
బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ద్వారకాతిరుమల: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో శుక్రవారం గల్లంతైన ద్వారకాతిరుమలకు చెందిన యువకుడు లాలూ నాయక్ (17) మృతదేహం శనివారం లభ్యమైంది. మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది స్నేహితులతో కలసి లాలూ నాయక్ పేరుపాలెం బీచ్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. అర్ధరాత్రి సమయం నుంచి అతడి ఆచూకీ కోసం స్నేహితులు వెదకడం మొదలు పెట్టారు. అయితే నీటి మునిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో, బీచ్ ఒడ్డున లాలూ నాయక్ మృత దేహం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతడి అన్నయ్య చిన్నాకు కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు కొవ్వూరు ఘాట్‌లో ఖననం చేశారు.