
భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్‌గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.
ముఖేష్ అంబానీ బర్త్‌డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్‌డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలయన్స్ బాస్‌కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్‌కర్ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్‌తో అలంకరించింది.

కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్‌లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్‌గా ఎదిగారు. ముఖేష్ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు.