
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
జంగారెడ్డిగూడెం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి పట్టపగలు తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టి.నరసాపురం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఒంటెద్దు క్రాంతికుమార్‌రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు ఇటీవల డాంగేనగర్ ప్రాంతంలో రెండు చోరీలకు పాల్పడ్డాడని వివరించారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒంటెద్దు క్రాంతికుమార్‌రెడ్డి ప్లంబర్ పని చేస్తుంటాడని, ప్లంబింగ్ పనికి ఉపయోగించే కట్టర్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో ఇంటి తాళాలు పగులగొడతాడని డీఎస్పీ చెప్పారు. సీఐ వి.కృష్ణబాబు పర్యవేక్షణలో ఎస్సై షేక్ జబీర్ క్రాంతి కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. కాగా నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుల్ ఎన్.రమేష్, రాజశేఖర్‌లకు రివార్డుకు జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తామన్నారు.