
ధాన్యం సేకరణకు అన్ని చర్యలు చేపట్టాం
భీమడోలు: ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అన్నారు. గుండుగొలనులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయాధికారి హబీబ్ బాషాతో కలిసి ఆమె సందర్శించారు. ధాన్యం కేంద్రంలోని గోనె సంచుల వివరాలు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన లక్ష్యాలను వ్యవసాయ శాఖ సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి సమస్యలు ఆరా తీశారు. లారీలో దిగుమతవుతున్న గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. రైతులు సైతం చిల్లులు లేని సంచులు రావడంతో సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల లక్ష్యాలు పూర్తి కాగానే వెంటనే టార్గెట్లను నిర్ణయించి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామన్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసకుంటుందన్నారు. ఆపోహాలు తావివ్వవద్దని సూచించారు. ఏడీఏ డాక్టర్ పి.రాజకుమారి, ఏవో ఎస్‌పీవీ ఉషారాణి, మాజీ ఎంపీపీ కొండబాబు పాల్గొన్నారు.