Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత | Pope Francis Passed Away Vatican says in video statement | Sakshi
Sakshi News home page

Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

Published Mon, Apr 21 2025 1:37 PM | Last Updated on Mon, Apr 21 2025 3:06 PM

Pope Francis Passed Away Vatican says in video statement

వాటికన్‌ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్‌ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.

పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. 

 

పోప్‌ ఫ్రాన్సిస్‌ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్‌, ఇటు కమలా హారిస్‌ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్‌ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా.

 

గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్‌ ఫ్రాన్సిస్‌.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్‌ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది.  పోప్‌ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement