
ముంపు చేలను పరిశీలించిన అధికారులు
నిడమర్రు: ‘అటవీ శాఖ నిర్లక్ష్యం–అన్నదాత ఆక్రోశం’ అని సాక్షి పత్రికలో సోమ వారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తాహసీల్దారు నాగరాజు, వ్యవసాయ అధికారి గీతా కుమారితో కలిసి పెదనిండ్రకొలనులో నీట మునిగిన వరి చేలను పరిశీలించారు. మరో వైపు అటవీ శాఖ అధికారులు ముంపు నీటిని ఇంజిన్లతో, జేసీబీలతో బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి గంగారత్నం తెలిపారు. తహసీల్దారు మాట్లాడుతూ కౌలు రైతు వెంకన్న సాగు చేస్తున్న 7 ఎకరాల్లోని ముంపు నీటిని పూర్తిగా బయటకు తోడిన తర్వాత పంట నష్ట నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు.

ముంపు చేలను పరిశీలించిన అధికారులు