రాయితీ ఇచ్చినా రాబడి అంతంతే | - | Sakshi
Sakshi News home page

రాయితీ ఇచ్చినా రాబడి అంతంతే

Published Wed, Apr 23 2025 8:31 AM | Last Updated on Wed, Apr 23 2025 8:31 AM

రాయితీ ఇచ్చినా రాబడి అంతంతే

రాయితీ ఇచ్చినా రాబడి అంతంతే

నూజివీడు: మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, నగర పంచాయతీల్లో ముందస్తుగానే ఆస్తి పన్ను మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రాయితీపై ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఏప్రిల్‌ 30లోగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను బకాయిలను ఏకమొత్తంలో ఒకేసారి చెల్లిస్తే 50 శాతం రాయితీని ఇస్తూ బకాయిదారులకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఎంత అవకాశం కల్పించినా పన్నుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరో వారం రోజుల్లో (ఏప్రిల్‌ 30)తో గడువు ముగియనుంది. ఏలూరు జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలలో పది శాతం మాత్రమే ముందస్తుగా వసూలు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో 13 శాతం నుంచి 15 శాతం ఆస్తి పన్ను ముందస్తుగా వసూలైంది.

ప్రచారం ఏది?

ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ముందుగానే చెల్లిస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుందన్న విషయాన్ని పెద్దగా ప్రచారం చేయలేదు. దీంతో చాలా మంది ప్రజలకు తెలియకపోవడం, అరకొరగా రాయితీ ఇవ్వడం కూడా వసూళ్లు మందగించడానికి ఐదు శాతం మాత్రమే రాయితీ ఇవ్వడం వల్ల కూడా తక్కువ మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారు దీని గురించి పట్టించుకోలేదు. పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించే వారే రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. పది శాతం వరకు రాయితీ ఇస్తే దాదాపు 40 నుంచి 50శాతం వరకు వసూలై ఉండేదని పురపాలక సంఘం వర్గాలే పేర్కొంటున్నాయి.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో

వసూళ్లు ఇలా

ఏలూరు జిల్లాలో ఆస్తి పన్నును అత్యధికంగా వసూలు చేసి ఏలూరు కార్పొరేషన్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ డిమాండ్‌ రూ.49 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.5.40 కోట్లు వసూలైంది. చింతలపూడి నగర పంచాయతీలో డిమాండ్‌ రూ.2.58 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.16లక్షలు మాత్రమే వసూలైంది. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు మున్సిపాలిటీలో రూ.15.28కోట్ల డిమాండ్‌కు గాను రూ.2.29 కోట్లు వసూలు చేసిప్రథమ స్థానంలో ఉండగా, ఆకివీడు నగర పంచాయతీ కేవలం రూ.27లక్షలు మాత్రమే వసూలు చేసి చివరి స్థానంలో ఉంది.

ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునుపట్టించుకోని ప్రజలు

మరో వారమే గడువు

మున్సిపాలిటీ మొత్తం అసెస్‌మెంట్‌లు డిమాండ్‌ వసూళ్లు

ఏలూరు 70461 రూ.48.90 కోట్లు రూ.5.33 కోట్లు

జంగారెడ్డిగూడెం 14651 రూ.08.47 కోట్లు రూ.0.88 కోట్లు

నూజివీడు 13732 రూ.07.16 కోట్లు రూ.0.83 కోట్లు

చింతలపూడి 7262 రూ.02.58 కోట్లు రూ.0.16 కోట్లు

భీమవరం 32130 రూ.25.57 కోట్లు రూ.3.58 కోట్లు

తాడేపల్లిగూడెం 25508 రూ.16.49 కోట్లు రూ.2.02 కోట్లు

తణుకు 21450 రూ.15.28 కోట్లు రూ.2.29 కోట్లు

పాలకొల్లు 15092 రూ.08.68 కోట్లు రూ.1.08 కోట్లు

నర్సాపురం 14800 రూ.07.92 కోట్లు రూ.0.71 కోట్లు

ఆకివీడు 8048 రూ.03.42 కోట్లు రూ.0.27 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement