
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి. అవి..పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్.
ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమా లియా, పాకిస్తాన్‌లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి నుంచి రెండేళ్ల పాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి.