వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగరాజు మృతి
బుట్టాయగూడెం: మండలంలోని బూరుగువాడకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కుంజా నాగరాజు(45) మంగళవారం కారు ప్రమాదంలో మృతి చెందాడు. పులిరాముడుగూడెం నుంచి రవ్వారిగూడెం మీదుగా అడ్డదారిలో కామయ్యకుంట వెళ్తున్న సమయంలో నాగరాజు డ్రైవింగ్ చేస్తున్న కారు లోయలోకి దూసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ సమయంలో స్టీరింగ్ నాగరాజు శరీరానికి గుద్దుకోవడంతో మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు యు.ఏసుబాబు, రవ్వారిగూడెం గ్రామస్తులు, బంధువులు నాగరాజు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా నాగరాజు మృతిపై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు.
లోయలోకి దూసుకెళ్లిన కారు