
విజయపథంలో విద్యావికాస్
జంగారెడ్డిగూడెం: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించినట్లు విద్యావికాస్ పాఠశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల్లో కె.రుష్మిత అత్యధికంగా 596 మార్కులు సాధించిందన్నారు. అలాగే 592 మార్కులు ఎం.జాయ్ నిస్సీ, ఎం.దేవిశ్రీ, ఎం.సంజన సాధించగా, 591 మార్కులు జి.వర్షిత, ఎన్.అక్షర, పి.దీపిక సాధించినట్లు చెప్పారు. 500కు పైబడి 150 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పి.సతీష్‌చంద్, వి.శ్రీనివాస్, పి.లక్ష్మీప్రసన్న, ప్రిన్సిపాల్ వి.ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.