స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్‌ | PM Narendra Modi says Quad here to stay holds 'fruitful' talks with Joe Biden | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్‌

Published Mon, Sep 23 2024 4:45 AM | Last Updated on Mon, Sep 23 2024 4:45 AM

PM Narendra Modi says Quad here to stay holds 'fruitful' talks with Joe Biden

అదే క్వాడ్‌ లక్ష్యం: మోదీ 

క్వాడ్‌ శిఖరాగ్రంలో ప్రసంగం 

విలి్మంగ్టన్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: ‘క్వాడ్‌’ కూటమి ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ కోసమే అది కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. ప్రపంచదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను క్వాడ్‌ గౌరవిస్తోందని అన్నారు. సంఘర్షణలు, సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, సమగ్ర, శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో–పసిఫిక్‌కు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

అమెరికాలో డెలావెర్‌లోని విలి్మంగ్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం జరిగిన క్వాడ్‌ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రారం¿ోపన్యాసం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆతిథ్యమిచి్చన ఈ సదస్సులో ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు ఆంథోనీ అల్బనీస్, ఫుమియో కిషిదా కూడా పాల్గొన్నారు. భిన్న రంగాల్లో క్వాడ్‌ దేశాలు పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని మోదీ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణమార్పులు, మౌలిక సదుపాయా కల్పనతోపాటు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. క్వాడ్‌ సదస్సులో ఫలవంతమైన చర్చ జరగబోతోందని వ్యాఖ్యానించారు.  

వ్యూహాత్మక బంధం బలోపేతం 
ప్రపంచమంతటా శాంతియుత పరిస్థితి నెలకొనాలన్నదే క్వాడ్‌ ఆకాంక్ష అని కూటమి నేతలు స్పష్టం చేశా రు. ఇండో–పసిఫిక్‌ దేశాల బాగు కోసమే కూటమి ఏర్పాటైందన్నారు. ‘ఇండో–పసిఫిక్‌ సంక్షేమానికి కృషి చేస్తున్న శక్తి క్వాడ్‌’ అని ఉద్ఘాటించారు. తమ కూటమి దేశాల మధ్య వ్వూహాత్మక బంధం గతంలో ఎన్నడూ లేనంతగా బలపడిందని వెల్లడించారు.

 సదస్సు అనంతరం నేతలంతా ఈ మేరకు ఉమ్మడి డిక్లరేషన్‌ విడుదల చేశారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఇటీవల జరిగిన మిస్సైల్‌ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చైనా తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండో–పసిఫిక్‌ విద్యార్థులకు 50 క్వాడ్‌ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు భారత్‌ ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికింద మొత్తం 5 లక్షల డాలర్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. 

నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు 
క్వాడ్‌ సదస్సు సందర్భంగా ప్రధానులు అల్బనీస్, కిషిదాతో పాటు బైడెన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రతపై భారత వైఖరిని వివరించారు. ఆయా దేశాలతో బంధాల బలోపేతంపై సంప్రదింపులు జరిపారు.

ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ చొరవ ప్రశంసనీయం: బైడెన్‌ 
మోదీపై బైడెన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గత నెలలో ఉక్రెయిన్‌లో చరిత్రాత్మక పర్యటన చేపట్టడం, శాంతి సందేశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. మోదీకి బైడెన్‌ శనివారం విలి్మంగ్టన్‌లోని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా ఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. 

భారత్‌ గళం బలంగా వినిపించేలా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలకు తాను మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా బైడెన్‌ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కలి్పంచేందుకు తన మద్దతు ఉంటుందన్నారు. మోదీ–బైడన్‌ భేటీపై భారత్, అమెరికా ఒక ఫ్యాక్ట్‌ïÙట్‌ విడుదల చేశాయి.  అమెరికాకు చెందిన జనరల్‌ అటామిక్స్‌ సంస్థ నుంచి భారత్‌ 31 లాంగ్‌–రేంజ్‌ ఎండ్యూరెన్స్‌ ఎంక్యూ–9బీ ఆర్మ్‌డ్‌ డ్రోన్లు కొనుగోలు చేస్తుండడాన్ని బైడెన్‌ స్వాగతించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement