Teacher Belly Dancing Video Viral husband Give Divorce Egypt - Sakshi
Sakshi News home page

టీచర్‌ కొంపముంచిన వైరల్‌ వీడియో.. షాకిచ్చిన భర్త.. ఉద్యోగం కూడా పాయె

Published Sat, Jan 15 2022 12:01 PM | Last Updated on Sat, Jan 15 2022 1:59 PM

Teacher Belly Dancing Video Viral husband Give Divorce Egypt - Sakshi

సోషల్ మీడియాలో యుగంలో వీడియోలు, ఫోటోలతో జీవితాలు తారుమారైన సంఘటనలెన్నో చూశాం. తాజాగా ఒక వీడియోతో ఓ టీచర్ భవితవ్యం అస్తవ్యస్తమైంది. తన జీవితానికి ఆధారమైన టీచర్ ఉద్యోగం పోగా.. మరోవైపు కట్టుకున్న భర్త  విడాకులు ఇచ్చి షాక్‌కు గురిచేశాడు.

సోషల్ మీడియాలో యుగంలో వీడియోలు, ఫోటోలతో జీవితాలు తారుమారైన సంఘటనలెన్నో చూశాం. తాజాగా ఒక వీడియోతో ఓ టీచర్ భవితవ్యం అస్తవ్యస్తమైంది. తన జీవితానికి ఆధారమైన టీచర్ ఉద్యోగం పోగా.. మరోవైపు కట్టుకున్న భర్త  విడాకులు ఇచ్చి షాక్‌కు గురిచేశాడు. అసలు ఏం జరిగిందోనని ఆలోచిస్తున్నారా? వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్‌కు చెందిన అయా యూసఫ్ అనే టీచర్ తన సహోద్యోగులతో కలిసి నైలు నదిపై పడవలో విహారయాత్రకు వెళ్లింది. విహారయాత్రలో సరదాగా తన సహచరులతో కలిసి బెల్లీ డ్యాన్స్ చేసింది. అయితే బెల్లీ కాస్త.. ఆమె పాలిట శాపంలా మారింది.

అయా యూసఫ్ బెల్లీ డ్యాన్స్‌ చేస్తుండగా.. ఆమె సహోద్యోగి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆమె డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆమె బెల్లీ డ్యాన్స్‌ వీడియో పాఠశాల అధికారుల కంట పడటంతో.. వారు కూడా సీరియస్ అయ్యారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ షాక్‌ నుంచి తేరుకొకుండానే.. ఆమె భర్త కూడా మరో ఊహించని షాక్ ఇచ్చాడు. బెల్లీ డ్యాన్స్ చేయడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తంచేస్తూ విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పరిణామాలతో అయా యూసఫ్‌ తీవ్ర మనోవేదనకు గురైంది. సహోద్యోగి తన అనుమతి లేకుండా డాన్స్‌ వీడియో చిత్రీకరించాడని ఆమె ఆరోపించింది. నైలు నది విహార యాత్రలో పది నిమిషాల ప్రయాణం తన జీవితాన్నే అగమ్యగోచరమైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె బహిరంగంగా డ్యాన్స్ చేయడంపై కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

టీచర్‌ వ్యవహారంలో పాఠశాల అధికారులు తీసుకున్న నిర్ణయంపై మరికొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళ అనుమతి లేకుండా ఆమె వీడియో చిత్రీకరించి..  డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధిత టీచర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక తాను బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయలేని అయా యూసఫ్‌ వివరణ ఇచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement