
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య
మే 15 వరకు అవకాశం
ఈ నెల 28 నుంచి మే 15 లోగా దరఖాస్తు చేసుకో వాలి. విద్యార్థులను లాటరీ ద్వారా పారదర్శ కంగా ఎంపిక చేస్తాం. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థల వద్ద ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం.
– పి శ్యామ్‌సుందర్, జిల్లా సమగ్రశిక్షా అదనపుప్రాజెక్టు కోఆర్డినేటర్, భీమవరం
భీమవరం: ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివించాలనే పేదల కోరిక నెరవేర్చేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానిని కొనసాగింపుగా ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరడానికి ఈనెల 28వ నుంచి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించారు. జిల్లాలో 2023లో 1,162 మంది విద్యార్థలు ప్రైవేటు స్కూళ్లలో సీట్లు దక్కించుకోగా 2024లో 1,163 మంది విద్యా ర్థులు అడ్మిషన్లు పొందారు. తల్లికి వందనం పథకంలో అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ అమలుచేయకపోవడంతో ఇప్పుడు పేదలు ఫీజుల భారం తగ్గించుకోడానికి ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యనైనా పొందాలని ఎదురుచూస్తున్నారు. ఒకటో తరగతిలో ప్రైవేటు స్కూల్స్‌లో చేరే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. గతంలో ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లలో చదువుకునే పరిస్థితి ఉండగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరే విద్యార్థలకు ఖర్చులేకుండా చదువుకునే అవకాశం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 705 ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకుగాను ఒకటో తరగతిలో 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ముందుగా ఆయా స్కూల్స్ ఉచిత విద్యకు రిజిస్ట్రర్ చేయించుకోవాలి. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను ఆడ పిల్లలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 6 శాతం ఇవ్వాల్సి ఉంది.
5 ఏళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశం
ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తుకు అవకాశం

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య