
సియోల్: ఉత్తరకొరియా ఆదివారం సముద్ర జలాలపైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ దీన్ని ధ్రువీకరించాయి. డిసెంబర్ 18న కూడా అమెరికా ప్రధాన భూభాగంపై సైతం దాడి చేయగల సామర్థ్యమున్న ఘన ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్–18ని ఉత్తర కొరియా ప్రయోగించింది.
ఏప్రిల్‌లో దక్షిణకొరియాలో, నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉత్తరకొరియా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.