
వారెవ్వా.. షవర్ బాత్
శ్రీవారి కొండపై జల్లు స్నానంతో సేదతీరుతున్న మూగజీవాలు
భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలోని దేవస్థానం గో సంరక్షణశాలలో మూగజీవాలు షవర్ బాత్‌లు చేస్తూ ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఎక్కడాలేని విధంగా దేవస్థానం అధికారులు ఈ మూగజీవాల కోసం రూ. 2 లక్షలు పైగా వెచ్చించి గో, గజ శాలల్లో గతంలోనే షవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆవులు, గిత్తలకు, అలాగే అశ్వానికి షవర్ల కిందే సిబ్బంది జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా గజలక్ష్మి సైతం జల్లు స్నానంతో ఉపసమనాన్ని పొందుతోంది. కజానా బాతులైతే ఎక్కువ సమయం గోసంరక్షణశాలలోని కొలనులోనే ఉంటున్నాయి. ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి.
– ద్వారకాతిరుమల

వారెవ్వా.. షవర్ బాత్

వారెవ్వా.. షవర్ బాత్

వారెవ్వా.. షవర్ బాత్