
వాషింగ్టన్: అమెరికాలోని సిన్సినాటిలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోయారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డూ యూనివర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఇతడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం ధ్రువీకరించారు.
వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎంబీఏ చదువుకుంటున్న వివేక్ సైనీ(25) అనే భారతీయ విద్యార్థిని జూలియన్ ఫాక్‌నర్ అనే డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి దారుణంగా పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.