
ప్రజా పంపిణీ.. పర్యవేక్షణ లేమి
ఏలూరు (మెట్రో): ఇంతన్నారు.. అంతన్నారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు ఇది రాష్ట్రంలో కూటమి సర్కారు తీరు. ప్రజాపంపిణీ వ్యవస్థపై నిండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే నిత్యాసరాల సరఫరాలో కోతలు విధిస్తున్నారు.
ప్రజా పంపిణీని నిర్వీర్యం చేసేలా..
ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలను గుర్తించే ఆహార సలహా సంఘాల (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) ఏర్పాటులో నూ నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో రేషన్ సరఫరా లో లోటుపాట్లు, డీలర్ల మోసాలు, కార్డుదారుల సమస్యలు, వారి డిమాండ్లు వంటి వాటిపై చర్చించాల్సిన అవసరమే లేకుండా పోతుంది. తద్వారా ప్రజలు రేషన్ విషయంలో ఏ ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టనట్టుగా మారింది.
ఆహార సలహా సంఘాలు ఇలా..
రేషన్ సరుకులు సక్రమంగా అందేలా ఆహార సల హా సంఘాలు బాధ్యతలు నిర్వహిస్తాయి. ఆయా సలహా సంఘాలకు చైర్మన్‌గా సబ్‌కలెక్టర్ లేకుంటే డిప్యూటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా ఎంపీపీ, కన్వీనర్‌గా తహసీల్దార్, సభ్యులుగా ఎంపీడీఓ, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నా యకులు, డీలర్ల సంఘం అధ్యక్షులు, పాత్రికేయు లు, ఉపాధ్యాయులు ఉంటారు. రేషన్ షాపుల తనిఖీలు, బియ్యం సరఫరాపై నిఘా, తూకాల్లో మోసాలు వంటి బాధ్యతలను ఈ సంఘాలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఈ సంఘాలు ఏర్పాటు కాకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది.
మధ్యాహ్న భోజనాన్నీ..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అ మలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం నాణ్యత ప్రమాణాలను సైతం ఆహార సలహా సంఘాల సభ్యులు పరిశీలిస్తారు. అయితే ఇవి ఏర్పాటుకాకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వహణపైనా పర్యవేక్షణ కొరవడింది. దీంతో చిన్నారులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు కొరవడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
కందిపప్పు లేదు
నిత్యావసరాల సరఫరా విషయంలోనూ కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ అందించగా.. వాహనాలను తొలగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వీటి స్థానంలో రేషన్ దుకాణాలు పెంచుతామని ప్రకటించింది. అలాగే పూర్తిస్థాయిలో సరుకులను కూడా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వం సరఫరా చేసిన కందిపప్పుకు మంగళం పాడింది. పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం బియ్యం పంపిణీతోనే ప్రభుత్వం సరిపెడుతోంది.
ఆహార సలహా సంఘాల ఏర్పాటుఊసెత్తని ప్రభుత్వం
ప్రజా పంపిణీని పట్టించుకోని వైనం
సరుకుల్లో కోతలు.. మరో వైపు నిర్లక్ష్యం
కానరాని పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు
మధ్యాహ్న భోజన నిర్వహణపైనా పర్యవేక్షణ కరువు
జిల్లాలో వివరాలు
రేషన్ దుకాణాలు 1,123
ఎండీయూ వాహనాలు 395
రేషన్ కార్డులు 6,31,044
బియ్యం సరఫరా (నెలకు) 8,701.03 టన్నులు
పంచదార 218.75 టన్నులు