
పుట్టిన రోజు కోసం విమానంలో విహార యాత్రకు
భారత సంతతికి చెందిన వైద్యురాలి కుటుంబంలో ఆరుగురు దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్‌షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్‌షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్‌లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.
బాధితులు వివరాలు
భారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్‌గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.
డా. జాయ్ సైని ఎవరంటే..!
మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్‌లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.
పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.