కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం

Published Sat, Apr 26 2025 1:35 AM | Last Updated on Sat, Apr 26 2025 1:35 AM

కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం

కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం

యలమంచిలి: యూత్‌ క్లబ్‌ నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి కళామందిరంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటిక పోటీలలో తొలి రోజు రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటగా గుడివాడకు చెందిన కృష్ణ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసి యేషన్‌ వారు ప్రదర్శించిన ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పీవీ సత్యనారాయణ రచించిన ఈ నాటకానికి పి.కృష్ణ హితేష్‌ దర్శకత్వం వహించారు. రెండవ నాటికగా హైదరాబాద్‌ విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక అలరించింది. ఈ నాటికను పరమాత్ముని శివరాం రచించారు.

సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు

పాలకొల్లు (సెంట్రల్‌): కూటమి నాయకులను ఎక్స్‌ ఖాతాలో దూషించారంటూ అందిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురువాడ గ్రామానికి చెందిన అమితి హరి ప్రసాద్‌అనే వ్యక్తిని అదుపు తీసుకున్నామని పాలకొల్లు టౌన్‌ పోలీసులు శుక్రవారం తెలి పారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఆయన కు టుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, బూతులు తిడుతూ వారి వ్యక్తిత్వహన నానికి పాల్పడ్డాడని పాలకొల్లుకు చెందిన టీడీపీ పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు ధనాని సూర్యప్రకాష్‌ ఫిర్యాదు చేశారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, లోకేష్‌లపై కూడా తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.రజిని కుమార్‌ తెలిపారు.

ఎంపీడీఓను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం

ఉంగుటూరు: ఉంగుటూరు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి గంజి రాజ్‌మనోజ్‌కు శుక్రవారం ఓ వింత అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎంపీడీఓకు ఓ నంబర్‌ నుంచి ఓ ఫోన్‌ వచ్చింది. లైన్‌లో ఉండండి ప్రిన్సిపల్‌ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారని ఎంపీడీఓకు ఫోను కలిపారు. నేను పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ త్రివేదిని అంటూ మాట్లాడుతూ మా మేనల్లుడు ఆశ్రం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు . డబ్బు సర్దండి అంటూ ఒక ఫోను నెంబరు చెప్పారు. పైగా ఈ విషయం ఎవరికి చెప్పకండంటూ చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఎంపీడీఓ ముందు తడబడినా ఆ తర్వాత పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సత్యభూషణ కుమార్‌ కదా? అని గుర్తు వచ్చి మిన్నకుండిపోయారు.

దొంగ అరెస్టు

భీమవరం: నడిచి వెళ్తున్న మహిళ మెడలో బంగారుచైన్‌ లాక్కుని పారిపోతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భీమవరం వన్‌టౌన్‌ ఎస్సై కృష్ణాజీ శుక్రవారం చెప్పారు. మెంటేవారితోటకు చెందిన జి.వాసవి బుధవారం మార్కెట్‌కు రైల్వే అండర్‌ టన్నెల్‌ నుంచి నడుచుకుంటూ వస్తుండగా పాలకొల్లుకు చెందిన కొప్పర్తి అలెగ్జాండర్‌ పౌల్‌ ఆమె మెడలోని చైన్‌ లాక్కుని పారిపోతుండగా వాసవి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు పౌల్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు.

లారీ తిరగబడి డ్రైవర్‌ మృతి

జంగారెడ్డిగూడెం: మండలంలోని పుట్లగట్లగూడెం నుంచి పంగిడిగూడెం వైపు వెళ్ళే గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే లారీ డ్రైవర్‌ ధనుంజయ్‌ సింగ్‌ (44) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లక్కవరం ఎస్సై శశాంక తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్‌ రాష్ట్రం పిప్రా గ్రామానికి చెందిన ధనుంజయ్‌ సింగ్‌ కొంత కాలంగా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే స్టాక్‌ పాయింట్‌లో కాంక్రీట్‌ మిక్చర్‌ లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం లారీలో కాంక్రీట్‌ తీసుకుని పంగిడిగూడెం వైపునకు వెళ్తున్నాడు. రహదారి మధ్యలో లారీ నిలిచిపోవడంతో పదేప దే లారీను స్టార్ట్‌ చేయగానే లారీ వెనక్కి వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి తిరగబడింది. ఈ ప్రమాదంలో ధనుంజయ్‌ సింగ్‌ తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలం వద్దనే మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సంస్థ ఫీల్డ్‌ ఆఫీసర్‌ కిషోర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement