
పేరుపాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు
ద్వారకాతిరుమల: పేరుపాలెం బీచ్‌లో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది యువకులు శుక్రవారం ఉదయం ఒక ఆటోలో పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. మధ్యాహ్నం సరదాగా బీచ్‌లో స్నానం చేస్తున్నారు. అయితే ద్వారకాతిరుమలకు చెందిన లాలూ నాయక్(17), సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన మధు బీచ్ లోపలికంటూ వెళ్లారు. దాంతో లాలూ నాయక్ గల్లంతు కాగా, మధు ప్రాణాలతో బయటపడ్డాడు. సహాయక సిబ్బంది నాయక్ కోసం గాలిస్తున్నారు. తొమ్మిది మంది యువకులు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు.