
మన చిన్నతనంలోని విషయాలు ఎవ్వరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంత తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్, లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే..వెంటనే తన్మయత్వానికి గురవ్వుతాం. నాటి రోజులన్నీ కనుల ముంగిట మెదిలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే..!. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతున్నాడు ఈ యూకే వ్యక్తి.
యూకే(UK)కి చెందిన కంటెంట్ క్రియేటర్ రాల్ఫ్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.."నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అనే క్యాప్షన్‌ని కూడా జోడించాడు. అంతే ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందర్నీ కదలించింది.
ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం(Childhood ) గడిచిన ఇంటిని చూసినప్పడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటాని ఓ పిచ్చిలా అనిపించినా..అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్లముందు కదలాడుతున్నాయి అంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్ని వరుసగా గుర్తుకొస్తున్నాయి..అంటూ భావ్వోద్వేగానికి గురయ్యాడు.
ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలయమైన ఆ ఇంటికి చేరుకోగానే..ఆ ఇంటి తలుపు తట్టి యజామని పర్మిషన్ తీసుకుని మరీ ఆ ఇల్లంతా కలియతిరిగాడు. అంతేగాదు తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటిని ఎలా వదిలేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు ఆ వీడియోలో.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్..! మెచ్చుకోకుండా ఉండలేరు)