
శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం
జనగామ: పట్టణంలోని పాతబీటు బజారు ఆవరణలో శ్రీరామనవమి నవరాత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీగణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు మేళ్ల చెరువు అప్పయ్య శాసీ్త్ర మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన వేడుకలకు డీసీపీ రాజ మహేంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెల్లవారు జాము 5గంటలకు పండితులు శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులను మండపానికి తీసుకువచ్చా రు. గణపతి పూజ, అఖండదీపారాధన, ధ్వజా రోహణ తదితర పూజాకార్యక్రమాలను నిర్వహించారు. పాతబీటు బజారులో నిర్వహించే నవరాత్రోత్సవాలు ఏడు దశాబ్ధాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సాంప్రదాయాలు, సంస్కృతులు, భక్తికి జనగామ నిలయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్త, తాజా, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, గోపయ్య, శ్రీకాంత్, వేణు, ద్వారక బజాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు(సోమవారం) శ్రీ విష్ణు సహస్ర పారాయణం, 1న సామూహిక పారాయణం, 6న శ్రీరామనవమి నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం