
సివిల్స్‌లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక
నూజివీడు : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఒంగోలు క్యాంపస్‌లో 2016–22 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థిని సాయి శివాని యూపీఎస్‌సీ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించింది. గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి దేశంలో అత్యున్నత స్థాయిలో ర్యాంకు సాధించడం ఆమె కృషికి, పట్టుదలకు, అభ్యాసన పట్ల చూపిన నిబద్ధతకు నిదర్శనం. సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో ట్రిపుల్ ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్‌చార్జి చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయ్‌కుమార్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్ ఆమెకు అభినందనలు తెలిపారు.
త్రుటిలో తప్పించుకున్నాం
పాలకోడేరు: వారంతా కశ్మీర్‌లోని పహల్గాంలో కొద్దిలో ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షానికి చెందిన సోము చైతన్య దీపక్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. చైతన్య, అతని సోదరి అరుణ, స్నేహితుడు చిన్నారావులు వారి కుటుంబాలతో కలిసి ఈ నెల 20న పహల్గాం, గుల్మార్గ్ వెళ్ళి ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే గడిపారు. సోమవారం రాత్రి అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లిపోయారు. సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం వారు గడిపిన ప్రదేశంలోనే టూరిస్ట్‌లపై ఉగ్రదాడుల ఘటన తెలియడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి శ్రీనగర్‌లో రూంకే పరిమితమయ్యామని, గురువారం సాయంత్రం ఫ్లైట్‌కు తిరుగు ప్రయాణమవ్వాలని వారు తెలిపారు.
సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్‌లు
ఏలూరు(మెట్రో): సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్‌లు కావాల్సిన రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ పీవీఎస్ రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి సూక్ష్మ సేద్య పథకంలో 8,500 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్‌లు ఏర్పాటు చేస్తుందని, జిల్లాలో ఈ పథకం కింద 2003 నుంచి నేటి వరకు 1,15,329 హెక్టార్లకు సంబంధించి 93,003 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలుకు 84,810 హెక్టార్లు అందుబాటులో ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు (5 ఎకరాల వరకు) 100 శాతం సబ్సిడీ, ఇతర చిన్న, సన్నకారు రైతులకు (5 ఎకరాలకు మించకుండా) 90 శాతం రాయితీ పొందవచ్చు. మధ్య తరహా రైతులకు 70 శాతం రాయితీ, పెద్ద రైతులకు 50 శాతం రాయితీ పొందవచ్చును.
పాలిసెట్‌కు ఏర్పాట్లు
డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు
భీమవరం: పాలీసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వీఆర్వో పాలిశెట్టి–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కో ఆర్డినేటర్లు, అసిస్టెంట్ కో ఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 18 సెంటర్ల పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయగా వీటిలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. మొత్తం 7,254 మంది విద్యార్థులు పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సెల్‌ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. పరీక్షా కేంద్రాలు దగ్గరలో జిరాక్స్ షాపులు మూసివేయాలని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. సమావేశంలో జిల్లా ఖజానా అధికారి ఏ గణేష్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సన్యాసిరావు, జిల్లా కోఆర్డినేటర్ డి.ఫణీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సివిల్స్‌లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక

సివిల్స్‌లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక