
అమాయకులపై ఉగ్రదాడులు అమానుషం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన
ఏలూరు టౌన్ : కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత అమానుషమైన చర్య అని ప్రపంచ యావత్తు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ ఉగ్రదాడులను యావత్తు ప్రపంచం వ్యతిరేకించాలని కోరారు. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరివేయాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహ జ్వాలలు
భీమవరం: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం పట్టణంలో కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రదర్శనలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు మాట్లాడుతూ శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని అలాంటి దేశంలో ఉగ్రవాదుల చర్యలు దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతంగాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ఇతర దేశాలు పన్నుతున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రజలు తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. మరెక్కడా ఇటువంటి ఘటనలు తిరిగి చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీఎల్ నర్సింహరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, పార్టీ కార్యదర్శి ఏఎస్ రాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కర్రా జయచరిత, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, వైఎస్సార్‌సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బంధం పూర్ణచంద్రరావు, భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, పార్టీ నాయకులు కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, గంటా సుందరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అత్తిలిలో..
అత్తిలి: కశ్మీర్‌లో ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించి, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో చనిపోయిన వారికి శాంతి చేకూరాలని వైఎస్సార్‌సీపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అమాయకులపై ఉగ్రదాడులు అమానుషం

అమాయకులపై ఉగ్రదాడులు అమానుషం

అమాయకులపై ఉగ్రదాడులు అమానుషం