
శ్రీఽథమ్–25 వేడుకలు షురూ
హసన్‌పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సుమతిరెడ్డి మహిళా ఇంజనీరిగ్ కళాశాలలో ‘శ్రీథమ్–25’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడారు. దేశ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని.. విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్‌తో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

శ్రీఽథమ్–25 వేడుకలు షురూ