
ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి
ఆకివీడు: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని వారి అంతానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఉగ్రదాడులకు నిరసనగా స్థానిక వైఎస్సార్ సెంటర్‌లో శనివారం కొవ్వొతుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మోటుపల్లి గంగాధరరావు, ఎండీ.మస్తాన్ వలీ మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని కూడా మట్టుబెట్టాలన్నారు. అమరులైన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎండీ.జహంగీర్, ఎస్కే. ఆరీఫ్, ఎండీ.జక్కీ, ఎండీ.సిద్ధిక్, ఎస్కే.హుస్సేన్, గుండా సుందరరామనాయుడు, జీ.ధనరాజు, మోరా జ్యోతిరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, నిమ్మల నాగు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన