
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
ఏలూరు (టూటౌన్): పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏలూరు అంజుమన్ మోహాఫీజువల్ ఇస్లాం సంస్థ హాల్లో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ సలహాదారుడు మాజీ మండలి చైర్మన్ ఎండీ షరీఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ నల్ల చట్టం అని అది ముస్లింల మనోభావాలను దేశవ్యాప్తంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మీ పార్టీకు చెందిన ముస్లిం, మైనారిటీ నాయకులు రాజీనామా చేస్తున్నారా? అనే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజీనామాలు చేయడంలో ప్రయోజనం ఉండదని పార్టీలో ఉండే తమ హక్కులు సాధించుకుంటామని అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి 41 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. వీళ్ళకి గతంలో ఏలూరులో వ్యాక్సినేషన్ సౌకర్యం ఉండేది కాదని యునైటెడ్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి హజ్ సర్వీసె సొసైటీ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పెట్టడం అభినందనీయమన్నారు. హజ్ యాత్రకు వెళుతున్న వారికి లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు. తొలుత అంజుమాన్ సంస్థ అధ్యక్షుడు జబివుల్లా కమిటీ, సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు షేక్ నసిరుద్దీన్ కమిటీ నాయకులు ఎండీ షరీఫ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో హజ్ సర్వీసెస్ సొసైటీ ఎస్‌కే నాగూర్ జానీ, జనరల్ సెక్రెటరీ ఎండీ ఖాలిద్ అహ్మద్, జాయింట్ సెక్రెటరీ ఎండీ హుస్సేన్ షరీఫ్, ట్రెజరర్ ఎస్.కె జావీర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.