
కావలసిన పదార్థాలు:
శనగపిండి – 2 కప్పులు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – రెండున్నర కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత
తయారు చేసే విధానం: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్, ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లెడ సహాయంతో దోరగా వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి ఏలకుల పొడి, కలిపి లడ్డూగా చుట్టుకోవాలి.
(చదవండి: వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి)