పథకాన్నే లేకుండా చేసే కుట్రకు కూటమి సర్కారు తెరతీసిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,600 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉంటే వాటిని చెల్లించకుండా కొత్తగా బీమా విధానాన్ని తీసుకువస్తామని సర్కారు చెబుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి పెద్దపీట వేశారు. 3,257 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా విపత్తు సమయంలోనూ ఉచితంగా వైద్య సేవలు అందించి నేనున్నానంటూ ఆదుకున్నారు. పేదలకు పెద్ద రోగమొచ్చినా కార్పొరేట్ వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందించి నయం చేసి ఇంటికి క్షేమంగా పంపించారు. అలాగే ఆరోగ్యశ్రీలో సేవలు పొందిన రోగులు, బాలింతలకు ఆరోగ్య ఆసరా పథకం కింద ఆర్థిక సాయం చేశారు.ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు అందిస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిస్థాయిలో వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో పేదలకు ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు చేపడుతున్నాం. ప్రభు త్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనేది తెలియజేస్తాం. – డాక్టర్ ఐ.రాజీవ్, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్పేదల ప్రాణాలతో చెలగాటం కూటమి ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 2019లో టీడీపీ అధికారం నుంచి తప్పుకున్న నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి వేల కోట్లు బకాయిలు పెడితే అప్పుడు అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ బకాయిలన్నీ చెల్లించారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆరోగ్య భరోసా లేకుండా చేసేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. –దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
రేపు వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం
కై కలూరు: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం మంగళవారం ఉదయం 9 గంటలకు ఏలూరు మినీ బైపాస్ రోడ్డు క్రాంతి కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదివారం తెలిపారు. రా నున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యచరణపై చర్చ ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఉభయగోదావరి జిల్లాల పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొ త్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కా రుమూరి సునీల్‌కుమార్, ఉంగుటూరు, ఏలూ రు, దెందులూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు పుప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, కొఠారు అబ్బయ్యచౌదరి, మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కంభం విజయరాజు, తెల్లం బాలరాజు హాజరవుతారన్నారు. జిల్లాలో ని ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణు లు తప్పక హాజరుకావాలని డీఎన్నార్ కోరారు. నేడు అర్జీల స్వీకరణ ఏలూరు(మెట్రో): ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ కా ర్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కలెక్టరేట్, డివిజన్, మండల స్థాయి లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు. -
ధాన్యం కేంద్రాల ప్రారంభమెప్పుడో?
భీమడోలు: ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. పంట కోతలు ముమ్మరంగా చేపడుతుండగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు పూర్తయి చేతికందిన దాళ్వా ధాన్యాన్ని ప్రధాన రోడ్లు, అప్రోచ్ రోడ్లపై ఆరబెడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం ఉన్న ధాన్యాన్ని రోడ్లపైనే భద్రపరుచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, గోనె సంచులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే నిండా మునిగిపోతామని ఆవేదన చెందుతున్నారు. భీమడోలు మండలంలో 13 వేల ఎకరాల్లో దాళ్వా వరి సాగుచేయగా 20 శాతానికి పైగా మాసూళ్లు పూర్తయ్యాయి. 1153, పీఎల్ 126 రకాల పంట వారం ముందుగా కోతలు పూర్తికాగా ఈ పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. కొందరు రైతులు దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. రోడ్లపై ఆరబోస్తున్న రైతులు -
గుగ్గులోతుకు గురుజ్యోతి అవార్డు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ, సామాజిక సేవా రంగంలో సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా విశాఖకు చెందిన గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ గురు జ్యోతి రాష్ట్ర అవార్డు–2025ను ఏలూరుకు చెందిన గుగ్గులోతు కృష్ణకు ప్రకటించారు. ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసంశెట్టి కృష్ణమూర్తి పురస్కారానికి కృష్ణకు అందజేశారు. గోల్డ్ మెడ ల్, సర్టిఫికెట్ జ్ఞాపిక, సన్మాన పత్రాన్ని అందజేశారు. కృష్ణ ఏలూరు ఇందిరా కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ రంగంలో 28 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. ఆయన్ను ఏపీటీఎఫ్1 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.రత్నం బాబు, జి.మోహన్‌రావు అభినందించారు. పెద్దిరాజుకు పురస్కారం ఉంగుటూరు: ఉంగుటూరు నం.1 పాఠశాల హెచ్ఎం శి రిమామిళ్ల పెద్దిరాజును గ్లో బల్ ఫౌండేషన్ సంస్థ ఉగా ది పురస్కారంతో సత్కరించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పెద్దిరాజును సత్కరించి పురస్కారం అందించారు. విద్యారంగంలో సే వలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపికచేశారు. పెద్దిరాజును ఎంఈఓ రవీంద్రభారతి, ఎంఈఓ పరసా వెంకటేశ్వరరావు అభినందించారు. ఇంటర్ విద్యార్థులకు బస్ పాస్‌లు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో వారికి బస్ పాస్‌లు మంజూరు చేయనున్నారు. పాత ఐడీ కార్డుల ఆధారంగా బస్‌పాస్‌లు ఇస్తామని జిల్లా ప్రజా రవాణా అ ధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులకు మాత్రమే రాయితీ బస్ పాసులు ఇస్తున్నామని పేర్కొన్నారు. స్కౌట్స్, గైడ్స్‌లో రికార్డు తాడేపల్లిగూడెం రూరల్: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మండలంలోని పెదతాడేపల్లి గురుకుల విద్యాసంస్థ చోటు దక్కించుకుంది. పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు 18 యూనిట్లుగా ఏర్పడి స్కౌ ట్స్, గైడ్స్‌లో ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించారు. ఒకే పాఠశాల నుంచి 450 మంది విద్యార్థులు స్కౌట్స్, గైడ్స్ విభాగంలో చేరడాన్ని అభినందిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ రాష్ట్ర పరిశీలకులు సిరిమువ్వ శ్రీనివాస్ తెలిపారు. -
కూటమి పాలనలో ఆక్వా రైతుకుదేలు
కాళ్ల: రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వా రంగం ఉండటంతో ఇష్టారాజ్యంగా ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్‌గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టారిఫ్‌ల సాకుతో ధరలు తగ్గిస్తున్నారని విమర్శించారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తోందన్నారు. ఆక్వా రైతులు కుదేలవుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది రైతులు ఆక్వారంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఫీడ్, సీడు, గిట్టుబాటు ధర విషయంలో రైతులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారన్నారు. పది రోజులుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితులతో ఆక్వా పంటను కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని, ధరలు కిలోకు రూ.40 నుంచి రూ.50కి పడిపోయాయన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు అన్నివిధాలా అండగా నిలిచామన్నారు. కరోనా విపత్తు సమయంలో సాధికార కమిటీ ద్వారా ధరల నియంత్రణకు నాటి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. లారీల్లో సరుకు రవాణాకు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పాలకులతో మా ట్లాడి అనుమతులు ఇప్పించామన్నారు. అలాగే ఫీడు, సీడు ధరలను నియంత్రించామన్నారు. యూనిట్ రూ.1.50కే సబ్సిడీపై విద్యుత్ అందించామన్నారు. ఇలా ఐదేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలో రైతులకు రూ.3,500 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఫిషరీస్ అసిస్టెంట్‌ను నియమించామన్నారు. కూటమి సర్కారులో సిండికేట్‌దే రాజ్యం కూటమి పాలనలో వ్యాపారులు సిండికేట్‌గా రై తుల పొట్టకొడుతున్నా కూటమి ప్రభుత్వం నియంత్రించడం లేదని ముదునూరి ఆరోపించారు. సిండికేట్ మొత్తం కూటమి నాయకులే కావడంతో ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎగుమతిదారులు, ఫీడు ఉత్పత్తి, తయారీదారులు, యాజమాన్యాలు ప్రభుత్వ అండదండలతో నడుస్తున్నారనే భావన రైతుల్లో ఉందన్నారు. అలాగే ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పేరుతో విద్యుత్ సబ్సిడీలను తగ్గించారన్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చార్జీల పేరుతో రైతులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50 కౌంట్ వరకు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతున్నా 70 నుంచి 100 కౌంట్ వరకు ధరలు తగ్గించడం దారుణమన్నారు. ఆక్వా రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని, వారి పక్షాన పోరాటం చేస్తుందని ముదునూరి తెలిపారు. సీడు, ఫీడు ధరల నియంత్రణ, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సిండికేట్‌గా దోపిడీ టారిఫ్‌ల సాకుతో ధరల తగ్గింపు వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ధ్వజం -
రైతు కంట్లో కారం
మిర్చి ధరలు పతనం తాడేపల్లిగూడెం రూరల్: దేశవాళీ లావు రకం మిర్చి పంట ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో గతేడాది ధరను చూసి ఈ ఏడాది సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి విశాఖ వరకు ప్రధానంగా దేశవాళీ లావు రకాలను పచ్చళ్లకు, కారాలకు వినియోగిస్తుంటారు. ప్రధానంగా గుంటూరు, వేలేరుపాడు, జంగారెడ్డిగూడెం, ఆరిపాటిదిబ్బలు, పంగిడి, భద్రాచలం, సత్తుపల్లి, వేమసూరి, వెంకటాపురం, చర్ల ప్రాంతాల్లో దేశవాళీ లావు రకాలను సాగు చేస్తుంటారు. ఇలా పండించిన పంటను గుంటూరు, తాడేపల్లిగూడెంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఏటా రైతులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. గూడెంలో 25 వేల టన్నుల వరకు.. తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏటా 20 వేల నుంచి 25 వేల టన్నుల మిర్చి అమ్మకాలు జరుగుతాయి. ధర బాగుండటమే ఇందుకు కారణం. ఇక్కడ 100 నుంచి 150 మంది కమీషన్ వ్యాపారులు రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి బయట మార్కెట్‌కు విక్రయిస్తారు. ఈ క్రమంలో విశాఖ వరకు ఇక్కడ నుంచే మిర్చి ఎగుమతి జరుగుతుంటుంది. పెట్టుబడులు పెరిగి.. గతేడాది ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ సీజన్ లో రైతులు మిర్చిని ఎక్కువగా పండించారు. ఈ క్రమంలో విస్తీర్ణం పెరిగినా చీడపీడల కారణంగా దిగుబడులు లేవని రైతులు అంటున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లకు దిగుబడులు పడిపోయాయని చెబుతున్నారు. గతేడాది కిలో రూ.500 నుంచి రూ.700 పలకగా ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.200 నుంచి రూ.300కు వ్యా పారులు కొంటున్నారని అంటున్నారు. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట పండించిన రైతులకు నష్టాలు మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మిర్చిలో తేజ వైరెటీ సన్నాలు కిలో రూ.80 నుంచి రూ.100 కూడా పలకడం లేదని వాపోతున్నారు. రూ.90 వేలు నష్టం మిర్చి పంటకు ఎకరాకు ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి దిగుబడులు, ధర పతనం కావడంతో ఆశించిన ధర లభించడం లేదు. పంట మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తే క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే వస్తోంది. దీంతో ఎకరానికి దాదాపు రూ.90 వేల వరకు నష్టం చవిచూడాల్సి వస్తోంది. ఈ సీజన్లో మిర్చి రైతుకు కన్నీళ్లే మిగిలాయి. – వెలిశల రాధాకృష్ణ, కల్లూరుగూడెం, వేమసూరి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ -
రమణీయం.. రాములోరికల్యాణం
ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని స్వామి వారి నిత్యకల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. ముందుగా తొళక్క వాహనంపై సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులకు విశేష పుష్పాలంకారాలు చేసి ఆలయ ప్రధాన రాజగోపురం, క్షేత్ర పురవీధుల మీదుగా నిత్య కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. మండపంలో చిన వెంకన్న, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లతో పాటు మరో రజిత సింహాసనంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. రాత్రి తొళక్క వాహనంపై సీతారాముల గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. అలాగే జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. – ద్వారకాతిరుమల -
జాక్ చిత్ర బృందం సందడి
భీమవరం: భీమవరం విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జాక్ చిత్ర బృందం శనివారం రాత్రి సందడి చేసింది. హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. నేడు క్షీరారామలింగేశ్వరస్వామి కల్యాణం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామిని పెండ్లి కుమారుడిని చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్మిప్రతిష్ఠాపన, బలిహరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి 5.05 గంటలకు (తెల్లవారితే మంగళవారం) స్వామి వారి కల్యాణం జరగనుంది. మద్యాహ్నం 3 గంటలకు రథోత్సవం నిర్వహంచనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, ఇ.సూరిబాబు, ఆలయ ప్రధానార్చకులు కిష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి పెయింటర్ మృతి
ఆకివీడు: స్థానిక భుజబలరాయుడు మంచినీటి చెరువులో పడి పెయింటర్ పోతురాజుల శ్రీనివాస్(48) ఆదివారం మృతి చెందాడు. స్థానిక సంతపేట ఇల్లాపు వారి వీధిలో నివసిస్తున్న శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ చల్లదనం కోసం చెరువు గట్టు వద్దకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ మృతితో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పెంటపాడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై స్వామి తెలిపారు. పెంటపాడుకు చెందిన సత్తి సూర్యచంద్రారెడ్డి (69) బైక్‌ఫై శనివారం గణపవరం మండలం పిప్పర వెళ్లి తిరిగి వస్తుండగా గూడెం నుంచి భీమవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని 108 అంబులెన్స్‌లో గూడెంలోని ఒక ప్రేవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. -
ఈదురుగాలులతో వర్షం
పోలవరం రూరల్: పోలవరం మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురింది. దీంతో పట్టిసం – జీలుగుమిల్లి జాతీయ రహదారిలో వెంకటాపురం, ఎల్ఎన్డీపేట గ్రామాల మధ్య చెట్లు కూలిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఆర్ఎస్రాజు రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. తప్పిన ప్రమాదం కామవరపుకోట: స్థానిక కొత్తూరు కాలనీలో ఆదివారం సాయంకాలం ఈదురుగాలులకు ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి పడిపోయింది. స్తంభం కింద పడే సమయంలో పక్కనే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై విద్యుత్ అధికారులను వివరణ కోరగా విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జంగారెడ్డిగూడెం: స్థానిక జాతీయ రహదారిలో హ్యుందాయ్ షోరూం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేటకు చెందిన తోట లక్ష్మీనారాయణ (42) పిల్లల చదువుల కోసం ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నాడు. లక్ష్మీనారాయణ మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. జంగారెడ్డిగూడెం ఎస్సై షేక్ జబీర్‌కు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని చేధించేందుకు రహదారిపై ఉన్న సీసీ కెమెరాను పోలీసులు పరిశీలిస్తున్నారు. లక్ష్మీనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఆక్వాను ఆదుకోండి!
గణపవరం: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వాను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆక్వా రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం గణపవరం కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో గణపవరం, నిడమర్రు, ఉండి, ఆకివీడు, పెంటపాడు, ఉంగుటూరు మండల గ్రామాలకు చెందిన ఆక్వా రైతులు సమావేశమై సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. సమావేశానికి ఆక్వా రైతు అడబాల రంగా అధ్యక్షత వహించారు. సమావేశంలో పలువురు రొయ్య రైతులు సాగులో ఇబ్బందులపై మాట్లాడారు. వ్యాపారుల మాయాజాలం, సీడ్లో మోసాలు, షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు, పెరిగిపోతున్న మేతల ధరలు, పడిపోతున్న రొయ్య ధరలపై గళమెత్తారు. ప్రస్తుతం రొయ్యల సాగు తీవ్ర నష్టాల బాటలో నడుస్తుందని, 95 శాతం మంది రొయ్యల రైతులు నష్టాల పాలయ్యారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రొయ్య సాగును ఆదుకోవాలని కోరారు. సమావేశంలో పలువురు ఆక్వా రైతులు తమ కష్టనష్టాలను మొరపెట్టుకున్నారు. పులిమీద పుట్రలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన కొత్త సుంకం ఆక్వా రంగాన్ని మరింత కుదేలు చేసింది. ట్రంప్ ప్రకటన వెలువడి క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య ధరలు అమాంతం పతనమైపోయాయి. అసలు అమెరికాకు 30 కౌంట్ లోపు ఉన్న రొయ్యలో ఎగుమతి అవుతాయని, ఇక్కడి వ్యాపారులు 100 కౌంట్ రొయ్య ధరను ఒక్కసారిగా రూ.30 నుంచి రూ.40 తగ్గించి వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆక్వా రైతులను ఆదుకోకపోతే సాగు కొనసాగించలేమని ముక్త కంఠంతో చెప్పారు. సమావేశంలో పలువురు రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం రైతులు నినాదాలు చేస్తూ గణపవరం సెంటర్లోని మూడు రోడ్ల కూడలిలో కొంతసేపు ఆందోళన నిర్వహించి రొయ్య రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ గణపవరం ప్రధాన రోడ్డు మీద ప్రదర్శన చేశారు. ●ఎన్నడూ చూడని సంక్షోభం మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని సంక్షోభాన్ని ప్రస్తుతం రొయ్య సాగుదారులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మేతల ధరలు పెరిగిపోయి సాగు భారంగా మారిన పరిస్థితులలో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి రొయ్య ధర అమాంతం తగ్గించి వేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రొయ్య రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిందే. రుద్రరాజు యువరాజు, ఆక్వా రైతు సంఘం, రాష్ట్ర కమిటీ సభ్యుడు కిలోకు రూ.40 తగ్గించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల వంకతో ఇక్కడి వ్యాపారులు రొయ్య ధర కిలోకు అమాంతం రూ.40 వరకూ తగ్గించి వేశారు. ఈ ధరకు అమ్ముకుంటే రైతులు కోలుకోలేని విధంగా నష్టాల పాలవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా సాగుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆక్వా సాగు సంక్షోభం నుంచి బయట పడే పరిస్థితులు లేవు. కాకర్ల వినాయకం, ఆక్వా రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెండెకరాలు అమ్ముకున్నాను ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పదెకరాల నిబంధన తీసివేసి రైతులందరికి విద్యుత్ యూనిట్ రూ.1.50కు ఇవ్వాలి. నేను 40 ఎకరాల్లో రొయ్య సాగు చేసి అప్పులు తీర్చడానికి సొంత పొలం రెండెకరాలు ఇటీవల అమ్ముకున్నాను. విద్యుత్ సబ్సిడీ లేక బిల్లును లక్షల్లో కడుతున్నారు. ప్రస్తుతం 30 ఎకరాలు వదిలేసి పదెకరాలలో రొయ్య సాగు కొనసాగిస్తున్నాను. –ఆదిమూలం శ్రీనివాస్, ఆక్వా రైతు, వాకపల్లి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి ట్రంప్ అనాలోచిత నిర్ణయం వల్ల ఆక్వా రైతులు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. వ్యాపారుల మాయాజాలం వల్ల వారం రోజుల్లోనే రొయ్యల అమ్మకంలో నాలుగు లక్షల నష్టం వచ్చింది. వారం క్రితం అమ్మిన ధరకూ నాలుగు రోజుల అనంతరం అమ్మిన ధరకూ కిలోకు రూ.50 తగ్గిపోవడంవల్ల నాలుగు లక్షలు నష్టపోయాను. –గరిపాటి సాయిరాం , ఆక్వారైతు, చానమిల్లి నష్టాల ఊబిలో కూరుకుపోయాం: రొయ్య రైతుల ఆవేదన -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెంలో గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు ఎంతో విలువైన మట్టిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. గ్రామంలోని తూర్పు వైపున ఉన్న చెరువు దాటిన తరువాత డీ ఫారం పట్టా భూమిలో మట్టి అక్రమ తవ్వకాలు గత కొద్దిరోజులుగా సాగుతున్నాయి. జేసీబీ సహాయంతో తవ్వుతున్న మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ మట్టిని గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో రోడ్డు ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారు. టిప్పర్ మట్టిని అక్రమార్కులు రూ. 5 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ మట్టి దందాను అడ్డుకోవాల్సిన అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ఈ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పాపికొండల్లో అలుగుల సందడి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని అడవుల్లో అరుదైన అడవి అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలియన్, ఆసియా పాంగోలియన్, సుండా పాంగోలియన్, పాతమాన్ పాంగోలియన్ అని నాలుగు రకాలు అలుగులు ఉంటాయి. ఈ అలుగు సుమారు 20 ఏళ్లు బతుకుతాయి. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అటవీ ప్రాంతాల్లో, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. 1821లో తొలిసారిగా ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ జీవులకు భయపడితే ముడుచుకుపోయి తమను తాము రక్షించుకుంటాయి. వీటి చర్మంపై ఉండే పెంకులు చాలా దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 పైగా సంచరిస్తున్నట్లు వైల్డ్‌లైఫ్, ఫారెస్టు అధికారులు తెలిపారు. రాత్రి వేళ సంచారం అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. రాత్రి సమయాల్లో ఆహారం కోసం అన్వేషిస్తాయి. తెల్లవారేసరికి తొర్రల్లోకి చేరుకుంటాయి. ఈ అలుగు రెండు సంవత్సరాలకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తుందది. కోతి మాదిరిగానే తాను జన్మనిచ్చిన పిల్లలను వీపుపై ఎక్కించుకుని ఆహార అన్వేషణ సమయంలో తిప్పుతుందని చెబుతున్నారు. అలుగులు సంచరిస్తున్న సమయంలో ఎలాంటి అలికిడి విన్నా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. కదలకుండా గట్టిగా ముడుచుకుని ఉండిపోతాయి. అలుగులకు ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ అలుగుల వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదునుగా ఉంటాయి. ఇవి సింహం కూడా తినలేనంత గట్టిగా ఉంటాయి. ఈ అలుగు సంతతి పాపికొండల అభయారణ్యంలో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. అలుగులపై స్మగ్లర్ల కన్ను ఏజెన్సీ ప్రాంతంలోని అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై స్మగ్లర్ల కన్ను పడింది. అరుదైన అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పెంకుల విలువ రూ.లక్షల్లో ఉంటుందని అంటున్నారు. అలుగు పెంకులను చైనాలోని మందుల తయారీలో ఉపయోగిస్తారని సమాచారం. గతంలో అలుగును బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్బుక్లో వీడియో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో తమ ఉన్నతాధికారులు ఆ వీడియోను చూసి స్మగ్లర్లను పట్టుకునేందుకు ఆదేశాలు ఇవ్వడంతో అలుగు అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులను వలపన్ని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన వన్య ప్రాణులను వేటాడి విక్రయించాలని చూస్తే ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, అలాగే రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారని అధికారులు పేర్కొన్నారు. అరుదైన వన్యప్రాణుల సంచారం గుర్తింపు బెదిరితే బంతిలా మారిపోయే గుణం వణ్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పు -
ట్రిపుల్ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో చోరీ
నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఎన్1 బ్లాక్‌లోని 103, 303 ఫ్లాట్లకు తాళాలు వేసి ఉండటంతో వాటిలో చోరీకి పాల్పడ్డారు. 103 ఫ్లాట్‌లో ఉండే డీన్ అకడమిక్ సాదు చిరంజీవి ఊరు వెళ్లారు. ఆయన భార్య రాత్రి 10 గంటల వరకు ఫ్లాట్‌లోనే ఉండి, ఆ తర్వాత పక్కన ఉండే స్నేహితుల వద్దకు వెళ్లి పడుకుంది. 303లో ఉండే సీఎస్సీ ఫ్యాకల్టీ తన ఫ్లాట్‌కు తాళం వేసి సొంతూరు వెళ్లాడు. దీంతో ఈ రెండు ఫ్లాట్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. చప్పుడవుతుండటంతో పక్క ఫ్లాట్ వాళ్లు సెక్యురిటీకి ఫోన్ చేసి చెప్పారు. సెక్యురిటీ సిబ్బంది వచ్చేలోగా దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 103 ఫ్లాట్‌లో బెడ్రూమ్లోని వస్తువులను, బీరువాలోని దుస్తులను చిందరవందరగా పడేశారు. దాదాపు రూ.6 వేల నగదు చోరికి గురైంది. 303 ఫ్లాట్‌లో ఏమీ పోలేదని సంబంధిత యజమానులు పేర్కొన్నారు. చోరీ సంగతి తెలిసిన వెంటనే ఎస్ఐ జ్యోతిబసు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాచారాన్ని ఏలూరులోని క్లూస్ టీంకు తెలపగా వారు వచ్చి పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ట్రిపుల్ ఐటీలో భద్రత డొల్లే ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్‌లో రెండోసారి దొంగతనం జరగడం సంచలనంగా మారింది. గతేడాది ఆగస్టు 20న చోరీ జరిగింది. ప్రతి షిఫ్ట్‌లో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ దొంగలు దర్జాగా చొరబడుతున్నారు. గత నెలలో ఏఆర్ డీఎస్పీ ట్రిపుల్ ఐటీని సందర్శించి సెక్యురిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్లో సెక్యురిటీ లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. సెక్యురిటీ పాయింట్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు సరిహద్దుల వద్ద లేకుండా ఎక్కడో అవసరం లేనిచోట ఏర్పాటు చేయడం గమనర్హం. ఏ ఇళ్లకు తాళాలు వేశారనేది దొంగలకు ఎలా తెలుస్తుందనేది అంతుబట్టడం లేదు. గతేడాది చోరికి సంబంధించి దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. గొడుగువారిగూడెం వైపు నుంచి గోడకున్న ఫెన్సింగ్ తీగలు కత్తిరించి లోపలికి ప్రవేశించి ఉంటారని, దొంగతనం చేసిన తరువాత మళ్లీ అదే దారిలో వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. -
● సొంతింటి కోసం రాయిపై రాయి
బుట్టాయగూడెం మండలం కామవరం అటవీ ప్రాతంలో కొలువైన గుబ్బల మంగమ్మతల్లి గుడి వద్దకు వస్తున్న వేలాది మంది భక్తులు గుడి సమీపంలో రాయి మీద రాయి పెట్టి సొంతిల్లు నిర్మించుకునే భాగ్యం కలిగించు తల్లి! అంటూ మొక్కు కుంటున్నారు. తమకు ఎటువంటి ఇల్లు కావాలో చెబుతూ కొందరు మూడు నుంచి నాలుగు రాళ్లు పేర్చి మొక్కుకుంటున్నారు. ఇలా మొక్కుకుంటే తమ కోర్కులు తీరతాయని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో గుడి ప్రాంగణం సమీపంలో ఎక్కువ మంది భక్తులు రాయి మీద రాయి పెట్టి పూజలు చేస్తున్నారని ఆలయ కమిటీ తెలిపింది. – బుట్టాయగూడెం -
వక్ఫ్ భూములపై కుట్ర రాజకీయాలు
ఏలూరు టౌన్: కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీస్తూ కుటిల రాజకీయాలకు తెరతీశాయని, దేశంలో రాజ్యంగాన్ని అమలు చేయకుండా సొంత అజెండాతో పనిచేస్తున్నాయని వక్ప్ బోర్డు ఏలూరు జిల్లా మాజీ చైర్మన్ డాక్టర్ కామిలుజమ అన్నారు. ఏలూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా వక్ప్ ఆస్తులు, భూములు, అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులపై ఏదైనా వివాదం ఏర్పడితే పరిష్కరించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నియమించిన ట్రిబ్యునల్ ఉందని, నూతనంగా ప్రవేశపెట్టిన బిల్లులో కలెక్టర్లకు అధికారం ఇవ్వడంపై సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిపాలన, నియంత్రణకు 1995లో ప్రత్యేకించి వక్ఫ్ చట్టం రూపొందించారని గుర్తు చేశారు. ఈ చట్టం మేరకు వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరుతో ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు. ముస్లిం సమాజాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యావత్ ముస్లిం సమాజం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని, దేశంలో ముస్లిం సోదరులకు జీవించే హక్కును హరించేలా ప్రభుత్వాలు తీవ్రమైన నిర్ణయాలు, చర్యలకు పాల్పడడం విచారకరమన్నారు. వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ కామిలుజమ -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. విద్యార్థి విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం తాడేపల్లిగూడెం: విద్యార్ధి విజయాల్లో తల్లిదండ్రులదే కీలకపాత్ర అని శశి విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ అన్నారు. శశి విద్యాసంస్థలో ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్లో చేరబోయే విద్యార్థులకు ఐఐటీ, నీట్‌పై శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సభలో ఆయన మాట్లాడారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఐక్యూ ఆధారంగా మార్కులు, ర్యాంకులు సాధిస్తారని.. ఈ విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదన్నారు. గొప్పవాళ్లంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారి స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధ, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, క్యాంపస్ ఇన్చార్జి కె.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు నిరాశేనా?
45 కాంటూర్ ప్రజలకు ఉపాధి ఎలా? ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో ముంపు పేరుతో దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో 70 శాతం భూములను ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించింది. దీంతో ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయి. ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించకపోవడంతో ఆ భూములను నేటివరకు భూ యజమానులే సాగు చేసుకున్నారు. కొంతమంది పెద్దరైతులు వారి భూములను ఇతరులకు జామాయిల్ సాగుకు కౌలుకు ఇచ్చారు. జామాయిల్ సాగుతో ఇప్పటికే ఉపాధి లేక పేదలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పరిహారం ఇస్తుందిలే అన్న ఆశతో ఇన్నాళ్లు కాలాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు 41 కాంటూర్ వరకే పరిహారం చెల్లించి 45 కాంటూర్‌కు పరిహారం చెల్లింపు విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో పరిహారం ఇచ్చే వరకు తమకు ఉపాధి ఎలా అని 45 కాంటూర్‌కు చెందిన చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను అన్నివిధాల ఆదుకుంటామని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. బహిరంగ వేదికల సాక్షిగా ప్రభుత్వ పెద్దలు నిర్వాసితులనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం సర్వం త్యాగం చేస్తున్న త్యాగధనులంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారే తప్ప నిర్వాసితుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడంలేదు. దీంతో ప్రభుత్వం నుంచి ఎప్పటికి సమాధానం లభిస్తుందోనని విలీన మండలాల నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉంటుందా? అన్న అనుమానం నిర్వాసితులకు లేకపోలేదు. మిగులు భూముల మాటేంటి? ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి 2027 కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావాస కాలనీలకు తరలిస్తామని వ్యాఖ్యానించారు. వివిధ గ్రామాలలోని భూములకు పరిహారం చెల్లించగా ముంపులో లేని భూములు(మిగులు భూముల) విషయమై ప్రభుత్వం నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేస్తుందన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అరకొర పరిహారం తీసుకుని మిగులు భూములు వదులుకుని నిర్వాసిత కాలనీలకు ఎలా వెళ్లేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కాలనీల్లో ఉపాధి ఎలా? పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయమే ఆధారంగా జీవించిన నిర్వాసితులకు జీవనోపాధి ఎలా కల్పిస్తుందన్న విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించి వదిలేస్తే తమ భవిష్యత్తు ఏంటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. 45 కాంటూర్ వరకు నిర్మాణం ఉంటుందా? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 41.15 కాంటూర్ వరకే పరిమితం అంటూ ఓ పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయమై పత్రికలు ప్రచురించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 45 కాంటూర్ వరకు నిర్మిస్తామంటూ నమ్మబలుకుతుంది. 45 కాంటూర్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేని మాటలు చూస్తే అసలు 45 కాంటూర్ నిర్మాణం ఉంటుందా, లేదా అన్న ప్రశ్న నిర్వాసితులను వేధిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ప్రశ్నలకు సమాధానాలు కరువు తరలించే నాటికి 18 ఏళ్లుంటే పరిహారం ఇస్తారా? ఆర్ అండ్ ఆర్ పరిహారానికి సంబంధించి 2017 జూన్‌ను కటాఫ్ తేదీగా ప్రకటించారు. అప్పటికి 18 ఏళ్లు నిండిన వారందరికి ప్రభుత్వ ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని 2025లో అంటే 7 సంవత్సరాల తరువాత చెల్లించింది. దీంతో ఆ కటాఫ్ డేట్ కారణంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. దీంతో నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే నాటికి 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధికి భూమి చూపించాలి ముంపు పేరుతో భూములను సేకరించిన ప్రభుత్వం 45 కాంటూర్‌లోని నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఎప్పుడు చెల్లిస్తుందన్న విషయమై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 45 కాంటూర్ నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపాఽధి చూపించే బాధ్యత ప్రభుత్వానిదే. ఉపాధి నిమిత్తం సాగు భూమి చూపించాలి. –కురాకుల బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా అధ్యక్షుడు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలి మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటే తప్ప నిర్వాసితులకు న్యాయం జరగదు. ఇప్పటికే 45 కాంటూర్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్వాసితులు అయోమయంలో ఉన్నారు. వారికి న్యాయం జరగాలంటే మండలాన్ని యూనిట్ గా తీసుకుని, పునరావాస కాలనీలకు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం చెల్లించాలి. – మైసాక్షి వెంకటాచారి, సీపీఐ మండల కార్యదర్శి, కుక్కునూరు -
డ్రోన్ సాయంతో జూదరుల గుర్తింపు
ఉండి: ఉండి పట్టణ శివారు పంట పొలాల వద్ద పేకాట ఆడుతున్న 9 మంది వక్తులను డ్రోన్ ద్వారా గుర్తించి, కేసులు నమోదు చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జూదం వంటి పలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అందులో భాగంగా శనివారం ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎండీ నజీరుల్లా, సిబ్బంది డ్రోన్ ద్వారా గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కోలమూరు, పాందువ్వ గ్రామాల శివారు నిర్మానుష్య ప్రదేశాలలో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,390 నగదు స్వాధీనం చేసుకుని, వారిపై ఉండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
అడవి మానులే దేవుళ్లు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలంలో ఉన్న లక్ష్మీపురంలో నాలుగు రకాల చెట్ల మానులు అడవి నుంచి తీసుకొచ్చి రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడిగా ఏర్పాటు చేసుకొని వాటినే పూజిస్తూ వస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో రామాలయం ఏర్పాటు చేసినా తాము చెట్లనే దేవుళ్లుగా కొలుస్తామంటూ గిరిజనులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురంలో 50 కుటుంబాలకు చెందిన నాయక్‌పోడు గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామ ఇలవేల్పుగా గంగానమ్మ అమ్మవారిని పూజలు చేసే గిరిజనులు తదుపరి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడినే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ చిత్రపటాలు, విగ్రహాలు ఉండవు. శ్రీరామనవమికి ముందు రోజు గ్రామస్తుల్లో పెద్దలు, యువకులు అడవిలోకి వెళ్లి 4 రకాల చెట్ల మానులు సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మానులే దేవుళ్లు శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న పెద్దలు, యువకులు అడవికి వెళ్ళి చెండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సేకరిస్తారు. శ్రీరాముడికి చెండ్ర, సీతాదేవికి పాల, లక్ష్మణుడికి ఊడిగ, ఆంజనేయుడికి రావి చెట్టు తీసుకువచ్చి వాటిని చెక్కించి గ్రామం మధ్యలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు సీతారామ కల్యాణాన్ని ఘనంగా జరుపుతున్నారు. సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామిగా మానులకే పూజలు నాయక్ పోడు గిరిజనుల తరతరాల నాటి ఆచారం అడవి మానులే దేవుళ్లు అడవి మానులను దేవుళ్లుగా పూజిస్తాం. ఈ ఆచారం మా పూర్వీకుల నుంచీ వ స్తోంది. దానినే మేము ఆచరిస్తున్నాం. ఏటా శ్రీరామనవమికి ముందు అడవికి వెళ్లి నాలుగు రకాల అడవి చెట్లను తీసుకొచ్చి, వాటిని చెక్కి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిగా ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తాం, నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం గురువింద కొర్రయ్య, ఉత్సవ కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం నాటి ఆచారాలతో శ్రీరామనవమి వేడుకలు లక్ష్మీపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను తరతరాల నాటి ఆచారాలతో నిర్వహిస్తాం. అడవిలో 4 రకాల చెట్లను తీసుకొచ్చి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడిగా కొలుచుకోవడం మాకు ఆనవాయితీ. అదే మాకు జయం, మా గ్రామానికి సురక్ష. ఈ సంప్రదాయాన్నే మేము కొనసాగిస్తాం. – కపిలవాయి హరిసూర్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం -
ఆదర్శనీయులు జగ్జీవన్ రామ్
ఏలూరు టౌన్: తొలి ఉప ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ ఆదర్శనీయులని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. శనివారం ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ కేదారేశ్వరి ఆధ్వర్యంలో జగ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ అణగారిని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి జగ్జీవన్ ఎనలేని కృషి చేశారన్నారు. పేదల హక్కుల సాధనకు పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం పార్టీ సమన్వయకర్తలు మా మిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), మేక వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), తెల్లం బాలరాజు (పోలవరం), పుప్పాల వాసుబాబు (ఉంగుటూరు), కంభం విజయరాజు (చింతలపూడి)తో కలిసి డీఎన్నార్ కేక్ చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, నగర మహిళాధ్యక్షురా లు జిజ్జువరపు విజయనిర్మల, నగర బీసీ సెల్ అ ధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ కై సర్, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి గాజుల బాజీ, పార్టీ నాయకులు తులసీ వర్మ, తులసీ, ఫణి, బండ్లమూడి సునీల్ పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం..ఏలూరు (టూటౌన్): అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బాబూ జగ్జీవన్‌రామ్ నేటి తరాని కి ఆదర్శనీయులని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా స్థానిక ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే చంటి తో కలిసి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగుల ఆశాజ్యోతి ఏలూరు (టూటౌన్): బడుగు, బలహీన వర్గాల ఆ శాజ్యోతి జగ్జీవన్‌రామ్ అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమా ర్ అన్నారు. ఏలూరులోని బార్ అసోసియేషన్ హా లులో జగ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు ఆధ్వర్యంలో రూపొందించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త చరిత్ర పుస్తకాన్ని జిల్లా జడ్జి సునీల్‌కుమార్ చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రయ్.. రయ్..
ప్రాణాలు పోతున్నాయ్ ! మైనర్ల డ్రైవింగ్‌ను తీవ్ర ఉల్లంఘనగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తమ చేతికి చిక్కిన మైనర్ల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని వారి తండ్రులపై కేసులు నమోదుచేశారు. వీటికి సంబంధించి 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వారికి నివాళులర్పిస్తూ రోడ్ల పక్కన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీల్లో వయసు పైబడిన వారి కంటే 20 నుంచి 25 ఏళ్లలోపు యువకుల ఫొటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో అధిక శాతం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారే ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. సాక్షి, భీమవరం: జిల్లాలోని రోడ్లపై రయ్‌మంటూ హల్చల్ చేస్తున్న మైనర్లు, ఆకతాయిల కట్టడికి చర్యలు నామమాత్రంగానే ఉండటంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. భీమవరంలోని విష్ణు కళాశాల రోడ్డు, ఎస్ఆర్కేఆర్ కాలేజీ రోడ్డు, తణుకులోని రాష్ట్రపతి, వేల్పూరు, సొసైటీ, ఉండ్రాజవరం రోడ్లు, తాడేపల్లిగూడెంలో శశి కళాశాల, నిట్ కళాశాల రోడ్లు, నరసాపురంలో వైఎన్ కళాశాల, గోదావరి బండ్, వలందర్ రేవు ఏరియా, రుస్తుంబాద రోడ్లు, పాలకొల్లులోని దిగమర్రు, దొడ్డిపట్ల రోడ్లల్లో ఆకతాయిలు మోటారు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. వీరిలో అధికంగా మైనార్టీ తీరని వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారే ఉంటున్నారు. హైవేల్లో అయితే వీరి వేగానికి అంతే ఉండటం లేదు. జైలు శిక్షలు ఉన్నా.. 16 ఏళ్లలోపు వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్ల వాహనాలు నడిపేందుకు అర్హులు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన పేరెంట్స్/ వాహన యజమానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. 13 మందికి పైగా మృతి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో భీమవరం, నూజివీడు, సీసలి, జంగారెడ్డిగూడెం, మొగల్తూరు తదితర చోట్ల జరిగిన వేర్వేరు మోటారు సైకిళ్ల ప్రమాదాల్లో 13 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీరిలో వాహనాన్ని నడుపుతున్న వారు కొందరైతే, దారిన వెళుతున్న వారు మరికొందరు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా బయటే సెటిల్మెంట్ చేసుకున్న ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు ఎందరో ఉన్నారు. జిల్లా పో లీస్, రవాణశాఖ అధికారులు పూర్తిస్థాయిలో రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించడం ద్వారా ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలపై అవగాహన లేమి కుమారుడు మోజు పడ్డాడనో, చెప్పినట్టుగా చదువుకుంటాడనో, తమ స్టేటస్ సింబల్‌గానో.. ఏదైనా గాని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల వయసు, సామర్థ్యానికి మించి అధునాతన బైక్‌లను కొనిస్తుంటే, మరోపక్క ఆకతాయిలు జీరో ఫైనాన్స్‌పై వాహనాలు తీసుకుని హల్చల్ చేస్తున్నారు. మట్టి రోడ్డులో ఎలా నడపాలి? తారు రోడ్డుపై ఇసుక ఉంటే ఎలా కంట్రోల్ చేయాలి? ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలి ? ట్రాఫిక్ నిబంధనలేమిటి? మలుపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి? ఇవేమీ అవగాహన లేకుండానే బైక్‌లపై చక్కర్లు కొడుతున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రుల భయం లేకపోవడమో, తమను ఎవరూ ఏమీ చేయరన్న భావనతోనో ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు కూర్చుని నిర్ల్యక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక్కోసారి అదుపుతప్పి వారు ప్రమాదానికి గురై కన్నవారికి తీరని శోకాన్ని మిగల్చడంతో పాటు దారిన వెళ్లే అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. టెర్రర్ డ్రైవింగ్ బైక్‌లపై మైనర్లు, ఆకతాయిల హల్చల్ ప్రాణాంతకంగా పరిణమిస్తున్న ర్యాష్ డ్రైవింగ్ వాహనచోదకులు, ప్రయాణికుల బెంబేలు కఠిన చట్టాలున్నా చొరవ చూపని అధికారులు ఉమ్మడి జిల్లాలో మూడు నెలల్లో 13 మందికి పైగా మృత్యువాత కేసులు నమోదు చేస్తున్నాం మైనర్లు, ర్యాష్ డ్రైవింగ్‌లను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నాం. వాహనాలకు సంబంధించి సరైన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. మూడు నెలల్లో జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదుచేశాం. – ఉమామహేశ్వరరావు, జిల్లా రవాణశాఖ అధికారి, భీమవరం -
ఆక్వాపై ప్రభుత్వం మొద్దునిద్ర
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: రొయ్య రేటు పతనమై ఆక్వా రైతులు విలవిల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ఆక్వా రైతులు రోడ్డున పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ధరలు పతనమై రైతులు అల్లాడుతున్నారన్నారు. గతంలో టమాటా రైతుల మాదిరిగా రొయ్యలను రోడ్డున పారవేసే పరిస్థితులు రాకుండానే కూటమి ప్రభుత్వ ఎంపీలు పార్లమెంట్లో గళాన్ని వినిపించాలని సూచించారు. తక్షణమే రొయ్యల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 10 నెలల్లో రూ.1.50 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా అన్యాయాలు, అక్రమాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని కారుమూరి విమర్శించారు. 10 నెలల్లో రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తానని గద్దెనెక్కి.. ఇప్పుడు ప్రజల తలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు చెంపపెట్టు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు దారుణంగా ఉన్నాయని, ఇది మనకు మంచిది కాదంటూ కూటమి ఎమ్మెల్యే కొలికిపూడి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని కారుమూరి అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలని మనకు ఓట్లేశారే కానీ, జగన్‌ని తిట్టమని మనకు ప్రజలు ఓట్లేయలేదని గుర్తుంచుకోవాలని అనడం కూటమి ప్ర భుత్వ పనితీరును తెలుపుతుందని విమర్శించారు. అమాత్యులకు రోజుకు రూ.1.50 లక్షలు.. తణుకులో పేకాట, గుండాట, క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని, దీని కోసం అమాత్యుల కు రోజుకు రూ.1.50 లక్షలు ముట్టచెబుతున్నట్టుగా ప్రజలే చెప్పుకొంటున్నారని కారుమూరి విమర్శించారు. మద్యం దుకాణాల్లో పగలూ రాత్రీ అమ్మకాలు చేయిస్తూ పావలా వాటా, తాజాగా కమీషన్ గుంజుతున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో మ ద్యం దుకాణాల వద్ద జరుగుతున్న దారుణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీపీ ఉప ఎన్నికల్లో అత్తిలిలోని తన ఇంటిని చుట్టుముట్టి ఎంపీటీసీ సభ్యులను ఎన్నికల కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్న తీరు దారుణమన్నారు. మద్యం అక్రమ అమ్మకాలకు సంబంధించి ఎకై ్సజ్ అధికారులకు 20 రోజులు స మయం ఇస్తున్నానని, తీరు మారకపోతే తామే రంగంలోకి దిగి నైట్ పాయింట్లు, బెల్టుషాపుల వద్దకు వెళ్లి అధికారులకు సమాచారం ఇస్తామని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డు బిల్లు దుర్మార్గం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళా మాజీ డైరెక్టర్ మెహర్ అన్సారీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లుకు ముస్లింతా వ్యతిరేకంగా ఉన్నా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు. -
2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
ఏలూరు(మెట్రో): జిల్లాలో దాళ్వా ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల టన్నుల అని జేసీ పి.ధాత్రి రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 241 రైతు సేవా కేంద్రాలు ఉండగా క్లస్టరింగ్ అనంతరం 118 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఏ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ.2,320, కామన్ రకం క్వింటాల్‌కు రూ.2,300 మద్దతు ధరలు అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలు, ఫిర్యాదుల కోసం జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ నంబర్లు 08812–230448, 77020 03584, 7569562076, 75695 97910లో సంప్రదించవచ్చని సూచించారు. పిల్లలతో ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు ఏలూరు టౌన్: ఏలూరు టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని వాసావారి వీధికి చెందిన ఆలమూరి చంద్రశేఖర్, దివ్య భార్యాభర్తలు. వారికి 6వ తరగతి చదివే కుమారుడు, 4వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ సెల్‌ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రోజూ గొ డవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్య జీ వితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ఏలూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు డయల్ 112కు సమాచారం ఇవ్వగా ఏలూరు టూటౌన్ పోలీసులు వెంటనే స్పందించి ఆమె వద్దకు వెళ్లి వారిని రక్షించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఇదే తరహాలో ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత రెండు సార్లూ పోలీసులు సకాలంలో వెళ్లి వారిని రక్షించి తీసుకువచ్చారు. కూటమి నేతలపై అట్రాసిటీ కేసు కైకలూరు: పాత్రికేయుడిపై దాడి చేసిన కూ టమి నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శని వారం రాత్రి నమోదయ్యింది. కైకలూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 27న కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల నిమిత్తం భుజబలపట్నం ఎంపీటీసీ ఓటు వేయాల్సి ఉంది. ఆయన్ను ఇంటిలో నిర్బంధించారనే సమాచారంతో న్యూస్ రైట్ పత్రిక ఎడిటర్ కురేళ్ల కిషోర్ గ్రామానికి వచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కారులోకి వెళ్లడం, ఆయన భా ర్య రోదించడం వంటి సంఘటనలను ఆయన సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో కూటమి పార్టీకి చెందిన కటికిన జయప్రకాష్(జేపీ), కొల్లి వరప్రసాద్ (బాబీ), పాలపర్తి శ్యా మ్ గణేష్(బాబీ కారు డ్రైవర్), వదర్లపాడుకు చెందిన వడుపు ప్రసాద్, మరో కొందరు తన ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాతావరణ మార్పులతో గుబులు భీమవరం: ఆరుగాలం కష్టించి పండించిన దాళ్వా పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణంలో మార్పులు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం, జిల్లాలో ఈదురుగాలులు, చిరుజల్లులు పడటంతో దిగాలు చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పీ ఆర్–126, ఎస్ఎల్–10 వంటి రకాలు మా సూళ్లు చేస్తుండగా ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా వరి మాసూళ్లు ముమ్మరం కానున్నాయి. దాళ్వా సీజన్ ప్రారంభంలో రైతులు సాగునీటి ఎద్దడి, పైరుపై చీడపీడలు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఒడిదుడుకుల ను ఎదుర్కొంటూ దాళ్వా పంట పండించారు. ప్రస్తుతం దాదాపు అన్ని మండలాల్లో గింజలు ఎర్రముక్కులు పడే దశలో ఉండగా ముందుగా నాట్లు వేసిన రైతులు మాసూళ్లకు సన్నద్ధమవుతున్నారు. ముందుగా మాసూళ్లు చేసిన రైతు లు కొట్టు, పొట్టు ధాన్యం ఎకరాకు 60 బస్తాలకు పైగా దిగుబడి వస్తున్నట్టు చెబుతుండటంతో మిగిలిన రైతులు దాళ్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు. -
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
పాలకొల్లు సెంట్రల్: వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభమైందంటే చాలు చికెన్ పాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్సీ వైద్యుడు అడ్డాల ప్రతాప్ కుమార్. చికెన్ పాక్స్ అన్ని వయసుల వారికి సోకినా.. ముఖ్యంగా చిన్నారులకు వేగంగా సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి సోకిన వారు ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో నీరసంగా కనిపిస్తుంటారు. ఆటలమ్మ, గవద బిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. గవద బిళ్లలు చల్లటి పానీయాలు అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి గవద బిళ్లలు వస్తాయి. ప్రధానంగా లాలాజల గ్రంధులు ఉబ్బడంతో గవద బిళ్లలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఏ ఆహారం తిన్నా నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఎంఎంఆర్ టీకా వేయించుకోవడం వల్ల గవద బిళ్లలు రాకుండా నివారించవచ్చు. గవద బిళ్లలకు మందులు వాడితే మూడు రోజుల్లో తగ్గుతుంది. వాపు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది. చికెన్ పాక్స్ ఆటలమ్మ వైరస్ వల్ల వస్తుంది. జ్వరం.. శరీరంలో వేడి ఎక్కువై పొక్కులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీని కూడా ఆటలమ్మ అనుకుంటారు. ఆటలమ్మ అరి చేతులు, పాదాలు, నెత్తి మీద రాదు. అలా వచ్చాయంటే అవి స్కిన్ ఎలర్జీగా గుర్తించాలి. ఆటలమ్మ సోకిన వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. టీకా అందుబాటులో ఉంది. వేయించుకోవడం మంచిది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ఒక చోట గోకి మరో చోటు గోకితే అక్కడ పొక్కులు వస్తాయి. అందువల్ల గోర్లు పెరగకుండా చూసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆటలమ్మ సోకిన వారిని ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించాలి. గవద బిళ్లలు వచ్చిన వారికి గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. మూఢ నమ్మకాలు, అపోహలకు పోకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడంతో పాటు.. శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
గండేపల్లి: ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యువీ శివనాగబాబు తెలిపారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన బాడవుల కేదార్ మణికంఠ (21) రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం స్నేహితుడు విష్ణువర్ధన్తో కలిసి ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో బిర్యాని తినేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గండేపల్లి శివారుకు వచ్చేసరికి బైక్‌పై రాంగ్రూట్లో వచ్చిన వ్యక్తి వీరి బైక్‌ను ఢీకొట్టడంతో కేదార్ మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. రాజానగరం జీఎస్‌ఎల్‌కు తరలించగా అప్పటికే మణికంఠ మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముసునూరు: పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన పింగుల ఏసుబాబు(48) ఏడాదికాలంగా మండలంలోని గుళ్ళపూడి శివారు గుడిపాడుకు చెందిన నెక్కరగంటి సత్యనారాయణ వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు. గురువారం తోటలో గడ్డి కోసుకు రావడానికి వెళ్ళాడు. సాయంత్రమైనా ఇంటికి రాలేదు. శుక్రవారం పామాయిల్ తోటలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పంచనామా అనంతరం నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. మృతుడి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అభినవ దానకర్ణుడు అనంత కోటిరాజు
గణపవరం: ఎంత సంపాదించినా లభించని తృప్తి, ఇతరులకు సాయం పడటం, సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ద్వారా లభిస్తుందని కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శుక్రవారం గణపవరంలో రాజు వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.36 కోట్ల సాయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షత వహించారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సేవ చేయడానికి, ఇతరులకు సహాయ పడటానికి కూడా ఒక హద్దు ఉంటుందని, వేగేశ్న అనంత కోటిరాజుకు ఈ హద్దులేమీ లేవని, ఇప్పటివరకూ తన సేవా సంస్థ ద్వారా సుమారు రూ.300 కోట్ల సేవా కార్యక్రమాలను పూర్తిచేయడం ఆయనలోని మానవత్వానికి, గొప్పదనానికి నిదర్శనమన్నారు. అనంత కోటిరాజు అభినవ దానకర్ణుడని అభినందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, గణపవరం ఎంపీపీ అర్ధవరం రాము, జెడ్పీటిసి దేవారపు సోమలక్ష్మి, గణపవరం సర్పంచ్ మూర అలంకారం, స్థానిక నాయకులు కాకర్ల శ్రీను, కె.జగపతిరాజు, దండు రాము, నడింపల్లి సోమరాజు, కొనిశెట్టి రమేష్, ఇందుకూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరంలో వేగేశ్న ఫౌండేషన్ రూ.35 కోట్లతో నిర్మించిన ఎనిమిదెకరాల మంచినీటి చెరువు, జగన్నాథపురంలో మంచినీటి చెరువు అభివృద్ది, చెరువు చుట్టూ ప్రహరీ, మైక్రోఫిల్టర్స్, జగన్నాథపురం ప్రాధమిక పాఠశాలలో రూ.15 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతకోటిరాజు దంపతులను పంచాయతీ తరపున సన్మానించారు. అనంతకోటిరాజు మాట్లాడుతూ రాజు వేగేశ్న ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొన సాగుతాయని ప్రకటించారు. -
శ్రీరామ నవమికి చిన భద్రాద్రి ముస్తాబు
చింతలపూడి: చింతలపూడి మండలం యర్రగుంటపల్లి సమీపంలోని శ్రీ రామ రామలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 6న కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రాముడి గట్టుగా ప్రసిద్ధికెక్కిన సీతా రామాంజనేయ ఆలయాన్ని ఈ ప్రాంత భక్తులు చిన్న భద్రాచలంగా పిలుచుకుంటారు. ఇక్కడి ఆలయంలో భద్రాద్రిలో వెలసిన విగ్రహాలను పోలిన విగ్రహాలు ఉండటం విశేషం. భద్రాచలంలో సీతాదేవి రాముల వారి తొడపై ఆసీనులైనట్లు ఇక్కడ కూడా కూర్చుని ఉండటం విశేషం. వందల ఏళ్ళ క్రితం రామ చంద్రుడు సీతా లక్ష్మణ సహేతుడై శంఖు చక్రాలతో ఈ ప్రాంతంలో వెలిసినట్లు చెబుతుంటారు. ఇక్కడ స్వామి వారి కల్యాణం జరిపితే పెళ్ల కాని అమ్మాయిలకు పెళ్లవుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయానికి చేరువలో కై లాసపతి పరమేశ్వరుడు నందీ సమేతంగా వేంచేసి ఉన్నాడు. పరమశివుడిని శ్రీరాముడు ముళ్ళ గోరింట పూలతో, బొంత పూలతోను పూజించినట్లు, వెలగ, నేరేడు పళ్లను నివేదించినట్లు చరిత్ర చెబుతోంది. ఏటా చైత్రశుద్ధ నవమికి స్వామి కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి కల్యాణాన్ని వీక్షిస్తారు. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. శ్రీరామనవమి ప్రత్యేకం యడవల్లి కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని ద్వారకాతిరుమల దేవస్థానం దత్తత తీసుకుని ఉప దేవాలయంగా స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సీతారాముల కల్యాణానికి తరలి వస్తారు. ఇక్కడ కూడా భద్రాచలంలో ఉన్నట్లే శ్రీరాముడి తొడ భాగాన సీతాదేవి కూర్చుని ఉండటంతో ఈ ఆలయాన్ని కూడ భక్తులు చిన భద్రాద్రి అని పిలుచుకుంటారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణానికి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. రాముని గట్టుగా ప్రసిద్ధి చెందిన యర్రగుంటపల్లి రామాలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి యర్రగుంటపల్లి రాముని గట్టు(ఆలయాన్ని) మరింత అభివృద్ధి చేయడానికి ట్రస్టు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడ ఆలయ అభివద్ధికి నిధులు మంజూరు చేయాలి. ఆలయని భూములను ట్రస్ట్‌కు అప్పగించి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. – వి సత్యన్నారాయణ శాస్త్రి, ఆలయ కమిటీ అధ్యక్షుడు, యర్రగుంటపల్లి -
గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం
జంగారెడ్డిగూడెం : గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు లక్కవరం ఎస్సై శశాంక తెలిపారు. గురువారం మండలంలోని లక్కవరం–నాగులగూడెం గ్రామాల మధ్య కొండ దేవతల ఆలయం పాత ఇసుక ర్యాంపు సమీపంలోని ఎర్రకాలువలో లక్కవరానికి చెందిన చల్లా బసవయ్య(70) గల్లంతయ్యాడు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న బసవయ్య గురువారం పశువులు మేపేందుకు బసవయ్య కాలువ సమీపంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, కాలువ వద్ద అతడి చెప్పులు, తువ్వాలు, కర్ర ఉన్నాయి. ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఉంటారని స్థానికులు భావించారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై శశాంక ఘటనాస్థలికి చేరుకుని వృద్ధుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు గాలించినప్పటికీ బసవయ్య మృతదేహం లభ్యం కాకపోవడంతో, శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా బసవయ్య మృతదేహం నీటిలో తేలుతూ ఉండడంతో గుర్తించి స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పీడీఎస్ బియ్యం పట్టివేత టి.నరసాపురం: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టి.నరసాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్సై జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి మండలంలోని మల్లుకుంట సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ తరలిస్తుండగా గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకుమన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కోడి వ్యర్థాలు తరలిస్తున్న వ్యాన్ సీజ్ భీమడోలు : భీమడోలు పంచాయతీ శివారు పెదలింగంపాడు ఆక్వా చెరువులకు కోడి వ్యర్థాలు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పెదపాడుకు చెందిన కోరం ప్రకాష్, కూడిపూడి వాసు వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి లింగంపాడులోని గంటా మోహనరావు ఆక్వా చెర్వులకు కోడి వ్యర్థాలు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై వై.సుధాకర్ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. -
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
చింతలపూడి: కూలీలతో వస్తున్న ట్రక్ ఆటో బోల్తా పడ్డ సంఘటన చింతలపూడి మండలం, ఆంథోనీ నగర్ సమీపంలో శుక్రవారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా దుద్దుపూడి గ్రామానికి చెందిన కూలీలు చింతలపూడి మండలం వెలగలపల్లిలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో గురువారం రాత్రి పనికి వెళ్లి ట్రక్ ఆటోలో తిరిగి వస్తుండగా ఆటో పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కనపర్తి లక్ష్మికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించినట్లు వైద్యులు తెలిపారు. నలుగురు కూలీలను కాపాడి మేస్త్రి మృతి గన్నవరం: శ్లాబ్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలను రక్షించే క్రమంలో కాంక్రిట్ లిఫ్ట్ గడ్డర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన పిల్లిబోయిన కొండలు(35) కాంక్రీట్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఓ భవనానికి శ్లాబ్ నిర్మాణ నిమిత్తం గురువారం కొంత మంది కూలీలను తీసుకుని వెళ్లారు. శ్లాబ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంక్రీట్‌ను పైకి లిఫ్ట్ చేసే యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో లిఫ్ట్ బాక్స్ వైర్లు ఒక్కసారిగా తెగి ఐరన్ గడ్డర్లు కింద పడిపోవడం గమనించిన కొండలు అక్కడే ఉన్న మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆ నలుగురు మహిళలను పక్కకు నెట్టివేసిన కొండలు మాత్రం బరువైన లిఫ్ట్ బాక్స్ గడ్డర్లు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి టి.నరసాపురం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. రాజపోతేపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కె.జగ్గవరానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో హాస్పటల్‌కు బయల్దేరాడు. మధ్యలో రాజుపోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సులో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ట్రిపుల్ ఐటీలో పవర్ విజన్‌పై శిక్షణ
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలోని ట్రిపుల్ఈ ఇంజినీరింగ్ విద్యార్థులకు శుక్రవారం పవర్ విజన్ 2050, ఎనర్జీ ఇంజినీరింగ్‌పై కెపాసిటీ బిల్డింగ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విజయవాడ సమీపంలోని ఉన్న పవర్‌గ్రిడ్ జనరల్ మేనేజర్ కే నాగమోహన్‌రావు భారతదేశంలోని విద్యుత్ రంగం–భవిష్యత్ అనే అంశంపై ప్రసంగించారు. 2050 నాటికి దేశంలోని విద్యుత్ శక్తి రంగం స్థిరమైన, సమర్ధవంతమైన, వినియోగదారులకు అనుకూలమైన రంగంగా మారుతుందన్నారు. స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతల గురించి వివరించారు. ట్రిపుల్ఈ హెచ్ఓడీ శ్రావణి కనక కుమారి, కోఆర్డినేటర్ జ్యోతీలాల్ నాయక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చేదెక్కుతున్న మామిడి
దిగుబడి తగ్గడంతో రైతుల్లో ఆందోళన మండలం మామిడి దిగుబడి విస్తీర్ణం (అంచనా)ఎకరాలు టన్నుల్లో నూజివీడు 10,434 41,736 ఆగిరిపల్లి 17,655 71,060 ముసునూరు 2,520 8,500 చాట్రాయి 3,619 14,476 చింతలపూడి 4,000 15,315 లింగపాలెం 3,000 11,500 మొత్తం 41,208 1,62,587నూజివీడు: పండ్లలో రారాజు మామిడి.. అయితే మామిడికి గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. గత నాలుగేళ్లుగా మామిడి దిగుబడి దారుణంగా పడిపోతుండటంతో మామిడి రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక.. గొయ్యి అన్న చందంగా తయారైంది. మామిడి పంట సంక్షోభం దిశగా పయనిస్తోంది. రైతులు పూత నిలుపుకునేందుకు ఎకరాకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టినా ప్రకృతి సహకరించక.. తెగుళ్లు, పురుగుల బెడదతో పూతలు మాడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 41వేల ఎకరాల్లో మామిడి తోటలు జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికంగా నూజివీడు నియోజకవర్గంలో మామిడి తోటలు సాగవుతుండగా మొత్తంమ్మీద 41 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు వంటి రకాలున్నాయి. వరి, మొక్కజొన్న, పామాయిల్ వంటి పంటలతో పాటు మామిడి కూడా ప్రధానంగా రైతులు సాగు చేస్తున్నారు. దీంతో రైతులు మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకు సాగుతుండగా కాలం కలిసి రాకపోవడంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. నిలవని పూత ఈ ఏడాది మామిడి తోటల్లో పూతలు బాగా వచ్చినప్పటికీ ఏ మాత్రం నిలబడలేదు. రెండు విడతలుగా పూత రాగా ముందు విడత పూత డిసెంబరు 15 నుంచి జనవరి మొదటి వారం వరకు వచ్చింది. రెండో విడత పూత జనవరి 20 తరువాత నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు వచ్చింది. మొత్తం విస్తీర్ణంలో దాదాపు 95 శాతం తోటలు పూత పూసినప్పటికీ పూత నిలవలేదు. నల్లతామర పురుగు ఆశించడంతో వచ్చిన పూతంతా తుడిచిపెట్టుకుపోయి కేవలం పూత కాడలే మిగిలాయి. దీంతో మామిడి పూత మొత్తం విస్తీర్ణంలో 20 శాతం కూడా లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పూతను నిలుపుకునేందుకు రైతులు మామిడి తోటలకు 12 నుంచి 15 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. అయినప్పటికీ నల్లతామర దాటికి పూతంతా మాడి మసైపోవడంతో రైతులు నష్టాల పాలై నిండా మునిగిపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా దిగుబడి లేకపోవడంతో రైతులు అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయారు. ధర అంతంత మాత్రమే దిగుబడి లేనప్పటికీ మామిడికి ధర అంతంత మాత్రంగానే ఉందని రైతులు వాపోతున్నారు. కాయలు బాగుంటే బంగినపల్లి టన్నుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు, తోతాపురి టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర మాత్రమే పలుకుతున్నాయని, కాయలపై మచ్చలు ఉంటే ఆ మాత్రం ధర కూడా రావడం లేదని పేర్కొంటున్నారు. పూత నిలవలేదు పదెకరాల మామిడి తోటకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టి పురుగుమందులు కొట్టినా పురుగు చావలేదు. మామిడి రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నిసార్లు పిచికారీ చేసినా పురుగులు చావడం లేదు. వేలాది రూపాయలతో కొనుగోలు చేసి కొట్టినా పురుగు మందులు పనిచేయడం లేదు. నకిలీ పురుగు మందులు వస్తున్నాయనే అనుమానం ఉంది. – బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు -
వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు
టి.నరసాపురం: వ్యవసాయశాఖకు చెందిన విత్తనాభివృద్ధి క్షేత్రానికి కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లిన అధికారులను అల్లంచర్ల రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం అల్లంచర్లలో విత్తనాభివృద్ధి క్షేత్రానికి 40 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆ భూ మిలో కొంత భాగాన్ని రైతులు ఆక్రమించుకున్నా రు. భూమికి హద్దులు నిర్ణయించి వ్యవసాయ శాఖ కు చూపించేందుకు వ్యవసాయశాఖ జేడీఏ హబీబ్ బాషా, తహసీల్దార్ టి.సాయిబాబా, సర్వేయర్ అ క్కడికి వెళ్లారు. హద్దులు నిర్ణయించి కందకం తవ్వే ప్రయత్నం చేయడంతో ఆక్రమణలో ఉన్న రైతులు అడ్డుకున్నారు. విత్తనాభివృద్ధి క్షేత్రానికి భూమిని కేటాయించిన సమయంలోనే 82 మంది రైతులకు 50 సెంట్ల చొప్పున ప్రభుత్వం ప ట్టాలు ఇచ్చింది. అయితే వారికి భూమిని చూపించలేదు. తమకు భూములను చూపించాలని రైతులు పట్టుబట్టారు. తహసీల్దార్ నచ్చజెప్పే ప్రయత్నం చే సినా అంగీకరించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. -
ముస్లింలకు చంద్రబాబు దగా
నూజివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ యూనస్పాషా(గబ్బర్) అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముస్లింలపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల అభ్యున్నతికి కృషి చేశారని, వైఎస్సార్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వక్ఫ్ చట్టానికి టీడీపీ, జనసేనలు మద్దతు తెలపడం దారుణమన్నారు. ముస్లిం విభాగం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 లక్షల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు పూనుకోవడం గర్హనీయమన్నారు. కౌన్సిలర్ మీర్ అంజాద్ ఆలీ, నాయకులు షేక్ మస్తాన్ వలీ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, ముస్లిం నాయకులు మహ్మద్ ఆలీ, షేక్ షాజహాన్, సలీం, ఆమీర్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లు డల్
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీలు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తంగా 54.56 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఒక్క నూజివీడు పట్టణంలో మాత్రమే 60 శాతానికి పైగా పన్ను ఆదాయం వచ్చింది. లక్ష్యాన్ని చేరని వైనం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో గృహాలు, ఖాళీ స్థలాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా మార్చి 31 నాటికి నూరు శాతం పన్ను వసూలు చేస్తామని అధికారులు ప్రకటించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. మార్చి 31 నాటికి జిల్లాలో మొత్తంగా రూ.83.64 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.45.64 కోట్లు మాత్రమే వసూలైంది. మార్చి 31న అర్ధరాత్రి నుంచి ఆస్తిపన్నుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం వివరాలు అప్డేట్ అయిన తర్వాత వెబ్సైట్ మళ్లీ అందుబాటులోకి రానుంది. నూజివీడు ఫస్ట్.. ఏలూరు లాస్ట్ ఈ ఏడాది మార్చి 6 నాటికి పన్ను వసూళ్లు వేగవంతం చేస్తున్నామని అధికారులు చెప్పినా కార్యరూ పం మాత్రం దాల్చలేదు. ఆ రోజున సగటున 43.38 శాతం పన్నులు వసూలు కాగా.. గడువు ము గిసే నాటికి 54.56 శాతం మాత్రమే వసూలయ్యా యి. నూజివీడు 62.09 శాతం ప్రథమ స్థానం, జంగారెడ్డిగూడెం 59.91 శాతంతో ద్వితీయ స్థానం, చింతలపూడి 55.98 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. ఏలూరు కార్పొరేషన్ మాత్రం 52.31 శాతంతో చివరి స్థానంలో ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వ్యూ ఆస్తి పన్ను వసూళ్లు 55 శాతం లోపే.. రూ.83 కోట్లకు రూ.45 కోట్లే వసూలు నూజివీడులో మాత్రమే 62 శాతం రాబడి ఫలితమివ్వని అధికారుల చర్యలు మున్సిపాలిటీ అసెస్మెంట్లు వసూలు కావాల్సిన వసూలైన మొత్తం శాతం మొత్తం. (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) ఏలూరు 71,378 60.44 31.62 52.31 (కార్పొరేషన్) జంగారెడ్డిగూడెం 19,114 11.34 6.80 59.91 నూజివీడు 15,283 9.54 5.92 62.09 చింతలపూడి 7,350 2.32 1.30 55.98 (నగర పంచాయతీ) పటిష్ట చర్యలు తీసుకున్నాం పన్ను వసూళ్లపై ప్రచార మాధ్యమాల ద్వారా, సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించడం, ఫోన్ ద్వారా ఫాలో అప్ చేశాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెలలో తీసుకున్న చర్యల కారణంగా 12 శాతం అదనంగా వసూళ్లు చేయగలిగాం. మార్చి 31న ఆన్లైన్ వెబ్సైట్ నిలిపివేశారు. మరలా అప్డేట్ అయిన వివరాలతో ఈనెల 5 నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందించడం, మౌఖికంగా సమాచారం ఇచ్చి సన్నద్ధం చేశాం. 5వ తేదీ తర్వాత గతేడాది పన్నులతో పాటు ఈ ఏడాది పన్నులు కూడా చెల్లించేలా యజమానులను చైతన్య పరుస్తున్నాం. – కేవీ రమణ, కమిషనర్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ -
ముస్లింలకు చంద్రబాబు దగా
నూజివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ యూనస్పాషా(గబ్బర్) అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముస్లింలపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల అభ్యున్నతికి కృషి చేశారని, వైఎస్సార్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వక్ఫ్ చట్టానికి టీడీపీ, జనసేనలు మద్దతు తెలపడం దారుణమన్నారు. ముస్లిం విభాగం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 లక్షల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు పూనుకోవడం గర్హనీయమన్నారు. కౌన్సిలర్ మీర్ అంజాద్ ఆలీ, నాయకులు షేక్ మస్తాన్ వలీ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, ముస్లిం నాయకులు మహ్మద్ ఆలీ, షేక్ షాజహాన్, సలీం, ఆమీర్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు
టి.నరసాపురం: వ్యవసాయశాఖకు చెందిన విత్తనాభివృద్ధి క్షేత్రానికి కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లిన అధికారులను అల్లంచర్ల రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం అల్లంచర్లలో విత్తనాభివృద్ధి క్షేత్రానికి 40 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆ భూ మిలో కొంత భాగాన్ని రైతులు ఆక్రమించుకున్నా రు. భూమికి హద్దులు నిర్ణయించి వ్యవసాయ శాఖ కు చూపించేందుకు వ్యవసాయశాఖ జేడీఏ హబీబ్ బాషా, తహసీల్దార్ టి.సాయిబాబా, సర్వేయర్ అ క్కడికి వెళ్లారు. హద్దులు నిర్ణయించి కందకం తవ్వే ప్రయత్నం చేయడంతో ఆక్రమణలో ఉన్న రైతులు అడ్డుకున్నారు. విత్తనాభివృద్ధి క్షేత్రానికి భూమిని కేటాయించిన సమయంలోనే 82 మంది రైతులకు 50 సెంట్ల చొప్పున ప్రభుత్వం ప ట్టాలు ఇచ్చింది. అయితే వారికి భూమిని చూపించలేదు. తమకు భూములను చూపించాలని రైతులు పట్టుబట్టారు. తహసీల్దార్ నచ్చజెప్పే ప్రయత్నం చే సినా అంగీకరించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. -
స్వర పేటిక తెగినా వైద్యులు ఊపిరి పోశారు
పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో స్వరపేటిక తెగిన ఓ వ్యక్తికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం, సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామానికి చెందిన ఎస్.పవన్‌కల్యాణ్ (35) చేపలు అమ్మే నిమిత్తం సంతకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇనుప కంచైపె పడి తీవ్రంగా గాయపడ్డారు. అతని మెడ ముందు భాగంలో స్వర పేటిక పూర్తిగా తెగిపోయింది. ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో ఏలూరు జీజీహెచ్ నుంచి విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. రోగి ఆర్థిక స్థితిని గమనించి ఈఎన్టీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కొణిదే రవి, సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీ రావు రూ.50 వేల ఖరీదు చేసే టి. ట్యూట్‌ను ముంబై నుంచి కొనుగోలు చేసి షియాన్–యాన్లీ పద్ధతి ద్వారా అమర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావటంతో రోగి పూర్తిగా కోలుకుని మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన బృందాన్ని శుక్రవారం సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్ అభినందించారు. -
గోవిందకుంట చెరువులో మట్టి దందా
ద్వారకాతిరుమల: స్థానిక పంచాయతీకి చెందిన గోవిందకుంట చెరువులో మట్టి అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్నారు. ప్రధానంగా జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు తవ్వకాలు జరుపుతూ కొందరు కూ టమి నేతలకు ట్రాక్టర్‌కు ఇంతని ముట్టచెబుతున్నట్టు సమాచారం. దూరాన్ని బట్టి ట్రాక్టర్ మట్టిని రూ.700 నుంచి రూ.900కి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వైపు నుంచే మట్టి ట్రాక్టర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు గట్టును సైతం అక్రమార్కులు తవ్వేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేద ని స్థానికులు అంటున్నారు. నేడు పాఠశాలలకు సెలవు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సెలవు అని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు పాటించని యాజమాన్యాలపై చ ర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు స్లాట్ బుకింగ్ విధానంలో 16 రిజిస్ట్రేషన్లు చేసినట్టు జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నామని, త్వరలో అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామన్నారు. స్లాట్ బుకింగ్ సమయంలోనే చలానాలు అప్లోడ్ చేయా ల్సి ఉంటుందని, స్లాట్ బుక్ చేసుకున్న వారు సమయానికి అందుబాటులోకి రాలేకపోతే రూ.200 అదనంగా చెల్లించి తమ స్లాట్‌ను రీ షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపారు. ఏలూరు స బ్ రిజిస్ట్రార్–2 రామకృష్ణ, సతీష్ పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్‌కు 250 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జేఈఈ మె యిన్స్ సెషన్–2 పరీక్షలకు 250 మంది విద్యా ర్థులు హాజరయ్యారు. ఉదయం షిఫ్టులో 115 మందికి 106 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 152 మందికి 144 మంది హాజరయ్యారని సిటీ కో–ఆర్డినేటర్ పి.సాయికుమారి తెలిపారు.కోకో రైతులకు న్యాయం చేయాలి ఏలూరు (టూటౌన్): కోకో గింజల కొనుగో లు, ధర సమస్యలపై కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. ఏలూరు లోని అన్నేభవనంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌర వాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఈనెల 7 వరకు ఎదురు చూస్తామని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులు అబద్ధాలు వల్లించడం దుర్మార్గమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750 ఉండగా కంపెనీలు మాత్రం రూ.450 నుంచి రూ.550కే కొనుగోలు చేస్తున్నాయన్నారు. అన్ సీజన్ గింజలు కొనడం లేదన్నారు. అంతర్జాతీయ మా ర్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
సర్కారు నిర్లక్ష్యం.. పౌల్ట్రీకి శాపం
చేదెక్కుతున్న మామిడి మామిడికి గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 8లో uశనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో బర్డ్‌ఫ్లూతో నిండామునిగిన రైతులకు ఇప్పటికీ ప్రభుత్వ సాయం, నష్టపరిహారం అందించలేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా రీషెడ్యూల్ చేయకపోవడంతో కొత్త బ్యాచ్‌లు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. 200 పౌల్ట్రీలు.. 1.30 కోట్ల కోళ్లు ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీల్లో 1.30 కోట్ల వరకు లేయర్ కోళ్లు ఉన్నాయి. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మరోపక్క ఏడు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్లు పెంచే షెడ్లు ఉన్నాయి. సంక్రాంతికి ముందు నుంచే జిల్లాలోని నాటు కోళ్లు, పందెం పుంజులు వైరస్ లక్షణాలతో మృత్యువాత పడగా శీతల ప్రభావం వలన చనిపోతున్నాయని అధికారులు కొట్టిపారేస్తూ వ చ్చారు. తర్వాత బర్డ్‌ఫ్లూ వైరస్ లేయర్, బ్రాయిలర్ ఫారాలకు విస్తరించింది. జిల్లాలో అసాధారణ రీతిలో కోళ్లు మరణాలు సంభవిస్తుండటంపై ఫిబ్రవరి 4న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉంగుటూరు మండలం బాదంపూడి, తణుకు మండలం వేల్పూరులో కోళ్ల మరణాలకు ఎవియాన్ ఇన్ఫ్లూయంజ్ (హెచ్5ఎన్1) వైరస్ కారణమని ల్యాబ్ నివేదికలు తేల్చాయి. వైరస్ గుర్తించిన పౌల్ట్రీకి కిలోమీటరు పరిధిలో ఇన్ఫెక్షన్ జోన్, పది కిలోమీటర్లు పరిధిని అలర్ట్ జోన్‌గా గుర్తించి కొద్దిరోజులపాటు చికెన్, గుడ్లు అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. కలకలం రేపిన చిన్నారి మృతి పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసింది. ఈ ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడింది. దీంతో చికెన్, గుడ్డు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఫాంగేట్ వద్ద రూ.4.60 ఉన్న గుడ్డు ధర శుక్రవారం రూ.4.25కి తగ్గిపోయింది. మరింత సంక్షోభంలోకి.. ప్రభుత్వం సకాలంలో వైరస్‌ను గుర్తించి, కట్టడికి చర్యలు చేపట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు విమర్శిస్తున్నారు. మరోపక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువైతే వడదెబ్బకు గురై కోళ్ల మరణాలు పెరగడంతో పాటు 10 నుంచి 20 శాతం వరకు గుడ్ల ఉత్పత్తి పడిపోతుందంటున్నారు. రా నున్న రోజుల్లో పరిశ్రమ మరింత సంక్షోభంలో కూ రుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 8లో uఆదుకోని ప్రభుత్వం వైరస్ గుర్తించక ముందు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 15 లక్షల వరకు లేయర్, 50 వేల వరకు బ్రాయిలర్ కోళ్లు మృతిచెందినట్టు అంచనా. వైరస్ గుర్తించాక వేల్పూరు ఇన్ఫెక్షన్ జోన్‌లోని 55వేలు, బాదంపూడి ఇన్ఫెక్షన్ జోన్‌లోని 1.34 లక్షల లేయర్ కోళ్లను కల్లింగ్ చేశారు. గుడ్లు, మేతలను పూడ్చిపెట్టేశారు. ఒక్కో కోడికి రూ.140 నష్టంగా అధికారులు ప్రాథమికంగా లెక్కకట్టారు. ఈ మేరకు పూడ్చిపెట్టిన కోళ్లకు రూ.2.65 కోట్లు, అలాగే గుడ్లు, మేతల రూపంలో మరింత మొత్తం బాధిత రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం అందించలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంతో కొత్త బ్యాచ్‌లు వేయలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. న్యూస్రీల్బర్డ్ఫ్లూ వైరస్ నియంత్రణలో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి పౌల్ట్రీ రంగానికి శాపంలా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ పంజా విసరడంతో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో తాజాగా నరసారావుపేటలో బర్డ్‌ఫ్లూతో చిన్నారి మృతి చెందిన ఘటన కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. కోడికి కష్టకాలం నరసరావుపేట ఘటనతో కలకలం మరలా బర్డ్‌ఫ్లూ భయం వైరస్ నియంత్రణలో కూటమి నిర్లక్ష్యం జిల్లాలో బర్డ్‌ఫ్లూ బాధిత రైతులకు అందని సాయం విడుదల కాని నష్టపరిహారం.. రీషెడ్యూల్ కాని రుణాలు కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం బర్డ్‌ఫ్లూ వెలుగుచూసే నాటికి ఫాంగేట్ వద్ద గుడ్డు ధర రూ.5.05 ఉంది. ఆంక్షల నేపథ్యంలో స్థానిక వినియోగంతో ఎగుమతులు తగ్గడంతో ఫిబ్రవరిలో రూ.4.10కి పడిపోయింది. చికెన్ ధరలు సైతం కిలో రూ.100కి తగ్గి కోళ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పట్టణ ప్రాంతాల్లో చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించారు. ధర లేకపోవడం, ఎండలకు జడిసి బ్రాయిలర్ రైతులు కొత్త బ్యాచ్‌లు తగ్గించడంతో మార్కెట్లో కోళ్ల సంఖ్య తగ్గింది. రంజాన్ మాసం మొదలు కావడం, బర్డ్‌ఫ్లూ లేదని నిరభ్యంతరంగా చికెన్ తినవచ్చంటూ అధికారులు ప్రకటించడంతో కొద్దిరోజులుగా వినియోగం పెరిగింది. నష్టపరిహారం రావాల్సి ఉంది బర్డ్‌ఫ్లూ కారణంగా జిల్లాలో జరిగిన నష్టం వివరాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే సంబంధిత రైతులకు అందజేస్తాం. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదు. – కె.మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ, పశ్చిమగోదావరి జిల్లా -
ఆటో డ్రైవర్ల ఆక్రందన
ఏలూరు (టూటౌన్): రాపిడో, ఊబర్, ఓలా సంస్థల అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ఆటో డ్రైవర్లు గళమెత్తారు. శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలు కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేసుకుని కోట్లాది రూపాయలు ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయని మండిపడ్డారు. కేరళలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సవారీ యాప్ ద్వారా ఆటో, టాక్సీ డ్రైవర్లకు 6 శాతం కమీషన్‌కు సేవలందిస్తోందని, అయితే మన రాష్ట్రంలో రాపిడో వంటి సంస్థలు 25 నుంచి 30 శాతం కమీషన్లు గుంజుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరేలా ఆన్లైన్ యాప్ తయారు చేయాలని డిమాండ్ చేశారు. రాపిడో, ఊబర్, ఓలా సంస్థలను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాయని హెచ్చరించారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు ఆటో డ్రైవర్లకు మద్దతు తెలిపారు. జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమర్‌కుమార్, జె.గోపి నగర అధ్య క్ష, కార్యదర్శులు అడ్డాల రాజు, బి.చంద్రశేఖర్ నా యకత్వంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు. -
పాస్టర్ మృతిపై నిరసనల హోరు
పాలకోడేరులో ర్యాలీ పాలకోడేరు: పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బిషప్ జెర్మియా, యూపీఏ అధ్యక్షుడు గోపే సాల్మన్ రాజు డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో గురువారం గొల్లలకోడేరు నుంచి పాలకోడేరు రావి చెట్టు సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. యునైటెడ్ పాస్టర్ల అసోసియేషన్ మండల అధ్యక్షుడు గోపే సాల్మన్ రాజు, బిషప్ సత్యం మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సీఐడీ, సీబీఐ సంస్థలతో విచారణ జరిపించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశాపు రాజు, విజయ్ కుమార్ ఎలిషా దానియేలు, నికోలస్, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టి.నరసాపురం: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసనలు హోరెత్తాయి. ప్రవీణ్ మృతిపై సమగ్ర న్యాయ విచారణ చేసి అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ క్రైస్తవులు పలుచోట్ల శాంతి ర్యాలీలు నిర్వహించారు. క్రైస్తవ సమాజాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. టి.నరసాపురంలో క్రైస్తవ సంఘాల నాయకులు, విశ్వాసులు స్థానిక హైస్కూల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్లు బి.బెసలేలు, సీహెచ్ హోషేయ, ఆర్.మోషే, బి.రమేష్, వై.పాల్చిన్నారావు, నవజీన్పాల్, బి.కిషోర్, ప్రేమ్‌కుమార్, ప్రసన్నకుమార్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలి కామవరపుకోట : క్రైస్తవులపై దాడులు అరికట్టాలని, పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన సమగ్ర విచారణ జరిపించాలని కర్మేల్ మినిస్ట్రీ పాస్టర్ మోజెస్ డిమాండ్ చేశారు. మండలంలోని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా నుంచి చెక్ పోస్ట్ మీదగా చౌతన సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గడ్డం ఎలీసాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూనియన్ పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీ కొయ్యలగూడెం : పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులు గురువారం కొయ్యలగూడెంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక జీడీఎం చర్చి నుంచి వివిధ క్రైస్తవ సంఘాల కాపరులు, విశ్వాసులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎం.దేవసహాయం మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని కోరారు. సెక్రటరీ బాలస్వామి మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా చర్చిలను సైతం కూల్చి వేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి క్రైస్తవులపై దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బి.శామ్యూల్ రాజు, కె.డానియేల్, పాల్ అన్న, బెంజిమెన్, సింగ్, కె.బాబురావు, టీఎన్.స్నేహన్, పాస్టర్లు, క్రై స్తవులు పాల్గొన్నారు. -
● ఇదేనా గురువులకిచ్చే గౌరవం ?
చెట్ల నీడలో, అరుగులపై పడిగాపులు కాస్తూ ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం గురువారం ఏలూరు సెయింట్ గ్జేవియర్ బాలుర పాఠశాలలో ప్రారంభం కాగా.. పేరు నమోదు ప్రక్రియ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు టీచర్లు పాట్లు పడ్డారు. కనీసం ఉపాధ్యాయులు కూర్చునేందుకు, భోజనాలు చేసేందుకు బెంచీలు, కుర్చీలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు.దీంతో నేలపై, గట్లపై కూర్చుని భోజనాలు చేశారు. ఇదేనా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం అంటూ పలువురు బహిరంగంగానే విమర్శించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
కోకో రైతులను ఆదుకోవాలని వినతి
ఏలూరు (టూటౌన్) : కోకో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమను ఆదుకోవాలని కోరుతూ గురువారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడుని కలిసి వినతిపత్రం అందజేసింది. గురువారం ఈమేరకు అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయడు సమక్షంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల సంయుక్త సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రైతు సంఘ నేతలు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేయాలని, అన్ సీజన్ గింజలు వెంటనే కొనుగోలు చేసి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోకో రైతులను మోసం చేస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ కోకో గింజల దిగుమతులు ఆపాలని, దేశీయంగా రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈనెల 7వ తేదీ లోపు కంపెనీలు తమ నిర్ణయాన్ని చెప్పాలని మంత్రి ఆదేశించారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకుంటుందని, కోకో రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య, బోళ్ళ వెంకట సుబ్బారావు, కోనేరు సతీష్ బాబు, గుది బండి వీరారెడ్డి, జాస్తి కాశీ బాబు, డి.నరేష్, కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు. -
టేకు ప్లాంటేషన్ సంరక్షణకు ప్రాధాన్యమివ్వండి
బుట్టాయగూడెం: రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న టేకు ప్లాంటేషన్ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు ఫారెస్ట్ రేంజ్ అధికారులను ఆదేశించారు. బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన రామనర్సాపురంలో ఉన్న 72–73 టేకు ప్లాంటేషన్‌ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెట్ల ఎత్తు, మొదలులోని చుట్టుకొలతలను స్వయంగా పరిశీలించారు. అలాగే ప్లాంటేషన్లోని చెట్ల తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టేకు చెట్లను స్మగ్లర్లు నరికి వేయకుండా బీటు స్థాయి ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అటవీశాఖ ఉద్యోగులు అటవీ సంరక్షణ విధులతోపాటు టేకు ప్లాంటేషన్‌ను కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్పాత్, ఫైర్‌లైన్స్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీశుభం, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, కన్నాపురం రేంజ్ అధికారి ఎం.శివరామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో రమణక్కపేటలో ఉన్న టేకు ప్లాంటేషన్‌ను కూడా పీసీసీఎఫ్ చలపతిరావు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలోని అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారులకు ఆదేశం టేకు ప్లాంటేషన్‌ను పరిశీలించిన పీసీసీఎఫ్ -
స్వాహా చేసిన చెట్ల సొమ్ము పంచాయతీకి జమ
ఎఫెక్ట్ ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంటలో కొందరు కూటమి నేతలు స్వాహా చేసిన చెట్ల సొమ్మును ఎట్టకేలకు బుధవారం పంచాయతీకి జమ చేశారు. వివరాల్లోకి వెళితే. గుండుగొలనుకుంట నుంచి కామవరపుకోట మండలం వడ్లపల్లికి వెళ్లే గ్రావెల్ రోడ్డుకు మరమ్మతులు చేయించే పేరుతో, రహదారి మార్జిన్‌లోని చెట్లను కొందరు కూటమి నేతలు 6 నెలల క్రితం నరికించి, కలపను విక్రయించారు. ఆ సొమ్మును పంచాయతీకి జమ చేయకుండా, కనీసం రోడ్డుకు మరమ్మతులు చేయించకుండా స్వాహా చేశారు. దీనిపై గతనెల 30న సాక్షి దినపత్రికలో ‘చెట్ల సొమ్ము స్వాహా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు విచారణ జరిపి, చెట్లు కలప విక్రయించగా వచ్చిన సొమ్మును పంచాయతీకి జమ చేయాలని సదరు నేతలకు సూచించారు. అయితే మొదట్లో మొండికేసిన ఆ నేతలు చివరకు పంచాయతీకి రూ. 56 వేలను జమ చేశారు. ఈ నగదుతో గుండుగొలనుకుంట – వడ్లపల్లి రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని ఎంపీడీవో ప్రకాష్ తెలిపారు. -
పాటెమ్మ తల్లి జాతరలో అగ్నిగుండ ప్రవేశం
దెందులూరు: చల్లచింతలపూడిలో నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీ పాటెమ్మ పేరంటాలు తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. మండుటెండలో కనకనలాడే నిప్పులపై అమ్మవారు ఆవహించిన కమ్మ సత్యవతి అనే భక్తురాలు పాటెమ్మ తల్లి విగ్రహాన్ని చేతపట్టుకుని అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆమెతోపాటు ఆలయ కమిటీ చైర్మన్ యలమర్తి శ్రీనివాసరావు యలమర్తి సత్తిబాబు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ముమ్మడి మోహన్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ నాగనబోయిన సత్యనారాయణ, కమిటీ సభ్యులు యలమర్తి రామ్మోహన్రావు, రాముడు, మోహన్, మురళి, పర్వతనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సిక్స్ వీక్స్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కోర్సు ఏలూరు రూరల్: ఆటలపై ఆసక్తి గల వారి కోసం స్పోర్ట్స్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు పాటియాలాలోని ఎన్ఎస్ఎన్ఐఎస్ సిక్స్ వీక్స్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. మాస్ స్పోర్ట్స్ పార్టిషిపేషన్ ప్రోగ్రామ్ ద్వారా 6 నెలల పాటు శిక్షణ జరుగుతందని వెల్లడించారు. ఈ శిక్షణపై ఆసక్తి గలవారు మే 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. -
వ్యసనాలకు బానిసలై.. పోలీసుల అవతారమెత్తి..
వసూళ్లకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ ఏలూరు (టూటౌన్): వ్యవసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ పోలీసుల అవతారం ఎత్తిన నలుగురు వ్యక్తుల ఆట కట్టించారు పోలీసులు. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యప్రకాశరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెంకు చెందిన మాండ్రు డేవిడ్ లక్ష్మీనగర్ హైవే పక్కన టీస్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 1న రాత్రి 11.30 గంటలకు నలుగురు వ్యక్తులు కారులో వచ్చి పోలీసులమని చెప్పి డేవిడ్‌ను బెదిరించారు. రాత్రి సమయంలో షాపు ఎందుకు తెరిచావంటూ, కేసు పెడతామని బెదిరించారు. రూ.1,000 ఇస్తే కేసు లేకుండా వదిలేస్తామనడంతో డేవిడ్ ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. ఇదే సమయంలో స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు రావడంతో వారంతా కారులో ఉడాయించారు. దీనిపై బాధితుడు ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఈనెల 3న భీమడోలు జంక్షన్ వద్ద ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించేందుకు పోలీస్ యూనిఫారం కుట్టించుకుని నకిలీ పోలీసుల అవతారం ఎత్తినట్టు విచారణలో తేల్చారు. భీమడోలు మండలం పూళ్లకి చెందిన బుంగా ప్రశాంత్, పెరికె సురేంద్రకుమార్, కోరపాటి రోహిత్, ఉంగుటూరుకి చెందిన గొల్లా సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కారు, పోలీస్ లోగోతో కూడిన యూనిఫాం, విజిల్ గార్డ్, పోలీస్ బెల్ట్, లాఠీని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. భీమడోలు, ద్వారకా తిరుమల స్టేషన్ల సిబ్బందిని అభినందించారు. -
నాలుగో వసంతంలోకి నవ పశి్చమ
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజలకు పాలనను చేరువ చేయడంతో పాటు మరింత మెరుగ్గా అందించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. దీనిలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏలూరు కేంద్రంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను రెండుగా విభజించారు. భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లాలు ఏర్పడ్డాయి. శుక్రవారంతో కొత్త జిల్లాలు మూడేళ్లు పూర్తిచేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్నాయి. తగ్గిన దూరాభారం భీమవరం కేంద్రంగా 20 మండలాలతో జిల్లాను ఏర్పాటుచేయడంతో ప్రజలకు పాలన చేరువైంది. జిల్లాలోని ఏ ప్రాంతం వారు అయినా 30 కిలోమీటర్లలోపు జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకుంటున్నారు. గతంలో జిల్లా కేంద్రం ఏలూరు వెళ్లేందుకు 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడేవారు. భీమవరంలో కలెక్టరేట్. జిల్లా అధికారుల కార్యాలయాలు ఏర్పాటుచేయడంతో వీరికి వ్యయప్రయాసలు తప్పాయి. ముఖ్యంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమానికి సులువుగా హాజరు కాగలుగుతున్నారు. కలెక్టరేట్ అందుబాటులో ఉండటంతో భోజన సమయానికి పనులు పూర్తిచేసుకుని వారి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అందుబాటులో ఎస్పీ కార్యాలయం ప్రజలకు ఏ కష్టం వచ్చిన శాంతి భద్రతలను విషయంలో పోలీసుల సాయం కోసం, ఏదైన సమస్య ఉంటే చెప్పుకోవడానికి, అలాగే స్పందనలో అర్జీలు పెట్టుకోవడానికి జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా అందుబాటులో ఉంది. అటు కలెక్టరేట్ ఇటు ఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ప్రజలు సులభంగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లా కార్యాలయాలను తమకు అందుబాటులోకి తీసుకువచ్చిన మాజీ సీఎం జగన్ మేలును ప్రశంసిస్తున్నారు. విపత్తుల వేళ వేగంగా సేవలు జిల్లాలో ఏ ప్రాంతంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా వేగంగా అధికారులు వెళ్లి సాయం అందిస్తున్నారు. గోదావరి వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు 30 నిమిషాల్లోపు సంఘటన ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు సకాలంలో సాయం చేయడం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గ తంలో ఏలూరు నుంచి అధికారులు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. స్థానిక అధికారులు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా ఉండేది. కొత్త డివిజన్లు నూతన జిల్లా ఏర్పాటుతో నూతన రెవెన్యూ, పోలీసు సబ్ డివిజన్లను కూడా నాటి ప్రభుత్వం ఏర్పాటు చే సింది. భీమవరం నూతన రెవెన్యూ డివిజన్, పో లీసు సబ్ డివిజన్, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్లు ఏర్పాటయ్యాయి. భీమవరంలో కలెక్టరేట్జిల్లా వివరాలు జనాభా 20 లక్షలు ఓటర్లు 14.40 లక్షలు విస్తీర్ణం 2,278.35 చ.కి.మీ రెవెన్యూ డివిజన్లు 3 పోలీస్ సబ్ డివిజన్లు 3 మండలాలు 20 గ్రామాలు 409 మున్సిపాలిటీలు 6 జిల్లా అభివృద్ధికి జగన్ కృషి రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుతో పాటు ఆయా జిల్లాల అభివృద్ధికి గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ విశేషంగా కృషిచేశారు. జిల్లాలో 71,200 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేసి గృహ నిర్మాణాలకు రూ.500 కోట్ల మేర ఖర్చు చేశారు. రైతుల కోసం రూ.10.56 కోట్లతో మల్టీపర్సస్ గోడౌన్లు నిర్మాణం చేపట్టారు. రూ 455.59 కోట్లతో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్‌లు నిర్మించారు. రూ.16.14 కోట్లతో పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించారు. రూ.86 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.9.72 కోట్లతో 60 అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించారు. నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభు త్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. పట్టణాల్లో రూ.400 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధి చేశారు. పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. నరసాపురం ప్రాంతంలో రూ.3 వేల కోట్లతో ఆక్వా యునివర్సిటీ, ఫిషింగ్ హార్బర్, వాటర్ గ్రిడ్ తదితర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జిల్లాల పునర్విభజనతో మేలు పరిపాలనా సౌలభ్యం ప్రజలకు చేరువలో జిల్లా అధికారులు మూడేళ్లు నిండిన కొత్త జిల్లాలు వ్యయప్రయాసలు తగ్గాయి జిల్లాల పునర్విభజనతో వ్యయప్రయాసలు తగ్గాయి. గతంలో మా గ్రామం నుంచి జిల్లా కేంద్రం ఏలూరు వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తప్పాయి. కేవలం 8 కిలోమీటర్లలో జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాం. స్పందన కార్యక్రమానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు చాలా వెసులుబాటుగా ఉంది. ఇదంతా జగన్ చేసిన మేలు – బి.రాంబాబు, కొండేపూడి జగన్ మేలు మరువలేం భీమవరం జిల్లా కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేశారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులో ఉండటంతో సమస్యలను సులభంగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నాం. జిల్లా అధికారులు వేగంగా వచ్చి సమస్యలు పరిష్కరించగలుగుతున్నారు. – వి.శ్రీనివాస్, తోకలపూడి -
వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి
‘డైట్’లో పోస్టులకు దరఖాస్తులు దూబచర్లలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో వివిధ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు ఏలూరు డీఈఓ తెలిపారు. 8లో uఏలూరు(మెట్రో): కనీస మద్దతు ధర స్థాయి నుంచి పండించిన పంటకు ధరను డిమాండ్ చేసే స్థాయికి రైతులను తీసుకువెళ్లేలా పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లో గురువారం వ్యవసా య, అనుబంధ రంగాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో సమావేశయ్యా రు. సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేలా రైతులను స మాయత్తం చేస్తామన్నారు. సాగులో డ్రోన్లతో పాటు యాంత్రీకరణను ప్రోత్సహించడంతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పి ంచాలన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందు కు ప్రతి శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషాను ఆదేశించారు. రుణాల జాబితాలను.. జిల్లాలో స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు రుణాల కోసం వెనుకబడిన త రగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు కార్పొరేషన్ ద్వారా యువత చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే బ్యాంకులకు పంపాలని క లెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఎంపీడీఓలతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మార్చి 25 నాటికి 30,436 మంది యువత దరఖాస్తులు చేసుకున్నారన్నారు. సత్యసాయి పథకం నిర్వహణపై శ్రీ సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ పనులపై కలెక్టర్ సమీక్షించారు. 14 మండలాలు 158 గ్రామాల్లో 3.75 లక్షల జనాభాకు నీరందించే పథ కం పనులు పక్కాగా నిర్వహించాలని సూచించారు. -
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నారాయణ నియామకం
ఏలూరు (టూటౌన్): ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, ఏలూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది ఏవీ నారాయణను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పీడీజే కోర్టు పీపీగా కోనే సీతారామ్ పనిచేస్తున్నారు. ఈయన పదవీ కాలం మే 10న పూర్తి కానుండడంతో మే 11 నుంచి ఏవీ నారాయణ పీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. నెలకు రూ.45 వేలు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఏలూరుకు చెందిన న్యాయవాది ఏవీ నారాయణ 1993–96 మధ్య ఏలూరు లా కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ఏలూరు బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకుని జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ఆయన ఏలూరు కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. -
అయ్యో.. రొయ్య
ప్లాంటేషన్ సంరక్షణపై దృష్టి టేకు ప్లాంటేషన్ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీఎఫ్ చలపతిరావు రేంజ్ అధికారులను ఆదేశించారు. రామనర్సాపురంలో ప్లాంట్‌ను పరిశీలించారు. 8లో uశురకవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025భీమవరం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. 60 శాతం వనామీ, మిగిలిన విస్తీర్ణంలో చేపలను పెంచుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో పెద్ద మొత్తంలో రొయ్యలు మార్కెట్లోకి వస్తుంటాయి. ప్రస్తుతం అధికంగా 80 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు పట్టుబడులు చేస్తున్నారు. ఈ తరుణంలో దేశీయ ఉత్పత్తులపై అమెరికా పన్నులు పెంచిందంటూ గురువారం ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ధరలను తగ్గించేశారు. 100 కౌంట్ ప్రస్తుత ధర రూ.235లు ఉండగా రూ.210లకు కొనుగోలు చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు. 50 కౌంట్లోపు అమెరికాకు.. జిల్లా నుంచి అమెరికా, చైనా, యూరప్ దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. కిలోకు 50 కౌంట్ వచ్చే రొయ్యలు మాత్రమే అమెరికాకు వెళుతుండగా, 60 నుంచి 140 కౌంట్ వరకు ఇతర దేశాలకు వెళుతున్నాయి. కాగా అమెరికా సుంకాలు పెంచనున్నట్టు చేసిన ప్రకటనను సాకుగా చూపించి చైనా, ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే రొయ్య ధరలను తగ్గించేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు కుమ్మకై ్క తమ కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా పన్నులు పెరిగితే ఆ భారం వినియోగదారులపై పడాల్సి ఉండగా అందుకు భిన్నంగా రైతులనే దోచుకోవడం దారుణమంటున్నారు. సుంకాల మోతతో.. తాజాగా అమెరికా సుంకాల మోత పరోక్షంగా ఆక్వా రంగంపై పడటం రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. రొయ్యల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సాయం అందకపోగా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే సాగుకు స్వస్తి చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని వాపోతున్నారు. న్యూస్రీల్తీవ్రంగా నష్టపోతున్న రైతులు రొయ్యల ఫీడ్ తయారీ మెటీరియల్ ధరలు తగ్గినా ఆ మేరకు మేత ధరలు తగ్గడం లేదు. అలాగే నాణ్యమైన సీడ్ లభించకపోవడంతో చెరువుల్లో రొయ్య పిల్లలు వేసిన నెల రోజుల్లోనే వైరస్ కారణంగా చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫీడ్ ధరలపై ప్రభుత్వం అజమాయిషీ లేకపోవడం, నాణ్యమైన సీడ్ అందించకపోవడంతో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితం 100 కౌంట్ రూ.260 ఉన్న ధర ఒక్కసారిగా రూ.230లకు పడిపోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆక్వా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు సిండికేట్ అయ్యి ధరలు తగ్గించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. రైతుల ఆందోళనలు నేపథ్యంలో పదిరోజుల క్రితం 100 కౌంట్ రూ.240లు పెంచగా కొద్దిరోజుల తర్వాత దానిని రూ.235లకు తగ్గించారు. గత నాలుగు రోజులుగా ఈ ధరే కొనసాగుతోంది. మేతలు, మందుల ధరలు, చెరువుల నిర్వహణ పెరిగిపోవడంతో 100 కౌంట్‌కు రూ.260లు ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు’ ఉంది రొయ్యల రైతుల పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 26 శాతం పన్నులు విధిస్తామనడం ఆక్వా రైతులపై ప్రభావం చూపుతోంది. దీనిని సాకుగా చూపించి ఎగుమతిదారులు రొయ్య రేట్లను అమాంతం తగ్గించేశారు. కౌంట్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ట్రంప్ టారిఫ్ బాంబ్ రొయ్యల ధరలపై ప్రభావం అమెరికా పన్నుల పెంపును సాకుగా చూపించి ధరలు తగ్గించిన ఎక్స్‌పోర్టర్స్ 100 కౌంట్ ధర రూ.235 నుంచి రూ.210కి తగ్గింపు దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతులు 50లోపు కౌంట్ అమెరికాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి -
ముమ్మరంగా దాళ్వా మాసూళ్లు
భీమవరం: అవరోధాలను అధిగమించి ఆరుగాలం కష్టించి దాళ్వా సాగుచేసిన రైతన్నలు పంట మాసూళ్లు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగునీటి కొరత, తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డా వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, వీరవాసరం, పెంటపాడు, తణుకు, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైతన్నలు దాళ్వా మాసూళ్లు ప్రారంభించగా పీఆర్–126, ఎస్ఎల్–10 వంటి వరి రకాల కొట్టుపొట్టు ధాన్యం ఎకరాకు 60 నుంచి 70 బస్తాల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వాసాగు చేయగా కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు ప్రారంభించారు. సాగునీటి కొరత, తెగుళ్ల బెడద దాళ్వా సాగు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్య ఉత్పన్నం కావడంతో వంతుల వారీ విధానంలో నీరందించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయినప్పటికీ మెరక ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు మురుగు కాలువల్లోని నీటిని ఆయిల్ ఇంజిన్ల సహాయంతో చేలకు పెట్టుకుని పంటను కాపాడుకున్నారు. అలాగే తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం దాళ్వా పంటలో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికిగాను 348 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతుసేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ ఉన్న ధాన్యం కొనుగోలులో సాధారణ రకం క్వింటాళ్లు ధాన్యం రూ.2,300, ఏ గ్రేడ్ రకం రూ.2,320 రైతులకు చెల్లిస్తారు. పంట మాసూళ్లు ప్రారంభం కావడంతో జిల్లాలో మొట్టమొదటి ఽరైతు సేవాకేంద్రాన్ని గురువారం తాడేపల్లిగూడెంలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా వరిసాగు అనుకూల వాతావరణంతో దిగుబడులపై ఆశలు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రభుత్వ లక్ష్యం నేడు తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం 80 శాతం గింజలు గట్టిపడితే మాసూళ్లు చేయాలి జిల్లా వ్యాప్తంగా దాళ్వా వరి పంట ఆశాజనకంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు ప్రారంభమయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో 80 శాతం గింజలు గట్టిపడిన తరువాతనే మాసూళ్లు చేయాలి. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం -
పన్ను పాటలో సాగని ఆట
నరసాపురం: నరసాపురం మున్సిపల్ మార్కెట్ డైలీ పన్ను వసూళ్ల విషయంలో జనసేన నేతకు మేలు కలిగించేలా, మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడేలా కూటమి నేతలు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. పైకి నిబంధనల ప్రకారం జరుగుతున్నట్లు చూపించి, గత ఏడాది కంటే ఏకంగా రూ.50 లక్షలకు పైగా తక్కువకు మార్కెట్ పాటను జనసేన నాయకుడికి కట్టపెట్టాలని మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. అనుకున్న వారికి పాట కట్టబెట్టాలంటే కౌన్సిల్ తీర్మానం అవసరం. ఈ విషయంలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఇబ్బందనే భయంతో అధికారులు వెనక్కి తగ్గి మళ్లీ పాట నిర్వహించాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ ఫుట్‌పాత్‌లు, రోడ్డు మార్జిన్ల వద్ద వ్యాపారాలు చేసే వారి నుంచి రోజువారీ పన్నుల వసూళ్లకు హక్కులు కోసం గతేడాది జరిగిన వేలంపాట రూ.83 లక్షలకు వెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వారం క్రితం నిర్వహించిన పాటలో ఓ జనసేన నేత తన భార్య గంటా నాగదుర్గాదేవి పేరున రూ.30,06,000కు పాట దక్కించుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే రూ.50 లక్షలకు పైగా పాట తగ్గింది. తెరవెనుక చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో జనసేన నేతకు మార్కెట్ పాట అప్పగించి, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టేందుకు ముందు నుంచి భారీ స్కెచ్ వేశారు. వేలం పాటకు ముందు మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే నాయకర్ వెళ్లి మార్కెట్ పన్ను ఎక్కువ కట్టవద్దని బహిరంగంగా చెప్పారు. దీంతో వేలంపాటదారులు భయపడ్డారు. ఎమ్మెల్యే చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే పన్ను వసూళ్లు కష్టమవుతుందని కాంట్రాక్టర్లు భయపడి పాటకు మొగ్గుచూపలేదు. కమిషనర్ తక్కువ మొత్తానికి జనసేన నేతకు పన్ను నిర్వహణ అప్పగించడానికి మున్సిపల్ చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం బాధ్యత తనపై వేసుకుని కష్టపడ్డారు. మూడుపార్లు పాట వాయిదా వేసి, నాలుగో సారి జనసేన నేతకు రూ.50 లక్షలు తక్కువకు అప్పగించారు. కౌన్సిల్ తీర్మానం అవసరంతో చిక్కు పన్ను వసూళ్ల బాధ్యతలు అప్పగించాలంటే కౌన్సిల్ తీర్మానం అవసరం. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 25 మంది వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. గత ఏడాది కంటే భారీ మొత్తంలో పాట తగ్గడంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మొత్తం వ్యవహారం కమిషనర్, మున్సిపల్ రెవిన్యూ అధికారుల మెడకు చుట్టుకోవచ్చని భయపడ్డారు. దీంతో పాటను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ వసూలు చేసే పన్నులు కొంతమేర తగ్గిస్తామని పైకి వ్యాపారులను మభ్యపెట్టి ఆశలు చూపించి ఏకంగా మున్సిపాలిటీకి మార్కెట్ పాట ద్వారా ఏటా వచ్చే ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేయడం, అందులో స్వయంగా ఎమ్మెల్యే పరోక్షంగా ప్రయత్నించడం.. ఈ అంశంలో మున్సిపల్ కమిషనర్ నిబంధనలు వదిలి పెట్టడం చర్చనీయాంశమైంది. కూటమి కార్యకర్తలా మున్సిపల్ కమిషనర్ వ్యవహారం! తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో చివరి నిమిషంలో వెనకడుగు జనసేన నేతకు మేలు చేసే ప్రయత్నం స్వయంగా నరసాపురం ఎమ్మెల్యే బెదిరింపుల పర్వం -
ఏలూరును అరగగామిగా నిలపాలి
జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి ఏలూరు(మెట్రో): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో బుధవారం కలెక్టర్‌తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి, జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతిపథంలో నిలపాలన్నారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం పెంపొందించేందుకు రైతులకు ప్రభుత్వం అందించే చేయూతపై అవగాహన కలిగించి, మరింత విస్తీర్ణంలో సాగుచేసేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ,పాపికొండలు, కొల్లేరు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి, ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2.50 లక్షల ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరిగి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారని, 50 ఉత్పత్తుల అమ్మకాలతో ఏలూరు జిల్లా మూడవ స్థానం సంపాదించిందన్నారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఉద్యానవన పంటలలో ఆయిల్ పాం అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి చేయాలి జిల్లాలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పేదల గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. మే 31 నాటికి 13,525 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఇంతవరకు 6,832 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని, వేసవిలో అనుకూలమైన వాతావరణం ఉంటుందని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కాలువలు కట్టేలోగా మంచినీటి చెరువులన్నింటిని నింపుకోవాలన్నారు. ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్మించిన తాగునీటి సదుపాయాలు, టాయిలెట్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. -
మెప్మాకు గిన్నిస్ బుక్ రికార్డ్స్
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్డీసీ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా మెప్మా అధికారులు గిన్నిస్ బుక్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లతో బుధవారం కలెక్టర్‌ను కలిశారు. ఓఎన్డీసీ విక్రయాల్లో జిల్లా ఎస్‌హెచ్‌జీల భాగస్వామ్యం 6,500గా ఉందని మెప్మా అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఓఎన్డీసీ విక్రయాల్లో జిల్లా భాగస్వామ్యం పెద్ద మొత్తంలో పెరగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా లైవ్లీహుడ్స్ స్పెషలిస్ట్ సీహెచ్ నాని బాబు, జిల్లా ఐబీ గ్రంధి పార్వతి, జిల్లా ఈ మార్కెట్ స్పెషలిస్ట్ సీహెచ్ మోహన్ ఉన్నారు. చెల్లని చెక్కు కేసులో జైలు, జరిమానా నూజివీడు: చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు నూజివీడు మండలం సీతారామపురంనకు చెందిన కన్నెకంటి సాంబశివరావు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సేరినరసన్నపాలెంకు చెందిన బల్లా సత్యన్నారాయణకు 2020 జులై 6న రూ.12,44,000 నగదును అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత సాంబశివరావు బాకీ తీర్చమని అడగగా 2021 జులై 5న రూ.10 లక్షలకు సత్యన్నారాయణ చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును సాంబశివరావు బ్యాంకులో వేయగా నగదు లేదని బ్యాంకు నుంచి చెక్కు తిరిగి వచ్చింది. దీంతో సాంబశివరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సత్యన్నారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ముదినేపల్లి రూరల్: కుమారుడు, కుమార్తె మందలించారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకీగూడెంకు చెందిన పిచ్చేటి కొండయ్య (42) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఏడాది క్రితం సౌదీఅరేబీయా వెళ్లడంతో వడాలి గ్రామంలోని అత్తవారింట పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కొండయ్య కుమారుడు 9వ తరగతి, కుమార్తె 7వ తరగతి చదువుతున్నారు. కొండయ్య ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వెళుతుండడంతో కుమారుడు, కుమార్తె మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కొండయ్య మూడు రోజుల కిందట ఎలుకల మందు తిని అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనిపై కొండయ్య సొదరుడు బాపూజీ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నెల నెలా కోత
ముమ్మరంగా మాసూళ్లు దాళ్వా మాసూళ్లలో రైతులు నిమగ్నమయ్యారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. 8లో uగురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వెతలకు చెక్ పెట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు రాజకీయాలు, కులమత వర్గాలు చూడకుండా లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ఇంటికే వచ్చి పింఛన్ అందించే ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే రూ. 2000 పింఛన్‌ను ఏటా పెంచుతూ రూ.3000 చేశారు. 2019 నాటికి జిల్లాలో సుమారు 1.45 లక్షలు ఉన్న పింఛన్లు వైఎస్సార్సీపీ హయాంలో 2.36 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ప్రతి నెలా కోతే పింఛన్ సాయాన్ని రూ.4000 చేశామంటున్న కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. పెంచిన భారం ఖజానాపై పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోంది. 2024, జూన్‌లో 2,32,885 మందికి రూ.99.8 కోట్ల పింఛన్ సాయం అందిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో లబ్ధిదారుల సంఖ్య 2,25,718 మందికి తగ్గిపోయారు. వారికి అందించే సాయం రూ.96.8 కోట్లకు చేరింది. పది నెలల కాలంలో 7,167 పింఛన్లకు కూటమి కోత పెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.25 కోట్లు భారాన్ని తగ్గించుకున్నట్టు అంచనా. స్పౌజ్ పింఛన్లలో వింత పోకడ పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే అతని భార్య(స్పౌజ్)కు పింఛన్ మంజూరయ్యేలా యాప్‌లో ఆప్షన్ ఉంటుంది. కూటమి పాలన చేపట్టిన వెంటనే పింఛన్ సైట్‌ను క్లోజ్ చేయడంతో స్పౌజ్ పింఛన్ల మంజూరు ఆగిపోయాయి. నవంబరులో స్పౌజ్ ఆప్షన్ ఇచ్చినా కేవలం ఆ నెల నుంచి మృతిచెందిన వారి భార్యలకు మాత్రమే సాయం అందేలా కొర్రి పెట్టింది. దీంతో అంతకుముందు చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్ సాయం అందకుండా పోయింది. అధికారుల అంచనాల మేరకు జిల్లాలో 6000 మంది వరకు పింఛన్ లబ్ధిదారులు మృతిచెందగా కేవలం 607 మందికి మాత్రమే ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ అందిస్తోంది. న్యూస్రీల్గత పది నెలల్లో జిల్లాలోని పింఛన్ల పంపిణీ వివరాలు నెల పింఛన్లు సాయం (రూ. కోట్లలో) జూన్ 2,32,885 99.80 జూలై 2,31,874 99.20 ఆగస్టు 2,31,075 99.18 సెప్టెంబరు 2,30,123 96.57 అక్టోబరు 2,29,184 96.19 నవంబరు 2,28,362 96.25 డిసెంబరు 2,27,755 96.49 జనవరి 2,27,086 96.72 ఫిబ్రవరి 2,26,044 96.61 మార్చి 2,25,718 96.87 50 ఏళ్లకే పింఛన్ హమీ గాలికి తమ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. పాలనలోకి వచ్చి పది నెలలు గడిచినా వాటి ఊసెత్తడం లేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుమారు రెండున్నర లక్షల మంది వరకు ఉండగా వారిలో 70 శాతం మంది అర్హులు ఉంటారని అంచనా. ప్రభుత్వం 50 ఏళ్లకే పింఛన్ హామీ గురించి మాట్లాడకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వేలల్లో దరఖాస్తులు చివరిగా 2024 జనవరిలో గత ప్రభుత్వం 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జూలైలో కొత్తవి మంజూరు రావాల్సి ఉండగా జూన్‌లో కూటమి రాకతో వాటికి బ్రేక్ పడింది. గత ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి కొత్త పింఛన్ల కోసం 6,350 దరఖాస్తులు ఆన్లైన్ అయ్యాయి. కూటమి ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పింఛన్ల కోసం అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా. సైట్ ఓపెన్కాక దరఖాస్తులను ఆన్లైన్ చేసే వీలులేక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పేదలు అందజేస్తున్న ఆర్జీలు ఏమవుతున్నాయో తెలీని పరిస్థితి. పది నెలల్లో 7,167 పింఛన్ల తగ్గింపు జూన్‌లో 2,32,885 మందికి రూ.99.7 కోట్ల పంపిణీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 2,25,718 మందికి రూ.96.87 కోట్ల సాయం కొత్త పింఛన్ ఒక్కటీ మంజూరు చేయని వైనం పెండింగ్‌లో 20 వేలకు పైగా దరఖాస్తులు ‘భీమవరంలోని పేద వృద్ధ దంపతులు చిన్నారావు, సత్యవతిల ఇద్దరు కుమారులు పనుల కోసం వేరే ఊళ్లు వలస వెళ్లిపోయారు. వృద్ధాప్య పింఛనే దంపతుల జీవనాధారం. గత ఆగస్టులో చిన్నారావు మృతిచెందగా స్పౌజ్ కోటాలో తర్వాతి నెల నుంచి సత్యవతికి పింఛన్ అందాలి. కూటమి ప్రభుత్వం ఆ ఆప్షన్ క్లోజ్ చేయడంతో ఆమెకు పింఛన్ సాయం అందక తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఆమె ఒక్కరే కాదు జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన వేల మంది పింఛన్ కోసం అధికారులకు అర్జీలు అందజేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. -
కూటమి సేవలో ఖాకీలు!
సాక్షి, భీమవరం: అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ వారి విధులు విస్మరిస్తున్నారు. కూటమి మూకల దౌర్జన్యాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదుపై వారం రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిర్యాదు అందినట్టుగా ఎక్నాలెడ్జ్మెంట్తో సరిపెట్టారు. గత నెల 27న అత్తిలి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కూటమి మూకలు నిర్భంధించి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎంపీటీసీ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీలులేకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి మూసివేశారు. దమ్ముంటే తమను దాటి వెళ్లమంటూ అరుపులు, కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. ఒకానొక దశలో కారుమూరి ఇంటి గేటును నెట్టుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. గొడవలు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కూటమి మూకలు చేసిన దౌర్జన్యకాండకు సంబంధించిన వీడియోలు, సీసీ టీవీ పుటేజీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలమయ్యాయి. ఎన్నిక వాయిదా పడిన మరుసటి రోజు సైతం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే రోడ్లన్నింటిని బ్లాక్ చేసి వైఎస్సార్సీపీ సభ్యులు ఉన్నారేమోనని వాహనాలను తనిఖీలు చేయడం సంచలనమైంది. ప్రశాంతతకు నిలయమైన అత్తిలిలో ఇలాంటి ఘటనలు ముందెప్పుడూ చూడలేదంటూ స్థానికులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లరి మూకలు పెట్రేగిపోయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ సభ్యులకు రక్షణ కల్పించాలని స్వయంగా మాజీ మంత్రి కారుమూరి తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ ప్రేమరాజు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. వారం రోజులైన కేసు లేదు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అనుచరులు సాగించిన దౌర్జన్యంపై అదే రోజున మాజీ మంత్రి కారుమూరి అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన అనుచరులు మారణాయుధాలతో తన ఇంటిపై దాడికి తెగబడ్డారని, మహిళ ఎంపీటీసీ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తమ సభ్యులు ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి సంబంధించి సీసీ పుటేజీ, మీడియా కవరేజీ వివరాలను పెన్‌డ్రైవ్‌లో పెట్టి పోలీసులకు అందజేశారు. వారం రోజులు కావస్తున్నా చర్యలు తీసుకోకుండా జిల్లా పోలీసులు కాలయాపన చేస్తుండటంపై కారుమూరి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు తమకు ఫిర్యాదు అందినట్టుగా మంగళవారం రాత్రి అత్తిలి పోలీసులు రసీదు అందజేశారు. కేసు విషయమై అత్తిలి ఎస్ఐ పి.ప్రేమరాజు వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి అనుచరుల అరాచకం మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కారుమూరి వారం రోజులు కావస్తున్నా కేసు నమోదుకు మీనమేషాలు -
ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలి
కాళ్ల: కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పశువుల చెరువు పూడికతీత పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి మస్తర్ రికార్డులను పరిశీలించారు. 3,307 పనిదినాలు అంచనాతో రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో సుమారు రూ.10 లక్షలతో చేపట్టిన పనులు పారదర్శకంగా జరగాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జి.స్వాతి, ఏపీఓ కె.శ్రీనివాసరావు, సర్పంచ్ గుడ్ల మధుసూదనరావు, టెక్నికల్ అసిస్టెంట్ వీవీ మణికంఠ, ఫీల్డ్ అసిస్టెంట్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఏలూరు (మెట్రో): మారుతున్న కాలానికనుగుణంగా వస్తున్న శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో అమలు చేయడం ద్వారా అధిక దిగుబడులను సాధించాలని ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ అన్నారు. ఏలూరులోని ఏరువాక కేంద్రంలో మార్టేరు వ్యవసాయ పరిధిశోధనా స్థానం సహ సంచాలకులు డా. టి.శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. జి.శివనారాయణ మాట్లాడుతూ సార్వా, దాళ్వా పంటకాలానికిగాను ఏరువాక కేంద్రం, వ్యవసాయ శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి మునుపు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏరువాక కేంద్రంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం, రెండు మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ భాషా, ఏరువాక కేంద్రం, ఏలూరు సమన్వయ కర్త డా. కె.ఫణికుమార్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డా.సీహెచ్. శ్రీనివాసు, మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. కె.మోహనరావు, ఏరువాక కేంద్రం, ఏలూరు శాస్త్రవేత్త ఎన్.నాగేంద్ర బాబు, రైతు శిక్షణా కేంద్రం ఏడీఏ లలిత సుధ, సెరికల్చర్ అధికారి శ్రీనివాస్, మత్స్య శాఖ అధికారి రాజకుమార్, ఏలూరు ఉద్యాన అధికారి కరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 21 నెలలు అయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఆందోళన నెలకొందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా దీని ఊసే లేకపోవడం శోచనీయమన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2004, సెప్టెంబరు 1 నాటికన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్‌తో నియామకమైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఇచ్చినా రాష్ట్రంలో ఇప్పటికీ అమలు చేయని పరిస్థితి కొనసాగడం బాధాకరమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏను 90 శాతం నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. పెండింగ్ ఉందన్నారు. ఇంకా మూడు డీఏలను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందన్నారు. సీపీఎస్, జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జి.మోహానరావు, కార్యదర్శి ఎం.ఆదినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.మనోజ్, జేఏసీ కన్వీనర్ నెరుసు రామారావు, డిప్యూటీ సెక్రటరీ ఎం.శామ్యూల్, కోశాధికారి ఎస్డి జిలానీ తదితరులు పాల్గొన్నారు. -
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుముప్పు తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. రాళ్లకుంటలోని సెయింట్ గ్జేవీయార్ పాఠశాలకు చెందిన జామాయిల్ తోటను కొద్దిరోజుల క్రితం నరికివేశారు. కలపను తరలించగా, మిగిలిన తుక్కు మొత్తం అక్కడే ఉంది. గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా ఆ తుక్కుకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు, చుట్టుపక్కలకు వ్యాపించాయి. దాంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక ఎస్సై జి.నాగరాజు సిబ్బందితో కలసి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన సిగిరెట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8లో uవిజయవంతంగా ఈఎండీపీ ఎక్స్పో ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, సమగ్ర శిక్షా సంయుక్త అధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం ఈఎండీపీ 2024–25 జిల్లాలోని 40 పాఠశాలల్లో అమలు చేశారు. ఇందుకు సంబంధించిన సెషన్ పూర్తయిన అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లు ఆన్‌న్‌లైన్ ద్వారా స్వీకరించి వాటి నుంచి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. జిల్లా స్థాయి ఎక్స్పోని స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసారు. రెండు ప్రాజెక్టులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందచేశారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్, జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారి రెడ్డి రామారావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ సోమయాజులు ప్రాజెక్టులను పరిశీలించారు. రాచూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సౌర విద్యుత్ వినియోగం ప్రయోజనం, బొర్రంపాలెం విద్యార్థులు రూపొందించిన సాంకేతిక పరిష్కారాలు– రోబో పాత్ర ప్రాజెక్టులు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. తణుకులో ఐటీ దాడులు తణుకు అర్బన్: ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం తణుకులో ఇద్దరు వ్యాపారులపై దాడులు చేశారు. తణుకు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాటూరి లక్ష్మణరావుతోపాటు తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఎన్.దుర్గాప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో ఇద్దరి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. -
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలు బుధవారం నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 167 మందికి 157 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగిన పరీక్షకు 143 మందికి 127 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో.. భీమవరం: భీమవరంలో బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని డీఎన్నార్ కళాశాలలో ఉదయం షిప్ట్‌లో 100 మందికి 93 మంది, మధ్యాహ్నం షిప్ట్‌లో 100 మందికి 95 మంది హాజరయ్యారని పరీక్షల పర్యవేక్షకుడు సూర్యనారాయణమూర్తి చెప్పారు. 9న ఉండిలో ఆక్వా రైతుల సమావేశం భీమవరం: ఆక్వా సమస్యలపై చర్చించడానికి ఈ నెల 9న అప్సడా, ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటుచేసినట్లు జిల్లా ఫ్రాన్స్ఫార్మర్స్ వెల్పేర్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.గజపతిరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు చెప్పారు. బుధవారం భీమవరంలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఆక్వా రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సివుందన్నారు. 9వ తేది ఉదయం 10 గంటలకు ఉండి గ్రామంలోని కోట్ల ఫంక్షన్హాల్లో నిర్వహించే సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నందున ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం ధర్నా భీమవరం: పేదల ఇళ్లస్థలాలకు సంబంధించి ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, డీఆర్ఓకు ఆర్జీలు సమర్పించారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడిచిపోయినా హామీలను అమలు చేయలేదన్నారు. సత్వరమే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్‌ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తమరాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి భీమవరం: మున్సిపాలిటీల ద్వారా ప్రజలకు అందించే సేవల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశించిన కార్మికుకు చేదు అనుభవం ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేవలను ప్రైవేటుపరం చేస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి వినతి పత్రం అందజేశారు. -
మెట్ట.. నీటికి కటకట!
చింతలపూడి: భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముంది. చెరువులు ఎండిపోయే దశకు చేరుకోగా బోర్లు, బావులు ఇప్పటికే అడుగంటిపోయాయి. ఈ పరిస్థితుల్లో మెటప్రాంత ప్రజానీకం తాగు, సాగునీటికి తహతహలాడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆంధ్రా కాల్వ ఎండిపోయింది. ఎర్రకాల్వలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. నియోజకవర్గంలో ఉన్న 450కి పైగా చెరువులు, కుంటలు ఏటా మేనెల వచ్చేసరికి నీరు ఇంకిపోతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే చెరువులు వట్టి పోయే ప్రమాదం ఏర్పడింది. చెరువుల ఆక్రమణతో ఈ దుస్థితి గత ఏడాది డిసెంబర్ నెల నుంచి వర్షాలు పడకపోవడం, చెరువులు ఎండిపోవడానికి ఒక కారణమైతే, రైతులు దాళ్వా పంటలు వేయడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్‌లో ఈ ఏడాది 8,228 ఎకరాల్లో రైతులు రబీ వరి సాగు చేపట్టారు. వీటికి తోడు చెరువుల ఆక్రమణలు కారణంగా కూడా నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తుండటంతో ఆక్రమణలతో చెరువులు హరించుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. చెరువుల్లో నీరు ఎండిపోతుండటంతో పశువులకు తాగునీరు ఎలా అన్నదే ప్రస్తుతం రైతులను పట్టిపీడిస్తున్న సమస్య. మెట్టకు శాశ్వత సాగునీటి వసతి లేకపోవడం, కేవలం వర్షాలపైనే ఆధారపడ్డ చెరువులవల్ల ప్రతి ఏటా మనకు ఈ దుస్థితి ఏర్పడుతోందని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. ఎండిన ఆంధ్రా, ఎర్ర కాలువలు వట్టిపోతున్న బోర్లు.. అడుగంటిన బావులు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి చెరువుల్లో నీరు ఎండిపోవడంతో ప్రభుత్వం పశువుల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువుల సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి కలిగించాలి. ఉపాధిహామీ నిధులతో చెరువుల పూడికను పూర్తిస్థాయిలో తీయిస్తే వర్షాకాలంలో చెరువుల్లో నీరు నిల్వ చేసుకోవచ్చు. – దొంతా కృష్ణ, రైతు సంఘం నాయకుడు, రేచర్ల గోదావరి జలాలను మళ్లించాలి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను మళ్లించాలి. తద్వారా రైతులకు శాశ్వత సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి. – ఎస్కే కాలేష, రైతు సంఘం నాయకుడు, చింతలపూడి -
పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అసత్య ప్రచారం
తణుకు అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తణుకులో శాంతి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా నరేంద్ర సెంటర్‌కు చేరుకుని ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించారు. క్రిస్టియన్ కౌన్సిల్ నాయకుడు ఒ.మనోజ్బాబ్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతికి క్రైస్తవ లోకం బాధపడుతుంటే మద్యం కొనుగోలు చేశారని, మద్యం సేవించి ప్రయాణించారని సామాజిక మాధ్యమాల్లో చూపిస్తూ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా టీవీ 5 మూర్తి క్రైస్తవ లోకాన్ని హేళన చేసేలా దశమ భాగాలు తీసుకునే పాస్టర్లు, పనిమనుషుల నుంచి డబ్బులు తీసుకునే పాస్టర్లు అని సంబోధిస్తూ వ్యంగంగా మాట్లాడడాన్ని క్రైస్తవ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్‌లో డ్రగ్స్ దొరికినప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండానే నిందలు వేశారని, తిరుపతి లడ్డూలో పశువుల కొవ్వు ఉందని ఎటువంటి ఆధారాలు లేకుండానే నిందలు వేసి సున్నితమైన అంశాలను వివాదాస్పదం చేస్తుంది ఎవరని నిలదీశారు. ప్రవీణ్ మృతి ఘటనను సీఐడీతో దర్యాప్తు చేయించాలన్నారు. ర్యాలీలో పాస్టర్లు ఎం.హారత్బాబు, పీడీ ప్రసన్నకుమార్, ఎన్.ఇజ్రాయేలు, కె.దానియేలు, యు.రాజ్‌కుమార్, బి.జేమ్స్, కె.బ్లెస్సింగ్ రాజు, భారీ సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. తణుకులో క్రైస్తవ సంఘాల శాంతి ర్యాలీ -
మామిడి పండుగ.. ఉత్సాహంగా..
బుట్టాయగూడెం: మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి లయబద్ధంగా డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న మామిడికాయ, బాట పండుగ, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని కొండరెడ్డి గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాది వేసవికాలంలో తాము జరుపుకునే పండుగకు సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం గ్రామస్తులందరూ చందాలుగా వేసుకోవడంతోపాటు కొంతసొమ్ము ప్రజల నుంచి వసూలు చేసి వాటితో పండుగ జరుపుకుంటున్నామని కొండరెడ్డి గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ పంటలను గుర్తించి ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. గిరిజన సంప్రదాయ పండుగలను ప్రభుత్వం గుర్తించాలంటున్న కొండరెడ్లు -
బంధువునని నమ్మించి దోపిడీ
భీమవరం: దూరపు బంధువునని నమ్మించాడు. అదును చూసి దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఆనక పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం వన్‌టౌన్‌పోలీసు స్టేషన్లో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన 23 ఏళ్ల పి విట్టర్పాల్ తాపీ పనిచేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో మార్చి 28వ తేదీన పట్టణంలోని బేతనిపేట అమ్మిరాజుతోటలోని యర్రంశెట్టి మంగతాయారు ఇంటికి వెళ్లి తాను వారికి దూరపుబంధువునని నమ్మించాడు. ఇళ్లు అద్దెకు కావాలని ఇళ్లు చూడడానికి ఇంకా తనవాళ్లు వస్తున్నారంటూ వృద్ధులతో కబుర్లుచెప్పసాగాడు. మూడు గంటల సమయం గడిచిపోవడంతో మంగతాయారు భర్త వీరాస్వామినాయుడు బయటకు వెళ్లడంతో విట్టర్పాల్ ఒక్కసారిగా మంగతాయారుపై చాకుతో దాడిచేసి ఆమె మెడలోని సుమారు రూ.5 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు గొలుసు, మంగళసూత్రాలు, నల్లపూసలతాడు అపహరించుకుపోయాడు. గాయాలైన మంగతాయారును ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐ ఎం.నాగరాజు, సీసీఎస్ సీఐ డి రాంబాబు, ఎస్సైలు బీవై కిరణ్‌కుమార్, ఎం రవివర్మ సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితుడు విట్టర్పాల్ను సోమవారం పట్టణంలోని బ్రిడ్జిపేట వంతెన వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. త్వరితగతిన కేసును ఛేదించడంలో కృషిచేసిన అధికారులను అభినందించి, సిబ్బందికి రివార్డులను అందించారు. రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాల అపహరణ పోలీసులకు చిక్కిన నిందితుడు -
కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమమే
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలు వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే చలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. ఏలూరు అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపినా కొనుగోలు, ధర సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పినా ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. రోజురోజుకీ ధర తగ్గించి వేస్తున్నాయని, కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడుకు ప్రతినిధి బృందం మార్చి 29న వినతి పత్రం అందజేయగా రెండు, మూడు రోజుల్లో కంపెనీలతో మీటింగ్ జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం కిలోకు రూ.700కు పైగా ధర ఉందని ప్రస్తుతం కంపెనీలు రూ.500 నుంచి రూ.550కు ధర ఇస్తున్నాయని, ఈ ధర మరింత తగ్గిస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు. న్యాయం జరిగే వరకూ కోకో రైతులు ఐక్యంగా పోరాడతారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ళ సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్, గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీ బాబు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్
కుక్కునూరు: లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. కుక్కునూరు పీహెచ్సీలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్న కొమరం ముత్యాలమ్మపై గొడ్ల అజిత్‌కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు అజిత్‌కుమార్‌ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి కై కలూరు: విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న భవ్య న్యూస్ ఎడిటర్ కురేళ్ళ కిషోర్‌పై దాడి చేసిన కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు దళిత సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. ప్రముఖ దళిత నాయకుడు మత్తె సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి ర్యాలీగా సీఐ కార్యాలయానికి వెళ్లారు. దాడి ఘటనపై తక్షణ కేసు నమోదు చేయాలని రూరల్ సీఐ వి.రవికుమార్‌ను కోరారు. అనంతరం విలేకరులతో సూర్యచంద్రరావు మాట్లాడుతూ మార్చి 26న భుజబలపట్నంలో వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో జరిగిన ఘర్షణ ఫొటోలను తీస్తున్న పాత్రికేయుడు కురేళ్ళ కిషోర్‌పై కూటమి నేతలు దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత ప్రజా సమితి నియోజకవర్గ అధ్యక్షుడు మత్తె రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ మద్దా ప్రేమ్‌కుమార్, దళిత నాయకులు పాతపాటి శాంతరాజు, గాలి ప్రసాద్, బోడిగంటి కిషోర్, బండి ప్రసాద్, సోమల శ్యామ్‌సుందర్, రత్నరాజు, దాసరి ప్రసాద్, రాజు, గోపవరం దళిత యువత హాజరయ్యారు. వ్యక్తిపై హత్యాయత్నం ఉంగుటూరు: వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన మంగళవారం రాత్రి ఉంగుటూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఉంగుటూరు దళిత పేటకుచెందిన యర్రారపు రాజు భార్యతో అదేపేటకు చెందిన మార్లపూడి ప్రసాదు వివాహేతర సంబంధం కలిగి ఉండటంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండుసార్లు పెద్దల సమక్షంలో పెట్టగా గొడవను సద్దుమణిగేలా చేశారు. కాగా మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బైక్‌పై నారాయణపురం వైపు వెళుతున్న ప్రసాద్‌పై రాజు గొడ్డలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయమైన ప్రసాద్‌ను తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5న వీఆర్ఏల రాష్ట్ర సదస్సు భీమవరం: విజయవాడ ఎంబీ భవన్లో ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సదస్సుకు అన్ని మండలాల నుంచి వీఆర్ఏలు హాజరై జయప్రదం చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వీఆర్ఏలు విడిపోయారనే పేరుతో ప్రభుత్వం దోబూచులాడుతుందని, అందరూ కలిసి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్ లేదనే పేరుతో జీతాల బిల్లు పెట్టకపోవడం దారుణమన్నారు. -
ఆప్కాస్ రద్దును విరమించుకోవాలి
ఏలూరు(టూటౌన్): ఆప్కాస్‌ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్న ఆప్కాస్‌ను రద్దుచేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే వెట్టిచాకిరిలోకి, బానిసత్వంలోకి నెట్టి వేయడమేనని విమర్శించారు. ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తే పిఎఫ్, ఈఎస్‌ఐలకు, కనీస వేతనాలకు గ్యారెంటీ ఉండదని ఆందోళన వ్యక్తి చేశారు. గత ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. ఎక్స్‌గ్రేషియా పెంచడం, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం, ఇంజనీరింగ్ కార్మికులకు 36 నెంబర్ జీవో ప్రకారం జీతాలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20 వేలకు పెంచడం వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆందోళన చేపట్టడానికి మున్సిపల్ కార్మికులు సన్నద్ధంగా ఉన్నరన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య, లావేటి కృష్ణారావు, అంగుళూరు జానుబాబు, బంగారు వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. -
ఈ శ్రమ్ పోర్టల్‌పై వర్కర్లకు అవగాహన
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు తప్పనిసరిగా ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని ఓ హోటల్లో గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు, హోటల్ యాజమాన్యానికి ఈ–శ్రమ్ పోర్టల్ గురించి మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల నందు సుమారు 800 మంది వరకు గిగ్, ఫ్లాట్ ఫారం వర్కర్లు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, రాపిడ్ వంటి వాటిలో పనిచేసేవారు ఉన్నారన్నారు. వీరందరినీ ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వర్కర్లు ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ కలిగి ఉండాలన్నారు. కార్మికుల వయసు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, సీఎస్సీ సెంటర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చునని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు. -
గిరిజన పండుగలను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించి ఐటీడీఏ ద్వారా ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాం. – కొక్కెర భీమరాజు, అలివేరు, బుట్టాయగూడెం మండలం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం మా పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తున్న మామిడికాయ పండుగను సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మామిడి చెట్టుకు పూజలు చేసిన తర్వాతే ఆ ఫలాలను తింటాం. అప్పటి వరకూ ఎవ్వరూ ముట్టుకోం. ఎవరు ముట్టుకున్నా వారికి జరిమానా విధించడం జరుగుతుంది. – సర్ల బుల్లెమ్మ, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
పింఛన్.. ప్రతినెలా టెన్షన్
వైఎస్ జగన్ పాలనలో వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా తలుపు తట్టి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్లేవారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము కూడా ఇంటికే పింఛన్ అందిస్తున్నామని చెబుతున్నా ఆ దిశగా సరైన చర్యలు తీసుకోకపోవడంతో పింఛన్ లబ్ధిదారులకు అగచాట్లు తప్పడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ సొమ్ముల కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కొన్ని సచివాలయాలు తాళాలు వేసి ఉండడం, కొన్నిచోట్ల సచివాలయాల్లో సిబ్బంది ఉండకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి తలెత్తింది. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
పింఛన్లపై అన్నీ కోతలే
● ఎన్నికల హామీలన్నీ గాలి మాటలే.. ● 9 నెలల కాలంలో వేలల్లో తొలగింపు ● కొత్తవి ఒక్కటీ మంజూరు చేయని కూటమి సర్కారు ఏలూరు(మెట్రో): మేం అధికారంలోకి వస్తే 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్లు ఇస్తాం. బీసీల్లో 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందిస్తాం. ఒక్క పెన్షన్ కూడా తొలగించకుండా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ చెప్పిన మాటలు. ప్రజలకు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు. గద్దెనెక్కాక పెన్షన్‌దారులకు చుక్కలు చూపిస్తున్న కూటమి సర్కారు అడ్డగోలుగా పెన్షన్లు తొలగిస్తూ, దివ్యాంగులు, వృద్ధులను ఇబ్బంది పెడుతోంది. మరణాల వల్ల పెన్షన్లు తగ్గుతున్నాయని చెబుతూ తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో పండుగే.. గతంలో నెలలో ఒకటో తేదీ వచ్చిందంటే వృద్ధులు, వికలాంగులు , వితంతువులకు పండుగ వాతావరణం ఉండేది. వేకువజామునే పింఛన్‌దారుల తలుపు తట్టి ఇంటి వద్దే పెన్షన్ అందించేందుకు గత వైఎస్సార్సీపీ సర్కారు చర్యలు తీసుకుంది. గతంలో బాధలు పునరావృతం కాకుండా కమ్యూనిటీ హాళ్ల వద్ద పండుటాకులు పడిగాపులు పడకుండా.. ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టింది. గత ఎన్నికల్లో పింఛన్లు పెంచుతాం, అర్హతలు, నిబంధనల్లో వెసులుబాటు కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఉన్న పెన్షన్లు సైతం తొలగించేందుకు చర్యలు చేపట్టారు. కూటమి సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచి ప్రతీ నెలా పెన్షన్లు తొలగిస్తూ వస్తున్నారు. తొలగించిన పెన్షన్లన్నీ మరణించిన వారివే అని అధికారులతో ప్రకటనలు చేయిస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎక్కడ? వాస్తవానికి పింఛన్లు అర కొర తగ్గించినా, కొత్త పింఛన్లు వచ్చి చేరుతూనే ఉంటాయి. ప్రతీ సంవత్సరం నూతన పింఛన్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి సంవత్సరంలో రెండుసార్లు నూతన పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పెన్షన్‌ను కొత్తగా మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు 45 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తానని, అదే విధంగా బీసీలకు 50 ఏళ్లు పైబడితే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. వీటిపై నేటికీ కూటమి నాయకులు నోరు మెదపలేదు. మరణాల వల్ల పింఛన్ల సంఖ్య తగ్గిందని చెబుతున్నా, మరణించిన వారి స్థానంలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన పాపాన పోలేదు. -
● బొప్పాయి.. బడాయి
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం అలివేరులో నడపల శ్రీరాములు ఇంటి ఆవరణలో ఉన్న ఈ బొప్పాయి చెట్టు ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంది. సాధారణంగా బొప్పాయి చెట్టు నిటారుగా పెరిగి ఫలాలను అందిస్తుండగా ఈ బొప్పాయి చెట్టు మాత్రం తన దిశను మార్చుకుని 14 కొమ్మలతో విభిన్నంగా ఉండటం గమనార్హం. ఈ కొమ్మలకు మొత్తం 16 కాయలు ఉన్నాయి. మరో విశేషమేమిటంటే కొన్ని కొమ్మలకు కాయలు ఉన్నా.. ఆకులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ బొప్పాయి చెట్టును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – బుట్టాయగూడెం -
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకుంటే ఉద్యమాలు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషాద్ మొహిద్దీన్ హెచ్చరించారు. పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తన మిత్ర పక్షాలతో కలిసి కుట్ర చేసి లక్షలాది, కోట్ల రూపాయలు విలువైన వక్ఫ్ భూములను స్థానిక అధికారులకు కట్టబెట్టే విధంగా చూస్తూ, ఓ మతాన్ని నష్టపరిచడం చాలా అన్యాయం అన్నారు. పార్లమెంట్లో బిల్లుకు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం ముస్లింలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ముస్లిం హక్కులను కాపాడుతానని చెప్పి, ఇప్పుడు ముస్లింల విశ్వాసానికి వ్యతిరేకంగా వ్యహరించడం శోచనీయం అని అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించడం హర్షం వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించాలని కోరారు. -
ఇంటర్ పుస్తకాల పంపిణీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను జిల్లాలోని వివిధ కళాశాలలకు పంపిణీ చేశారు. మంగళవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆయా కళాశాలలకు వివిధ వాహనాల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది ప్రస్తుతం అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలలకు 67,800 నోటు పుస్తకాలు వచ్చాయని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాను తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 5751 టెక్ట్స్ పుస్తకాలు వచ్చాయని, వాటిని కూడా ఆయా కళాశాలలకు తరలించామని తెలిపారు. ముగిసిన పదో తరగతి పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 22,413 మంది హాజరయ్యారు. 22,704 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,244 మంది హాజరు కాగా ఒకసారి అనుత్తీర్ణులైన వారిలో 295 మంది విద్యార్థులకు 169 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా పరిశీలకుడు 4 కేంద్రాల్లో, జిల్లా విద్యాశాఖాధికారి 4 కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ 3 కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 29 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. కూల్‌డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ డిపోలో తనిఖీలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ డిపోలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గడువు దాటిన కూల్డ్రింకులు దుకాణాలకు పంపిణీ చేస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ రామరాజు స్థానిక నరసింహరావు పేటలోని జమ్ ఎంటర్ప్రైజెస్ కోకాకోలా సేల్స్ డిపోలో ఫిర్యాదుదారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులకు గడువు తేదీ ముగిసిన డ్రింకులు ఏమీ లభ్యం కాలేదు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కల్తీ విషయంలో ఎలాంటి ఫిర్యాదులందినా వెంటనే తనిఖీలు చేస్తామని, కల్తీ జరిగినట్టు గుర్తిస్తే సంబంధిత పదార్థాల సాంపిళ్ళు ల్యాబ్‌లకు పంపి పరీక్షిస్తామన్నారు. కల్తీ జరిగిటన్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో చేరికకు 25న ప్రవేశ పరీక్ష టి.నరసాపురం: జిల్లాలోని గురుకుల పాఠశాలలు అప్పలరాజుగూడెం(బాలురు), నాగిరెడ్డిగూడెం (బాలికలు), ముసునూరు (బాలికలు)లో 5, 6, 7, 8 తరగతులలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అప్పలగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డీఎస్బీ శంకరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవా కేంద్రం ద్వారా వెబ్సైట్లో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందన్నారు. వివరాలకు 87126 25030 నెంబరులో సంప్రదించాలన్నారు. ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దూబచర్ల డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను ఎఫ్ఎస్టీసీ విధానంలో భర్తీ చేసే నిమిత్తం అర్హత, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని యాజమాన్యాల్లోని(ప్రభుత్వ/ జిల్లా పరిషత్/ మున్సిపల్) పాఠశాలల్లో పని చేస్తున్న మండల విద్యాశాఖాధికారులు/ ప్రధానోపాధ్యాయులు/ స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలు డీఈఓ ఏలూరు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. -
నిరుద్యోగులను నిండా ముంచారు
ఏలూరు (టూటౌన్): ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంతవరకూ నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటన చేస్తామని చెప్పి.. 10 నెలలైనా ఉలుకూ పలుకూ లేదు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే యోచనపై కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మండిపడుతున్నారు. జిల్లాలో 1.50 లక్షలకు పైగా నిరుద్యోగులు నిరుద్యోగ యువతకు ప్రతీ నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. కూటమి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని డప్పాలు కొట్టిన నాయకులు ప్రస్తుతం దాని ఊసే ఎత్తక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లాలో 16.50 లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. వీరిలో 8 నుంచి 10 శాతం నిరుద్యోగ యువత ఉన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 1.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పిస్తుందనే ఆశలో ఉన్నారు. లేని పక్షంలో ప్రతీ నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు చొప్పున అందిస్తుందని ఓటు వేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకనట చేయలేదు. అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్‌లో భాగంగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలును కొండెక్కించడం పట్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అవకాశం వస్తే తమ సత్తా చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే డీఎస్సీ అభ్యర్థుల కంటి నీరు తుడిచేలా డీఎస్సీ ప్రకటన చేశారు. 10 నెలలు కావస్తున్నా దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పాలకులు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులైన తమను మోసం చేసారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆట లాడుకోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహాం గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆప్కాస్ విధానం రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉండటం పట్ల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు, సంస్థలు, వ్యక్తులు లేకుండా ఆప్కాస్ ద్వారా నేరుగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం, పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాలలో తమ వాటాను జమ చేయడం వంటి వాటి వల్ల సుమారు 10 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. ఆప్కాస్ రద్దు చేసి మళ్లీ పాత విధానాన్ని ప్రవేశపెడితే తమకు కష్టాలు తప్పవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు మెగా డీఎస్సీ దగా డీఎస్సీనే.. ఆప్కాస్ రద్దు యోచనపై అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది ? ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. తొలగించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి నెలకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలి. – జి.సూర్యకిరణ్, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ సూపర్ సిక్స్ అమలులో విఫలం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పేరుతో వేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదు. తక్షణం మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. – కే.లెనిన్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ, ఏలూరు జిల్లా -
ప్రభువు మార్గం అనుసరణీయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏసుక్రీస్తు మార్గంలో ప్రతి క్రైస్తవుడూ పయనించిన నాడే శాంతి, స మాధానాలు లభిస్తాయని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు అన్నారు. స్థానిక గ్జేవియర్ నగర్లో ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్, నిర్మలగిరి పుణ్యక్షేత్ర అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్లే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సో మవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడు తూ పొరుగువారిని ప్రేమతో ఆదరించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అ మలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఇంజమాల మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయ రావు విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తొలుత కేక్ కట్ చేసి మహోత్సవాన్ని నిర్వహించారు. మేత్రాసనం ప్రొక్యూరేటర్ ఫా దర్ బి.రాజు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర విచారణ గురువు జాన్ పీటర్, నాగేశ్వరరావు బిషప్ జయరావును గజమాలతో స న్మానించారు. కళ్లే లలిత ట్రస్ట్ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం ఏసీ, రెండు వాటర్ రిఫ్రిజిరేటర్లను అందజేశారు. -
వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు తగదు
కొయ్యలగూడెం: వక్ఫ్ బోర్డు రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు కన్నాపురంలో సోమ వారం రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మతపరమైన రాద్ధాంతాన్ని ఖండించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకడం అన్యాయమని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డుతో పేద ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందని, అటువంటి బిల్లు రద్దు చేయడం ముస్లింలను తీవ్రంగా అన్యాయానికి గురిచేస్తుందని అన్నారు. వక్ఫ్ బోర్డు రద్దు ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి కేంద్రంలోని బీజేపీని లొంగదీయాలని కోరా రు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. మెయిన్ సెంటర్లో రాస్తారోకో చేసి కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరంలో ర్యాలీలు నిర్వహించారు.ట్రైనీ డాక్టర్ అంజలికి న్యాయం చేయాలిబుట్టాయగూడెం : రాజమండ్రి బొల్లినేని ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న ట్రైనీ డాక్టర్ అంజలికి న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జీలుగుమిల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నా యకురాలు ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు ముత్యాలమ్మ, సుధారాణి, వెంకటలక్ష్మి, బుల్లెమ్మ, సీతారామయ్య, బి.రాంబాబు, సీహెచ్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా ఓటేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం ఏలూరు తంగెళ్ళమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ జెండా చేపట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుంచి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్, ఎండీ ఇలియాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. ముస్లింల వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి బోర్డుల్లో ముస్లింలకు కూడా స్థానం కల్పిస్తారా అని నిలదీశారు. ఎవరికి కేటాయించిన సంస్థల్లో వారు ఉంటే ఆ సంస్థలకు, దేశానికి కూడా మేలు జరుగుతుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపాలన్నారు. కూటమి ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమిలో ఉన్న పార్టీలు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని భావించి భవిష్యత్తులో తగిన బుద్ధి కలిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ నాయకుడు ఎండీ ముజాహిద్, అహలెసున్నత్వల్ జమాత్ నాయకుడు ఎస్కే పాషా, అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం ప్రతినిధులు, ముస్లింలు పాల్గొన్నారు. -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి
భీమవరం అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేయాలని పాస్టర్లు వర్థనపు లాబాను, ప్రసన్నకుమార్, డెలిగేట్లు టి.విజయబాబు, బి.భాగ్యానందం, బి.సునీల్, పి.చిట్టిబాబు డిమాండ్ చేశారు. భీమవరం మండలంలోని వెంపలో పెదపేటలో అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రజలు అనేక అనుమానాలతో ఉన్నారని ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. రాష్ట్ర వాప్తంగా దళితులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులను అరికట్టాలన్నారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్ శాంతి ర్యాలీకి మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఇంజేటి జయమణి, ప్రభాకర్‌రావు, బల్ల సుబ్బారావు, కడిమి పౌల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో.. పెంటపాడు: పాస్టర్ పగడాల అకస్మిక మృతిపై ప్రభుత్వం తక్షణం న్యాయ విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని గూడెం క్రైస్తవ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం గూడెంలోని పలు డినామినేషన్లకు చెందిన క్రైస్తవులు, దైవసేవకులు, మ్యూజిక్ టీం సభ్యులు, క్రైస్తవ గాయకులు గూడెం క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ నిజాలు నిగ్గు తేల్చి తక్షణం దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్రైస్తవులపై ఇటీవల దాడులు పెరిగిపోయాయనడానికి ఈ ఉదంతమే కారణమన్నారు. శిలువ శ్రమల 40 దినాలలో ఉన్న క్రైస్తవ బోధకులు, విశ్వాసులు అహర్నిశం దేశం కోసం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మానుకొండ డల్లా, మరనాత ఎలీషా, పాస్టర్ రవికుమార్, శామ్యూల్ మాస్టార్, బేబీ సరోజిని, లాల్ నెహ్రూ, మెండెం జేమ్సు, పాస్టర్ వినోద్, టైటస్, ప్రసాద్, పాస్టర్ ఎజ్రా శాస్త్రి, దినకరన్, కరుణమ్మ, రాజబాబు, లూక్సన్, శ్యాంబాబు పాల్గొన్నారు. -
డాక్టర్ జగదీష్‌కు అవార్డు
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్, తిరుమల తిరుపతి బర్డ్ ఆస్పత్రుల మాజీ డైరెక్టర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ శ్రీవిశ్వవైద్య దివ్యాంగ బంధుశ్రీ అవార్డును అందుకున్నారు. మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో ఆదివారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి నవీన్ రామ్‌గులామ్ డాక్టర్ జగదీష్‌కు అవార్డును అందజేశారు. వైద్య రంగంలో జగదీష్ చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. జగదీష్ సోమవారం ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజిక – సాంస్కృతిక సంస్థ అయిన మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు ప్రజల వారసత్వం, సంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి వేదికై ందన్నారు. వికలాంగుల పునరావాసం, సమాజ సేవకు అంకితమవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనేక దేశాల్లో ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపులు నిర్వహించి సేవలను విస్తరించామని చెప్పారు. ఇంతవరకు అనేక దేశాల్లో క్యాంపులు నిర్వహించి, 1.83 లక్షలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి, దివ్యాంగుల అంగవైకల్యాన్ని రూపుమాపామన్నారు. -
కవిటం బాలలకు భరతనాట్యం అవార్డు
పోడూరు: ఉగాది మహోత్సవంలో భాగంగా రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో సోమవారం బాలలకు నిర్వహించిన భారతీయ నృత్యోత్సవం–2025లో కవిటం గ్రామానికి రేమెళ్ల మనోజ్ఞ, ఇళ్ల జాహ్నవి, సత్తి హరినాగశ్రీ, వీరవల్లి యశిస్విని భరతనాట్యంలో అద్భుత ప్రదర్శన చేసి ఆహుతులను మెప్పించారు. నృత్యప్రదర్శన చేసిన కవిటం బాలికలకు నిర్వాహకులు నర్తన వసంత కుసుమం అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నృత్యప్రదర్శన చేసిన మనోజ్ఞ, జాహ్నవి, హరి నాగశ్రీ, యశస్విని, పెనుగొండకు చెందిన శ్రీ వెంకటేశ్వర నృత్య నాట్య కళాశాలకు చెందిన నాట్యాచార్యులు కె.వినయ్కృష్ణను కవిటం గ్రామ ప్రముఖులు అభినందించారు. -
వర్మ మూవీస్ నూతన చిత్రం ప్రారంభం
జంగారెడ్డిగూడెం: శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నూతన చిత్రం పూజా కార్యక్రమం సోమవారం జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై జరిగింది. ఉదయం 10.10 గంటలకు ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ అనన్య చిత్రం మాదిరిగానే నూతన సినిమా విజవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ బి.ప్రసాద్‌రాజు స్వాగతం పలికి కొత్త సినిమా విశేషాలు తెలిపారు. కొత్త, పాత కలయికతో హరర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మ్యూజిక్ డైరక్టర్ సీఏ రాజ్‌కుమార్, ఎడిటింగ్ నందమూరి హరి అని మిగతా పేర్లు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. డెల్టా ప్రాంతానికి చెందిన ప్రముఖులు నాగిరెడ్డి సత్యనారాయణ, నంగిన పాండు రంగారావు అతిథులుగా హాజరై సినిమా విజయవంతం కావాలని కోరారు. కొట్లాటలో యువకుడి మృతి వీరవాసరం: జాతరలో జరిగిన కొట్లాటలో యువకుడు మృతిచెందాడు. నందమూరి గరువు కోట సత్తెమ్మ జాతరలో జరిగిన కొట్లాటలో గ్రామానికి చెందిన కాసాని రాజేష్(16)కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని వీరవాసరం ఎస్సై రవికుమార్ సోమవారం తెలిపారు. జాతరలో కోబ్రా డ్యాన్స్ జరుగుతుండగా కొండచిలువపై జనాలు పడిపోవడంతో కమిటీ సభ్యులు వెనుకకు గెంటారు. ఇదే సమయంలో వెనుక ఉన్న మృతుడు కాసాని రాజేష్‌పై పడడంతో కమిటీ సభ్యులకు రాజేష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో గ్రామానికి చెందిన మేకల సతీష్, మేకల రాహుల్ రాజేష్‌ను అడ్డగించి తీవ్రంగా గాయపరిచారు. వీరవాసరం పోలీసులకు సమాచారం అందడంతో వారు రాజేష్‌ను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై తెలిపారు. కాసాని ఈ ఘటనలో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. తన కుమారుడిని కావాలనే హత్య చేశారని తల్లి దుర్గ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 23 కేజీల పంచలోహ విగ్రహం బహూకరణ పాలకొల్లు సెంట్రల్: శ్రీ ముఖధారమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం దాతలు సింహాద్రి వీర బ్రహ్మం, భ్రమరాంబ దంపతులు అమ్మవారికి 23 కేజీలతో పంచలోహ ఉత్సవ విగ్రహం సమర్పించారు. ఉదయం సన్నాయి వాద్యాలతో విగ్రహాన్ని వీఽధిలో ఊరేగించిన తరువాత ఆలయానికి చేరుకుని పురోహితులు రవీంద్ర బ్రహ్మత్వంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులకు విగ్రహాన్ని అందజేశారు. ఉదయం ముఖధారమ్మకు చలివిడి, పానకం సమర్పించి పట్టణంలో ఉన్న అన్ని అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి చలివిడి పానకం సమర్పించారు. -
బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలతో కలిపి రూ.23 వేల కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గుగులోతు మోహన్‌రావు అన్నారు. ఈ బకాయిల చెల్లింపుకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి ఫ్యాప్టో సమావేశంలో చైర్మన్ మోహన్‌రావు మాట్లాడుతూ 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. సీపీఎస్, జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారిని పాత పింఛన్‌లోకి తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోని సైతం అమలు చేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ రెండో తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో చైర్మన్లు జీ వెంకటేశ్వరరావు, జీ ప్రకాశరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌లు ఎం.శామ్యూల్, ఈసీ సభ్యులు ముస్తఫా ఆలీ, కె.ఆర్.పవన్ కుమార్, ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ బీ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ ముహూర్తాలు ప్రారంభం
కొయ్యలగూడెం: పెళ్లికళ వచ్చేసిందే బాలా అంటూ వధూవరులు బంధుమిత్రులు వేడుకలు చేసుకునే సమయం వచ్చేసింది. ఏప్రిల్‌లో శుభలగ్నాలతో కూడిన తొమ్మిది పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. విశ్వావసు నామ సంవత్సర చైత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు మూఢం ఉందని చెబుతున్నారు. అనంతరం 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీలు ముహూర్తాలకు శుభప్రదమైనవి. ఈ నేపథ్యంలో కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కొన్ని ఆలయాల వద్ద నిర్మించిన కల్యాణ మండపాలలో ఏప్రిల్ ఆరు నుంచి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, అనంతరం ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. పురోహితులు అడ్వాన్స్ బుకింగ్ అవ్వగా, ఈవెంట్ బుకింగ్ మేనేజర్లు కల్యాణ ఏర్పాట్లకు సంబంధించి తల మునకలై ఉన్నారు. టిప్ టాప్ మొదలుకుని భాజా భజంత్రీలు.. కళ్యాణానికి సంబంధించిన వారు అందరూ తమ షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. సంవత్సరంలో ఒకే నెలలో ఇన్ని ముహూర్తాలు రావడం ఇదే మొదటిదని పండితులు అంటున్నారు. -
శ్రీనివాసుడిని తాకిన సూర్యకిరణాలు
ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుడి కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుడి అపాదమస్తకం స్ప్రుశించే శుభ సమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ఏటా చైత్ర మాసం ముందు, లేదా చైత్ర మాసం ప్రారంభం రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని పురాతన దేవాలయమైన, శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలోను లేని విధంగా ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్ఠత. ఆలయంలోని గర్భాలయంలోకి నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువును అర్చించి వెళతాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఇలా ఎన్ని ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వెళ్లి స్వామిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు, లేద చైత్ర మాసం ప్రారంభం రోజుల్లో, వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా శ్రీ వేంకటేశ్వర స్వామి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చిస్తాయి. ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన సూర్యకిరణాలు స్వామి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకిన అనంతరం, అవి రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఈ వింత ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ జరగడం విశేషమని అర్చకులు చెబుతున్నారు. ఏటా 3 రోజులు ఆవిష్కృతమవుతున్న అద్భుత దృశ్యాలు -
కోడి పందేల స్థావరాలపై దాడులు
ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్.జగన్నాథపురం, మలసానికుంట గ్రామాల్లో కోడి పందేల స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడి చేసి 19 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 49,200 నగదు, 4 కోడి పుంజులు, 5 కోడి కత్తులు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.15,800 నగదు, కోడి పుంజు, రెండు కోడి కత్తులు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. మలసానికుంటలో 11 మందిని అరెస్ట్ చేసి, రూ.33,400 నగదు, 3 కోడి పుంజులు, 3 కోడి కత్తులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ముదినేపల్లి మండలంలో.. ముదినేపల్లి రూరల్: మండలంలోని రెండు గ్రామాల్లో కోడిపందేలు ఆడుతున్న 9 మందిని ఎస్సై వీరభద్రరావు ఆదివారం అరెస్టు చేశారు. గురజ పంటకాలువ దగ్గర కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి నలుగురిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.3050 నగదు రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. కొరగుంటపాలెంలో కోడిపందేలు ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.4,200 నగదు కోడిపుంజు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంతో బంధువుల ఆందోళన కొట్టి చంపేశారు: కుటుంబ సభ్యులు తణుకు అర్బన్: మద్యం దుకాణ ఆవరణలో ఈ నెల 29న వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో మృతుడు శ్రీనివాసరావు మృతదేహంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆదివారం వైన్ షాపు వద్ద ఆందోళన నిర్వహించారు. శ్రీనివాసరావును కొట్టి చంపేశారని, కాళ్లు, చేతులు వెనక్కి మడిచేసి దారుణంగా హింసించినట్లుగా ఒంటిపై ఉన్న గాయాలే చెబుతున్నాయని మృతుడి భార్య లక్ష్మి, కుమార్తెలు ఆరోపించారు. గత మూడు రోజులుగా వైన్ షాపు ఆవరణలోని సీసీ కెమేరాలు పనిచేయడంలేదని షాపు యజమానులు అంటున్నారని, ఇప్పుడు ఎందుకు పనిచేస్తున్నాయని వారు నిలదీశారు. విషయం తెలుసుకున్న బహుజన సంఘ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ ఆందోళనకారులకు మద్దతు పలికారు. తక్షణమే బ్రాంది షాపు లైసెన్స్‌ను రద్దుచేయాలని, బాధిత కుటుంసభ్యులకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు. తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, జానా సతీష్‌లు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ తెలియదని, కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. -
పాస్టర్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి
అత్తిలి: క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని క్రైస్తవ మత పెద్దలు అన్నారు. అత్తిలి మండల క్రైస్తవలు ఆదివారం అత్తిలిలో ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు. అత్తిలి బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు వినతి పత్రం అందజేశారు. యూపీఎం ప్రెసిడెంట్ బాబూరావు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీని ఉద్దేశించి బిషప్ ప్రేమ్‌కుమార్, బిషప్ జగజ్జీవన్, ఎన్సీసీ స్టేట్ సెక్రటరీ మనోజ్‌బాబు, ఎంఆర్పీఎస్ అబ్బు దాసరి లాజరస్ మాట్లాడారు. భీమవరంలో.. భీమవరం: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తూ శత వార్షిక రూపాంతర దేవాలయం సంఘ సభ్యులు ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సత్వరం దర్యాప్తు చేసి.. ఆయన మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సభ్యులు కోరారు. పీసీసీ చైర్మన్ ఉన్నమట్ల కరుణాకరరావు, రేమల్లి కమలరాజు, సంఘస్తులు పాల్గొన్నారు. అదే విధంగా పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ స్థానిక లూథరన్ గ్రౌండ్ నుంచి ప్రకాశంచౌక్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం దర్యాప్తును వేగంవంతం చేయాలని డిమాండ్ చేశారు. గంటా సుందర్‌కుమార్, చిగురుపాటి సందీప్, పిల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మండవల్లిలో.. మండవల్లి: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండవల్లిలో మండల క్త్రెస్తవ సంఘాలు, విశ్వాసుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కమ్యూనిటీ హాలు నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేశారు. తొలుత ప్రవీణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాల్వేషన్ ఆర్మీ డీసీ మేజర్ మణిబాబు, సీఎస్ఐ ప్యారీస్ గురువు ఎ,సతీష్, సీయోన్ శిఖరం పాస్టర్ గుర్రం పరంజ్యోతి, సీయోను మందిరం మేజర్ పాస్టర్ తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడులో.. ఆకివీడు: పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానస్పద మృతికి నిరసనగా ఆదివారం ఆకివీడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీబీసీఎన్సీ సెంట్రల్ బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి గూడపాటి జోసఫ్ రాజు మాట్లాడుతూ పాస్టర్లపై దౌర్జన్యాలు, హత్యల్ని ఖండించాలన్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న పాస్టర్లపై దాడులు హేయమైన చర్య అన్నారు. స్థానిక సీబీసీఎన్ చర్చి నుంచి ప్రధాన సెంటరులోని అంబేడ్కర్ సెంటర్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ జార్జి, మండా ఏసోబు, బొండాడ వెంకటేశ్వరరావు, నాని, మద్దా నరేష్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో.. నరసాపురం: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యేనని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆదివారం నరసాపురంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ వై.రూబెన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జిల్లా నలుమూలలు నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రైస్తవులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు చదలవాడ జ్ఞానప్రకాష్, కాకిలేటి మధు, అడిదల శరత్, సికిలే పెర్సిపాల్, ఇంజేటి జాన్‌కెనడీ తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో ఘనంగా మామిడికాయ పండుగ
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగ పర్వదినంతో ప్రారంభమయ్యే మామిడికాయ పండుగను ఆదివారం పలు గిరిజన గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వేసవిలో మామిడికాయ పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ జరిపిన తర్వాత మాత్రమే గిరిజనులు మామిడికాయను తింటారు. ఉగాది రోజున ఇళ్లలో, గ్రామాల్లో ,తోటల్లో కాసిన మామిడి కాయలను అందరూ పండగకు కోసుకొని తీసుకొచి అక్కడ పూజల అనంతరం తింటారు. ప్రతి గ్రామంలో గంగానమ్మతో పాటు ఆయా గ్రామాల్లోని వన దేవతలను గిరిజనులు పూజిస్తారు. ఆయా దేవతలకు దూప దీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేసిన తర్వాతే మామిడి కాయలు చెట్ల నుంచి కాయలను కోస్తారు. ప్రతి ఇంటికీ కోడిని తీసుకువచ్చి గ్రామ దేవతకు మొక్కుగా ఇస్తారు. గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లు మొక్కుగా ఇస్తారు. ఆ కోళ్లును వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజలనంతరం గ్రామంలోని చిన్నాపెద్దా కలిసి ఒక గుజిడీ (స్థలం) ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడి కూర తెచ్చుకుని లొట్లలో తాటి కల్లు ఏర్పాటు చేసుకుని జీడి, మామిడి ఆకులతో, దారకాయలతో తాటికల్లును సేవిస్తారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు మామడి కాయ పండుగను పురస్కరించుకుని గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా గిరిజన సంప్రదాయ రేల నృత్యాలు చేస్తారు. ఈ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆదివారం కంసాలి కుంటలో ఈ ప్రారంభమైన ఈ మామిడికాయ పండుగలో సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ పాల్గొని వన దేవతలకు పూజలు చేయడంతో పాటు మహిళలతో కలిసి గిరిజన నృత్యాలు చేశారు. -
త్యాగానికి ప్రతీక రంజాన్
నేడు పండుగ జరపుకోనున్న ముస్లింలు చింతలపూడి: నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగ సోమవారం జరుపుకోనున్నారు. ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఉపవాసాలను నమాజుతో విరమించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసే ముందు పేదలకు సాయం చేస్తారు. ఈదుల్ ఫితర్ నమాజ్‌ను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఈద్గాహ్, మసీదులకు వెళ్ళి సామూహికంగా ప్రార్థనలు చేస్తారు. నమాజు అయిన తరువాత ముస్లింల స్మశాన వాటిక(ఖబరస్తాన్)కు వెళ్ళి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. అనంతరం కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియచేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నమాజు ముగిశాక బంధుమిత్రులు, స్నేహితులను ఆహ్వానించి షీర్ ఖుర్మా తినిపిస్తారు. పసందైన వంటకాలతో స్నేహితులను, బంధు మిత్రులను పిలిచి ఆప్యాయంగా పెడతారు. దివ్య ఖురాన్ అవతరించిన నెల ఖురాన్ అవతరించింది రంజాన్ మాసంలోనే.. అల్లాహ్ నుంచి 1,24,000 మంది ప్రవక్తలు రాగా వారిలో మహమ్మద్ ప్రవక్త చివరి వారు. క్రీ.శ.624 మార్చి 27న తన సహచరులతో కలిసి మదీనాలో ఈదుల్ ఫితర్ పాటించారని ప్రతీతి. సాధారణ రోజుల్లో ఎవరికై నా దానం చేస్తే దానిని స్వీకరించిన వ్యక్తి మాత్రమే లెక్కలోకి వస్తాడని, రంజాన్ మాసంలో ఒక వ్యక్తికి దానం చేస్తే వందమందికి చేసినంత ఫలితం ఉంటుందని భావిస్తారు. ఈ నెలలో చేసే దానాలు నేరుగా దైవ సన్నిధికి చేరతాయని నమ్మకం. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ వెన్నవల్లి వారిపేట ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును ఏలూరు వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వివరాలు వెల్లడించారు. చనపతి రమణమ్మ అలియాస్ చిట్ల రమణమ్మ (65) ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తూ చీటి పాటలు వేస్తూ ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈనెల 27న వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. మెడలోని బంగారు ఆభరణాలతో పరారయ్యారు. వన్‌టౌన్ సత్యనారాయణ పేట కమ్యూనిటీ హాలు ప్రాంతంలో ఉంటున్న చనపతి దుర్గాప్రసాద్ రమణమ్మ వద్ద చీటి పాటలు వేశాడు. చీటీ పాడుకుని సుమారు రూ.2 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. డబ్బుల కోసం రమణమ్మ అనేకసార్లు దుర్గాప్రసాద్‌ను మందలించింది. దుర్గాప్రసాద్ తన ఉంగరాన్ని తాకట్టుపెట్టి మరో రూ.30 వేల వరకు అప్పు తీసుకున్నాడు. ఈ నెల 27న సాయంత్రం డబ్బులు విషయం మాట్లాడేందుకు రమణమ్మ వద్దకు వెళ్ళాడు. రమణమ్మ తిట్టడంతో ఒక్కసారిగా రమణమ్మపై దాడి చేశాడు. నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేశాడు. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం కాళ్ళు, చేతులు కట్టేసి ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుర్గాప్రసాద్‌ను ఈనెల 30 న ఏలూరు నగరంలోని పంపుల చెరువు రోడ్డులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి నుంచి సుమారు 57 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి వద్ద హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసును చేధించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు. -
రోడ్లపైకి దాళ్వా ధాన్యం
భీమడోలు : దాళ్వా ధాన్యం రోడ్లపైకి చేరుతోంది. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు జాతీయ రహదారిపై ఆరబెడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో తేమశాతం వేగంగా తగ్గుతుండటంతో బస్తాల్లో పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ తెరవకపోవడంతో బరకాలతో కప్పి బస్తాలకు రక్షణ కల్పిస్తున్నారు. భీమడోలు మండలంలోని గుండుగొలను, సీతంపేట, పోలసానిపల్లి ప్రాంతాల్లో 1153, పీఎల్ 126 రకాల పంట కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఎకరాకు 43 నుంచి 50 బస్తాల దిగుబడులు వస్తున్నా యి. అధిక శాతం సీతంపేట ఆయకట్టు రైతులే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చయ్యిందని, నీటిని తోడుకునేందుకు అదనపు ఖర్చు చేశామని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యాన్ని జాతీయ రహదారిపై నుంచి ఎత్తివేయాలని రైతులను పోలీసులు ఒత్తిడి చేస్తుండటంతో కొందరు అయినకాడికి దళారులకు విక్రయిస్తున్నారు. భీమడోలు మండలంలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, దళారులకు అమ్మి నష్టపోవద్దని ఏఈఓ ఎస్పీవీ ఉషారాణి సూచించారు. -
నల్ల గట్టు.. కొల్లగొట్టు !
● రాజధాని అభివృద్ధి కోసం గ్రావెల్ తవ్వకాలకు ప్రతిపాదనలు ● పర్యావరణానికి హాని కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం ● ఆందోళనలో ఐదు గ్రామాల ప్రజలు నూజివీడు: నూజివీడు మండలంలోని బోర్వంచ రెవెన్యూ పరిధిలోని కొన్నంగుంట, కొత్తూరు గ్రామాల వెంబడి ఉన్న నల్ల గట్టుకు రాష్ట్ర ప్రభు త్వం ఎసరు పెట్టింది. రాజధాని అభివృద్ధికి గ్రావెల్ అవసరమంటూ నల్లగట్టు నుంచి గ్రావెల్ తవ్వి రాజధాని ప్రాంతానికి తరలించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో నల్లగట్టు రూపురేఖలు కోల్పోనుంది. నల్ల గట్టును తవ్వడం వల్ల పర్యావరణ విధ్వంసం జరిగినట్టే. కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి నూ జివీడు తహసీల్దార్ సర్వే నంబర్ 53లో దాదాపు 50 ఎకరాలు గ్రావెల్ తవ్వడానికి అనుకూలంగా ఉందని ప్రతిపాదనలు ఆగమేఘాల మీద పంపించారు. అలాగే బోర్వంచ గ్రామ సర్పంచ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి పంచాయతీ తీర్మానాన్ని సైతం తీసుకున్నారు. రాజధాని ప్రాంతానికి గ్రావెల్ తరలింపు కోసమని.. రాష్ట్ర రాజధాని ముంపు ప్రాంతం కావడంతో అక్కడ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను మెరక చేసేందుకు లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరం. ఈ మేరకు నూజివీడు ప్రాంతంలోని కొండలను సీఆర్డీఏ అధికారులు గతంలో పరిశీలించి వెళ్లారు. అనంతరం ఏలూరు కలెక్టర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపేందుకు కలెక్టర్ తహసీల్దార్ నుంచి వివరాలను తీసుకున్నారు. -
సంప్రదాయానికి ప్రతీక ఉగాది
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కమి సమ్మేళనం, పంచాంగ శ్రవణం ఆకట్టుకున్నాయి. పండితులు, రైతులు, కళాకారులకు సత్కారాలు అర్చకులు గూడూరు శ్రీనివాసరావు (మండవల్లి), కందుకూరి రామబ్రహ్మానంద శర్మ (ఏలూరు), వేదాంతం లక్ష్మీనరసింహాచార్యులు (ముసునూరు), వెంకట నాగ శ్రీధర్‌శాస్త్రి (కై కలూరు)ను నగదు పురస్కారాలతో కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ సత్కరించారు. ఆదర్శ రైతులు మలకపల్లి వీరరాఘవయ్య (ఆడమిల్లి), మద్దుకూరి కృష్ణ (కొయ్యలగూడెం), పర్వతనేని రామకృష్ణ (సీతంపేట), ఉప్పలపాటి చక్రపాణి (లక్ష్మీపురం), సింహా ద్రి గోపాలకృష్ణ (రాట్నాలకుంట)ను సత్కరించారు. కళాకారులు బొడ్డేపల్లి అప్పారావు, షేక్ మహబూబ్ సుభాని, వి.రామాంజనేయులు, పూనెం జయ సా యి శ్రీను, టి.రమ్యకృష్ణ, కల్యాణి, వి. కామరాజు, ఘంటసాల పెద్దిరాజు, ఎడవల్లి వెంకటరమణ, మండవ రాజగోపాలకృష్ణ, బీకే బిందు, కామ సో మరాజు, గండికోట రాజేష్ సత్కరించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆర్టీసీ పీఆర్వో కేఎల్వీ నరసింహులు సత్కారం అందుకున్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరావు, ఆర్డీఓ ఆచ్యుత అంబరీష్ పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
కూటమి ప్రభుత్వంలో కార్మికులకు దగా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభు త్వం భవన నిర్మాణ కార్మికులను దగా చేస్తోందని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్య దర్శి బద్దా వెంకట్రావు విమర్శించారు. హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ 15వ వార్షిక సమావేశం అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతి థిగా వెంకట్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పాలకులు మళ్లించిన బోర్డు నిధులను తిరిగి జమ చేసి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్రంలో 38 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారని వీరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భవన నిర్మా ణ కార్మికుల సంక్షేమానికి రూ.కోటి నిధులు జమ చేస్తాననే హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చిందీ లేనిదీ తెలియడం లేదన్నారు. ఏలూరులో తమ సంఘ భవనానికి స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మాచర్ల శంకర్రావు, అధ్యక్షుడిగా లింగమల్లు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఉప్పు సత్యనారాయణ, నెమలి కృష్ణ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బత్తిన శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉమా విజయ సాయి, సహాయ కార్యదర్శిగా వస్తాది జనార్దన, కోశాధికారిగా తరుణ్ సాయికుమార్, ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
వైభవం..ఉగాది సంబరం
●విశ్వావసు.. విజయ తేజస్సు ●ద్వారకాతిరుమలలో ఘనంగా వేడుక ద్వారకాతిరుమల: చిన వెంకన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం స్థానిక ఉగాది మండపంలో వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయదేవేరులతో శేషవాహనంపై కొలువైన శ్రీవారిని అట్టహాసంగా మండపం వద్దకు తీసుకువచ్చారు. మండపంలోని రజిత సింహాసనంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పూజాదికాలు నిర్వహించారు. పండితులు పంచాంగ శ్రవణాన్ని పఠించి రాశి ఫలాలను వివరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు అర్పించారు. చివరగా పండిత సత్కారాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి దంపతులు, అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఆగమ విద్యార్థులు, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోటెత్తిన భక్తులు కొత్త సంవత్సరాది కావడంతో చిన వెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ తూర్పురాజ గోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, టికెట్, ప్రసాదాల కౌంటర్లు, కేశఖండనశాల తదితర వి భాగాలు భక్తులతో కిక్కిరిశాయి. -
33వ గురు పట్టాభిషేక మహోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక గ్జేవియర్ నగర్ లోని సెయింట్ జేవియర్ బోర్డింగ్ దేవాలయంలో ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. నగరంలోని అమలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఐ.మైఖేల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బిషప్ జయరావు సందేశమిస్తూ ప్రతి గురువు ప్రజల కోసం జీవించాలని, క్రీస్తు ప్రభువు మా దిరి పేదలపై ప్రత్యేక ప్రేమ కలిగి ఉండాలని, భక్తులను నీతివంతమైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఫాదర్ మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయరావు ఆదర్శ గురువుగా ప్ర జలకు ఎనలేని సేవలను అందించారని, ప్రజ ల సమగ్ర అభ్యున్నతికి అహర్నిశలూ సేవలందించారన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ ఆత్మశాంతి కోసం ఆచార్య డి.అబ్రహం, టోకూరి స్వరూపరాణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్లు, గురువులు బిషప్ జయరావును ఘనంగా సన్మానించారు. ఫాదర్లు బి.రాజు, టి.ఇమ్మానియేలు, జె.బెనర్జీ, కార్పొరేటర్ ఎం. నిర్మల సిస్టర్స్, విశ్వాసులు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్‌లో ధూమపానం శానిటరీ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసు ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రయ్య నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ధూమపానం చేస్తూ పాల్గొన్న శా నిటరీ ఇన్స్పెక్టర్కు అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్లకు శనివారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ చంద్రయ్య జూమ్ మీటింగ్ నిర్వహించారు. కండ్రిగగూడెం 16వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు సిగరెట్ కాలుస్తూ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇది చర్చనీయాంశం కావడంతో నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఇన్స్పెక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీ చంద్రయ్యను ఆదేశించారు. ఈ మేరకు ఏసీ చంద్రయ్య షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉన్నతాధికారి ఎదుటే కింది స్థాయి ఉద్యోగి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు వేలెత్తి చూపించే పనులు చేయడం సిగ్గు చేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు పీజీఆర్ఎస్ రద్దు ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమ వారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవని, దీంతో పీజీఆర్‌ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఘనంగా వసంతోత్సవాలు ద్వారకాతిరుమల : చినవెంకన్న దేవస్థానానికి ఉపాలయం, క్షేత్ర దేవత కుంకుళ్లమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు వైభవంగా ప్రా రంభమయ్యాయి. 5 లక్షల గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజ లు, కుంకుమార్చనలు జరిగాయి. సంస్కృతికి చిహ్నం ఉగాది భీమవరం: తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక అని, సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు చిహ్నాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం భీమేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంపై శనివారం అమావాస్య ఎఫెక్ట్ పడింది. స్వామివారిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శించారు. చినవెంకన్నకు ప్రీతికరమైనరోజు కావడంతో ప్రతి శనివారం వేలాదిగా భక్తులు క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ వారం అమావాస్య కావడంతో నామమాత్రంగా భక్తులు శ్రీవారిని దర్శించారు. మధ్యాహ్నం నుంచి అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం విక్రయాల కౌంటర్లు ఇలా దాదాపు అన్ని విభాగాలు ఖాళీగా మారాయి. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు పెంపు ముసునూరు: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు.శ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి నెల 31తో ముగియనుండగా, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ముసునూరు(బాలికలు), నాగిరెడ్డిగూడెం(బాలికలు), అప్పలరాజుగూడెం (బాలురు) గురుకులాల్లో 5వ తరగతిలో 80 చొప్పున 240 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మట్టిని తరలిస్తున్న లారీల సీజ్ భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని బరువానిపేట నుంచి భీమవరం వైపు అక్రమంగా మట్టిని తరలిస్తున్న 3 లారీలను గొల్లవానితిప్ప వద్ద ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తోలకాలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉగాది ఉత్సవాలకు మన్యం సిద్ధం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది రోజున వన దేవతలు, కొండ దేవతలకు పూజలు చేస్తారు. ఇంటి పేర్లతో పూజలు చేయడమే కాకుండా జంతు బలులు ఇస్తారు. వియ్యంకుడు వరుసయ్యే వారికి బలిచ్చిన జంతువు కుడి తొడను ఇస్తారు. జంతువు తొడతో కూర వండి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గిరిజనులు చెబుతున్నారు. ఉగాది ఉత్సవాలను దాసియ్యపాలెం, సీతప్పగూడెం, ముప్పినవారిగూడెం, మంచులవారిగూడెం గ్రామాల్లో వైభవంగా చేస్తారు. గంగానమ్మ, గుబ్బల మంగమ్మ, ముత్యాలమ్మ, నాగులమ్మ, కనకదుర్గమ్మ, పోచమ్మతల్లి, సమ్మక్క సారక్క, సూదికొండ మావుళ్ళమ్మ అమ్మవార్లకు ఘనంగా పూజలు చేసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్‌ను తెలుసుకుంటే మరికొంత మంది పూనకాల్లో వచ్చిన దేవతల ద్వారా వారి భవిష్యత్‌ను తెలుసుకోవడం విశేషం. గ్రామంలోని పాడిపంటలు, సుఖసంతోషాల గురించి, భవిష్యత్ గురించి పూనకాల నుంచి వచ్చిన దేవతల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. పూనకాల సమయంలో డప్పు వాయిద్యాలతో గ్రామాలు దద్దరిల్లిపోతాయి. నేడు వన, గ్రామ దేవతలకు ఘనంగా పూజలు మామిడి కాయ పండుగకు ఏర్పాట్లు పూర్తి -
గోదావరి నదిపై అక్రమ రవాణా
కుక్కునూరు: గోదావరి నది స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. మండలంలోని వింజరం రేవు నుంచి తరలించిన 120 కేజీల గంజాయి బూర్గంపాడు వద్ద పట్టుబడడం, వందకు పైగా మూగజీవాలను వింజరం రేవు నుంచి తరలిస్తుంటే స్థానికులు పట్టుకోవడం వంటివి సంచలనం రేపాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రవహిస్తున్న గోదావరి నదికి అవతల పక్కన భద్రాచలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, వాటికి సమీపంలో ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. దీంతో గంజాయి, పశువులను ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు వాటిని గుట్టుచప్పుడు కాకుండా గోదావరి దాటించి మండలం మీదుగా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. అనుమతించిన రేవుల్లోనే ప్రయాణించాలి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలు పలు పనుల నిమిత్తం గోదావరి మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గోదావరి దాటాలంటే ప్రభుత్వం అనుమతించిన రేవుల గుండా వెళ్లాలి. పడవల మీదుగా గోదావరి దాటించేందుకు అధికారికంగా వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట రేవుకు మాత్రమే అధికారులు వేలంపాట నిర్వహించి అనమతులు జారీచేశారు. కొంతమంది చేపలు పట్టేవారు ఆ సాకుతో పడవలలో ప్రజలను నిబంధనలకు విరుద్ధంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనమతులు లేకుండా ప్రజల తరలింపును అధికారులు పట్టించుకోకపోవడంతో పనిలో పనిగా కొంతమంది అక్రమ మార్గంలో ఆదాయం కోసం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల బూర్గంపాడు గంజాయి కేసులో మండలంలోని వింజరం రేవులో చేపలు పట్టే వ్యక్తిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ ముఠాతో చేతులు కలిపి గంజాయిని పడవలపై తరలించినట్టు తెలుస్తుంది. పడవలను అడ్డుకుంటాం వింజరం రేవులో అక్రమంగా ప్రజలను పడవల్లో తరలించే విషయం నా దృష్టికి వచ్చింది. అలా దాటించే పడవలను సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం. కె తాతారావు, సెక్రటరీ, వింజరం పంచాయతీ చేపలు పట్టేందుకు అనుమతి అవసరం గోదావరి నదిలో చేపలు పట్టే వారికి మత్స్యశాఖ నుంచి అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా నదిలో చేపలు పట్టడం చట్టవిరుద్ధం. అనుమతులు ఉన్న వారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తాం. కె మంగారావు, ఎఫ్డీఓ, ఐటీడీఏ కేఆర్ పురం వింజరం రేవు నుంచి గంజాయి తరలింపు ఇటీవల కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు -
కాలువలో మునిగి ఇద్దరు మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై శశాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్.వంశీకృష్ణ (23), కె.బాలసుబ్రహ్మణ్యం(30) వరుసకు బావ బావమరిదిలు. వీరు శనివారం మధ్యాహ్నం ఎర్రకాలువ జలాశయానికి వెళ్లారు. అక్కడ కొద్ది సేపు సేదతీరిన తరువాత స్నానం చేయడానికి జలాశయం కుడి కాలువ వద్దకు వెళ్లారు. స్నానానికి దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే మునిగిపోవడంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. -
కూటమి నేతల ఆగడాలు తాళలేం
ఉంగుటూరు: గ్రామాల్లో కూటమి నాయకుల జోక్యం మితిమీరి ఉండటాన్ని నిలువరింపజేయాలని మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు శని వారం ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. ఎంపీడీఓ రాజ్‌మనోజ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఎ.గోకవరం కార్యదర్శి కుసుమపై ఆ గ్రామ టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరించిన ఘటనతో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించలేని దుస్థితి నెలకొందని వాపోయారు. అలాగే మరో నాలుగైదు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు విజయకుమార్, ఉపాధ్యక్షుడు ధనలక్ష్మి, కార్యదర్శి దుర్గాప్రసాద్, సభ్యులు రమేష్, ట్రెజరర్ రవికుమార్ ఆధ్వర్యంలో కార్యదర్శులు వినతిపత్రాలు అందజేశారు. -
ఖాకీల పచ్చపాతం
ఈవీఎం గోడౌన్ తనిఖీ ఏలూరు(మెట్రో): జిల్లాకు సంబంధించి ఈవీంలను భద్రపరచిన కలెక్టరేట్లోని గోడౌన్‌ను శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికల పోరులో పోలీసులు పచ్చ పార్టీ నేతలకు పూర్తిగా దాసోహం అనే రీతిలో వ్యవహరించారు. అత్తిలిలో రెండు రోజులపాటు వందలాది మంది టీడీపీ కేడర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాన్ని చుట్టుముట్టినా పోలీసులు స్పందించని పరిస్థితి. కై కలూరులో తీవ్ర ఘర్షణలు, ఒక రిపోర్టర్‌పై తీవ్రస్థాయిలో దాడి జరిగినా పట్టించుకోలేదు. యలమంచిలిలో మాత్రం మంత్రి మాటలకు తలొగ్గి ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని అరెస్ట్ చేయడానికి తీవ్ర అత్యుత్సాహం చూపించారు. డీజీపీ మొదలు రెండు జిల్లాల ఎస్పీల వరకూ ఎవరికి ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేసినా స్పందించని దుస్థితి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాకీలను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలు చేసిన అరాచకం. అత్తిలిలో చేష్టలుడిగి చూస్తూ.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం ఎంపీపీ ఎన్నిక షెడ్యూల్ మేరకు గురువారం జరగాల్సి ఉంది. 13 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి నివాసానికి చేరుకుని ప్రభుత్వ కా ర్యాలయానికి వెళ్లడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో వందలాది మంది టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి ఇల్లు చుట్టుముట్టారు. దమ్ము ఉంటే మమ్మల్ని దాటి వెళ్లండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... వాహనాలను రోడ్లకు అడ్డంగా పెట్టి మో హరించారు. కొన్ని గంటల పాటు హైడ్రామా నడిపారు. తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, అత్తిలి ఎస్సై ప్రేమ్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ తో సహా డీజీపీ వరకూ అందరికీ మాజీ మంత్రి ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదు. వందలాది మంది చుట్టుముట్టి దాడికి సిద్ధంగా ఉండగా అత్తిలిలో ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఒక దశలో కూటమి శ్రేణులు కారు మూరి నివాసం గేట్లను నెట్టుకుని రావడానికి య త్నిస్తే కారుమూరి, వైఎస్సార్సీపీ కేడర్ అడ్డుకున్నారు. శుక్రవారం టీడీపీ మరో అడుగు ముందుకేసి ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే మహిళల ను వాహనాల్లో తరలించారు. ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడిన క్రమంలో ఆ రోజూ వందలాది మందిని టీడీపీ మోహరించి ఎంపీటీసీలను బయటకు రానివ్వకుండా చేసింది. అలాగే గ్రామంలోకి వచ్చే వాహనాలన్నింటినీ తనిఖీలు చేస్తూ పోలీసులు హడావుడి చేశారు. కనీసం దాడి జరిగే అవకాశం ఉన్న ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దడం, ఎంపీటీసీలకు రక్షణ కల్పించి ఎన్నికకు తీసుకువెళ్లే ప్రయత్నంగాని చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి కారుమూరి విలేకరుల సమావేశం నిర్వ హించి ఎస్పీ మొదలు డీజీపీ, డీజీపీ పీఏ వరకూ అందరికీ ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదు. కై కలూరులో దాడులు జరిగినా.. కై కలూరులోనూ ఇదే తరహాలో పోలీసులు వ్యవహరించారు. కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతలు సుమారు 30 మంది జర్నలిస్టులపై పోలీసుల సమక్షంలో దాడి చేసినా కనీసం స్పందించలేదు. భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు సూర్యనారాయణను గురు, శుక్రవారాలు రెండు రోజులు పాటు ఇంటి వద్దనే ఎన్నికకు రానివ్వకుండా చేసిన దానిపై మాజీ ఎమ్మెలే దూలం నాగేశ్వరరావు ఎస్సై మొదలు ఎస్పీ వరకూ ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. రెండు రోజులపాటు ఇదే తరహాలో అధికార పార్టీ హడావుడి చేసి బలం లేకపోయినా దొడ్డిదారిన వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకుంది. న్యూస్రీల్యలమంచిలిలో అత్యుత్సాహం యలమంచిలిలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ (గుంపర్రు)ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదు. దీంతో ఆమె కుమార్తె, బాలిక షర్మిలతో సత్యశ్రీ కిడ్నాప్‌నకు గురైందని ఫిర్యాదు తీసుకుని ఎన్నిక కోసం కార్యాలయానికి వచ్చిన ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి పాలకొల్లు రూరల్, టౌన్ సీఐలు గుత్తల శ్రీనివాస్, కోలా రవికుమార్, యలమంచిలి ఎస్సై బుర్రయ్యలు హడావుడి చేశారు. స్టేషన్‌కు రావాలని గట్టిగా పట్టుబడితే ఎన్నిక అయ్యాక వస్తానని ఆమె చెప్పినా సీఐ వినకుండా మహిళా కానిస్టేబుల్ సాయంతో జీపు ఎక్కించాలని ఆదేశించారు. చివరకు సత్యశ్రీ, ఎ మ్మెల్సీ కవురు శ్రీనివాస్ గట్టిగా పోలీసులతో వా దనలకు దిగడంతో వారు వెళ్లిపోయిన పరిస్థితి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగునా పోలీసులు కూటమి సేవలో తరలించారు. కూటమి సేవలో పోలీస్ ఉమ్మడి పశ్చిమలో టీడీపీ బరితెగింపు రాజకీయాలు అత్తిలిలో తీవ్ర ఘర్షణలు జరిగినా పట్టించుకోని పోలీసులు కై కలూరులో దాడులు జరిగినా స్పందన నిల్ రివర్స్ కేసుల పేరుతో యలమంచిలిలో హడావుడి స్థానిక పోరులో పోలీసుల అత్యుత్సాహం డీజీపీ నుంచి ఎస్పీ వరకూ స్పందించని వైనం -
చెట్ల సొమ్ము స్వాహా!
ద్వారకాతిరుమల: రోడ్డు మరమ్మతుల పేరుతో కూటమి నేతలు మార్జిన్‌లోని చెట్లను నరికివేశారు. వచ్చిన కలపను రూ.70 వేలకు అమ్మేసి సొమ్ములు స్వాహా చేశారు. ఇది జరిగి ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకూ రోడ్డు మరమ్మతుల ఊసెత్తలేదు సరి.. చెట్ల సొమ్ములు ఒక్క రూపాయి కూడా పంచాయతీకి జమ చేయలేదు. మండలంలోని గుండుగొలనుకుంటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహా రం చర్చనీయాంసమైంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనుకుంట నుంచి కామవరపుకోట మండలం వడ్లపల్లికి వెళ్లే గ్రావెల్ రోడ్డు ధ్వంసమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలతో వర్షం నీరు తడి ఆరక రోడ్డు దెబ్బతింటుందని కూటమి నేతలు కొందరు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లారు. చెట్లు నరికి, కలప విక్రయించగా వచ్చే సొమ్ముతో రోడ్డు మరమ్మతులు చేయించుకోమని ఆయన సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలో చెట్లు నరికి కలపను రూ.70 వేలకు విక్రయించారు. ఇందులో రూ.5 వేలను అటవీ శాఖ సి బ్బందికి వాటాగా ఇచ్చి మిగిలిన సొమ్మును నాయకులు స్వాహా చేశారు. ఇదిలా ఉండగా కలప సొమ్ము నగదు ఏమైందని ఎవరైనా ప్రశ్నిస్తే పంచాయతీకి జమ చేశామని ఆ నాయకులు చెబుతుండగా.. పంచాయతీ అధికారులను అడిగితే ఎలాంటి నగదు జమ చేయలేదని సమాధానమిస్తున్నారు. వారం రోజులుగా మల్లగుల్లాలు : వారం రోజులుగా కూటమి నేతలు నగదు విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో విషయం బయటపడింది. సొమ్ములు స్వాహా చేసింది ఎవరూ, ఇంత జరుగుతుంటే పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ను వివరణ కోరగా చెట్లు నరికిన విషయం వాస్తవమని, ఆ సొమ్ములతో రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని నాయకులు తెలిపారన్నారు. అయితే సొమ్ములు ఏమయ్యాయన్న విషయంపై విచారణ చేస్తామని చెప్పారు. చెట్లను అమ్మి సొమ్ము చేసుకున్న కూటమి నేతలు రూ.70 వేలు కూటమి నేతల జేబుల్లోకి.. అటవీ శాఖ సిబ్బంది వాటా రూ.5 వేలు ! ఆరు నెలలైనా పంచాయతీకి జమ కాని నగదు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేల్పూరులో మద్యం దుకాణం వెనుక మృతదేహం గుర్తింపు తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మద్యం దుకాణం వద్ద శనివారం సాయంత్రం వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శ్మశాన వాటిక రోడ్డులోని సూర్య వైన్స్ వెనుక శనివారం సాయంత్రం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించారు. అతన్ని వేల్పూరు సంతమార్కెట్ ప్రాంతానికి చెందిన కుడుపూడి శ్రీనివాసరావు (55)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆటోలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరావు గాయాలతో పడి ఉన్న తీరు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ముఖం, శరీరంపైనా గాయాలు ఉండడంతో ఎవరైనా కొట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు? ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ సత్యనారాయణ పేట ప్రాంతంలో గురువారం అర్థరాత్రి వృద్ధురాలు చానాపతి రమణమ్మ (65) హత్య ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ హత్యను సత్యనారాయణ పేటకు చెందిన ఒక యువకుడు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పర్యవేక్షణలో డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు కేవలం చిట్టీ పాటల డబ్బులే కారణమా ? ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత మృతికి కారణమైన యువకుడి అరెస్ట్ జంగారెడ్డిగూడెం: వివాహిత మృతికి కారణమైన యువకుడిని జంగారెడ్డిగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన హేమదుర్గ అనంత ప్రసన్న అనే వివాహితను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమె మృతికి కారణమైన కొయ్యలగూడెం మండలం గంగన్నగూడానికి చెందిన మోదుగ పెద్దసాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు ఏలూరు టౌన్: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చి ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కూర్చున్న బాలికను ఆటోడ్రైవర్ ఇంటి వద్ద దించుతానని నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. పోణంగి రోడ్డులోని తన ఇంటికి తీసుకువెళ్ళి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయంతో బాలిక అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేసింది. ఆ ప్రాంతంలోని హిజ్రాలు విషయాన్ని గమనించి బాలికను రక్షించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. శనివారం బాలిక తల్లిదండ్రులు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆటోడ్రైవర్ ఆర్.ప్రభాకరరాజుపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చాట్రాయి : నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అజయ్‌కుమార్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని చీపురుగూడెంలో జరిపిన దాడుల్లో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్యా మహేంద్రపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
కొల్లేరు సమస్యలపై గళం
ఏలూరు (టూటౌన్): కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలంటూ కొల్లేరు ప్రజలు గళమెత్తారు. తమకు ఉపాధి కల్పించాలని, సొసై టీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలంటూ శనివారం ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, జీఓ 120ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పర్యావరణం పేరుతో కొల్లేరు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.లింగరాజు, కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరుపై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డీఎన్‌వీడీ ప్రసాద్, జిల్లా నాయకులు కె.లెనిన్, పలు కొల్లేరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో పీఎండీఎస్ కిట్లు
ద్వారకాతిరుమల: రైతులకు పీఎండీఎస్ కిట్లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట ఎన్‌పీఎం షాపులో సిద్ధం చేసిన 2 వేల కిట్లను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల్లో 16 రకాల విత్తనాలను కలిపి ఈ కిట్‌ను తయారు చేశామని, వీటిని రుతుపవనాలు వచ్చే ముందు వేయాలన్నారు. మెంతులు, ఆవాలు, తోటకూర తదితర విత్తనాలు కలగలిపి 12 కేజీల బరువుతో ఈ కిట్ ఉంటుందన్నారు. ఈ విత్తనాల ద్వారా సాగు చేయడం వల్ల పశువులకు మేత పుష్కలంగా లభిస్తుందన్నారు. అలాగే ఆకు కూరలు, ఆవాలు, మెంతులను రైతులు విక్రయించుకోవచ్చన్నారు. మొత్తం 10 వేల మంది రైతులకు అందించే లక్ష్యంలో భాగంగా, తొలి విడతగా 2 వేల కిట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏడీఏ ఉషారాజ్ కుమారి, ఏడీపీఎం బాలిన వెంకటేష్, ద్వారకాతిరుమల, భీమడోలు ఏవోలు ఎ.దుర్గారమేష్, ఉషారాణి తదితరులున్నారు. బిల్డింగ్ నుంచి పడి వ్యక్తి మృతి కై కలూరు: పడక కుర్చీపై చల్లిగాలికి డాబాపై పడుకున్న వ్యక్తి కింద పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం కై కలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన కమతం యేబేలు(58) ఈ నెల 22న డాబాపై రాత్రి పడక కుర్చీలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి కింద పడి ఉన్నాడు. వెంటనే కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి, విజయవాడ ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారని పోలీసులు చెప్పారు. కుమార్తె దాసరి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉపాధి కల్పన కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): ఉపాధి కల్పన పథకంలో లబ్ధి కోసం మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం శుక్రవారం తెలిపారు. ఈ పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవ రంగానికి రూ. 20 లక్షలు సబ్సిడీ రుణం ఇస్తారన్నారు. ఈ పథకంలో నూతన ప్రొజెక్టులకు మాత్రమే రుణం ఇస్తారన్నారు. అభ్యర్థలు సంబంధిత వెబ్సైటులో సమాచారాన్ని పూరించి అవసరమైన ధ్రువపత్రాలు జతపర్చాలన్నారు. పోక్సో కేసు నమోదు భీమవరం: భీమవరం రెండో పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలిక పట్ల కె.గణేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తల్లితో కొన్నేళ్లుగా గణేష్ సహజీవనం చేస్తున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. చదువు మానేసి ఇంట్లో ఉంటున్న బాలికపై ఎవరూ లేని సమయంలో శరీరంపై చేతులు వేసేవాడు. ఎవరితోనైనా చెబితే బాగుండదని హెచ్చరించేవాడు. తన తల్లిని శుక్రవారం కొడుతుండగా ఎందుకు కొడుతున్నావని అడిగితే మీద చేతులు వేసి దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గత 11 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.86,52,879 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 103 గ్రాముల బంగారం, 2.075 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకిరాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.28,500 లభించినట్టు చెప్పారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్ర దేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 7 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. అందులో భాగంగా తొలిరోజు ఉగాది నాడు అమ్మవారు లక్ష గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. అమ్మవారికి కుంకుమ పూజలు, చంఢీ హోమం వంటి కార్యక్రమాలు జరుగుతాయని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. కొనసాగుతున్న డయాఫ్రం వాల్ పనులు : నిమ్మల పాలకొల్లు సెంట్రల్: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు రూ.990 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శుక్రవారం పాలకొల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు 2014–19లో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేసినట్టు చెప్పారు. నిర్వాసితులకు రూ.829 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. వరకట్న వేధింపుల కేసు నమోదు జంగారెడ్డిగూడెం: వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. పట్టణంలోని రాజులకాలనీకి చెందిన గెడ్డం వీరేంద్రకుమార్ రాజాకు, రమ్య మధురికకు 2016లో ప్రేమ వివాహం జరిగింది. ఈ నెల 23 నుంచి వీరేంద్రకుమార్ రాజా అధిక కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడన్నారు. దీనికి అతని కుటుంబసభ్యులు సహకరిస్తున్నారని, ఈ నెల 27 రాత్రి వీరేంద్రకుమార్ రాజా కట్నం తేవాలని భార్య రమ్య మధురికను కొట్టి ఇంటి నుంచి గెంటివేశాడన్నారు. దీంతో శుక్రవారం రమ్య మధురిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్‌తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహంతో ధర్నా కొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్‌సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు. పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు -
కళారత్న అవార్డుకు ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్యం నాట్య గురువు ఏ.పార్వతీ రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం హంస అవార్డు కళా రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. గత 45 ఏళ్లుగా ఏలూరులో కళా దీపిక నృత్య అకాడమీ ద్వారా వేలాదిమంది విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఉత్తమ నాట్య గురువు. నాట్య కళాకారిణే కాకుండా మంచి సంగీత కళాకారిణి. ఎన్నో సంస్థలు ఆమెను వివిధ బిరుదులతో, సన్మానాలతో గౌరవించాయి. ఆమె కళారత్న పురస్కారానికి ఎంపికై న సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు కళారత్న కేవీ సత్యనారాయణ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీ రామచంద్రన్ నృత్య రంగానికి చేస్తున్న విశేష సేవలను గుర్తించి తమ కేవీఎస్ ట్రస్ట్ ద్వారా కేవీ సత్యనారాయణ ప్రతిభా పురస్కారంతో 2022లో పార్వతి రామచంద్రన్‌ను సత్కరించామన్నారు. నాట్యానికి జీవితం అంకితం చేసిన గొప్ప కళాకారిణి పార్వతి రామచంద్రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కళా రత్న హంస అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నందుకు కళాకారులు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. -
లేగ దూడల ప్రదర్శన
ద్వారకాతిరుమల: మండలంలోని తక్కెళ్లపాడులో పశు సంవర్ధక శాఖ, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. అందులో 25 గేదె దూడలు, 15 ఆవు దూడలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పశు పోషణ, జాతి లక్షణాల ఆధారంగా రైతులకు బహుమతులను భీమడోలు ఏడీ డాక్టర్ సాయి రమేష్ అందజేశారు. అనంతరం వైద్యులు 4–6 నెలల వయస్సున్న 30 పెయ్యి దూడలకు బ్రూసెల్ల టీకాలు వేశారు. లేగ దూడలు పశు పోషణలో తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆ తరువాత ఈ ప్రదర్శనలో పాల్గొన్న రైతులందరికీ కాల్షియం, లివర్ టానిక్, గోమర్లు మందు, స్టీల్ క్యాన్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల, భీమడోలు మండలాల పశు వైద్యాధికారులు అంగర సురేష్, హరికృష్ణ, పాడి రైతులు బొల్లారెడ్డి సూర్యనారాయణ రెడ్డి, మానికల రామకృష్ణ, ముల్లంగి కృష్ణారెడ్డి, షేక్ మస్తాన్ సాహెబ్, పశు గణాభివృద్ధి సిబ్బంది, పశు సంవర్థక శాఖ సిబ్బంది, ఏహెచ్ఏలు, గోపాల మిత్రలు పాల్గొన్నారు. -
ఘనంగా ఉగాది ఉత్సవాలు
బుట్టాయగూడెం: మండలంలోని మంచులవారిగూడెంలో స్వయంభుగా వెలసి భక్తుల పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మతల్లి, కనకదుర్గమ్మ, నాగమ్మతల్లి, నాగేంద్రుల ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కోయ గిరిజన సంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో బోనం ఎత్తుకుని గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కోలాటాల ఊరేగింపు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి పుట్టింటి సారె కావిడ్లతో, నాటు కోళ్లు, మేకపోతులతో మొక్కులు చెల్లిస్తామని ఆలయ పీఠాధిపతి కేరం మధు తెలిపారు. -
ప్రమాదంలో వ్యక్తి మృతి
దెందులూరు: బైక్‌పై వెళ్తూ కిందపడి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని దెందులూరు ఎస్సైఆర్ శివాజీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం దెందులూరు గ్రామానికి చెందిన కొల్లా బత్తుల యేసు, గుంపుల వంశీ ద్విచక్ర వాహనంపై శ్రీరామవరం వెళుతున్నారు. గుంపుల వంశీ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడుపుతూ కింద పడటంతో కొంత దూరం వెళ్లి ఎదురుగా దెందులూరు వైపు వస్తున్న ఆటోను ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న యేసు మృతి చెందగా గుంపుల వంశీ గాయపడ్డాడు. అతన్ని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం నూజివీడు: మండలంలోని ఓగిరాల తండాలో ఎకై ్సజ్ సిబ్బంది శుక్రవారం నిర్వహించిన దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడంతో పాటు 35 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఏఈఎస్ జీ.పాండురంగారావు తెలిపారు. సంఘటన ప్రాంతం నుంచి పారిపోయిన కృష్ణపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఈఎస్టీఎఫ్ ఎస్ఐ కేఎండీ ఆరిఫ్, సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ఎవరైనా ఎకై ్సజ్ నేరాలకు పాల్పడుతుంటే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
రైతులకు అందుబాటులో పీఎండీఎస్ కిట్లు
ద్వారకాతిరుమల: రైతులకు పీఎండీఎస్ కిట్లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట ఎన్‌పీఎం షాపులో సిద్ధం చేసిన 2 వేల కిట్లను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల్లో 16 రకాల విత్తనాలను కలిపి ఈ కిట్‌ను తయారు చేశామని, వీటిని రుతుపవనాలు వచ్చే ముందు వేయాలన్నారు. మెంతులు, ఆవాలు, తోటకూర తదితర విత్తనాలు కలగలిపి 12 కేజీల బరువుతో ఈ కిట్ ఉంటుందన్నారు. ఈ విత్తనాల ద్వారా సాగు చేయడం వల్ల పశువులకు మేత పుష్కలంగా లభిస్తుందన్నారు. అలాగే ఆకు కూరలు, ఆవాలు, మెంతులను రైతులు విక్రయించుకోవచ్చన్నారు. మొత్తం 10 వేల మంది రైతులకు అందించే లక్ష్యంలో భాగంగా, తొలి విడతగా 2 వేల కిట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏడీఏ ఉషారాజ్ కుమారి, ఏడీపీఎం బాలిన వెంకటేష్, ద్వారకాతిరుమల, భీమడోలు ఏవోలు ఎ.దుర్గారమేష్, ఉషారాణి తదితరులున్నారు. బిల్డింగ్ నుంచి పడి వ్యక్తి మృతి కై కలూరు: పడక కుర్చీపై చల్లిగాలికి డాబాపై పడుకున్న వ్యక్తి కింద పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం కై కలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన కమతం యేబేలు(58) ఈ నెల 22న డాబాపై రాత్రి పడక కుర్చీలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి కింద పడి ఉన్నాడు. వెంటనే కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి, విజయవాడ ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారని పోలీసులు చెప్పారు. కుమార్తె దాసరి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉపాధి కల్పన కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): ఉపాధి కల్పన పథకంలో లబ్ధి కోసం మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం శుక్రవారం తెలిపారు. ఈ పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవ రంగానికి రూ. 20 లక్షలు సబ్సిడీ రుణం ఇస్తారన్నారు. ఈ పథకంలో నూతన ప్రొజెక్టులకు మాత్రమే రుణం ఇస్తారన్నారు. అభ్యర్థలు సంబంధిత వెబ్సైటులో సమాచారాన్ని పూరించి అవసరమైన ధ్రువపత్రాలు జతపర్చాలన్నారు. పోక్సో కేసు నమోదు భీమవరం: భీమవరం రెండో పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలిక పట్ల కె.గణేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తల్లితో కొన్నేళ్లుగా గణేష్ సహజీవనం చేస్తున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. చదువు మానేసి ఇంట్లో ఉంటున్న బాలికపై ఎవరూ లేని సమయంలో శరీరంపై చేతులు వేసేవాడు. ఎవరితోనైనా చెబితే బాగుండదని హెచ్చరించేవాడు. తన తల్లిని శుక్రవారం కొడుతుండగా ఎందుకు కొడుతున్నావని అడిగితే మీద చేతులు వేసి దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా గంటా శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా నూకపెయ్యి సుధీర్‌బాబు (ఏలూరు), రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శిగా గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శిగా కంబాల రాంబాబు, రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా యర్రా గంగాధరరావును నియమించారు.బూత్ కమిటీల జోనల్ అధ్యక్షుడిగా బీవీఆర్జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడేనికి చెందిన బీవీఆర్ చౌదరిని వైఎస్సార్సీపీ బూత్ కమిటీల విభాగం జో నల్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆయన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.ట్రావెల్స్ బస్సుల తనిఖీఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్, కాంట్రాక్ట్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనల అతిక్రమించిన 46 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.13 లక్షల అపరాధ రుసుం విధించినట్టు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు పేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించి, అవగాహన కల్పించారు. విరామ సమయంలో డ్రైవర్లు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని హితవు పలికారు. వాహన తనిఖీ అధికారులు బి.భీమారావు, ఎన్డీ విఠల్, ఎస్బీ శేఖర్, జి.ప్రసాదరావు పాల్గొన్నారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలిఏలూరు (టూటౌన్): పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పి.జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని గెట్సేమనే సెంట్రల్ చర్చిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రవీణ్ ప్రగడాల మృతి బాధాకరమని అన్నారు. నెల రోజుల క్రితం ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, చెప్పిన నెల రోజులకే మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హెల్మెట్ పెట్టుకుని ఉన్నా ఆయన మొహంపై బలమైన గాయం ఎలా తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిక్కాల జోసెఫ్, సభ్యులు పీటర్, పాస్టర్ కిరణ్ పాల్, ఏలూరు సిటీ పాస్టర్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.సెస్ బకాయిలు చెల్లించాలిభీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా గ్రంధాలయ సంస్థకు సెస్ బకాయిలను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో సెస్ బకాయి లపై ఆయన సమీక్షించారు. గ్రంథాలయ సంస్థకు సెస్ రూపేణా రూ.4,53,48,404 బకాయిలు ఉన్నాయని, దీనిలో పంచాయతీల బకాయిలు రూ.2,96,90768 ఉన్నాయన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
అత్తిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని అత్తిలి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు విమర్శించారు. తమకున్న ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. గురువారం అత్తిలి ఎంపీపీ అభ్యర్థిని, అత్తిలి–1 ఎంపీటీసీ సభ్యురాలు రంభ సుజాత మాజీ మంత్రి కారుమూరి నివాసంలో తన సహచర ఎంపీటీసీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నా కూటమి నా యకులు అక్రమంగా ఎన్నికను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు వచ్చి తమకు రక్షణ కల్పించకుండా ఏమీ తెలియనట్టు వ్యవహరించారని వాపోయారు. కుటిల సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసిందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ దారం శిరీష మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా పార్టీపై ఉన్న అభిమానంతో తమ పార్టీ అభ్యర్థికి ఓటువేయడానికి వెళుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. లక్ష్మీనారాయణపురం ఎంపీటీసీ సభ్యుడు ఆడారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేంచేలా కూటమి శ్రేణులు దాడులు చేయడం హేయం అన్నారు. ఎంపీటీసీ సభ్యులు అద్దంకి శ్రీను, సుంకర నాగేశ్వరరావు, కూరాకుల లక్ష్మి, దొమ్మేటి రమ్య, నల్లమిల్లి నాగమణి, శరకడం రామలింగ విష్ణుమూర్తి, గుడిమెట్ల ధనలక్ష్మి, పురుషోత్తపు నాగేంద్ర శ్రీనివాస్, ముదునూరి దుర్గా భవాని తదితరులు మాట్లాడారు. -
సంఖ్యా బలం లేకే కూటమి కుట్రలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీల సంఖ్యా బలం దమ్ములేక కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కై కలూరు తాలూకా సెంటర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు రౌడీయిజం ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో కై కలూరు మండలంలో 22 మంది ఎంపీటీసీ సభ్యుల్లో కేవలం ఒక్కటి మాత్రమే టీడీపీ గెలిచిందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వైస్ ఎంపీపీ–2 మరణిస్తే ప్రస్తుత ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభాలతో కూటమిలో చేర్చుకున్నారన్నారు. భుజబలపట్నం సెగ్మెంట్‌కు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పెన్మత్స సూర్యనారాయణరాజును ఓటు వేయడానికి రాకుండా కూటమి నేతలు ఇంటికి తాళాలు వేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించకుండా అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. భుజబలపట్నం ఎంపీటీసీని పోలీసులు నిర్బంధం నుంచి విడిపించి ఓటు హక్కును కల్పించాలని ఆయన కోరారు. -
కూటమి దౌర్జన్యకాండ
ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను అధికార టీడీపీ తుంగలోకి తొక్కింది. వైఎస్సార్సీపీకి ఏకపక్షం కావాల్సిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల్లో పాగా వేయాలని చూసింది. పచ్చమూకల్ని ఉసిగొల్పి ఎన్నికలను అడ్డుకుంది. అత్తిలిలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను నిర్బంధించగా యలమంచిలిలో కోరం సరిపోయినా పొంతన లేని కారణాలతో ఎన్నికలు వాయిదా వేశారు. కై కలూరులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శురకవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025యలమంచిలిలో హైడ్రామా యలమంచిలి మండలంలో హైడ్రామా నడుమ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు 13 మంది వైస్సార్సీపీ, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. గురువారం నాటి ఎంపీపీ ఎన్నికకు పూర్తిస్థాయిలో సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమేనని అంతా భావించారు. కాగా తమకు ఓటెయ్యాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నట్టు కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేయడం గమనార్హం. వాస్తవానికి వైఎస్సార్సీపీ పూర్తి సంఖ్యా బలం ఉండటంతో ఎన్నిక జరిగితే తమకు పదవి రాకుండా పోతుందన్న ఉద్దేశంతో టీడీపీ అధికార బలంతో ఎన్నికను వాయిదా వేయించిందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ విమర్శించారు. కై కలూరులో అరాచకం కై కలూరులో వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. 20 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ, కూటమికి సమాన బలం ఉంది. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును ఎన్నికకు హాజరుకాకుండా కూటమి నేతలు అడ్డుకున్నారు. కూటమి నేతల ఆగడాలను కవరేజీ చేస్తున్న భవ్య న్యూస్ ఎడిటర్ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబాదడంతో గాయలపాలై కై కలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) మీడియా ముఖంగా నిరశన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీలు ఎవరూ హాజరుకాలేదు. కూటమి పార్టీకి చెందిన 9 మంది మాత్రమే హాజరుకావడవంతో కోరం లేక ఎన్నికను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏలూరు ఆర్డీఓ అచ్చుత అంబరీష్ వాయిదా వేశారు. సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్/ అత్తిలి/ కై కలూరు: తణుకు నియోజకవర్గ చరిత్రలో మనుపెన్నడూ లేనివిధంగా అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో కూటమి మూకలు రెచ్చిపోయారు. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 16 చోట్ల వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన చెరో రెండు చోట్ల గెలుపొందాయి. ఇటీవల మాజీ ఎంపీపీ, మరో సభ్యుడు కూటమి పంచన చేరగా, ఒక సభ్యురాలు గల్ఫ్ వెళ్లడంతో వైఎస్సార్సీపీ సంఖ్యాబలం 13, కూటమి సభ్యులు ఆరుగురు అయ్యారు. ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను తమ వైపు లాక్కుని ఎంపీపీ పదవి కాజేయాలని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ సభ్యులు లొంగలేదు. చివరకు కాబోయే ఎంపీపీ రంభ సుజాతకు చెందిన పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించినా ఫలితం లేకపోవడంతో ఎన్నిక జరుగకుండా అడ్డుకునే ఎత్తుగడ వేశారు. కవ్వించి.. చుట్టుముట్టి.. అత్తిలిలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి గురువారం ఉదయం 13 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు అప్పటికే అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు కారుమూరి నివాసాన్ని చుట్టుముట్టారు. రోడ్డుపై మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి గొడవకు దిగారు. ఒక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చేందుకు ప్రయత్నించడంతో ఎంపీటీసీ సభ్యులు భయాందోళనలతో తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారు. పచ్చమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తూ వచ్చారు. ఉదయం 8 గంటలకు మొదలైన ముట్టడి ఎన్నిక సమయం ముగిసే వరకు కొనసాగింది. 12 గంటల తర్వాత ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడినట్టు సమాచారం వచ్చాక పచ్చమూకలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మండుటెండలోనే కారుమూరి ఎవరొస్తారో రండంటూ మాజీ మంత్రి కారుమూరి పచ్చమూకలకు ఎదురుతిరిగారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎక్కడికి కదలకుండా వారు ఉన్నంతసేపు దాదాపు నాలుగు గంటల పాటు ఇంటి ఎదురుగానే కూర్చుండిపోయారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఆయన వెంట ఉన్నారు. పోలీసుల ‘పచ్చ’పాతం అత్తిలిలో దాదాపు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసిన అధికారులు దాదాపు అందరినీ మండల పరిషత్ కార్యాలయం వద్దనే మోహరించారు. తమ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలని పలుమార్లు వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులను కోరినా వారు స్పందించలేదు. కూట మి శ్రేణుల కారుమూరి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సృష్టిస్తున్నా చేష్టలుడిగి చూశారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధులు సైతం పలుమార్లు సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా వస్తున్నామంటూ ఎన్నికల సమయం ముగిసే వరకూ కాలం గడిపేశారు. మాజీ మంత్రి కారుమూరి సమస్యను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. లా అండ్ ఆర్డర్ విధులను పక్కనపెట్టి కూటమి నాయకులు చెప్పినట్టుగా పోలీసుల వ్యవహరించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుల తరఫున మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు విప్ ఎకనాల్జెడ్మెంట్ను అందజేసేందుకు వెళ్లిన పార్టీ రాష్ట్ర నేత వడ్లూరు సీతారామ్‌ను పోలీసులు అడ్డుకుని బయటకు నెట్టేశారు. ఎన్నికల ప్రక్రియను కవరేజీ కోసం వచ్చిన సాక్షి టీవీ చానల్ కెమెరాను కూటమి నాయకులు లాక్కుని వైర్లు తెంపివేశారు. వీడియో చిత్రీకరిస్తున్న వారిపై వాటర్ ప్యాకెట్లను విసిరారు. న్యూస్రీల్ప్రజాస్వామ్యం ఖూనీ ఎంపీపీ పదవుల కోసం టీడీపీ చిల్లర రాజకీయాలు అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి ఇంటిని చుట్టుముట్టిన పచ్చమూకలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరు కాకుండా అడ్డగింత ఫిర్యాదుచేసినా పట్టించుకోని పోలీసులు యలమంచిలిలో కోరం సరిపోయినా ఎన్నిక వాయిదా కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత -
తణుకు చరిత్రలో చీకటి రోజు
మాజీ మంత్రి కారుమూరి అత్తిలి: కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ఇది ఒక బ్లాక్ డే అని, తణుకు నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి దారుణ ఘటన ఎన్నడూ జరగలేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీపీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకుండా కూటమి మూకలను ఉసిగొల్పడంపై గు రువారం ఆయన అత్తిలిలో మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి ఎస్పీ, డీఎస్పీ, సీఐ అందరికీ ఫోన్ చేసినా కానీ.. ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. తమ ఎంపీటీసీ సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, తాము ఎవరినీ తీసుకుపోలేదని, తమ మ్యాండెట్‌పై గెలిచినవారని తెలిపారు. తమవారినే ఇద్దరిని వారు తీసేసుకున్నారని అన్నారు. ఎన్నికలకు వెళ్లాల్సిన తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను కూటమి నేతలు దౌర్జన్యంగా రౌడీలను పెట్టి అడ్డుకున్నారని, తన ఇంటిపైకి వచ్చి రౌడీయిజం చేశారని చెప్పారు. చివరికి మహిళలని కూడా చూడకుండా తోసేసి దుర్మార్గంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున ఎంపీపీగా చేసిన మక్కా సూర్యారావును మభ్యపెట్టి తీసుకున్నారని, అయినా తాము మాట్లాడలేదని, నేడు దుర్మార్గంగా ఎన్నికకు వెళ్లకుండా సభ్యులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ‘మీకు 6 ఉంటే, మాకు 13 ఉన్నాయి.. అయినా సరే దా రుణాతి దారుణంగా రౌడీయిజంతో దుర్మార్గం చేశా రు.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. అసలు పోలీస్ వ్యవస్థ టోటల్‌గా విరుద్ధంగా అయిపోయింది.. టోటల్ ఫ్లాప్.. ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరించారు.. ఇంత దౌర్జన్యం చేస్తున్నా, ఆడవాళ్లను తోసేస్తున్నా ఎస్పీ, డీఎస్పీ, సీఐ ఒక్కరు కూడా ఇక్కడి రాలేదు.. నేను మాజీ మంత్రిని, నేను ఫోన్ చేసినా, చాలా మంది కౌన్సిల్ చైర్మన్లు ఫోన్లు చేసినా స్పందించలేదు, ఫోన్లు కూడా ఆపేశారు.. ఇది చాలా దుర్మార్గమైన, హేయమైన చర్య..’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకష్ణ చేసే దుర్మార్గాలకు చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు వస్తాయని కారుమూరి స్పష్టం చేశారు. -
ఫీజులు కట్టలేదని విద్యార్థుల నిర్బంధం
నరసాపురం రూరల్: ఫీజులు కట్టలేదనే కారణంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను గదిలో నిర్బంధించిన ఘటన వెలుగుచూసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నరసాపురం–పాలకొల్లు జాతీయ రహదారిని ఆనుకుని సరిపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లితండ్రులు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపుతో సంసిద్ స్కూల్ నిర్వహించడం దారుణమన్నారు. ఫీజుల కోసం విద్యార్థులను గదిలో బంధించడం బాలల హక్కులను కాలరాయడమే అ న్నారు. విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పాఠశాల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. స్కూల్‌కు వచ్చిన ఎంఈఓ పిల్లి పుష్పరాజ్యంకు ఫిర్యాదు చేశారు. -
సమ్మె బాటలో మీటర్ రీడర్లు!
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యుత్ మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టనున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ విద్యుత్ మీటర్ల రీడర్లు గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై యూనియన్ నాయకులు పెనుమాక జాకబ్, వంశీ, శేఖర్, శ్రీనివాస్, రమణ గురువారం విశాఖపట్నంలో సీఎండీతో చర్చలు జరిపారు. అయితే అవి విఫలం కావడంతో రీడర్స్ యూనియన్ నాయకులు కార్యాచరణలో భాగంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. వినియోగదారులపై భారం ప్రతి నెలా 1 నుంచి 12వ తేదీ లోపు మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయాల్సి ఉంది. విద్యుత్ మీటర్లు సమ్మెబాట పట్టి, విద్యుత్ అధికారులు ప్రత్యామ్నాయా ఏర్పాట్లు చేయకుంటే బిల్లుల శ్లాబ్ రేట్లు మారిపోయి అదనపు భారం పడే అవకాశం ఉండడం వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 5,700 మంది మీటర్ రీడర్లు ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో 750 మంది రీడర్లు ఉన్నారు. వీరు సమ్మె బాట పడితే 20 లక్షల సర్వీస్‌లకు ఇబ్బందులు కలగనున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళితే తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ముగియనున్న కాంట్రాక్టర్ల గడువు ఇదిలా ఉంటే విద్యుత్ మీటర్లకు సంబంధించి కాంట్రాక్టర్ల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి కాంట్రాక్టు మొదులుకాగా ఈనెలాఖరికి రెండేళ్ల గడువు తీరనున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదని వారు అంటున్నారు. మీటర్ రీడర్లు సమ్మె చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. దీనిపై విద్యుత్ తాడేపల్లిగూడెం డివిజన్ ఈఈ కె.నరసింహమూర్తిను వివరణ కోరగా మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళుతున్నట్లు తమకు ఇంకా తెలియదన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వచ్చే నెలలో కూడా మీటర్లు రీడింగ్ తీసేందుకు సమ్మతి ఇచ్చారని ఎస్ఈకు పంపామని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు రావని వివరించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీతో విఫలమైన చర్చలు వచ్చే నెల 1 నుంచి సమ్మె ఆలోచన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే వినియోగదారులపై భారం -
ట్రిపుల్ ఐటీల్లో సమస్యలు తొలగేనా?
నూజివీడు : రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్కొక్క ట్రిపుల్ ఐటీలో 6,600 మంది చొప్పున నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 26,400 మంది విద్యార్థులున్నారు. దేశంలోని 15 ఐఐటీల్లో కలిపి కూడా ఇంత మంది విద్యార్థులు ఉండరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ట్రిపుల్ ఐటీని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా ఇన్చార్జి డైరెక్టర్లపైన, ఇన్చార్జి వైస్ చాన్సలర్లపైన పాలనను వదిలేసింది. వారంతా ఇన్చార్జిలు కావడంతో తమకెందుకొచ్చిన గొడవ అని కీలక నిర్ణయాలను తీసుకునే విషయమై మిన్నకుంటున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ల్యాప్‌టాప్‌లు లేవు, యూనిఫాం లేదు ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలాఖరుకు ముగుస్తున్నా నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంత వరకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేదు. అలాగే యూనిఫాం ఇవ్వలేదు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే తరగతులు ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులకు ఈ రెండూ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ఇవ్వకపోవడాన్ని బట్టే ట్రిపుల్ ఐటీలను గాలికి వదిలేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు లేకపోవడంతో విద్యార్థులు పీడీఎఫ్‌లు జిరాక్స్‌లు తీయించుకొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే సంస్థలో ల్యాప్‌టాప్‌లు ఇవ్వడంలో ఇంత జాప్యంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ తొమ్మిది నెలలు గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) మీటింగ్ జరగాలంటూ ట్రిపుల్ ఐటీ అధికారులు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ల్యాబ్ అసిస్టెంట్లకు టైమ్ స్కేల్ ఇస్తారా? ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న ల్యాబ్ అసిస్టెంట్లకు టైమ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇది ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో గత ఐదు నెలలుగా టైమ్ స్కేల్ ఇవ్వాలని ల్యాబ్ అసిస్టెంట్లు ఆర్జీయూకేటీ అధికారులను అడుగుతున్నారు. దీనికి వారు జీసీ అనుమతి ఉండాలంటూ టైమ్ స్కేల్ ఇవ్వకుండా కాలం గడుపుకొస్తున్నారు. ఇన్చార్జిల ఏలుబడిలో ట్రిపుల్ ఐటీలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడుగు సమస్యలపై దృష్టిపెట్టని కూటమి ప్రభుత్వం సదుపాయాల కొరతతో విద్యార్థుల అవస్థలు నేడు ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం పూర్తిస్థాయి అధికారులనే నియమించలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను గాని, ఆర్జీయూకేటీకి వైస్ చాన్సలర్‌ను గాని, చాన్సలర్‌ను గాని ఇంత వరకు నియమించలేదు. డైరెక్టర్లు, వైస్‌చాన్సలర్, రిజిస్ట్రార్ అందరూ ఇన్‌చార్జిలే ట్రిపుల్‌ఐటీల పాలనను నెట్టుకొస్తున్నారు. ఈ ఇన్చార్జిలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సాహసం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 28న గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఇన్‌ఛార్జి వైస్‌చాన్సలర్, ఇన్చార్జి రిజి స్ట్రార్, నలుగురు ఇన్చార్జి డైరెక్టర్లు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్య సెక్రటరీ, ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డైరెక్టర్లు, మరికొందరు ఈ జీసీ సమావేశంలో పాల్గొననున్నారు. కొందరు ఆన్లైన్లోను, మరికొందరు నూజివీడు ట్రిపుల్ఐటీ నుంచి ఈ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనైనా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటారో లేదోనని ట్రిపుల్ ఐటీల సిబ్బంది వేచి చూస్తున్నారు. ఆరు వేల మందికి ఒకరే మెస్ నిర్వాహకుడు నూజివీడు ట్రిపుల్ ఐటీలోని 6,600 మంది విద్యార్థులకు ఒకే మెస్ నిర్వాహకుడు రెండు పూటలా భోజనాన్ని, ఒకపూట టిఫిన్‌ను అందించాల్సి రావడంతో విద్యార్థులకు సకాలంలో భోజనం అందకపోవడంతో పాటు ఒకే నిర్వాహకుడికి అప్పగించడం కూడా సమంజసం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 20న నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శించిన త్రిసభ్య కమిటీ అక్టోబర్ మొదటి వారానికల్లా మెస్ టెండర్లను పిలిచి మెస్ నిర్వాహకులను నియమిస్తామని చెప్పారు. ఇది చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు కనీసం టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించలేదు. ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఇంకెక్కడా ఉండదనే అభిప్రాయం ట్రిపుల్ ఐటీలో సర్వత్రా వ్యక్తమవుతోంది. -
సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు దోహదం
వీరవాసరం : కళలు, కళాకారులు ఎక్కడైతే గౌరవించబడతారో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటక పోటీల సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాటక ప్రదర్శనలు సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి ఎంతో దోహదపడతాయన్నారు. టీవీ రంగం మనిషిని చిన్నగా, సినిమారంగం మనిషిని పెద్దగా చూపిస్తుందని, మనిషిని మనిషిగా ఒక్క నాటక రంగమే చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో నాటక పరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, అల్లు రామకృష్ణ, గంట ముత్యాల నాయుడు, రామ్మోహన్ రావు, వెంకట రత్నం, పాలా ఆంజనేయులు, కళాపరిషత్ సభ్యులు పాల్గొన్నారు. -
బంగారం షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
భీమవరం (ప్రకాశంచౌక్)/పాలకొల్లు (సెంట్రల్): ఏలూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు భీమవరం, పాలకొల్లు పట్టణాల్లోని బంగారం షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్, సేల్స్ టాక్స్ అండ్ లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భీమవరంలోని శ్రీ సునీత జ్యూయలర్స్, వీకే బులియన్ గోల్డ్ షాపుల నందు అన్ స్టాంప్డ్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా సునీత జ్యూయలర్స్ షాప్ నందు రికార్డుల్లో ఉండాల్సిన దాని కంటే వెండి నిల్వలు 5 కేజీలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పాలకొల్లులో జరిపిన తనిఖీల్లో పట్నాల బ్రదర్స్ జ్యూయలరీ షాప్ నందు బంగారపు నిల్వల్లో 253 గ్రాములు, వెండి నిల్వల్లో 1500 గ్రాములు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాస జ్యూయలర్స్ షాప్‌లో బంగారం నిలువల్లో 92 గ్రాములు, వెండి నిల్వల్లో వెయ్యి గ్రాములు తక్కువ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా బంగారం షాపులపై అధికారులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు పి శివరామకృష్ణ, డి ప్రసాద్‌కుమార్, విజిలెన్స్ ఎస్సైలు సీహెచ్ రంజిత్‌కుమార్, కె.సీతారామ, సేల్స్ టాక్స్ అధికారులు పీవీ హేమమాలిని, ఎస్కే షబ్బీర్, లీగల్ మెట్రాలజీ అధికారి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలు
నరసాపురం రూరల్: అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ సురేష్‌కుమార్ అన్నారు. గురువారం నరసాపురం మండలం చినమైనవానిలంక గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పొదిగించబడిన ఆలివ్ రిడ్లే జాతికి చెందిన తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి పాఠశాల విద్యార్థులతో కలిసి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను సెక్షన్ ఆఫీసర్, ప్రధానోపాధ్యాయుడు ఎన్వీ సత్యనారాయణ నివృత్తి చేశారు. ఆలివ్ రిడ్లే జాతికి చెందిన ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లుపెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు. తాబేళ్ల జాతి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బయటకు రావడంతో గుర్తించి అటవీశాఖ ఆధ్వర్యంలో వాటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె రాంప్రసాద్, ఉపాధ్యాయుడు జి రవీంద్రరాజు, గ్రామస్తులు ఎంపీ కుమారస్వామి, విద్యార్థులు, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రంలో పనిచేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: టీ కోసం రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన కథనం ప్రకారం. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరగవాడ గ్రామానికి చెందిన బట్టు సేట్రామ్(55) లక్ష్మీనగర్‌లోని సింధూర పేపర్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి టీ తాగేందుకు తన బంధువు బట్టు కృష్ణతో కలసి ఘటనా స్థలం వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో కొవ్వూరు నుంచి ఏలూరు వైపునకు వెళుతున్న కారు సేట్రామ్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సేట్రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై సుధీర్ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘ఉపాధి హామీ’లో రజక వృత్తి చెరువులను బాగుచేయాలి ఏలూరు (టూటౌన్): రజక వృత్తి చెరువులను ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో బాగుచేయించేందుకు అధికారులు చొరవ చూపాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక జనసంఘ కార్యలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రజకులు వృత్తి చెరువులు పూడికలతో నిండి విస్తీర్ణం కోల్పోయిన పరిస్థితి నెలకొందని చెప్పారు. పలుచోట్ల పూడికల కారణంగా రజక వృత్తికి తీవ్ర అవరోధంగా మారి రజకులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రజక వృత్తి చెరువులను బాగుచేయించాలని కోరారు. ముఖ్యంగా గోపాలపురం, పోలవరం, నల్లజర్ల, చాగల్లు, ఉండి, తాడేపల్లిగూడెం, నియోజకవర్గాలు మండలాల్లోని చెరువులను బాగుచేయించాలని కట్లయ్య కోరారు. ఈ సమావేశంలో జిల్లా రజక నేతలు వట్లూరు మురళి, వి.శ్రీనివాసులు, శేషు, ఆర్.నాగేశ్వరరావు, మొలగాల దుర్గారావు, దేవరపల్లి రజక నాయకులు కదిలి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుడిపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలి కై కలూరు: విధి నిర్వహణలో ఫొటోలు తీస్తున్న భవ్య న్యూస్ ఎడిటర్ కురేళ్ళ కిషోర్‌పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు అద్దంకి వెంకట శ్రీనివాస్, మణిక్యరావు గురువారం డిమాండ్ చేశారు. కై కలూరు మండలం భుజబలపట్నంలో ఫొటోలు తీస్తున్న తనపై జనసేన నాయకుడు కొల్లి బాబీ, కూటమి నేత పూలా రాజీ, మరికొందరు దాడి చేశారని యూనియన్ నాయకుల ముందు కిషోర్ గోడు వెళ్లబోసుకున్నాడు. సెల్ ఫోన్ లాక్కున్నారని చెప్పారు. కై కలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పరామర్శించారు. స్థానిక సీఐ, ఎస్పీలకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. -
నిరాశపర్చిన పొగాకు ధర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా ప్రారంభ ధర రైతులను నిరాశ పర్చింది. ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో సోమవారం కొనుగోలు ప్రారంభమైంది. ప్రారంభ ధర కేజీకి రూ.290 పలికింది. సరాసరి ధర కంటే రూ.340 పలుకుతుందని ఆశించారు. గత ఏడాది ధర దృష్ట్యా కౌలు ధరలు, ఎరువులు, రైతు కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. గత ఏడాది వర్జీనియా వేలం ప్రక్రియపై నమ్మకంతో అధిక పెట్టుబడులతో ఎక్కువ పంటను పండించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే 20 మిలియన్ల కేజీల పంట అధికంగా ఉండొచ్చని అంచనా. గరిష్ట ధర 400 పైగా రావాలని, సరాసరి రూ.350కి తగ్గకుండా వస్తేనే ఈ ఏడాది రైతులు గట్టెక్కే పరిస్థితి ఉందని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ప్రారంభ ధర కేజీకి రూ.290 సరాసరి రూ.350 పైగా వస్తేనే గిట్టుబాటు సరైన ధర వచ్చేలా చూడాలి తొలి రోజు ధర ఏ విధంగాను ఆమోదయోగ్యం కాదు. గత ఏడాది వేలం ప్రక్రియ దృష్ట్యా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ధర మీద ఆశతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిర్ధేశించిన దాని కంటే ఎక్కువ పండిందని అధికారులు చెబుతున్నారు. కనీసం వారు నిర్ధేశించిన లక్ష్యానికై నా రూ.411 పైగా ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు -
పరిశోధన ఫలితాలు లాభసాటిగా ఉండాలి
నూజివీడు: మామిడి పరిశోధన ఫలితాలు రైతులకు లాభసాటిగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మామిడి పరిశోధ నస్థానం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో కిసాన్ మేళా, వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ముందుగా స్టాల్స్ సందర్శించారు. అనంతరం రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలనుద్ధేశించి మాట్లాడుతూ నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇటీవల నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఎంతగానో నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం మామిడికి నల్ల తామర పురుగులు ప్రధాన సమస్యగా తయారయ్యాయని మామిడి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు తోటల్లో జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నివారించుకోవాలి తప్ప పురుగుమందులతో నివారించలేమన్నారు. సమావేశంలో వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే గోపాల్, అపేడా రీజనల్ హెడ్ ఆర్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 2024–25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖలు సమన్వంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లా సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ రబీ పంటకు సంబంధించి 98 శాతం ఈకేవైసీ పూర్తయిందన్నారు. జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని, 2,,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గోనె సంచులను రైస్ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి నిర్దేశించిన గోడౌన్లలో ఉంచాలన్నారు. వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, ఆర్డీవోలు అచ్యుత్ అంబరీష్, ఎం.వి.రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి.శ్రీలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు . జేసీ పి.ధాత్రిరెడ్డి -
పెదవాగు బాధితులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్) : గత ఏడాది గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్బగా కమిటీ కార్యదర్శి ఎస్కె గౌస్ మాట్లాడుతూ వేలేరు పాడు, కుకునూరు మండలాల్లోని 50 గ్రామాలలో పంట భూముల్లో ఇసుక మేటలు వేసి, గండ్లు పడ్డాయని అన్నారు. నష్టపోయిన ప్రజలకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అనేక సార్లు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిస్కారం కాలేదన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి 50 గ్రామాలలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అల్లూరి నగర్ పంపుహౌస్ లో ఉన్న నీటిని మోటార్లతో మేడేపల్లి, రామవరం గ్రామ పంచాయతీ గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల నాయకులు సిరికొండ రామారావు, కట్టాం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మంచి ధర వచ్చేలా కృషి చేస్తాం
పొగాకు బోర్డు రైతులకు మంచి రేటు వచ్చేలా కృషిచేస్తుంది. ఈ ఏడాది కూడా ఆశించిన మేరకు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంటను బయటకు అమ్ముకోవద్దు. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పెద్దఎత్తున పంట పండించారు. గట్టి పోటీ ఉన్న పరిస్థితుల్లో ధర విషయంలో కొంత ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది వచ్చిన విధంగానే సరాసరి వచ్చేలా కృషిచేస్తాం. కర్నాటకలో ఆక్షన్ పూర్తి కాగానే, ఇక్కడ ధర పెరిగే అవకాశం ఉంది. – సీహెచ్ యశ్వంత్‌కుమార్, చైర్మన్ , వర్జీనియా పొగాకు బోర్డు -
కృత్రిమ అవయవాల పంపిణీ
ఏలూరు (టూటౌన్): ఏలూరు దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్ – టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ నిర్వహించారు. సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఫిజియోథెరపీ, ఆడియోలజీ, స్పీచ్ థెరఫీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాల కోసం 08812 –249297,7386565469లో సంప్రదించాలన్నారు. మెగా డీఎస్సీకి ఉచిత కోచింగ్ ఏలూరు (టూటౌన్): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ–2025 పరీక్షలకు బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఆర్వి.నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, టీటీసీ, బీఎడ్, కుల, ఆదాయ నివాస ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 8686180018 నెంబరులో సంప్రదించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందాలి ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో ప్రజలు ఆయా సమస్యలపై పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 36 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పోలవరం రూరల్: ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించనున్న దృష్ట్యా ఏర్పాట్లను కలెక్టర్ కే వెట్రిసెల్వి, జేసీ పీ ధాత్రిరెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో సమావేశ హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డయాఫ్రమ్ వాల్, ఎగువ కాపర్ డ్యామ్, గ్యాప్– 1, 2 తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ కూడా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఓ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం పలు వినతులు అందాయన్నారు. -
తీవ్ర నిరాశ కలిగించింది
తొలి రోజు రూ.290 రావడంతో రైతులు నిరాశ చెందారు. గత ఏడాది సరాసరి రూ.335 వచ్చింది. సరాసరి రూ.350 వస్తేనే పెట్టుబడులు తిరిగి వస్తాయి. 10 రోజులు చూస్తాం. ఇలాగే కొనసాగితే ప్రతిఘటిస్తాం. సరాసరి రూ.350 వచ్చేలా కంపెనీలు, బోర్డు, ప్రభుత్వం కృషిచేయాలి. జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులతో పోల్చితే మిగిలిన చోట్ల పంట తక్కువ. దీంతో ఆఖరిగా నిలిచిన జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదు బోర్డులను సమానం చేసి వేలం నిర్వహించాలి. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు -
30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: నూతన సంవత్సరాది పర్వదినానికి శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక ఉగాది మండపానికి రంగులు వేసే పనులను ప్రారంభించారు. అలాగే మండప పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేష వాహనంపై ఊరేగింపుగా మండపం వద్దకు వెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణము జరుపుతారు. ఆ తరువాత పండిత సత్కారం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి కోరారు. పసల కృష్ణభారతి యువతకు ఆదర్శనీయం తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణ భారతి నేటి యువతరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కృష్ణభారతి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పయనించి స్వాతంత్య్ర సమరయోధురాలిగా నిలిచారని అన్నారు. ఆమె వృద్ధాశ్రమాలను స్థాపించి నిరాశ్రయులైన వృద్ధులకు తోడుగా నిలిచి సేవా తత్పరత కలిగిన మహిళగా ప్రసిద్ధి పొందారని మాజీ మంత్రి కొట్టు తెలిపారు. ఆమె కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కృష్ణభారతి కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కృష్ణభారతి పోషించిన కీలక పాత్రను తెలుసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. కృష్ణభారతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
సాహసమే ఊపిరిగా..
దెందులూరు: వారి సాహసం ఎంతో మందికి ఊపిరి పోస్తుంది. ఆపదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణం పోస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదలు, తుపానుల్లో చిక్కుకున్న వారిని కాపాడి రియల్ హిరోలుగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రియాక్షన్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) బృందాలు. రాష్ట్రంలో 2016 మార్చి 24న ఈ సంస్థ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. మెరికలు లాంటి శిక్షణ పొందిన పోలీసులు ఎంతోమందిని రక్షించి ప్రశంసలందుకుంటున్నారు.324 మంది ప్రాణాలు నిలిపారుజిల్లాలో 9 ఏళ్లలో సంభవించిన విపత్తుల్లో అతిపెద్ద విపత్తు బుడమేరు వరదలు. ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో బుడమేరు వరదల్లో ఇన్స్పెక్టర జనరల్ అసిస్టెంట్ కమాండెంట్ రాజకుమారి నాయకత్వంలో 37 బోట్లతో, 12 బృందాలు, 21 ప్రాంతాల్లో రెస్క్యూ చేశారు. జిల్లాలో 9 ఏళ్లలో ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాహసోపేత రెస్క్యూల ద్వారా 324 మందిని కాపాడారు. 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 వేల మందికి ఆహారం, తాగునీరు అందించారు. వివిధ రకాల 54 జంతువులను రక్షించారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 42 మృతదేహాలను వెలికి తీశారు.యువతకు స్ఫూర్తియుద్ధభూమిలో సైనికులు, వరదలు తుపానులలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధి నిర్వహణ యువతకు స్ఫూర్తిదాయకం. చరిత్ర ఉన్నంతకాలం వారి ధైర్యం, సేవ, అంకితభావం కీర్తింపబడుతూనే ఉంటాయి.– డాక్టర్ తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రివిపత్తుల్లో బృందాల సేవలు కీలకంవిపత్తుల సమయంలో బృందాల సేవలు స్ఫూర్తిదాయకం. సమిష్టి కృషితో విపత్తుల సమయంలో నష్ట ప్రభావాన్ని తగ్గించారు. ప్రాణాలను కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం అందించడం, మృతదేహాల వెలికితేత వంటి సేవలతో ఏపీఎన్డీఆర్ఎఫ్ కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేశారు.– రాజకుమారి ఇన్స్పెక్టర్ జనరల్, ఏపీ ఎన్డీఆర్ఎఫ్ఎండల నుంచి కార్మికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ఏలూరు (టూటౌన్): అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనరు, విజయవాడ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం కార్మిక శాఖ కార్యాలయంలో హీట్ వేవ్స్‌పై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్మికులకు పని సమయంలో చల్లటి తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు/ఉద్యోగుల పని గంటలను రీ–షెడ్యూలింగ్ చేయాలన్నారు. ఓఆర్ఎస్ ఐవి ద్రవాలు వంటి అత్యవసర మందులు, ప్రథమ చికిత్స కిట్లు పని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీరు తాగడం, విండో షేడ్స్ ఉపయోగించడం, ఫ్యానింగ్, క్రాస్ వెంటిలేషన్ వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ డాంగే, ఆర్కే డబ్ల్యూసి రత్నబాబు, షేక్ షరీఫ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, మదర్ థెరిస్సా బిల్డింగ్ వర్కర్స్, ఐఎఫ్టీయూ, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, దుకాణాలు, సంస్థల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. -
ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం
యలమంచిలి: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మనుగడ లేకుండా మట్టిలో కలుపుతామని పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం యలమంచిలిలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మాపు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదని తెలిసి కూడా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు మద్దతు ఇవ్వడమంటే, కేవలం ఓటు బ్యాంకు రాజకీయ పరమైన కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విడగొట్టాలని 1997–98లో నారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అప్పుడు మాలల పంతం చంద్రబాబు అంతం అనే నినాదంతో ఆ రోజు అధికారం కోల్పోవటం జరిగిందన్నారు. ఆ సంఘటన మర్చిపోయి మళ్లీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి కేవలం మాలలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిగా అవాస్తవంతో కూడిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేసి ప్రస్తుతం పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా యలమంచిలి మండల యూత్ విభాగం అధ్యక్షుడుగా జల్లి అనిల్‌ను నియమించి నియామాకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పితాని పుష్పరాజ్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కార్యదర్శి బండి సుందరరామూర్తి, నియోజకవర్గ కన్వీనర్ బుంగా జయరాజ్, ఎస్సీ ఉద్యోగుల సంఘం మండల నాయకులు ముడకల గోపాలరావు, బొంద బుజ్జిబాబు, కప్పల బన్నీ, సోడగిరి ప్రదీప్, జల్లి విజయరాజు, రాపాక సుధీర్, తోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై పీవీ రావు మాల మహానాడు ధ్వజం -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో సంచలనం రేకెత్తించిన వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. బోసుబాబు భార్య శాంతికుమారి తనకు మేనమామ వరుసైన సొంగా గోపాలరావుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్‌కుమార్ సోమవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. భర్త పెట్టే బాధలు భరించలేక గంధం బోసుబాబు భార్య శాంతికుమారి, తన మేనమామ వరుసైన గోపాలరావు వివాహానికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. వివాహమైన అనంతరం శాంతికుమారి తన భర్తకు తెలియకుండా గోపాలరావుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. బోసు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా చేసే సమయంలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని శాంతికుమారిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అంతేకాకుండా భార్య శాంతికుమారి వద్ద ఉన్న డబ్బులు కూడా బలవంతంగా తీసుకున్నాడు. తరచూ తనను హింసించడంతో భర్త బోసుబాబు అడ్డు తొలగించాలని శాంతికుమారి, గోపాలరావు నిర్ణయించుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తుండగా జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో జరిగిన అవకతవకలపై పత్రికలో వచ్చిన కథనాలను ఆమె భర్త బోసు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయమై అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు బోసును ఫోన్లో బెదిరించిన కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో తన భర్త బోసుబాబును ఏం చేసినా అది చిర్రి వెంకటేశ్వరరావు మీదకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ శాంతికుమారి గోపాలరావును రాత్రి ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టింది. తర్వాత బోసు, పిల్లలు ఇంటి పోర్షన్ బయట వరండాలో పడుకుని పూర్తిగా నిద్రలోకి వెళ్లిన తర్వాత శాంతికుమారి సాయంతో గోపాలరావు తనతోపాటు తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో బోసు తలపై కుడి వైపున ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. తర్వాత అక్కడి నుంచి గోపాలరావు ఆ రాడ్డుతో పారిపోయాడు. ఈ ఘటనపై ఈనెల 18వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేయగా భర్త బోసు పెట్టే బాధలు భరించలేకే శాంతికుమారి, గోపాలరావు వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఈ హత్య చేసినట్లు ముద్దాయిలిద్దరూ అంగీకరించారని సీఐ తెలిపారు. అలాగే హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసు దర్యాప్తుకు సహకరించిన కై కలూరు రూరల్ సీఐ, పోలవరం, గణపవరం సీఐలు, చాట్రాయి, ముదినేపల్లి, కొయ్యలగూడెం ఎస్సైలు, సర్కిల్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. బోసుబాబు హత్యకేసును ఛేదించిన పోలీసులు కేసుకు సంబంధించి ఇద్దరి అరెస్ట్ -
చోరీ కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: ఆశా వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. చిన్నంవారిగూడెం గ్రామానికి చెందిన ఏలేటి రాణి అదే గ్రామంలో ఆశా వర్కర్‌గా పనిచేస్తుంది. ఈనెల 18న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా.. తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువా వెతకగా, బీరువాలో ఉంచిన 4 కాసుల బంగారం కనబడలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇంటి పక్కనే ఉన్న ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుతో పేర్కొన్నారని, ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కండక్టర్‌పై దాడి, కేసు నమోదు జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కోనా ప్రసాద్ శనివారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం – తాడేపల్లిగూడెం సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కిన జల్లి ప్రవీణ్‌కుమార్‌ను టిక్కెట్ అడిగారు. కండక్టర్ టిక్కెట్‌కు సరిపడా చిల్లర ఇమ్మని ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. దీంతో ప్రవీణ్‌కుమార్ కండక్టర్‌ను దుర్భాషలాడుతూ క్యాష్‌బ్యాగ్ లాక్కొని, కొట్టడంతో పాటు, బస్సులోని రాడ్డుకు కండక్టర్‌ను కొట్టాడు. దీంతో కండక్టర్‌కు గాయాలయ్యాయి. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ నెల 14 నుంచి 16 వరకూ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. 26న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా కై కలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఆటపాక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత ఆదివారం చెప్పారు. జాబ్‌మేళాలో ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కై కలూరు నేషనల్ స్కూల్, నవతా రోడ్డు ట్రాన్స్‌పోర్టు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 160 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18–35 సంవత్సరాల వయస్సు కలిగిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9701357315, 6281119575 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చన్నారు. నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్ చింతలపూడి: నాగిరెడ్డిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చాట్రాయి మండలం కొత్తగూడెంకు చెందిన ముల్లంగి శ్రీనివాసరావు, ముల్లంగి రామేశ్వరం బైక్‌పై నాటుసారా రవాణా చేస్తుండగా 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.అశోక్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్వీఎల్ నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
సంరక్షించి.. సాగరంలో విడిచి..
నరసాపురం రూరల్: సంతానోత్పత్తి కోసం నరసాపురం మండలం చినమైనవానిలంక ప్రాంతానికి వచ్చి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టగా.. గుడ్లను సంరక్షించి పొదిగిన తర్వాత 34 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కనిపించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. అలా వచ్చి తీరంలో గుడ్లు పెడుతుండగా అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షిస్తున్నారు. ఫిబ్రవరి 3న తొలిసారిగా గుర్తించిన తాబేళ్ల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రాగా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సముద్రంలోకి విడిచి పెట్టారు. సంరక్షణ కేంద్రంలో ఇప్పటివరకూ 135 తాబేళ్లు పెట్టిన 14,300 గుడ్లు సేకరించి భద్రపరిచినట్టు సిబ్బంది తెలిపారు. తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె.రాంప్రసాద్, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. సముద్రంలోకి వెళుతున్న తాబేలు పిల్లలు సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్లు తొలిసారిగా 34 తాబేలు పిల్లల విడుదల -
రికవరీ ఏజెన్సీల మాఫియా?
తీగలాగితే డొంక కదిలింది ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలోని ఒక సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుకు ఫోన్ కాల్ వచ్చింది. తాను ఏలూరు నుంచి సీఐ నాగరాజును మాట్లాడుతున్నానని.. చింతలపూడిలోని ఒక వ్యక్తికి చెందిన ఆధార్, పాన్‌కార్డ్ అతని పూర్తి వివరాలు వాట్సప్‌లో ఇవ్వాలని చెప్పాడు. ఆమెకు అనుమానం రావడంతో ఏలూరులోని పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తీగ లాగితే.. మొత్తం డొంక కదిలింది. ఏలూరు శాంతినగర్‌లో థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో ఒక కార్యాలయాన్ని నడుపుతున్న ముఠా దొరికింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు త్రీటౌన్ పోలీసులు కార్యాలయంపై మూడు రోజుల క్రితం దాడి చేశారు. పత్తేబాద రోడ్డులోనూ ఇదే తరహా ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు ఏజెన్సీ మాఫియా ఫైనాన్స్ కంపెనీలు రుణాల రికవరీకి థర్డ్‌పార్టీ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏలూరు కేంద్రంగా ప్రైవేటు ఏజెన్సీ మాఫియా జనాలను పోలీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఏజెన్సీలో ఏలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు, తిరుపతికి చెందిన ఇద్దరు, బెంగుళూరుకు చెందిన మరో ఇద్దరు కీలక పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన గడ్డం కిషోర్ అలియాస్ నాగరాజు, మధ్యాహ్నపు వంశీకృష్ణ, ప్రవీణ్‌కుమార్, రియాజ్, వెంకట్, ఇబ్రహీం, మరో నలుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏజెన్సీ ముఠాలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత సమాచారం? ప్రైవేటు ఏజెన్సీల పేరుతో సాగుతున్న దందాతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల పేరుతో ఏకంగా సచివాలయ ఉద్యోగులను సైతం ప్రభావితం చేస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చూస్తే .. వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నకిలీ పోలీసులే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా ? లేక నిజంగానే ఎవరైనా పోలీస్ అధికారులు ఈ ఏజెన్సీలకు అండగా నిలుస్తున్నారా? అనేది సందేహంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రైవేటు ఏజెన్సీల ఆగడాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. దుగ్గిరాల ప్రాంతానికి చెందిన కలగంటి గోవింద్ కొంతకాలం క్రితం ప్రైవేటు ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. ఇటీవల అతనికి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు అతడిని కలిసి నీకు బీమా వస్తుంది.. కొంత కడితే ఇంక లోన్ కట్టాల్సిన పనిలేదని కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం థర్డ్‌పార్టీ ఏజెన్సీ పేరుతో సీఐ అంటూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలని, రూ.1.80 లక్షలు చెల్లించకుంటే చెక్‌బౌన్స్ కేసు నమోదు చేస్తామని, అల్లరి చేస్తామని, బెయిల్ కూడా రాదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏలూరు టౌన్: ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన రామసీత ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పర్సనల్ లోన్ తీసుకున్నారు. నాలుగేళ్లుగా కడుతూ ఉండగా ఆరు నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో బకాయి పడింది. రామసీతకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అమరావతి నుంచి సీఐను మాట్లాడుతున్నాను. మీపై హైకోర్టులో కేసు వేస్తున్నారు. మీ ఇంటికి గంటలో పోలీసు జీపు వస్తుంది. మిమ్మల్ని చెక్‌బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ బెదిరించారు. కొంతసేపటి తర్వాత పత్తేబాద సచివాలయానికి చెందిన ఒక మహిళా పోలీసు (మహిళా సంరక్షణ కార్యదర్శి) రామసీత ఇంటికి వచ్చి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారని.. మీపై చెక్‌బౌన్స్ కేసు పెట్టారని.. వెంటనే సంబంధిత ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుని బకాయి డబ్బులు కట్టకపోతే.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల పేరుతో భయభ్రాంతులు సచివాలయ సిబ్బందిని వినియోగిస్త్తున్న వైనం ఏలూరులో రెండు చోట్ల తాత్కాలిక ఆఫీసులు? 9 మందిపై కేసు నమోదు -
ట్రిపుల్ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు
పేద విద్యార్థులకు వైఎస్సార్ వరం నూజివీడు క్యాంపస్‌లో 2008 బ్యాచ్ విద్యార్థుల మనోగతం ముగిసిన మొదటి బ్యాచ్ ఉద్యోగుల సమ్మేళనం వారంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక సహకారం లేక అందుబాటులో ఉన్న విద్యతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీలు వారి జీవితాలను పూర్తిగా మార్చేశాయి. పేద వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులకు చేయందించి.. ఆరేళ్లపాటు రూపాయి ఖర్చు లేకుండా సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందించడంతో దానిని అందుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సాధించారు. దీంతో ఒకప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారంతా నేడు పేదరికంలో నుంచి బయటకు వచ్చారు. ఇదంతా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల వల్లే సాధ్యమైందని పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన తొలి బ్యాచ్ 2008–14 విద్యార్థుల సమ్మేళనం ఆదివారం కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు నాటి తమ పరిస్థితులను వివరించారు. – నూజివీడు వైఎస్సార్‌ని మరువలేం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మా సొంతూరు. ఇందిరమ్మ ఇంట్లో ఉండేవాళ్లం. కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. ఆ తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఎంటెక్ పూర్తి చేశా. 2018లో ఎస్సైగా ఎంపికయ్యా. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్నా. సొంతూరిలో ఇల్లు కట్టుకున్నా. ఆనందంగా బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని జీవితంలో మరిచిపోలేం. – చారీ రాంబాబుకొత్త ఇల్లు కట్టుకున్నాం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం భూమానపల్లి మా సొంతూరు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లేవారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. 2008లో ట్రిపుల్‌ఐటీలో సీటు రావడంతో అక్కడే సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2017లో మున్సిపాలిటీలో ఏఈఈ ఉద్యోగం వచ్చింది. దీంతో మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం. ట్రిపుల్‌ఐటీలో చదువుకోవడం వల్లే మా పేద కుటుంబంలో మార్పు వచ్చింది. – మురికిపూడి మరియదాసు ఫీజు కట్టలేని కుటుంబం మాది.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు మా ఊరు. పూరింట్లో ఉండేవాళ్లం. అమ్మానాన్న కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ఐటీ అనేది ఒకటి ఉందనే విషయమే తెలియదు. దరఖాస్తు చేయకుండానే సీటు వచ్చింది చేరమంటూ కాల్ లెటర్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2020లో ఆర్ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. మంచి ఇల్లు కట్టి అమ్మానాన్నలకు బహుమతిగా ఇచ్చా. ట్రిపుల్ఐటీ లేకపోతే మా తల్లిదండ్రులు బయటి కాలేజీల్లో చదివించేవారే కాదేమో. – తాడేపల్లి మౌనిక -
కాపులపై కూటమివివక్ష
కాపు ఐక్యవేదికలో ధ్వజమెత్తిన నేతలు తణుకు అర్బన్: కాపుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కాపులపై కుల వివక్ష, సవతితల్లి ప్రేమను చూపిస్తోందని కాపు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జె.నాగబాబు, ఉత్తరాంధ్ర తెలగ సంఘం చైర్మన్ పి.వెంకట రామారావు విమర్శించారు. ఆదివారం పైడిపర్రు కాపు కల్యాణమండపంలో కాపు ఐక్య వేదిక చైర్మన్ రాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు ఏదోరకంగా అందలమెక్కాలనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కాపుల భావోద్వేగాలను రెచ్చగొట్టి 95 శాతం కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నా రు. అయితే నేడు కాపుల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసి కుల వివక్షను చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం కాపుల ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కుల వివక్ష చూపిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇటీవల బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. హై కోర్టు కాపుల విషయంలో సమర్థించిన జీఓ 30 అ మలు చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల కు కేటాయించిట్టుగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లను బ్రాహ్మణ, క్ష త్రి య, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి కులాల్లో పేదల కు కొనసాగిస్తే సమన్యాయం జరుగు తుందన్నా రు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులపై అవలంబిస్తున్న వైఖరిని వీడాలని కోరారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 13తో అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ ఈ నెల చివరి వరకు భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కావడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అమ్మను దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలు సమర్పించారు. జాతరకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. దేవస్థానంలో శ్రీక్యూశ్రీ లైన్లు నిండాయి. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, చిత్రపటాల అమ్మకం, అమ్మవారికి కానుకల ద్వారా రూ.2,92,056 ఆదాయం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించిన వారిని శిక్షించాలి గణపవరం: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గణపవరం మండలం పిప్పరలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలు మేధావిగా కొనియాడిన బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. పేద, దళిత, నిమ్న జాతుల గుండెల్లో కొలువైఉన్న అంబేడ్కర్‌ను ఎవరు అవమానించినా సహించేదిలేదన్నారు. దళితుల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టి వారి మధ్య విభేదాలు సృష్టించడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు చోడదాసి జైపాల్, సబ్బితిరాజు, నీతిపూడి వెంకటేశ్వర్లు, ప్రసన్నకుమార్, వెన్నపుచంటి, బీర త్రిమూర్తులు, సారధి, మోహనరావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి స్పెషల్ ఆదాయం
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ గత ఐదేళ్లుగా మంచి ఆదాయంతో దూసుకుపోతోంది. పండుగలకు, తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ఏటా సంక్రాంతి, దసరా పండగలతోపాటు కార్తీక మాసంలో, అరుణాచలం తదితర తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ప్రజలకు ఆర్టీసీ బాగా చేరువైంది. రికార్డు స్థాయిలో ఆదాయం గత ఐదేళ్లుగా ఆర్టీసీ మంచి ఆదాయాన్ని సాధించింది. 2020లో ఏడాదికి రూ.48 లక్షల ఆదాయం సాధించగా.. 2024 నాటికి ఏడాదికి రూ.కోటి ఆదాయం ఆర్జించే స్థాయికి చేరింది. ఏటా సంక్రాంతికి ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి హైదరాబాద్‌కు పది రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రికార్డు స్థాయిలో రూ.99 లక్షల ఆదాయాన్ని సాధించింది. ఈ ఏడాది పంచారామాల ప్రత్యేక బస్సు సర్వీసులు నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.1.50 కోట్లు దాటనుంది. ప్రైవేటు బస్సుల దందాకు చెక్ పండుగ సీజన్లు తీర్థయాత్రలకు ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేసేవి. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులతో టిక్కెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారు కోరుకున్న తీర్థయాత్రలకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు వల్ల ప్రైవేటు బస్సుల టిక్కెట్ దందాకు చెక్ పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ద్వారా గత 5 ఏళ్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా విపత్తు రెండేళ్లలో కూడా సంక్రాంతి, దసరా, ఇతర తీర్థ యాత్రలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు. ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.5 కోట్ల రాబడి ఈ ఏడాది సంక్రాంతికి రూ.99.30 లక్షల ఆదాయం పండగలు, యాత్రలకు ప్రత్యేక సర్వీసులతో ప్రైవేటు దందాకు చెక్గత ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ఆదాయం ఏడాది సంక్రాంతికి ఇతర సర్వీసులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) 2020 36.93 11.80 2021 36.88 28 2022 54.62 30 2023 60 35 2024 70 40 2025 99.51ప్రత్యేక బస్సులతో మంచి ఆదాయం పండగలు, తీర్థ యాత్రలకు, దైవ దర్శనాలకు జిల్లాలోని 4 డిపోల నుంచి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసేలా టిక్కెట్ ధరలు పెంచకుండానే అన్ని పండుగలకు బస్సులు ఏర్పాటు చేసి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాం. సంక్రాంతి, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఎన్వీఆర్ వర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి -
హైవే మొబైల్ వెహికల్స్‌కు జీపీఆర్ఎస్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు పోలీసు శాఖలోని హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ అమర్చినట్లు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు జిల్లాలోని 8 హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హైవే మొబైల్ వాహనాలను పర్యవేక్షించటంతోపాటు ఏదైనా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా అవకాశం లభిస్తుందని డీఎస్పీ చెప్పారు. సిబ్బందికి రేడియం జాకెట్లు, బేటన్స్ అందజేశామని, మరింత సౌకర్యాలు కల్పిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారుల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం, మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపట్టేలా శ్రద్ద వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో హైవే మొబైల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83329 59175 లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని ఏలూరు డీఎస్పీ సూచించారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్ పెనుగొండ: మండలంలోని తామరాడలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో గుబ్బల జ్ఞానేశ్వరరావు(50)ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడుల్లో ఎస్సై ఆర్ మధుబాబు, హెచ్‌సీ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు. -
నిట్‌లో ఉత్సాహంగా మారథాన్
తాడేపల్లిగూడెం (టీఓసీ): పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు సూచించారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఆధ్వర్యంలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మారథాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, పరుగు, నడక, యోగా వంటివి ఎంతగానో దోహదం చేస్తాయని వీటి సాధన కోసం విద్యార్థులు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు. అనంతరం నిట్ ముఖద్వారం నుంచి బాలికల వసతి గృహాల వరకు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిట్ ముఖద్వారం వరకు మారథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి.జగన్మోహన్రావు, శారదా ప్రసన్న మాలిక్, సుశాంత్ కుమార్, బెహారా తదితరులు పాల్గొన్నారు.