
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: క్షేత్రంలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మే 7 నుంచి 14 వరకు జరగనున్న చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 11న రాత్రి స్వామివారి కల్యాణం, 12న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాలను, దర్శనం క్యూలైన్లను రంగులతో ముస్తాబు చేసేందుకు, అలాగే స్వామివారి పాదుకా మండప ప్రాంతంలో, ఆలయ ధ్వజస్తంభం వద్ద తాటాకు పందిళ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గుడి సెంటర్‌లోని ప్రధాన కూడలిలో 40 అడుగుల శ్రీవారి భారీ విద్యుత్ కటౌట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయ గోపురాలకు, పరిసరాలకు విద్యుద్దీప తోరణాలను అమర్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు.
మే 7 నుంచి ఉత్సవాలు ప్రారంభం
11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, 12న రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు