
భారతీయ బిలియనీర్, ముఖేష్ అంబానీ కుమార్తె, ఇషా అంబానీ పిరమల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపార మహిళలలో ఒకరు. 32 సంవత్సరాల వయస్సులో, ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా కంపెనీని పరుగులు పెట్టిస్తోంది. 2022లో వ్యాపారవేత్తను ఆనంద్ పిరమిల్‌ను పెళ్లాడిన ఇషా ఆదియా ,కృష్ణలకు(కవలలు) తల్లి. రిటైల్ వారసురాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో కీలక బాధ్యతల్లో ఉన్న ఇషా గత సంవత్సరం, ఫిబ్రవరి 2024లో మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు గెల్చుకుంది. అలాగే, టైమ్ మ్యాగజైన్ టైమ్100 నెక్స్ట్ రైజింగ్ స్టార్ల జాబితాలో పేరు సంపాదించింది.
ఇషా అంబానీ నివసించే విలాసవంతమైన ఇల్లు గురించి ఎపుడైనా ఆలోచించారా? ముంబై నడిబొడ్డున ఉందీ అద్భుతమైన ఇల్లు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, పచ్చదనంతో నిండిన అద్భుతమైన దృశ్యాలు ఆధునిక డిజైన్‌ను సాంప్రదాయ అంశాల సమ్మితంగా ఉంటడంలో ఆశ్చర్యమేముంది. చక్కని వాస్తు, అద్భుతమైన ఇంటీరియర్స్, నుండి అత్యాధునిక సాంకేతికత వరకు ప్రతీ కార్నర్ అంబానీ శైలిని, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి.
డైమండ్ థీమ్డ్ ఇల్లు
ఇషా అంబానీ , ఆనంద్ పిరమల్ విలాసవంతమైన నివాసం అయిదు అంతస్తుల భవనం ‘గులిటా’. ఈ అతి విలాసవంతమైన ఇల్లు భారతదేశంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటైన ముంబైలోని వర్లిలో ఉంది. అరేబియా సముద్రం తీరాన, గాలి, అలల హొయల లయల మధ్క 3-D డైమండ్ థీమ్‌తో ఉంటుందీ అపార్ట్‌మెంట్. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు లగ్జరీలకు కొదువే లేదు. లండన్‌కు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్చరల్ కంపెనీ ఎకర్స్లీ ఓ'కల్లఘన్ దీన్ని డిజైన్ చేసిందట. దీన్ని ఆనంద్ తల్లిదండ్రులు అజయ్ , స్వాతి పరిమల్ వివాహ బహుమతిగా ఇచ్చారట. అప్పటికి దీని విలువు దాదాపు వెయ్యి కోట్లు రూపాయలు. 2012లో హిందూస్తాన్ యూనిలీవర్ నుండి భూమిని కొనుగోలు చేసింది. దీన్ని రెన్నోవేషన్ కోసం 500 కోట్లు చెల్లించారట.
ఇంటీరియర్స్
ఇంద్రభవనం లాంటి ఇల్లు కళాత్మకమైన ఇంటీరియర్స్‌తో నిండి ఉంటుంది. ఈ ఇంటిలో11 మీటర్ల పొడవైన పైకప్పుతో అలంకరించబడిన లివింగ్ రూమ్ ,ఓపెన్ స్విమ్మింగ్ పూల్, బహుళ లివింగ్ రూములు, డైమండ్ రూమ్,మాస్టర్ బెడ్‌రూమ్ డబుల్-హైట్ మల్టీ-పర్పస్ లాంజ్, లాంటి అన్ని హంగులతో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు పిల్లల సౌకర్యార్థం, ఇన్-హౌస్ వైద్యులు, బట్లర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది, అనేక ఇతర ముఖ్యమైన సేవలు వంటి సౌకర్యాలు మరిన్ని ఉన్నాయి.