Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Operation Sindoor: India Pakistan War Updates1
భారత్‌ భీకర దాడులతో పాక్‌ కకావికలం

India-Pakistan War Updates:ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ భేటీపాక్‌ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్‌ రివ్యూసైబర్‌ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్‌ పాక్‌ పార్లమెంట్‌ లో రక్షణ మంత్రి అసిఫ్‌ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్‌ డిఫన్స్‌ వ్యవస్థ విఫలంపాక్‌ రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్‌ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్‌ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్‌, ఐబీ చీఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలుమరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్‌ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్‌ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్‌ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్‌- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్‌ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్‌, వార్‌ మెమోరియల్‌ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్‌ వెళ్లిన 10 మంది పంజాబ్‌ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్‌లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్‌-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్‌ పంట పొలాల్లో కూలిన పీఎల్‌-15 మిస్సైల్‌భారత్‌ భీకర దాడులతో పాక్‌ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్‌ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్‌ ఫోర్స్‌👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్‌.. ఇండియా గేట్‌ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్‌, రాజస్థాన్‌ వెళ్లే వాహనాలు బంద్‌👉కాసేపట్లో సీడీఎస్‌, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీపాకిస్థాన్‌ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్‌ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్‌ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ భేటీ 👉ఆపరేషన్ సిందూర్‌.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్‌ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్‌ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్‌ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్‌👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్‌ దాడులు, భారత్‌ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్‌ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్‌ ఎటాక్‌ దిగిన భారత్‌లాహోర్‌, సియాల్‌కోట్‌, కరాచీపై భారత్‌ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్‌ చేసిన ఇండియన్‌ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్‌ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్‌ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్‌ మొదలుకుని జమ్మూ కశ్మీర్‌ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్‌ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్‌’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్‌ యుద్ధ విమానాన్ని ఎస్‌–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్‌–17, ఒక ఎఫ్‌–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్‌ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్‌ తదితర నగరాల్లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్‌)ను తుత్తునియలు చేసింది. పాక్‌ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్‌ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) చీఫ్‌తో అమిత్‌ షా చర్చించారు. ఇండో–పాక్‌ సరిహద్దుసహా బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంట భద్రతను బీఎస్‌ఎఫ్‌ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్‌లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

Tension In Pakistan Due To Indian Army Attacks2
దెబ్బ మీద దెబ్బ.. భారత్‌ దాడులతో పాక్‌ బెంబేలు

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. ఇదిలా ఉండగా, పాక్‌ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్‌ చేశారు. పాక్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్‌ పిరికిపంద అంటూ పాక్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్‌ మేజర్, సీనియర్‌ ఎంపీ అయిన తాహిర్‌ ఇక్బాల్‌ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్‌.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్‌ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్‌ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్‌ ఆధారపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్‌వై–80, ఎఫ్‌ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్‌వై–80ను పాక్‌ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్‌ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు.

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Govt3
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్‌

సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన‌ మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

IPL 2025 Postponed Indefinitely Amid India Pakistan Tensions4
ఐపీఎల్‌ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్‌ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్‌ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్‌-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ రద్దైంది. షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్‌ అవుట్‌ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్‌ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్‌ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక​్‌ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్‌ చీఫ్‌ అరుణ్‌ ధుమాల్‌ ప్రకటించాడు.మ్యాచ్‌ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్‌ ద్వారా పఠాన్‌కోట్‌ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ స్కోర్‌ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్‌ ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (28 బంతుల్లో 50 నాటౌట్‌; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్‌.. ఈ మంగళవారం​ అర్దరాత్రి పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు.ఇందుకు బ‌దులుగా పాకిస్తాన్‌ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్‌ చేసింది. పాక్‌ దుశ్చర్యకు భార‌త్ సైతం ధీటుగా బ‌దులిస్తోంది. భార‌త బ‌ల‌గాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది.

China Raises Concern Over Escalating India Pakistan Tensions5
భారత్‌-పాక్‌ యుద్ధంపై చైనా రియాక్షన్‌

భారత్‌-పాక్‌ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్‌ మాట్లాడుతూ.. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.పొరుగు దేశాలైన భారత్‌-పాక్‌ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు.ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్‌ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్‌ ఓవల్‌ ఆఫీసులో ట్రంప్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు.

#Single Movie Review And Rating In Telugu6
‘#సింగిల్‌’ మూవీ రివ్యూ

శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్‌, శ్వాగ్‌ చిత్రాలతో రెండు సూపర్‌ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘#సింగిల్‌’ అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. . ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘సింగిల్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 9) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(#Single Movie Review).కథేంటంటే..?ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. విజయ్‌ ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. తన జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటాడు. ఓ సారి మెట్రో ట్రైన్‌లో పూర్వ(కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి స్నేహితుడు అరవింద్‌(వెన్నెల కిశోర్‌)తో కలిసి రకరకాల ప్లాన్‌ వేస్తాడు. ఇదే సమయంలో విజయ్‌ లైఫ్‌లోకి హరిణి(ఇవానా) వస్తుంది. పూర్వని ప్రేమలో పడేయడానికి విజయ్‌ ఏంఏం పనులో చేస్తాడో.. హరిణి కూడా కూడా అలానే చేస్తుంది. అసలు హరిణి ఎవరు? విజయ్‌ ఛీ కొట్టినా అతని వెనకాలే ఎందుకు తిరిగింది? చివరకు విజయ్‌ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదా హరిణి ప్రేమలో విజయ్‌ పడిపోయాడా? లేదంటే మళ్లీ విజయ్‌ సింగిల్‌గానే మిలిగిపోయాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే(#Single Movie Review ).ఎలా ఉందంటే.. హీరో ఒక హీరోయిన్‌ని ప్రేమించడం, మరో హీరోయిన్‌ అతన్ని ప్రేమించడం.. చివరకు ఈ విషయం ముగ్గురికి తెలిసి.. ఒకరు త్యాగం చేసి మరొకరు హీరోని పెళ్లి చేసుకోవడం.. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు అన్ని ఇలానే ఉంటాయి. దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న స్టోరీ కూడా ఇలానే ఉంటుంది కానీ క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన ట్వీస్ట్‌ కొత్తగా ఉంటుంది. ‘క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటే నా కల్ట్‌ ప్యాన్స్‌ ఒప్పుకోరు’ అంటూ హీరోతోనే ఓ డైలాగ్‌ చెప్పించడమే కాకుండా..దానికి తగ్గట్లుగానే ముగింపు డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడు. కథ పరంగా చూస్తే ఇదొక్కటే కొత్త పాయింట్‌. మిగతాదంతా రొటీన్‌, రెగ్యులర్‌ స్టోరీ. కానీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ , రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాను కాపాడాయి. తెలిసిన కథే అయినా తెరపై శ్రీవిష్ణు వేసే పంచ్‌ డైలాగులకు, వెన్నెల కిశోర్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయి. ఎలాంటి సాగదీతలు లేకుండా సినిమా ప్రారంభంలోనే ట్రైయాంగిల్‌ ప్రేమకథను మొదలు పెట్టాడు దర్శకుడు. పూర్వని పడేసేందుకు విజయ్‌ చేసే పనులన్నీ రొటీన్‌గానే ఉన్నా.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వెజ్‌, వన్‌లైన్‌ పంచ్‌లు బాగా పెలడంతో బోర్‌ కొట్టదు. కథ ఏమిలేకున్నా ఫస్టాఫ్‌ కథనం ఫాస్ట్‌గానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మూర్తి(రాజేంద్ర ప్రసాద్‌) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతమేర ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడు దర్శకుడు. ఓ యంగ్‌ హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్లు గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ముగింపు మరింత కొత్తగా అనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లు చెప్పుకోవడానికి పెద్ద కథ లేకపోయినా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే మాత్రం కచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. శ్రీవిష్ణు ఓ సినిమా ఒప్పుకున్నాడంటే..అందులో కొత్త పాయింట్‌ అయినా ఉండాలి లేదంటే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా అందించాలి. ఇది రెండో రకం సినిమా. దానికి తగ్గట్లుగానే శ్రివిష్ణు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే సినిమాకు ప్లస్‌ అయింది. రొటీన్‌ సీన్లను కూడా తనదైన నటనతో హీలేరియస్‌గా మార్చేశాడు. ఇందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ.. అవి బూతులు అనే విషయం తెలియకుండా శ్రీవిష్ణు తనదైన డైలాగ్‌ డెలివరీతో మ్యానేజ్‌ చేశాడు. శ్రీవిష్ణుకి తోడుగా వెన్నెల కిశోర్‌ ఉండడం మరో ప్లస్‌ పాయింట్‌. కామెడీ విషయంలో వీరిద్దరు పోటీపడి నటించారు. కేతికా శర్మ, ఇవానా కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్‌ తెరపై కనిపించేంది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు గుర్తుంచుకునే విధంగా ఉండవు కానీ కథలో భాగంగా వస్తూ.. వినసొంపుగానే ఉంటాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెట్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉనాయి.

Indian Oil assures ample petrol diesel LPG stock across country7
పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై టెన్షన్‌.. ఆయిల్‌ కంపెనీ క్లారిటీ

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత వస్తుందేమోనన్న ఆందోళనతో పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాలను ముందే కొని నిల్వ చేసుకునేందుకు దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టత ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ మేరకు ఐఓసీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ చేసింది. "భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంధనం, ఎల్పీజీ మా అన్ని అవుట్‌లెట్‌లలో సమృద్ధిగా అందుబాటులో ఉంది" అని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ వద్ద ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. వినియోగదారులు అనవసర ఆందోళనతో పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తవద్దని సూచించింది.ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ భయాందోళనలు నెలకొన్నాయి.#IndianOil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly.There is no need for panic buying—fuel and LPG is readily available at all our outlets.Help us serve you better by staying calm and avoiding unnecessary rush. This will keep our…— Indian Oil Corp Ltd (@IndianOilcl) May 9, 2025

Kommineni Comments On Chandrababu Govt Allocation Of Land To Ursa8
ఉర్సాకు పెట్టుపోతలు పూర్తయినట్టేనా?

కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్‌ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్‌లైన్‌లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్‌సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్‌లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Indiato Seek Checks On Imf Loans To Pak At Meet9
పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?

ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్‌ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్‌ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్‌ సమర్పించిన సంగతి తెలిసిందే.కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్‌ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్‌ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్‌ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్‌ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్‌ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్‌ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

Why India corporate sector retirement age is shifting from 60 to 4510
60 నుంచి 45 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ వయసు?

శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్‌ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్‌ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement