జపాన్‌ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..! | Origami: The Japanese Art of Paper Folding To Create Lord Venkateswara | Sakshi
Sakshi News home page

జపాన్‌ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!

Published Wed, Apr 30 2025 11:48 AM | Last Updated on Wed, Apr 30 2025 1:45 PM

Origami: The Japanese Art of Paper Folding To Create Lord Venkateswara

ఒరిగామిపై 1988లో  ఆసక్తి పెంచుకున్న రవి కుమార్‌ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేలా ఈ కళ ఉపకరిస్తుందని గుర్తించారు. ‘ఒరిగామి ద్వారా గణితం – రవికుమార్‌ తోలేటి’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. కోవిడ్‌ సమయంలో విద్యార్థుల కోసం డీఐవై మోడల్స్‌ వీడియోలుగా అందించడంతో పాటు, శాస్త్రవేత్తల స్థాయిలో ప్రాజెక్టులు రూపొందించేందుకు ప్రేరణనిచ్చారు. 

పలు అవార్డులు.. 
గతంలో రవి కుమార్‌కు ఎన్‌సీఈఆర్‌టీ ఇన్నోవేషన్‌ అవార్డు (2002), రాష్ట్రపతి పురస్కారంగా ‘నేషనల్‌ టీచర్స్‌ అవార్డు’ (2005), కేవీఎస్‌ నేషనల్‌ ఇన్నోవేషన్‌ అవార్డులు (2012, 2019) లభించాయి. అలాగే 2022లో ప్రపంచంలో అతి పెద్ద ఒరిగామి నెమలిని రూపొందించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 

నాలుగేళ్లు పట్టింది.. 
ఒరిగామి కళతో ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి సుమారు నాలుగేళ్ల సమయం పట్టింది. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఒరిగామిని వినియోగిస్తున్నా. ఇది ప్రాచీన జపాన్‌ కళ కాగా, ప్రస్తుతం పలు రంగాల్లో విస్తరిస్తోంది. ఇది కేవలం కళ కాదు, సృజనాత్మకత, ఆవిష్కరణల సమ్మేళనం.  
– రవి కుమార్‌ తోలేటి, ఒరిగామి కళాకారుడు  

(చదవండి: కొవ్వొత్తులతో పీస్‌ వాక్‌..! తీవ్రవాద నిర్మూలన, శాంతి స్థాపనకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement