
అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం
నిడమర్రు: అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కోత కు సిద్ధంగా ఉన్న ఏడెకరాల వరి పంట నీటి పాలైన సంఘటన పెదనిండ్రకొలనులో చోటుచేసుకుంది. రైతులు, అధికారుల వివరాల ప్రకారం.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అన్‌సర్వే భూముల్లో అనధికారంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులు శనివారం 17 ఎకరాల చేప ల చెరువుకు గండి కొట్టారు. దీంతో చెరువు నీరు పంట కాలువలు, బోదెల్లో నీరు ఎగదన్నడంతో సరి హద్దుల్లోని వరి చేలు ఆదివారం ముంపు బారిన ప డ్డాయి. కౌలు రైతు చెన్నుబోయిన వెంకన్నకు చెందిన ఏడెకరాల వరి చేను పూర్తిగా నీటమునిగి సు మారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేశామని బాధిత రైతు వాపోయాడు.
సమాచారం ఇవ్వకుండా..
కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమ చేపల సా గు చేస్తున్న వారికి, అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఇటీవల వ్యవహారం చెడింది. దీంతో పట్టుబడికి వచ్చిన చెరువులను గండి కొడతామని క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు పెడుతూ సొమ్ములు వసూ లు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నిడమర్రు కొల్లేరు పాయలో అన్‌సర్వే, జిరాయి తీ భూముల లెక్కలు తేల్చాలని రైతులు సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 29న సర్వేకు సిద్ధమవుతున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేష్, వ్యవసాయ శాఖ సి బ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు ఓ చెరువుకు గండి కొట్టారు. దీ నిపై అటవీ శాఖ డీఎఫ్‌ఓ డి.విజయను వివరణ కో రగా పూర్తి వివరాలు తెలియదని, తమ సిబ్బందిని విచారణకు ఆదేశించానని, నివేదిక అనంతరం ఉ న్నతాధికారులకు తెలుపుతామని సమాధానమిచ్చారు.
పరిహారంపై సందిగ్ధం
గండి విషయంలో తమకు సమాచారం లేదని, ఉంటే పంటను ఒబ్బిడి చేసుకోవాలని రైతును అప్రమ త్తం చేసేవారమని మండల వ్యవసాయ అధికారి పి.గీతాదేవి అన్నారు. ఈ–క్రాప్‌లో పంట నమోదు చేశామని, నష్టం విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ముంపు చేనును ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు.
కొల్లేరులో అక్రమ చెరువుకు గండి
నీరు ఎగదన్ని సమీపంలోనిఏడు ఎకరాల వరి పంట మునక
లబోదిబోమంటున్న రైతు
మరోసారి కూటమి మోసం
కొల్లేరును 3వ కాంటూరుకి కుదిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అభయా రణ్యం పరిధిలో జిరాయితీ పట్టా భూములన్న వారిపైకి అధికారులను పంపి వేధిస్తున్నారు. ఇలా మరోమారు చంద్రబాబు సర్కారు కొల్లేరు రైతులను మోసం చేసింది. కౌలు రైతు వెంకన్నకు నష్టపరిహారం ఇవ్వాలి.
–కోడే కాశి, జెడ్పీటీసీ, నిడమర్రు
అధికారులను వేడుకున్నా..
మా భూముల లెక్కల తేల్చాలని సర్వేకు నెల రోజుల క్రితమే ఆయ కట్టు జిరాయితీ రైతులంతా దరఖాస్తు చేసుకున్నాం. గండి కొట్టడానికి వచ్చిన అధికారులకు సర్వే అనంతరం అన్‌సర్వే, జిరాయితీ విడదీసిన తర్వాత గండి కొట్టాలని వేడుకున్నా అటవీ శాఖ సిబ్బంది వినలేదు.
– వగ్వాల సుబ్బారావు, జిరాయితీ భూమి రైతు, నిడమర్రు
మా గోడు వినలేదు
ఒక్క రోజు సమయం ఇవ్వండి కోత యంత్రంతో పంటను ఒబ్బిడి చేసుకుంటామని చెప్పి నా అధికారులు వినలేదు. చెరువుకు గండి కొట్టారు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 60 బస్తాల వరకూ పండింది. ఆదివారం కోతకు సిద్ధ మయ్యాం. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.
–బోరున విలపిస్తున్న చెన్నుబోని వెంకన్న, సుబ్బాయమ్మ దంపతులు

అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం

అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం

అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం