సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌గా  13 ఏళ్ల బాలుడు | Donald Trump appoints 13-year-old cancer survivor as Secret Service agent | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌గా  13 ఏళ్ల బాలుడు

Published Thu, Mar 6 2025 6:12 AM | Last Updated on Thu, Mar 6 2025 6:12 AM

Donald Trump appoints 13-year-old cancer survivor as Secret Service agent

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్‌ విజేత డీజే డేనియల్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ గౌరవ ఏజెంట్‌గా నియమించారు. కాంగ్రెస్‌ తొలి సంయుక్త సమావేశంలో  డీజే విజయగాథను ట్రంప్‌ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్‌ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు. 

కానీ.. పోలీసు ఆఫీసర్‌ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్స ర్‌ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ గౌరవ ఏజెంట్‌గా చేయాలని డైరెక్టర్‌ సీన్‌ కరన్‌ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది.  సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ కరన్‌ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement