
నివేదిక అందించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం
దెందులూరు: కొంప ముంచిన నకిలీ మొక్కలు శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. చల్ల చింతలపూడిలో కమ్మ బ్రహ్మాజీ అనే రైతుకు ఇచ్చిన పామాయిల్ మొక్కల్లో బెరుకు మొక్కలు రావడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. ఈ మేరకు దెందులూరు నియోజకవర్గ హార్టికల్చర్ అధికారి, సైంటిస్టులు పామాయిల్ కంపెనీ ప్రతినిధులను వెంటనే బాధిత రైతు గ్రామానికి వెళ్లి పామాయిల్ బెరుకు మొక్కలను పరిశీలించి తనకు నివేదిక అందజేయాలని హార్టికల్చర్ ఏలూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహనరావు ఆదేశించారు.
నేడు ఏలూరులో మాదిగ సంక్షేమ
ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పర్యటన
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి బుధవారం ఏలూరు జిల్లాలో పర్యటిస్తారని, ఎస్సీ సొసైటీ కార్యనిర్వాహక సంచాలకుడు ఎం.ముక్కంటి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11.30కు కలెక్టరేట్ కాంపౌండ్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తారని స్పష్టం చేశారు.