
‘(అ) సత్యం’ నాటికకు మొదటి బహుమతి
భీమవరం: చైతన్య భారతి సంగీత, నృత నాటక పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నిర్వహించిన 18వ జాతీయస్థాయి నాటికల పోటీల్లో చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి ‘(అ) సత్యం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ప్రథమ బహుమతిని గెల్చుకుంది. విజేతల వివరాలను సోమవారం నాటిక న్యాయనిర్ణేతలు మానాపురం సత్యనారాయణ, ఎల్ రుద్రమూర్తి, సుసుము నాగ భూషణం వెల్లడించారు. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘జనరల్ భోగీలు’ ద్వితీయ బహుమతి, యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ‘నా శత్రువు’ తృతీయ బహుమతిని గెల్చుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ‘చిగురు మేఘం’, ఉత్తమ రచనగా ‘నా శత్రువు’, ఉత్తమ దర్శకత్వం బాలాజీ నాయక్ ((అ) సత్యం), ఉత్తమ నటుడు కావూరి సత్యనారాయణ (చెన్నయ్య పాత్రధారి – చిగురు మేఘం), ఉత్తమ నటి సురభి ప్రభావతి (సావిత్రమ్మ పాత్రధారిణి – జనరల్ భోగీలు), ఉత్తమ విలన్‌గా గోపరాజు విజయ్ (సీఐ పాత్రధారి – జనరల్ భోగీలు), ఉత్తమ హాస్యనటుడు పి కోటేశ్వరరావు (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ బాల నటుడు యశ్విత (నా శత్రువు), ద్వితీయ ఉత్తమ నటుడు చెరుకూరి సాంబశివరావు (కిడ్నాప్), ద్వితీయ ఉత్తమ నటి జ్యోతిరాణి (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గంగోత్రి సాయి (విడాకులు కావాలి) ఎం రత్నకుమారి (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్ (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ సంగీతం లీలమోహన్ (అ సత్యం), ఉత్తమ మేకప్ థామస్ (ఉక్కు సంకెళ్ళు), జ్యూరీ బహుమతి చిగురు మేఘం, ఇది రహదారి కాదు నాటికలు గెల్చుకున్నాయి. విజేతలకు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్‌కుమార్‌రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్ తదితరులు బహుమతులు అందజేశారు.